భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


హైదరాబాద్‌కు చెందిన ఆకాశ్‌ ఐఐటి బాంబేలో ఇంజనీరింగ్‌ ‌పూర్తి అమెరికాలో ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడ్డాడు. అతని తమ్ముడు అనురాగ్‌ ‌కూడా ఇంజనీరింగ్‌ ‌పూర్తి చేసి అన్న బాటలో అమెరికా వచ్చి పి.జి. తర్వాత అక్కడే ఉద్యోగంలో చేరాడు. అమెరికాలో జాబ్‌ ‌చేస్తున్న అనకాపల్లికి చెందిన ప్రియను ప్రేమించాడు. ఇద్దరు మ్యారేజ్‌ ‌చేసు కోవాలనుకున్నారు. అనురాగ్‌కు ట్రెడిషనల్‌ ‌మ్యారేజ్‌ అం‌టే ఇష్టం. అతని అమెరికన్‌ ‌ఫ్రెండ్స్ అం‌తా ఇండియాలో ట్రెడిషనల్‌ ‌మ్యారేజ్‌ ‌చూడాలని కోరడంతో పెళ్లి వెన్యూ అనకాపల్లికి మారింది. ఆకాశ్‌ ‌తమ్ముడి పెళ్లి పేరుతో చాలా కాలం తర్వాత ఇండియా వచ్చాడు. ప్రియ తండ్రి రాజారావు డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం వల్ల అనకాపల్లిలోని విశాలమైన తన మామిడి తోటలో మంగళవాయిద్యాలు, మామిడి తోరణాల మధ్య కొబ్బరాకుల పందిరిలో సంప్రదాయ బద్దంగా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.120 వెజ్‌-‌నాన్వెజ్‌ ‌ఫుడ్‌ ఐటమ్స్‌తో జరిగిన విందు ‘నెవర్‌ ‌బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌’ అని అతిథులంతా చెప్పుకున్నారు. అందరు క్యాటరింగ్‌ ఎవరికిచ్చారు అని ఎంక్వైరీ చేశారు. యూట్యూబ్‌ ‌విలేజ్‌’ ఒక్క క్యాటరింగే కాదు పెళ్లి మొత్తం కాంట్రాక్ట్ యూట్యూబ్‌ ‌విలేజ్‌’ ‌వారే చేశారు అని చెప్పారు. అంతే ఒక్కసారిగా యూట్యూబ్‌ ‌విలేజ్‌’ ‌పేరు మారుమోగిపోయింది.

ఆకాశ్‌ ‌చాలా సంవత్సరాల తర్వాత ఆ పెళ్లి, చాలామంది బంధుమిత్రులను కలుసు కున్నాడు. పెళ్లి పందిరిలో ఇంకా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతలో  అక్కడ కలకలం రేగింది. ఏమిటా అని చూస్తే ఎవరో ప్రముఖ యూట్యూబ్‌ర్‌ ‌వచ్చారట! జనం పొలోమని అతని చుట్టు చేరి అతనికి షేక్‌ం‌డ్స్ ఇస్తూ, అతనితో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఇంతలో అమ్మాయితండ్రి రాజారాం, ‘ఇతను ప్రముఖ యూట్యూబర్‌ ‌రాజా’ అని ఆకాశ్‌కు పరిచయం చేశాడు. ఆకాశ్‌కు అతడిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. కానీ గుర్తుకు రావడం లేదు. ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ‘ఆ యూట్యూబర్ ‌రాజా’ అన్నాడు.

‘మీరు ఆకాశ్‌ ‌కదా? హైదారాబాద్‌ ఐడియల్‌ ‌కాలేజ్‌లో ఇంటర్‌ ‌చదివారు. ఇంటర్‌ ‌కాలేజ్‌ ‌టాపర్‌ ‌మీరు. నేను మీ క్లాస్‌మేట్‌ను. మాథ్స్ ‌లెక్చరర్‌ ‌జీవరత్నం ఎప్పుడు మొద్దబ్బాయి అని తిట్టే సతీష్‌ ‌రాజాను’ అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది …సతీష్‌ ‌చదువులో ఎప్పుడు మొద్దబ్బాయి. కానీ సెన్సాఫ్‌ ‌హ్యామర్‌తో అందరిని నవ్వించేవాడు. చలాకీగా ఉండేవాడు.

‘ సతీష్‌ ‌నువ్వా! రాజా అంటే ఎవరో అనుకున్నాను. వాటే సర్ప్రైజ్‌’ అన్నాడు ఆకాశ్‌.

‘ఎనీవే ఆకాశ్‌ ‌నువ్వు అనుకున్నట్లుగానే అమె రికాలో సెటిల్‌ అయ్యావన్న మాట’ అన్నాడు సతీష్‌

‘‌దానికి నాదేముంది. సతీష్‌! ‌క్వైట్‌ ‌నాచురల్‌, ఐఐటిలో సీట్‌వచ్చింది. తర్వాత అమెరికా ఎగిరిపోయాను. కానీ నువ్వు ఎలా యూ ట్యూబర్‌గా మారావు అన్నదే ఎగ్జెటింగ్‌ ‌పాయింట్‌’ అన్నాడు ఆకాశ్‌.

‘అన్నట్టు ఆకాశ్‌ ఎన్ని రోజులుంటావు ఇక్కడ’ సతీష్‌ అడిగాడు.

‘ఫైవ్‌ ‌డేస్‌ అన్ని కార్యక్రమాలు ఇక్కడే జరుపుతున్నాం అందువల్ల’ అన్నాడు ఆకాశ్‌.

‘‌మా ఊరు ఇక్కడికి 10 కి.మీ దూరంలో ఉంది. పెళ్లి కార్యక్రమాల తర్వాత ఒకరోజు నువ్వు మీ ఫ్యామిలీతో మా ఇంటికి తప్పకుండా రావాలి’. ఆహ్వానించాడు రాజా.

‘తప్పకుండా వస్తాను’ అన్నాడు ఆకాశ్‌.

‌చెప్పినట్టుగానే నాలుగవ రోజు ఆకాశ్‌ ‌సతీష్‌ ‌వాళ్ల కుగ్రామం బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణం చూడొచ్చు అనుకున్నాడు. కానీ ఆ ఊళ్లో అడుగుపెట్టగానే విశాలమైన భవనాలు, సిటీలోని సకల సదుపాయాలు దర్శనమిచ్చాయి. కాకపోతే పచ్చటి ప్రకృతి మధ్యలో ఈ బంగళాలు ఉన్నాయి. ఊరంతా పరిశుభ్రంగా ఉంది. ఎక్కడా చెత్త చెదారం లేదు. నున్నటి సిమెంట్‌ ‌రోడ్లు. విశాలమైన ఆట స్థలంతో అధునాతన సౌకర్యాలతో ఉన్న స్కూల్‌ ‌భవనం చూడగానే ఆ ఊరు బాగా నచ్చింది. ఊరంతా ఒక రౌండ్‌ ‌వేసిన తర్వాత సతీష్‌ ఇం‌టికెళ్లాడు.

పొలాల మధ్యలోఉన్న బంగళా అది. భార్యా పిల్ల లతో పరిచయాలు, టీలు,టిఫన్లు పూర్తయిన తర్వాత తోటలోకి తీసుకెళ్లాడు సతీష్‌. అక్కడ మొదలైంది ఆకాశ్‌ ‌ప్రశ్నల పరంపర. ‘ఇంటర్‌ ‌తర్వాత ఎక్కడ చదివావు? యూ ట్యూబర్‌గా ఎలా మారావు?’ అడిగాడు.

‘ఆకాశ్‌ ‌నాకు చదువు మీద ఇంట్రస్ట్ ‌లేక ఇంటర్‌ ‌ఫెయిల్‌ అయ్యాను. ఊరికొచ్చాను. నాన్నకు వ్యవసాయం తప్ప వేరే లోకం లేదు. మెల్లగా నన్ను వ్యవసాయంలోకి దింపాడు. సేంద్రియ పద్ధతులతో నేను కొత్తరకం పంటల సాగు ప్రారంభించాను. ఈ ప్రాంతంలో డ్రాగన్‌ ‌ఫ్రూట్స్ ‌మొదట సాగు చేసింది నేనే. ఇప్పుడు అందరు పండిస్తున్నారు’ వివరించాడు సతీష్‌.

‘‌సేంద్రియ పంటల గురించి అప్పుడప్పుడు యూ ట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్‌ ‌చేసేవాడిని. దానికి అంత రెస్పాన్స్ ఉం‌డేది కాదు. ఒక రోజు మా అమ్మ నాలుగేళ్ల నా కొడుకును ఎత్తుకుని ఫోన్‌లో నా వీడియో చూస్తోంది. సడన్‌గా నా కొడుకు తను, నాన్నమ్మ యూ ట్యూబ్‌లో కనిపించాలని మారాం చేశాడు. సరేనని చేపల పులుసు కోసం తెచ్చిన చేపలతో ‘చేప పిట్టు’ అనే ఒక పాత సంప్రదాయ వంటకాన్ని మా అమ్మతో వండించి అది వీడియో తీసి యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ ‌చేశాను. అనూహ్యంగా అది వైరల్‌ అయ్యి చాలా వ్యూస్‌ ‌వచ్చాయి. పలాన పాత వంటకాలను చూపించమని కామెంట్స్ ‌పెట్టారు. వెంటనే అమ్మతో నాలుగైదు రకాల వంటలతో వీడియోలు తీసి అప్‌లోడ్‌ ‌చేశాను. సబ్‌ ‌స్క్రైబర్స్ ‌పెరిగారు. ఇలా కాదని మా పొలం మధ్యలో కుటీరం లాంటి వంటగది కట్టించి, ‘నాన్నమ్మ చేతి వంటలు’ ఛానల్‌ ‌పెట్టి మట్టి పాత్రల్లో అమ్మ చేసే ప్రతి వంటను వీడియో తీసి అప్‌లోడ్‌ ‌చేశాను.

యాభై వీడియోలకు లక్ష మంది సబైస్క్రైబర్స్ అయ్యారు. అమ్మ చేసే నాన్‌ ‌వెజ్‌ ‌పచ్చళ్ల వీడియోలకు తెగ ఆదరణ లభించింది. తమకా పచ్చళ్లు కావా లంటూ ఆర్డర్స్ ‌రావడంతో ఆన్లైన్‌ ‌పచ్చళ్ల వ్యాపారం మొదలు పెట్టాం. చాలా తక్కువ కాలంలోనే సక్సెస్‌ అయ్యాం. మేము చేసిందొక్కటే ఒక కిలో మటన్‌ ‌పచ్చడి కావాలని ఆర్డర్‌ ‌పెట్టారనుకుందాం. మటన్‌ ‌షాపుకెళ్లా మటన్‌ ‌తెచ్చింది మొదలు దాన్ని శుభ్రంగా కడిగి ఉప్పుకారాలు, మసాలాలు వేసి మ్యారినేట్‌ ‌చేయడం దగ్గర నుండి దాన్ని ఆయిల్లో ఫ్రైచేసి దినుసులన్ని వేసి పచ్చడి తయారైన తర్వాత నిమ్మకాయ పిండటం వరకు తర్వాత ఆ పచ్చడిని జాడీలో ప్యాక్‌ ‌చేసే వరకు అంతా వివరంగా వీడియో తీసి అప్‌లోడ్‌ ‌చేసేవాళ్లం. పచ్చళ్లను శుభ్రంగా తయారు చేయడమే కాకుండా అవి రుచిగా ఉండటం వల్ల బాగా డిమాండ్‌ ‌పెరిగింది. మొదట్లో మా అమ్మ,నా భార్య కలిసి పచ్చళ్లు తయారు చేసేవారు. కానీ ఇప్పుడు వెజ్‌, ‌నాన్వెజ్‌ ‌కలిపి రోజుకు వంద కిలోల ఆర్డర్స్ ‌వస్తాయి. పండుగలు పెళ్లిళ్ల సీజన్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. అందువల్ల ఇప్పుడు మా దగ్గర దాదాపు యాభై మంది పనివాళ్లున్నారు.. అనకాపల్లిలో పెద్ద పచ్చళ్ల షాప్‌ ‌తెరిచాను. అదెప్పుడు కిటకిటలాడుతుంది’ చెప్పాడు.

పక్కనే ఉన్న 250 గ్రాముల వెజ్‌, ‌నాన్వెజ్‌ ‌పచ్చళ్ల 12బాటిల్స్ఉన్న కేస్‌ అం‌దించాడు గిఫ్ట్‌గా. దాని మీద కాంబో ఆఫర్‌ ‌గిఫ్ట్‌ప్యాక్‌ అని రాసుంది.

‘ఒకేసారి ఇన్ని పచ్చళ్ల కేస్‌ ఎవరు కొంటారు?’ అన్నాడు ఆకాశ్‌.

‘‌చూపిస్తాను పద’ అని ఒక ఇంటికి తీసుకెళ్లాడు.

సతీష్‌ను చూడటంతోనే సాదరంగా ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టారు ఇద్దరిని. అక్కడ ఒక పెళ్లి చూపులు జరుగుతున్నాయి.

‘అమ్మాయి ఏకైక కూతురు చక్కని చుక్క హైదరాబాద్‌ ‌సాఫ్టవేర్ ఇం‌జనీర్‌. ‌నెలకు రెండు లక్షల జీతం. అబ్బాయి అందగాడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇం‌జినీర్‌ ‌నెలకు పన్నెండు లక్షల జీతం. ఇద్దరు ఏకైక సంతానమే కాబట్టి పెట్టిపోతల గురించి అడగవలసిన అవసరం లేదు. ఉభయ పక్షాల వారు ఇంకా ఏమైనా అడగవలసిన ప్రశ్నలుంటే అడగవచ్చు’ మధ్యవర్తి అన్నాడు.

ఇంతలో అబ్బాయి బామ్మ ‘అమ్మాయికి ఏమేం వంటలు వండటం వచ్చు’ అడిగింది.

అమ్మాయి తండ్రి ‘అత్తయ్య గారూ! మీ తరంలో స్త్రీలు ఇంటిపట్టునే ఉండి వంటలు, వార్పులు, పండుగలు, పిండి వంటలు అన్నీ చేసుకునేవారు. ఇప్పటి పిల్లలకు చదువులు ఉద్యోగాలతోనే సరిపోతుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు వంటలు చేయడానికి అసలు తీరిక లేదండి’ అన్నాడు.

మధ్యవర్తి కలుగజేసుకుని ‘బామ్మగారూ! మీ కాలంలో పెళ్లి కూతురుకి వంటవచ్చా అని అడిగేవారు. కానీ ఈ కాలంలో ఆడపిల్లలు ‘వంట’ అనే మాట వింటేనే ఇబ్బందిగా ఫీలవుతున్నారు. అదీగాక వాళ్లకసలు టైమ్‌ ఉం‌డదు’ అన్నాడు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో ‘వంట’ కారణంగానే చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు అన్నాడు. మరి పెళ్లి తర్వాత వండుకోకపోతే ఏం తింటారు’ అంది బామ్మ.

‘కుక్కర్‌లో రైస్‌ ‌పెట్టుకుని కర్రీస్‌ ‌బయట నుండి తెచ్చుకుంటారు’ అన్నాడు. ఇంతలో అమ్మాయి తరపువారు ‘మా ఊరు పెళ్లి కూతురంటే ఆషామాషీ కాదు. సారెగా ఎన్ని ఫుడ్‌ ఐటమ్స్ ‌తెస్తుందో చెప్పలేము. రోజురోజు పుట్టింటి వారు తాజాగా రకరకాల ఫుడ్‌ ఐటమ్స్ ‌పంపిస్తూ ఉంటారు’ అన్నారు.

ఇంతలో మధ్యవర్తి ‘అమ్మా! అమ్మాయికి సారెగా ఏమేం ఫుడ్‌ఐటమ్స్ ‌పంపుతారో లిస్ట్ ‌చెప్పం’• అన్నాడు.

‘రాజు గారి పుణ్యమా అని మా ఊళ్లో ఫుడ్‌ఐటమ్స్‌కు కొదవలేదు. రాజుగారి ‘నాన్నమ్మ చేతి వంట’ వారి వెజ్‌, ‌నాన్‌ ‌వెజ్‌ ‌పచ్చళ్లు పన్నెండు సెట్‌ ‌ప్రతి పెళ్లిసారెలో ఉండి తీరుతుంది. అదేవిధంగా పాలస సీజన్లో పాలస చేపపులుసు స్పెషల్‌ ఆర్డర్‌గా చేసి ఇస్తారు. రేగు వడియాలు.సగ్గు అప్పడాలు యూట్యూబ్‌ ‌ఛానెల్‌ ‌వారి పది రకాల అప్పడాలు వడియాలు,‘పొడులు- కారాలు, పది రకాల పొడులు, ఇడ్లీకారం, పుదీనకారం, కందిపొడి, అవిసెపొడి లాంటివి వాటితో ‘సారే గంప’లో ఇరవై రకాల పిండి వంటలు, పూత రేకులు, సున్నుండలు, కాజాలు, జాంగ్రీ, బాదుషా మొదలైనవి. పాతరకం స్వీట్స్, ‌హాట్స్ ‌కావాలంటే పాకుండలు, గోర్మిటీలు మొదలైనవి కావాలంటే ‘కలగూర గంప’లో పది వెరైటీలు ఇస్తాము. ఇవన్నీ కాకుండా ఎండు చేపలు తిన్నాలను కుంటే ‘మట్టగిడస’యూట్యూబ్‌ ‌ఛానెల్‌ ‌వారి ‘ఎండు చాపల వెరైటీ’ వంటలు. ఇవన్నీ కాకుండా యూ ట్యూబ్‌ ‌ఛానెల్‌ ‌వారి ఉలవచారుల వెరైటీలు, చివరగా ‘దధి’యూట్యూబ్‌ ‌ఛానెల్‌ ‌వారి పెరుగు వెరైటీలు పంపుతాం. మాఊరి వంటలకు రోజు హైదరాబాద్‌ ‌నుండి ఆర్డర్స్ ‌వస్తూనే ఉంటాయి. మేము పంపుతూనే ఉంటాం. పనిలోపనిగా హైదరా బాద్‌లో ఉండే మా పిల్లలకు కూడా ఏది కావాలంటే అది పంపుతాం. అందులో భాగంగా పెళ్లి తర్వాత అబ్బాయి అమ్మాయిలు రైస్‌ ‌పెట్టుకుని మేము పంపిన వెరైటీలు వడ్డించుకుంటే చాలు. వండుకుంటే ఒకటే కూర మాఊరి అమ్మాయిని చేసుకున్న వారికి నిత్యం విందు భోజనమే. అందుకే మాఊరి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి అందరు ఆరాటపడేది’ అన్నారు.

‘ఎంత డబ్బున్నా మంచి ఫుడ్‌ ‌తినగలగడానికి అదృష్టం ఉండాలమ్మా’ అన్నాడు మధ్యవర్తి.

అంతా విని అబ్బాయి తండ్రి ‘మాకు ఈ సంబంధం అన్ని విధాల నచ్చింది. వీలైనంత దగ్గర్లో ముహూర్తం చూడండి’ అన్నాడు.

పంతులు గారొచ్చి, ‘నెల రోజుల్లో దివ్యమైన ముహూర్తం నిర్ణయించారు మధ్యవర్తి ‘అయ్యా! పెళ్లి ఊళ్లోనే మామిడి తోటలో మిగతావన్నీ ఇప్పుడే పురమాయిస్తే బాగుంటుంది కదా!’ అన్నాడు.

దానికి అమ్మాయి తండ్రి, ‘పూల పందిళ్లు, మామిడి తోరణాలు’ యూట్యూబ్‌ ‌ఛానెల్‌ ‌వారికి చెపితే పెళ్లి మండపం బాధ్యత వారు చూసు కుంటారు. ‘రుచి ‘అభిరుచి’ యూట్యూబ్‌ ‌ఛానల్‌ ‌వారికి వంటల బాధ్యత అప్పగిస్తే సరిపోతుంది. ‘ఆహ్వానం-ఆతిథ్యం’ యూట్యూబ్‌ ‌ఛానెల్‌ ‌వారికి చెబితే అతిథి మర్యాదలు బాధ్యత చూసుకుంటారు. ‘కారు షికారు’ యూట్యూబ్‌ ‌ఛానెల్‌ ‌వారికి చెప్పితే వెహికిల్స్ ‌బాధ్యత వాళ్లు చూసుకుంటాడు అన్నాడు.

ఇవన్నీ విని విని ‘ఈ యూట్యూబ్‌ ‌ఛానెల్స్‌కి, శుభకార్యానికి ఏమిటి సంబంధం ’అడిగాడు ఆకాశ్‌.

‌మధ్యవర్తి అందుకుని ‘అయ్యా! మీరు అమెరికా నుంచి వచ్చారు. మీకు తెలియదు కాబట్టి చెబుతున్నాను. ఒకప్పుడు మాది అత్యంత వెనుకబడిన కుగ్రామం. మీ మిత్రుడు సతీష్‌గారు ‘నాన్నమ్మ చేతి వంట’ యూట్యూబ్‌ ‌ఛానెల్‌ ‌ద్వారా ఎందరికో ఉపాధి కల్పించారు. మా గ్రామాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇంటికొక యూట్యూబ్‌ ‌ఛానల్‌ ‌పెట్టించి ఎవరు ఏ ఐటమ్‌ ‌చేయడంలో దిట్టనో వారితో వాటిని తయారు చేయించి ఆ వీడియోలు అప్‌లోడ్‌ ఆన్లైన్‌ ‌వ్యాపారం చేసేటట్టుగా అందరిని ప్రోత్సహించారు. ఒకరు చేసిన ఐటమ్‌ ‌మరొకరు తయారు చేయరు. అందువల్ల ఎవరు ఎవరికి పోటీ కారు. అన్ని ఫుడ్‌ ఐటమ్స్ ‌కావడం వల్ల అవి హాట్‌ ‌కేక్స్‌లా అమ్ముడు పోతున్నాయి. విదేశాలకు కూడా మా ప్రొడక్టస్ ‌వెళుతున్నాయంటే అది కేవలం సతీష్‌ ‌గారి చలవే, యూట్యూబ్‌ ‌పుణ్యమే. మా ఆన్లైన్‌ ‌వ్యాపారం వల్ల మాకొచ్చే డబ్బే కాకుండా, మా వీడియోలు అప్‌లోడ్‌ ‌చేయడం వల్ల వ్యూయర్స్, ‌సబ్‌ ‌స్క్రైబర్స్ ‌పెరగడం వల్ల యూట్యూబ్‌ ‌నుంచి కూడా మాకు డబ్బొస్తుంది. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఊరంతా సంపాదిస్తున్నందుకు మా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం. మా డబ్బుతోనే నీట్‌గా రోడ్లు వేయించాం. దీనివల్ల దగ్గర దగ్గర ప్రాంతాల వాళ్లు స్వయంగా వచ్చి మా ఐటమ్స్ ‌కొంటున్నారు. మాకొచ్చే డబ్బుతో మా పిల్లలను హైదరాబాదులో పెట్టి బాగా చదివిస్తున్నాం. వాళ్లు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలతో విదేశాల్లో స్థిరపడుతున్నారు. మా జీవితాల్లో వెలుగులు నింపిన సతీష్‌ ‌గారికి ్య•ట్యూబ్‌ ‌వారికి మేమెంతో రుణపడి ఉన్నాం. మా గ్రామానికి చైతన్యం తెచ్చిన సతీష్‌ ‌గారికి ఎక్కువ మంది సబ్‌‌స్క్రెబర్‌ ఉన్నందున యూట్యూబ్‌ ‌వారు వారిని ప్రత్యేకంగా సన్మానించారు. ముఖ్యమంత్రిగారు మా ప్రాంతానికి వచ్చి మా అభివృద్ధిని కళ్లారా చూసి, ఆయనే మా గ్రామానికి యూట్యూబ్‌ ‌విలేజ్‌’ అని పేరు పెట్టారు. సతీష్‌ ‌గారికి ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని, నెక్సట్ ఎలక్షన్స్లో సతీష్‌ ‌గారికి ఎం.ఎల్‌.ఎ.‌గా సీట్‌ ఇస్తామన్నారు. అది మా ప్రాంతానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాం’ చెప్పాడు.

చుట్టు పక్కల ప్రాంతాల్లోనే కాదు దేశవిదేశాల్లో కూడా ఎక్కడ పెళ్లి జరిగినా, ఫెస్టివల్‌ ‌జరిగినా మా యూట్యూబ్‌ ‌విలేజ్‌ ‌వంటలు ఉండి తీరవలసిందే. అంత డిమాండ్‌ ఉం‌ది మాకు. మా ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి జనాలు పోటీ పడుతున్నారు. మా వంటల రుచులు అలాంటివి మరి. అమ్మాయిని చేసుకున్న దగ్గరి నుంచి మా ఐటమ్స్ ‌ఫ్రీగా వస్తాయి కాబట్టి అందరు ఆసక్తి కనబరుస్తున్నారు. పండగ వచ్చిందంటే ఒకవైపు ఆర్డర్స్, ‌మరోవైపు అల్లుళ్లతో కిటకిటలాడుతుంది అది విలేజ్‌కి ఉన్న క్రేజ్‌. ‌పాతకాలం వంటలుచేసే మా తల్లులకు ఎంతో విలువ, గౌరవం ఇస్తాం. ఇది సమిష్టి పని కావడం వల్ల కుటుంబంలో గొడవలు తగ్గి ఆత్మీయతలు పెరిగాయి. ఆర్థిక స్వాలంబనతో సాగుతున్న మా విలేజ్‌ ‌గురించి ఈ మధ్యే బీబీసీ ఛానెల్‌ ‌వారు ప్రత్యేక కథనం ప్రసారం చేశారు. ఈ ఖ్యాతికి కారణం మీ మిత్రుడు సతీషే అన్నారు.

ఆకాశ్‌ అం‌తా విని ‘సతీష్‌ ‌నువ్వు నిజంగా చాలా గ్రేట్‌ ‌రా! ఐఐటీ•లు చదువుకుని అమెరికాకు వెళితే ఒక కుటుంబం బాగుపడుతుంది. అదే నువ్వు బాగుపడటమే కాక ఊరందరిని బాగుపరచావు. అది ఎంతో గొప్ప విషయం’ నిన్ను చూస్తుంటే ఎంతో తృప్తిగా గర్వంగా ఉందిరా’ అన్నాడు.

దానికి ‘సతీష్‌ ఈ ‌గొప్పతనం అంతా నాది కాదు, యూ ట్యూబ్‌ ‌వారిది. కష్టాన్నే నమ్ముకున్న మాలాంటి వారి దగ్గరికి కస్టమర్స్‌ని తీసుకొచ్చింది. కష్టాల్లో కాంతి పుంజమై దారి చూపింది’ అన్నాడు.

‘పనికి మాలిన వీడియోలు చూడడానికి తప్ప యూట్యూబ్‌ ‌దేనికి పనికి రాదని సమాజంలో దాని గురించి అంటే అంత నెగెటివ్‌గానే మాట్లాడతారు. ఫస్ట్‌టైమ్‌ ‌యూట్యూబ్‌ ‌గురించి నీవల్ల పాజిటివ్‌గా విన్నాను. యూట్యూబ్‌ ‌వల్ల జీవితాలు పాగుపడడం మీ విలేజ్‌లోనే చూసాను’ అన్నాడు ఆకాశ్‌.

‘‌యూ ట్యూబ్‌ అనేది రెండు వైపుల పదునున్న కత్తిలాంటిది. కత్తి పండ్లు కోసుకోవడానికి ఉపయోగ పడుతుంది, గొంతు కోసుకోవడానికి పనికొస్తుంది. ఏది చేయాలో మనమే నిర్ణయించుకోవాలి. అవసరంలో ఉన్నవారికి ఆధారమై అన్నం పెడు తుంది. విలాసాలతో వ్యసనపరులైన వారిని అధోగతి పాలుచేస్తుంది. యూట్యూబ్‌ను ఎలా ఉపయోగించు కోవాలో ఆ ఛాయిస్‌ ‌మన చేతిలోనే ఉందిరా’ అన్న సతీష్‌ ‌మాటలు అక్షర సత్యాలుగా తోచాయి.

– ‌నిదానకవి నీరజ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE