ఉదయం అలారం మోగకముందే నిద్రలేచే అడుగులు.. రాత్రి అందరూ నిద్రపోయాక కానీ విశ్రాంతి తీసుకోని చేతులు.. ఇంటి బాధ్యతలను, ఆఫీసు లక్ష్యాలను ఏకకాలంలో మోస్తూ… నేను అలసిపోయాను అని చెప్పుకోడానికి కూడా సంకోచించే మనస్తత్వం.. నేటి ఆధునిక మహిళల జీవనచిత్రం ఇది. ఇంటిని, కెరీర్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కానీ, ఈ ప్రశంసల వెనుక ఒక నిశ్శబ్ద మానసిక ఒత్తిడి దాగి ఉంది. అన్నింట్లోనూ తానే నంబర్‌ ‌వన్‌గా ఉండాలనే తపనలో, తనను తాను కోల్పోతున్న మహిళల మానసిక సంఘర్షణే ‘సూపర్‌ ఉమెన్‌ ‌సిండ్రోమ్‌.’ అన్నీ తానే చేయాలనే పట్టుదల మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఒకవైపు ఆఫీసులో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు ఇంటిని, పిల్లలను, పెద్దలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కానీ, ఈ క్రమంలో తెలియకుండానే ఒక ప్రమాదకరమైన మానసిక ఒత్తిడిలోకి వెళ్తున్నారు. అదే ‘సూపర్‌ ఉమెన్‌ ‌సిండ్రోమ్‌’ ఆలోచనే సమస్యకు వ•లం.

అదృశ్య భారం:  చాలామంది మహిళలు తమను తాము ఒక సూపర్‌ ఉమెన్‌గా ఊహించుకుంటారు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి  రాత్రి పడుకునే వరకు క్షణం తీరిక లేకుండా పనిచేస్తుంటారు. ఈ ఒత్తిడి మహిళలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది.

ఒత్తిడికి కారణాలు: ఇంటి పనిలో ఇతరుల సహాయం తీసుకుంటే, తనను అసమర్థురాలిగా భావిస్తారేమోననే భయం చాలామందిలో ఉంటుంది. ఇతరులు చేసిన పని కూడా తాను చేసినంత పరిపూర్ణంగా ఉండదని భావించి, ప్రతి పనిని తామే నెత్తిన వేసుకుంటారు.

ఆరోగ్యంపై ప్రభావం: నిరంతర పని ఒత్తిడి వల్ల దీర్ఘకాలిక అలసట, నిద్ర లేమి, ఆందోళన, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతాయి. ఒక దశలో చిన్న విషయాలకే విపరీతమైన కోపం రావడం లేదా నిరాశకు గురవడం జరుగుతుంది.

పనిని పంచుకోవడం:  మీరు అన్ని పనులు చేయగలరు, కానీ అన్నీ మీరే చేయాల్సిన అవసరం లేదు. ఇంటి పనులను జీవిత భాగస్వామితో, పిల్లలతో పంచుకోవడం నేర్చుకోండి. పనిమనుషుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి.

మన సమాజంలో మహిళలు కుటుంబం కోసమే బతకాలి అనే ఆలోచన వల్ల, మహిళలు తమ సొంత ఆనందం కోసం సమయం కేటాయించుకోవడాన్ని ఒక ‘స్వార్థం’గా భావిస్తారు. ఈ అపరాధ భావం శరీర ఆరోగ్యంపై పడుతుంది.

సమయం ప్రాముఖ్యత: విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ముందుగా ఆక్సిజన్‌ ‌మాస్క్ ‌మనం పెట్టుకున్నాకే ఇతరులకు సహాయం చేయాలి. జీవితం కూడా అంతే. మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాన్ని బాగా చూసుకోగలరు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకు వీలుగా రోజువారీ సమయాన్ని పనులకు వినియోగించుకోవాలి. రోజులో కనీసం 30 నిమిషాల పాటు ఎలాంటి అపరాధ భావం లేకుండా మీ కోసం మీరు కేటాయించుకొని, మీకు ఇష్టమైన పని చేయాలి.

స్నేహబంధాల అవసరం: పెళ్ళి, పిల్లలు, ఉద్యోగ బాధ్యతల మధ్య మహిళలు తమ పాత స్నేహితులకు పూర్తిగా దూరమవుతున్నారు. కనీసం ఫోన్‌ ‌చేసి మాట్లాడ •కునే తీరిక కూడా ఉండటం లేదు. కుటుంబ సభ్యులతో పంచుకోలేని ఎన్నో భావోద్వేగా లను, ఒత్తిడులను కేవలం స్నేహితులతో మాత్రమే పంచుకోగలం. ఎలాంటి జడ్జిమెంట్‌ ‌లేకుండా మన మాట వినే ఒక మంచి స్నేహితురాలు ఉండటం మానసిక ఆరోగ్యానికి గొప్ప వరం.

ఒత్తిడిని తగ్గించే ఔషధం: స్నేహితులతో కలిసి నవ్వడం, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వల్ల శరీరంలో ‘ఆక్సిటోసిన్‌’ అనే హ్యాపీ హార్మోన్‌ ‌విడుదలవు తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, ఆత్మవిశ్వా సాన్ని పెంచుతుంది. నెలకు కనీసం ఒక్కసారైనా స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాలి. కుదరకపోతే వారానికి ఒకసారి ఫోన్‌ ‌కాల్‌ ‌లేదా వీడియో కాల్‌ ‌ద్వారా మాట్లాడాలి. కొత్త స్నేహాలను ఏర్పరచుకోవ డానికి కూడా ఏమాత్రం వెనుకాడకూడదు.

నో చెప్పడం నేర్చుకోండి: మీ శక్తికి మించిన పనులను లేదా మీకు ఇష్టం లేని బాధ్యతలను సున్నితంగా తిరస్కరించండి. ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టడం మీ బాధ్యత కాదు అంటున్నారు మానసిక నిపుణులు.

ఎనభై శాతం రూల్‌ ‌పాటించండి: ఇంటి శుభ్రత లేదా వంట వంటి విషయాల్లో వంద శాతం స్వచ్ఛత కోసం పాకులాడకండి. ఎనభై శాతం పూర్తయినా సరే, దానితో సంతృప్తి చెందడం అలవాటు చేసుకోండి.

డిజిటల్‌ ‌డిటాక్స్: ‌డిజిటల్‌ ‌డిటాక్స్ ‌రాత్రి పడుకోవడానికి గంట ముందు ఫోన్‌ ‌పక్కన పెట్టండి. ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం ఆపండి.

కృతజ్ఞతా భావం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఆ రోజు మీరు సాధించిన చిన్న విజయాలను లేదా మీకు ఆనందాన్ని ఇచ్చిన వ•డు విషయా లను ఒక డైరీలో రాయండి. మిమ్మల్ని మీరు ఎంతవరకు ప్రేమించుకుంటు న్నారో అంటే మీ మీద మీరు ఎంత వరకు శ్రద్ధ పెడుతున్నారో తెలుసుకో డానికి ఒక చిన్న ప్రశ్న పత్రం తయారు చేసుకోండి.

మహిళలు సూపర్‌ ఉమెన్‌ ‌కావాల్సిన అవసరం లేదు, కేవలం సంతోషకరమైన జీవితాన్ని గడప గలిగేలా ప్లాన్‌ ‌చేసుకుంటే చాలు. ఆరోగ్యం విషయంలో మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించుకుంటూ ఉండండి. గుర్తుంచుకోండి.. మీరు ఒక యంత్రం కాదు, భావోద్వేగాలున్న మనిషి. మీ ఆరోగ్యం దెబ్బతింటే మీ కుటుంబం ఆగిపోతుంది. అందుకే, ‘సూపర్‌ ఉమెన్‌’ అనే కిరీటాన్ని పక్కన పెట్టండి. పనిని పంచుకోండి, మీ పట్ల మీరు దయగా ఉండడం నేర్చుకోండి.

జయశ్రీ ఆచంట
సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.