నవంబర్‌ 26 ‌డాక్టర్‌ ‌వర్గీస్‌ ‌కురియన్‌ ‌జయంతి


భారతీయ సనాతన సాంప్రదాయంలో పశుపోషణ ఒక బాధ్యత. ద్వాపరయుగంలో కృష్ణ బలరాములు స్వయంగా పశు పోషణ చేసి చూపించారు. అట్టి మహత్కార్యాన్ని ఎంతోమంది ఋషులు రాజులు చక్రవర్తులు ప్రజలు ఆచరిస్తూ వస్తున్నారు. కాలక్రమేనా అఖండ భారతావనిని పాడి పశుమాంస భక్షకులు దురాక్రమణ చేసి పరిపాలించిన కాలం నుండి పశు సంపద తగ్గుతూ వచ్చింది. ప్రజలకు పాడి కొరత తీవ్రంగా ఏర్పడింది. భారతదేశ వ్యవసాయ చరిత్ర లోనూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి లోనూ చిరస్థాయిగా నిలిచిపోయిన మహ నీయులలో డాక్టర్‌ ‌వర్గీస్‌ ‌కురియన్‌ ఒకరు.
భారతదేశాన్ని పాల కొరతతో బాధపడుతున్న దేశం నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారులలో ఒకటిగా తీర్చిదిద్దడంలో ఆయన అసాధారణమైన పాత్ర పోషించారు.భారతదేశంలో పాల ఉత్పత్తి పెంపుదలకే కాకుండా, లక్షలాది మంది గ్రామీణ రైతులకు ఆర్థిక స్వావలంబన కల్పించిన మహోన్నత వ్యక్తి ఆయన. అందుకే ఆయనను ‘‘భారత శ్వేత విప్లవ పితామహుడు’’ (Father of the White Revolution in India) అని గౌరవంగా పిలుస్తారు. డాక్టర్‌ ‌వర్గీస్‌ ‌కురియన్‌ 1921 ‌నవంబర్‌ 26‌వ తేదీన కేరళ రాష్ట్రంలోని కాలికట్‌ (‌ప్రస్తుత కోజికోడ్‌)‌లో జన్మించారు.ఆయన తండ్రి ప్రభుత్వ వైద్యుడిగా పనిచేశారు.చిన్నతనం నుంచే విద్యాభ్యాసం, క్రమశిక్షణ, శాస్త్రీయ ఆలోచనా విధానం పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు. చెన్నైలోని లోయోలా కళాశాలలో భౌతికశాస్త్రంలో పట్టభద్రులయ్యారు.అనంతరం గిండీ ఇంజినీరింగ్‌ ‌కళాశాలలో మెకానికల్‌ ఇం‌జినీరింగ్‌ అభ్యసించారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి మిషిగన్‌ ‌స్టేట్‌ యూనివర్సిటీలో మెకానికల్‌ ఇం‌జినీరింగ్‌లో మాస్టర్స్ ‌డిగ్రీ పొందారు.ఆహార సాంకేతికత, పాల పరిశ్రమకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంపై కూడా అవగాహన పెంచుకున్నారు.

ఆనంద్‌ ‌ప్రయాణం – జీవితాన్ని మార్చిన మలుపు

1949లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ప్రభుత్వ బాంధవ్యంతో గుజరాత్‌ ‌రాష్ట్రంలోని ఆనంద్‌లో ఉన్న ప్రభుత్వ క్రీమరీలో పనిచేయడానికి నియమితులయ్యారు. ఆ సమయంలో పాల వ్యాపారంపై ప్రైవేటు సంస్థల ఆధిపత్యం ఉండేది. ముఖ్యంగా రైతుల నుంచి తక్కువ ధరకు పాలను సేకరించి, వినియోగదారులకు అధిక ధరలకు విక్రయించేవారు.రైతులకు వారి శ్రమకు తగిన ఆదాయం లభించేది కాదు. ఈ పరిస్థితిని మార్చడానికి త్రిభువన్‌దాస్‌ ‌పటేల్‌ ‌నాయకత్వంలో ఏర్పడిన కైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి కురియన్‌ ‌తన సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ సామర్థ్యాన్ని అందించారు. ఈ సహకార ఉద్యమమే తరువాత ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అమూల్‌  సంస్థగా ఎదిగింది.

రైతుల చేతుల్లోనే పాల వ్యాపారం

కురియన్‌ ‌ప్రకారం  పాల ఉత్పత్తిదారులైన రైతులే పాల సేకరణ, శీతలీకరణ, ప్రాసెసింగ్‌, ‌మార్కెటింగ్‌ ‌వంటి కార్యకలాపాలపై యజమాన్య హక్కులు కలిగి ఉండాలి.మధ్యవర్తుల ఆధిపత్యం తగ్గాలి.రైతులకు వారి పాల నాణ్యత, పరిమాణం ఆధారంగా న్యాయమైన ధర లభించాలి. ఈ లక్ష్యంతో ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సహకార వ్యవస్థతో అనుసంధానించారు. పాల శీతలీకరణ, పాశ్చరైజేషన్‌, ‌పాల పొడి తయారీ, వెన్న, నెయ్యి తదితర పాల ఉత్పత్తుల తయారీలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టారు.

ఆపరేషన్‌ ‌ఫ్లడ్‌ – ‌భారతదేశ శ్వేత విప్లవం

భారతదేశంలో పాల ఉత్పత్తిని భారీగా పెంచడానికి డాక్టర్‌ ‌కురియన్‌ ‌రూపొందించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆపరేషన్‌ ‌ఫ్లడ్‌ (Operation Flood) 1965లో జాతీయ పాల అభివృద్ధి సంస్థ  (National Dairy Development Board — NDDB) ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించి, దాని వ్యవస్థాపక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి ప్రధాని లాల్‌ ‌బహదుర్‌ ‌శాస్త్రి ఆనంద్‌లో అవ•ల్‌ ‌విజయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, ఈ సహకార నవ•నాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రోత్సహించారు. 1970లో ఆపరేషన్‌ ‌ఫ్లడ్‌ ‌కార్యక్రమం ప్రారంభమైంది. ఇది ప్రధానంగా మూడు దశల్లో అమలైంది. మొదటి దశ (1970-1980)లో గ్రామీణ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు చేయడం, ప్రధాన నగరాలకు పాల సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయడం. రెండవ దశ (1981-1985)లో  దేశవ్యాప్తంగా పాల సేకరణ కేంద్రాలను విస్తరించడం, పశువైద్య సేవలు, పశు పోషణ, కృత్రిమ గర్భధారణ వంటి సేవలను బలోపేతం చేయడం. మూడవ దశ (1985-1996)లో సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, పాల ఉత్పత్తి నాణ్యతను పెంచడం, రైతులకు నిరంతర ఆదాయ అవకాశాలను కల్పించడం. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు పాల అవసరాల కోసం విదేశాలపై ఆధారపడిన భారతదేశం, ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఎదిగింది. ఈ చారిత్రాత్మక మార్పునే భారతదేశ శ్వేత విప్లవం అంటారు.

రైతుల ఆర్థిక స్వావలంబన

డాక్టర్‌ ‌కురియన్‌ ‌దృష్టిలో పాల విప్లవం అంటే కేవలం పాల ఉత్పత్తి పెంచడం కాదు. గ్రామీణ రైతుల జీవితాల్లో ఆర్థిక, సామాజిక మార్పు తీసుకురావడం. ఆయన అభివృద్ధి చేసిన సహకార నవ•నాలో పాల ఉత్పత్తిదారులే సహకార సంఘాల యజమానులు. పాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో రైతులకు తగిన వాటా అందించాలి. మహిళలు కూడా పాల ఉత్పత్తి సహకార సంఘాల్లో భాగస్వాములు కావాలి. ఈ విధానం వల్ల చిన్న, సన్నకారు రైతులు కూడా పాడిపరిశ్రమ ద్వారా క్రమబద్ధమైన రోజువారీ ఆదాయం పొందగలిగారు. ముఖ్యంగా భూమి తక్కువగా ఉన్న కుటుంబాలకు పాడిపరిశ్రమ ఒక అదనపు జీవనాధారంగా మారింది.

జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు

భారతదేశ పాడిపరిశ్రమ అభివృద్ధికి, రైతుల ఆర్థిక స్వావలంబనకు చేసిన అపారమైన సేవలకు రామన్‌ ‌మెగసెసే అవార్డు(1963), పద్మశ్రీ(1965) ,పద్మభూషణ్‌(1966), ‌కృషి రత్న(1986), వరల్డ్ ‌ఫుడ్‌ ‌ప్రైజ్‌(1989), ‌పద్మవిభూషణ్‌(1999) ‌పురస్కారాలను ఆయన పొందారు.

ముగిసిన మహోన్నత శకం

డాక్టర్‌ ‌వర్గీస్‌ ‌కురియన్‌ 2012 ‌సెప్టెంబర్‌ 9‌వ తేదీన, తన 90వ ఏట గుజరాత్‌లోని నడియాద్‌లో కన్నువ•శారు. ఆయన మరణం భారతదేశ పాడిపరిశ్రమకు, గ్రామీణ సహకార ఉద్యమానికి తీరని లోటు. అయితే ఆయన నిర్మించిన అమూల్‌, NDDB, IRMA వంటి సంస్థలు నేటికీ ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నాయి. ఆయన జన్మదినమైన నవంబర్‌ 26‌ను మన దేశంలో జాతీయ పాల దినోత్సవం  (National Milk Day) గా జరుపుకుంటున్నాము. డాక్టర్‌ ‌వర్గీస్‌ ‌కురియన్‌ ‌జీవితం మనకు అనేక గొప్ప పాఠాలను అందిస్తుంది. ఆయన నిరూపించిన ముఖ్యమైన సత్యం ఏమిటంటే, రైతులకు సరైన సాంకేతిక పరిజ్ఞానం, సహకార వ్యవస్థ, మార్కెటింగ్‌ ‌సౌకర్యాలు, నిర్వహణ సామర్థ్యం కల్పిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సవ•లంగా మార్చవచ్చు. భారతదేశ శ్వేత విప్లవం ఒక వ్యక్తి సాధించిన విజయం మాత్రమే కాదు. లక్షలాది మంది పాడి రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు, సమిష్టిగా సాధించిన విజయం. అయితే ఆ విజయానికి దిశానిర్దేశం చేసి, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతుల ప్రయోజనాలకు అనుసంధానించి, ఒక బలమైన సంస్థాగత వ్యవస్థను నిర్మించిన ఘనత డాక్టర్‌ ‌కురియన్‌దే. ఆయన భారతదేశానికి కేవలం పాల ఉత్పత్తి విప్లవాన్ని అందించలేదు. రైతుల చేతుల్లోనే ఆర్థిక అభివృద్ధి అధికారం ఉండాలనే ఒక నూతన గ్రామీణ ఆర్థిక తత్వాన్ని ప్రపంచానికే పరిచయం చేశారు. ఆయన జీవితం, కృషి, ఆలోచనా విధానం భారత వ్యవసాయ రంగానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.

కరీంనగర్‌ ‌డైరీ ప్రస్థానం: ఒక విజయగాథ

అవిభక్త కరీంనగర్‌ ‌జిల్లాలోని పాడి రైతుల ఆర్థిక అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా మొదలైన కరీంనగర్‌ ‌డైరీ ప్రస్థానం నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. కురియన్‌ ‌వర్గీస్‌ ‌గారి స్ఫూర్తితో, ఆంధప్రదేశ్‌ ‌డైరీ డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న డైరీని ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలో పాలు సరఫరా చేస్తున్న రైతాంగంతో కలిసి ఒక సహకార సంఘంగా ఏర్పాటు చేసి, ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ నేటి వరకు విజయవంతంగా నడుపుతున్నాము.

చారిత్రక నేపథ్యం – పరిణామ క్రమం

1971 (ప్రారంభం):

అక్టోబర్‌ 16, 1971‌న సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆంధప్రదేశ్‌ ‌డైరీ డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌వారు కరీంనగర్‌ ‌పట్టణంలో రోజుకు కేవలం 12,000 లీటర్ల పాల ప్రాసెసింగ్‌ ‌సామర్థ్యంతో ఈ డైరీని ప్రారంభించారు.

1997 (సహకార వ్యవస్థలోకి అడుగు):

ఆంధప్రదేశ్‌ ‌సహకార సంఘాల చట్టం (1964) క్రింద ‘కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ‌పాల ఉత్పత్తిదారుల సహకార •••నియన్‌ ‌లిమిటెడ్‌’‌గా సహకార వ్యవస్థలోకి రూపాంతరం చెందింది.

2003 (మ్యాక్స్ ‌చట్టం):

రైతులకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పించే ఉద్దేశంతో ‘కరీంనగర్‌ ‌జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్‌ ‌లిమిటెడ్‌’ (MACS)  గా మారింది.

ప్రస్తుత రూపం (KMPCL):

ఆ తర్వాత కాలంలో 1956 కంపెనీల చట్ట ప్రకారం కరీంనగర్‌ ‌మిల్క్ ‌ప్రొడ్యూసర్స్ ‌కంపెనీ లిమిటెడ్‌ (KMPCL)  గా అవతరించి, నేడు ఒక బలమైన కార్పొరేట్‌ ‌స్థాయి రైతు సంస్థగా కొనసాగుతోంది.

సామర్థ్యం – విస్తరణ:

1971లో 12 వేల లీటర్ల సామర్థ్యంతో మొదలైన ఈ ప్రయాణం నేడు అద్భుతమైన స్థాయికి చేరుకుంది. కరీంనగర్‌లోని పాత ప్లాంట్‌ ‌సామర్థ్యం రోజుకు 2 లక్షల లీటర్లకు పెరిగింది. పెరుగుతున్న పాల ఉత్పత్తి, డిమాండ్‌కు అనుగుణంగా తిమ్మాపూర్‌ ‌మండలం నల్లగొండ గ్రామంలోరోజుకు 3 లక్షల లీటర్ల సామర్థ్యంతో అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడిన మెగా డైరీని ఏర్పాటు చేశాము. దీనితో కరీంనగర్‌ ‌డైరీ మొత్తం పాల ప్రాసెసింగ్‌ ‌సామర్థ్యం రోజుకు 5 లక్షల లీటర్లకుచేరుకుంది.

పాల సేకరణ – రైతుల భాగస్వామ్యం:

కరీంనగర్‌ ‌డైరీకి అసలైన బలం దాని పాడి రైతులు. సుమారు 90 వేల నుండి లక్ష మంది పాడి రైతులు (నెట్‌వర్క్ ‌క్వార్టర్‌ ‌రైతులతో సహా) డైరీకి పాలు సరఫరా చేస్తున్నారు. ప్రతిరోజూ 1.53 లక్షల లీటర్ల నుండి 1.70 లక్షల లీటర్ల వరకు నాణ్యమైన పాల సేకరణ జరుగుతోంది. 10 జిల్లాల పరిధిలోని 1,300కు పైగా గ్రామాల నుండి పాలను సేకరిస్తున్నాము. మొత్తం 1,150 పాల సేకరణ కేంద్రాలు పనిచేస్తుండగా, ఇందులో 53 కేంద్రాలను ప్రత్యేకంగా మహిళలే సమర్థవంతంగా నిర్వహిస్తుండటం మహిళా సాధికారతకు నిదర్శనం. 12 వేల లీటర్లతో మొదలై 5 లక్షల లీటర్ల సామర్థ్యానికి ఎదిగిన కరీంనగర్‌ ‌డైరీ, లక్షలాది పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతూ సహకార రంగానికి ఒక దిక్సూచిగా నిలుస్తోంది.

జై జవాన్‌!‌జై కిసాన్‌!‌జై సహకార!

డా. చలిమెడ రాజేశ్వర రావు
చైర్మన్‌, ‌కరీంనగర్‌ ‌మిల్క్ ‌ప్రొడ్యూసర్స్ ‌కంపెనీ లిమిటెడ్‌(KMPCL)

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.