పాకిస్తాన్‌కి హస్తం ఇచ్చింది చైనా. కారణం చిన్నదే. మనకంటే చైనాకు ఆ ఎడారి బుద్దులు బాగా తెలుసు. చెయ్యివ్వడంలో చేతి గుర్తు పార్టీ కన్నా నాలుగాకులు ఎక్కువే చదివింది చైనా. యుద్ధం నిర్ణయాత్మక దశకు చేరింది. పాకిస్తాన్ ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా చేతులు ఎత్తేస్తుంది. పాక్ ఇక గతం కాబోతుంది. ఎవరికైనా ఇంకా అనుమానాలు ఉంటే, బయటకి వ్యక్తం చేయకండి, బుద్ధి తక్కువ పని.
భారత్ ఇప్పుడు జీడీపీలో జపాన్‌ను అధిగమించి నాలుగవ స్థానంలోకి చేరింది. మొదటి స్థానం చేరాలంటే పాకిస్తాన్ పగలాలి. చైనాతో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత చెప్పినట్లు ‘అజేయశక్తే దేశాభివృద్ధికి మూలం. ఎటువంటి కారణం లేకుండా హింసకు దిగితే తప్పే. మనపై ఎవరూ హింసాకాండకు దిగకుండా ఆపాల్సిన అవసరం ఉంది. హింసని అనుమతించడం అధర్మం. ఒక గొప్ప జైనముని అహింస గురించి చెబుతూ ‘‘నీకు నువ్వు రక్షణ కల్పించుకోకపోతే, నిన్ను నాశనం చేస్తున్నా మౌనంగా ఉండిపోతే నువ్వు హింసాప్రవృత్తిని ప్రోత్సహిస్తున్నట్టే. నేరానికి కారణం అవుతున్నావు. కృష్ణుడు దుర్యోధనుని కలియడానికి బయలుదేరినప్పుడు రారాజు కృష్ణుడికి హాని తలపెట్టవచ్చునేమోని ధర్మరాజు అంటే… అలాంటి పరిస్థితి వస్తే యుద్ధం అవసరం లేదు..రాజ్యం మొత్తం జయించుకుని వస్తా’’ అని హామీ ఇచ్చాడు. శత్రువును ఎదురుకొనేటప్పుడు ఆచరణీయమైన వైఖరి ఇది. ఇది శక్తిని సరిగ్గా అర్థం చేసుకోవడం. అంతేనా! బలవంతుడి భాష సమాజం వింటుంది. న్యాయం జరగడానికి ఎటువంటి అవకాశం లేకుండా అవమానాలు జరిగితే… శక్తిని ప్రదర్శించడానికి వెనుకాడుతూ..ఒప్పందం గురించి ఎదురుచూడడం పిరికితనమే.. పురుషార్థం కాదు.
ప్రపంచం నేడు అర్థం చేసుకుంటున్న అత్యంత కఠిన సత్యం ఏంటంట? బలవంతుని భాష, అజేయమైన శక్తి సముపార్జన ద్వారా మాత్రమే ఏదైనా దేశం, జాతి అభివృద్ధి చెందుతాయి. భారత్ శక్తి ప్రదర్శన అంటే 140 కోట్ల మంది శక్తి.
పాకిస్తాన్ అంటే అంతా, బయటి దేశం పీచమణచడం అనుకుంటున్నారు. కానీ, అది మన ఆంతరంగిక విషయం కూడా పరిష్కరించుకోవడమే. ఇంట్లో ఉన్న పాకీయులను తుదముట్టించడమే. ఇప్పుడు పరోక్షంగా అదే జరుగుతోంది. మన అభివృద్ధి వేగంగా జరిగేది, ఇది జరిగితేనే! సైన్యానికి మద్దతు అంటూ రాహుల్, ఖర్గేల శరీరభాషను గమనించారు కదా! ఎక్కడో టర్కీలో ఖలీఫాను పదవిలో కూర్చోబెట్టడానికి భారత్‌లో ఉద్యమం చేసిన బానిస నాయకులు ఉన్న దేశం మనది ఒకప్పుడు. చేసిన సాయానికి విషసర్పం తుర్కీయే కృతజ్ఞత చూపకపోయినా ఫరవాలేదు, ద్రోహం చేస్తే! ఇప్పుడదే పని తుర్కీయే చేస్తోంది. 2023లో ఆ దేశంలో భారీ భూకంపం వచ్చింది. అప్పుడు మొట్టమొదట సాయం ప్రకటించిన దేశం భారత్. ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట భారీగా మానవతా సాయాన్ని అందించింది. బాధితులకు ఆహారం, మందులు, సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్‌లను మోదీ ప్రభుత్వం పంపింది. అపుడు మనం మానవత్వం చూపితే, అది మరిచి ఇఫుడు భారత్‌పై దాడికి పాకిస్తాన్‌కు డ్రోన్‌లను పంపింది. మనం మానవత్వం చూపితే వాళ్లు మతం చూస్తున్నారు. మెడికల్ టూరిజం పేరిట వేలకొద్ది పాకీయులు ఇక్కడ వైద్య సదుపాయం పొందుతున్నారు. ఇక్కడ కూడా మనం మానవత్వమే చూపెట్టాం. వాళ్లు మాత్రం మతం ముసుగు వేసుకొన్నారు. కుక్కకు విశ్వాసం ఉంటుంది. కానీ (మత) పిచ్చికుక్కకు ఉండదు. ఇంత చిన్న లాజిక్ మరిచిపోవడం మన తప్పు. ఆ నాయకుల హావభావాలు అలా కాకపోతే ఎలా ఉంటాయి?
శ్రీనగర్ లాల్‌చౌక్‌ని అడుగు, అతని దమ్ము ఎంతో చెబుతుంది.
రామ్‌మందిర్ పునాదిని అడుగు, అతని భక్తి ఎంతో చెబుతుంది.
కశ్మీర్‌కు తిరిగొచ్చిన పండిట్‌ను అడుగు, అతనికి భారతీయుల పట్ల ప్రేమ ఎంతో చెబుతుంది.
రద్దయిన 370 ఆర్టికల్‌ని అడుగు, అతని రాజకీయ చతురత ఎంతో చెబుతుంది.
పాక్ నుంచి తిరిగొచ్చిన అభినందన్‌ని అడుగు, సైన్యం పట్ల అతని బాధ్యత ఎంతో చెబుతాడు.
పాక్ ఆర్థిక పరిస్థితి ఎందుకు చిత్తయ్యిందో అతని వల్ల రద్దయిన నోటుని అడుగు, చెబుతుంది.
ప్రక్షాళన కావించడానికి దేశమైనా, గంగమ్మ అయినా అతనికి ఒకటే .. దేశం నాది అనుకున్నవాడు హిందుస్థాన్‌లోనే పుడతాడు. ఇటలీ నుంచి రాడు.
గెలవడానికి ఏదైనా చేసేవాడు కాదు.
గెలిచి ఏదైనా చేసేవాడు.
దేశాన్ని ఏదైనా చేసేవాడు కాడు.
దేశానికి ఏదైనా చేసేవాడు.
వదులుకుందాం ఏడుపుగొట్టుగాళ్లని, మన సైనికుల విజయాలను ఆస్వాదిద్దాం. అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేద్దాం. అయితే… గతానికి ఇప్పటికీ తేడా ఒకటుంది. మన సైన్యం విజయం సాధించే ప్రతి దశలోనూ అర్థంతరంగా యుద్ధం విరమించే ప్రమాదకరమైన ఆట ఆడుతూ వచ్చింది మన దేశం అప్పట్లో…
ఈ సారి అలా ఉండదు.. ఉండదు కాక ఉండదు.
సిందూర్ అంటే గతం కాదు. ప్రస్తుతం కాదు.
భవిష్యత్తులోనూ ఎవరి పాపిట్లో సిందూరం చెరిగిపోకుండా చూడడం.
ఇందిర పాలిట్రిక్స్ నమో టెక్నాలజీ
ఇందిర హయాంలో ప్రక్క దేశ జనుల బాధ గమనించి బాంగ్లా యుద్ధం జరిపించారు. భారత్ మీద దాడి చేసింది పాక్. ఎందుకంటే పాక్ ఆంతరంగిక విషయంలో జోక్యం చేసుకొని అంతర్జాతీయ సమాజం అనుమతి లేకుండా యుద్ధం చేశారు. కృతజ్ఞత లేని బాంగ్లాదేశ్ ఈరోజు పక్కలో బల్లెం. ఇందిరగారి భిక్ష ఇదంతా. 93 వేలమంది యుద్ధఖైదీలు చిక్కారు. సాధారణంగా దేశాల మధ్యన ఒడంబడికలు- మీకు ఇది చేస్తే, మాకు మీరు అది చేయాలి అంటాయి కదా! మరి ఎవరు ఎవరితో, ఎందుకు ఎలా ఏ కథ నడిపించారో మన వీర సైనికుల త్యాగాలు ఒట్టిపోయాయి. మన వారిని పొట్టన పెట్టుకున్న పాకీ సైన్యాన్ని ఆరుమాసాలు పోషించి రాజ్యపూజ్యాలు చేసి సాగనంపాం. ఇది ఇందిరగారి గెలుపులో కలికితురాయి.
ఇందిరగారి చాతుర్యం-లాహోర్, కరాచీ వరకు మన సైన్యం ఆక్రమణ కొనసాగింది. ఆక్రమించిన భూమిలో పీవోకే కూడా ఉంది. చారిత్రాత్మక ఒప్పందంలో మీ భూమి మీది, మా భూమి మాకు. వీరసైనికుల శవాల మీద పేలాలు కాల్చుకు తిన్న ఇందిర చాతుర్యం.
బాంగ్లాదేశ్‌కు ఎన్నో తాయిలాలు, విపరీత ఆర్థికసాయం. బాంగ్లాను బెంగాల్‌లో కలిపేసుకుంటే ఎవరు ఏమీ పీకేవారు కాదు. ఆక్రమించుకున్న కశ్మీర్ చేతికిచ్చిన ఖ్యాతి ఇందిరది… తీవ్రవాదం పేట్రేగినది. కశ్మీరీ పండిట్లు వేలమంది రాలిపోయారు. లక్షలమంది లోయ విడిచి తమదైన దేశంలో అనాథలుగా మిగిలిపోయారు. శాంతికాముకులైన బౌద్ధ భిక్షువులు తన్ని తరిమేసిన రొహింగ్యాలకు ఆశ్రయం ఇచ్చారు. వీళ్లంతా ఖాన్‌గ్రేస్‌కు ఓటర్లు.
యుద్ధంలో ఎవరు గెలిచారు? పాకీ, బాంగ్లా, రొహింగ్యా ముస్లింలు రాజపోషకులయ్యారు. కాంగ్రెస్ పాలించిన కాలం రావణకాష్టం. ముంబై, అహమ్మదాబాద్, సూరత్, బెంగళూరు, హైద్రబాద్, అక్షరధాం పార్లమెంట్ ఎన్ని బాంబులు, ఎంతమంది చావులు, లక్షల కోట్ల ఆస్తి నష్టం. ఎవరి చాతుర్యం ఈ అవస్థ! ఎవరి కుట్ర ఈ నష్టం! ఇది ఇందిర చాతుర్యం, హిందువుల అణచివేత. సెక్యులర్ పదం చేర్చుకున్న కాంగ్రెస్. 42 వ రాజ్యాంగ సవరణ, 85 శాతం హిందువుల నోటిలో మట్టి.
టెక్నాలజీ; ISRO, DRDO, BEL ఈ మూడు శక్తుల కలయికతో రూపొందించిన ‘ఆకాశతీరు’ ఇప్పుడు ప్రపంచ రణరంగ నియమాలను మార్చే స్తోంది. ఇవి కేవలం డ్రోన్‌లు కావు. ఉపగ్రహాలతో అనుసంధానమైన NAVIC ఆధారిత, AI తో నడిచే యుద్దమేఘం. ఆకాశతీరు అంటే ఏమిటీ? ప్రత్యక్ష ఉపగ్రహ చిత్రాలు- ISRO EARTH Observation satellites ద్వారా కచ్చితమైన లక్ష్య గుర్తింపు. NAVIC GPS ఆధారంగా స్వయం నియంత్రిత స్టెల్త్ డ్రోన్‌లు. BEL battle field ఫ్రొపెసర్‌లు, సురక్షిత కమ్యూనికేషన్ Aim ఆధారిత శూన్య- విలంబ కమాండ్ వ్యవస్థ. ప్రపంచం షాక్‌కి లోనైన కారణాలు. అమెరికా-పెంటగాన్ నిశ్చేష్టంగా మారింది. చైనా- బీజింగ్- మౌనంగా ఉంది. టర్కీ- Bayraktar డ్రోన్ల పట్ల గర్వం కొట్టొచ్చినట్టు ఐంది; పాకిస్తాన్ – డ్రోన్స్ కనుపించక పోవడంతో రక్షణ వ్వవస్థ కుప్పకూలింది.-‘ఇది ఎందుకు ప్రత్యేకం?’ 100% స్వదేశీ టెక్నాలజీ – ఒక్క విదేశీ చిప్ లేదు.
ISRO-DRDO-BEL సమన్వయం-అరుదైన విజయగాథ.
స్టెల్-వేగం-swarm control-మూడు కలిసిన ప్రపంచంలో ఏకైక వ్యవస్థ.
జీప్‌లోంచే ల్యాప్‌టాప్‌తో ఆపరేట్ చేయగలడు. యుద్ధం ఎక్కడైనా మొదయ్యే అవకాశం. వ్యూహాత్మక ప్రభావం. భారతదేశానికి ఇది ఒక యుద్ధ స్వాతంత్య్రం. ప్రపంచానికి ఇది ఒక హెచ్చరిక, దర్శనం – నిదర్శనం.
‘శత్రువులకు ఇది భయం, సందేహం, ఓ నిర్లక్ష్య శిక్ష’
‘‘ఆకాశతీరు’’ – కేవలం వ్యవస్థ కాదు’’ ఇది భారత్ ఆకాశంలో నుంచి ప్రయాణించిన బాణం’’ ఇది ప్రయాణించినప్పుడు శత్రువు తలవంచక తప్పదు;
‘‘ట్రంప్ కార్డ్ మిడిల్ డ్రాప్’’ (అసలు మే పదిన ఏం జరిగింది…? ఆ ఉదయం భారత వైమానిక దళం నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ (రావల్పిండి) పై బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసింది. ఈ స్థావరం ఇస్లామాబాద్‌కు పది కి.మీ.దూరంలో పాకిస్తాన్ స్ట్రాటజిక్ ప్లాన్ SPD కు సమీపంలో ఉంది. ఇది దాదాపు 170 అణు వార్‌హెడ్‌లను నిర్వహిస్తోంది. ఈ దాడి పాకిస్తాన్‌ను చాలా భయపెట్టింది. ఎందు కంటే నూర్‌ఖాన్ స్థావరంపై దాడి పాక్ అణు కమాండ్ అథారిటీని నిలిపివేయగల సామర్థ్యాన్ని చూపించింది. ఈ దాడి పాకిస్తాన్ అణుకమాండ్‌ను ‘డీకాపిటేట్’ చేయగల సంకేతంగా భావించవలసి వచ్చింది. ఈ దాడి తరువాత, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, విదేశాంగ కార్యదర్శి రూబియా వెంటనే జోక్యం చేసుకున్నారు. రూబియా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడారు. ఇది కాల్పుల విరమణకు దారితీసింది.
పాక్‌లో నూర్‌ఖాన్ వద్ద అణుస్థావరంపై దాడి జరిగినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం. దీనిని ధ్రువీకరిస్తూ AI గ్రోక్ కూడా చెప్పింది.
ట్విట్టర్ AI గ్రోక్ ప్రకారం భారత్ మే 10న పాక్ వాయు వ్యవస్థపై, అణువ్యవస్థలపై భీకర దాడి చేయడంతో, పాక్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా బలహీన పడినట్లు రుజువు కావడంతో పాక్‌కి మరోదారి లేక ఆ రోజు మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో పాక్ DGMO భారత్ DGMOకి హాట్‌లైన్ ద్వారా సంప్రదించి కాల్పుల విరమణ ప్రకటించమని అభ్యర్థించినట్లు సమాచారం.
ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అణు స్థావరాలపై దాడి చేసినట్టు భారత్ ఎప్పటికీ అధికారికంగా ఒప్పుకోదు. అలాగే ఇన్నాళ్లు అణుదాడి బూచి చూపించి భారత్‌ను భయపెట్టిన పాక్, అదే తమ అణు వ్యవస్థపై దాడి చేసింది అని అధికారికంగా ఒప్పుకుని, తమ డిఫెన్స్ వ్యవస్థ పూర్తి బలహీనతను, భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రపంచం ముందు ఒప్పుకోదు. అలాగే 2001 నుండి పాక్ అణువ్యవస్థ రక్షణ కోసం అమెరికా 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం పాక్‌కి చేసినట్టు, ఈ అణురహస్యాలు ఉగ్రవాదుల చేతిలో పోకుండా దానికి సంబంధించిన కోడ్స్ వగైరా అమెరికా అధీనంలో ఉన్నట్టు వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్ వంటి పత్రికలలో సమాచారం వచ్చింది. అంటే పాక్ అణువ్యవస్థను అమెరికా పరోక్షంగా నిర్వహిస్తోందా అనే అనుమానాలు బల పడుతున్నాయి. అందుకే ట్రంప్ అంత హడావిడిగా భారత్‌ని సంప్రదించాడు. ఆటలో ‘మిడిల్ డ్రాప్’ పడింది.
కాల్పుల విరమణ ‘బంధాలు ప్రతిబంధకాలు’
కాల్పుల విరమణ మనల్ని ఎంతటి నిరుత్సాహానికి గురి చేసిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల భావోద్వే గాలు శిఖరాగ్రం చేరాయి. ఈ సమయంలో పట్టు విడుపుల గురించీ.. సింహం నాలుగడుగులు వెనక్కి గురించీ చెబితే… శత్రువు కంటే ముందు హేళన చేసేది స్వంత మనిషే అని అర్థం అవుతున్నది.
ఎందుకంటే స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేసే వాడి మీద నమ్మకం లేకుండా… యాక్సిలరేటర్ మనమే త్రొక్కుతున్నప్పుడు ఉద్విగ్నత సహజం.
మొదటి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ కొడతాడనుకున్న బ్యాట్మెన్ అర్ధశతకం కూడా కొట్టకుండా వెను తిరిగితే చిరాకు పుట్టడాన్ని తప్పు పట్టలేం…ఆ వ్వక్తి మీద భారీ అంచనాలు ఉండడం తప్పు.. కానీ అవగాహన ఉన్న జాతీయవాదులు కూడా వ్యూహాలూ, ఆట నియమాలూ తెలిసి కూడా స్పందించిన తీరు ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. మోదీ శత్రువులూ, దేశ వ్యతిరేకులూ, గోతికాడ నక్కల్లా కాచుకుని ఉన్న తీరు.. అప్పుడెప్పుడో.. చిదంబరం.. దిగ్విజయ్ సింగ్‌లు హిందూ తీవ్రవాదం మీద పుస్తకం తయారుచేసి కూర్చున్న తీరు గుర్తుకు వచ్చింది. భారత్ ఎప్పుడూ తీవ్రవాదులను.. వాళ్ల వెనకాల ఉన్నవాళ్లని మట్టిలో కలిపేస్తామనే చెప్పింది. మోదీ కూడా అదే చెప్పారు. తీవ్రవాదుల కేంద్రాలు ధ్వంసం చేస్తాం అని చెప్పారు.. నీకేమైనా పాకిస్తాన్‌ను లేపేస్తాం అని చెప్పారా! అంతెందుకు? ఆపరేషన్ సిందూర్ గురించి చెబుతూ, యుద్ధం అని ఒక్క మాట ఎక్కువ మాట్లాడారా? చూన్ చూన్ కే మారేంగే… గుస్ కర్ మారేంగే అన్నారు. అదే చేస్తున్నారు. పాకిస్తాన్ కదా యుద్ధంగా పరిగణిస్తున్నాం అని చెప్పింది. మనం ఉత్సాహపడిన మాట వాస్తవమే. పడాలి కూడా. అదే సరైనది. కానీ, ఖాన్‌గ్రేస్.. విదేశీశక్తులతో చేసిన ఒప్పందాలు, ద్రోహాలు.. సిమ్లామిర్చీలు 93 వేల తుర్కీయే బిర్యానీలు.. నాలుగు రోజుల్లో కక్కించ గలుగుతామా… ఈ నాలుగు రోజులు భారత్ అంటే మోదీ… అంటే హిందూ సింహం చేసిన పని- ఆ ఒప్పందాలు పనికిమాలినవని ఆ ధూర్త దేశంతోనే చెప్పించడం. అదీ ఒక పక్క చావ మోదుతూ. సింధూ ఒప్పందం లేదిప్పుడు. సిమ్లా ఒప్పందం అమెరికా మధ్యవర్తినీ అని వాగి పాక్ దానికి కృతజ్ఞతలు చెప్పడంతోనే పరిసమాప్తి అయిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్‌కు మనకూ ఎటువంటి దౌత్య నియమాలు, యుద్ధ నియమాలు లేవు. మనం వీపు సాపు చేస్తుంటే, తిప్పి తన్నించుకోవడం తప్ప గత్యంతరం లేదు. ఇప్పటికే పాకీ కీలక స్థావరాలూ, అణు స్థావరాలూ కూడా గాల్లో కలిసిపోయాయి. చైనా, అమెరికా ఆయుధాల సింగారం తెలిసిపోయింది. పీవోకే తేవడానికీ, లేదా పాక్‌ను ముక్కలు చెయ్యడానికి అన్ని మార్గాలు తెరుచుకున్నాయి. ఇంకో సంగతి తెలియాలి. సైన్యానికి ఎప్పుడూ కచ్చితమైన లక్ష్యం ఉండాలి… అది తీవ్రవాద స్థావరాలు ధ్వంసం. ఇక టాస్క్ ఇవ్వడానికి చాలా కోణాలు సెట్ చెయ్యాలి. ఇప్పుడు అదే జరిగింది… బ్రోకర్ మామ.. సిమ్లా ఒప్పందం చంక నాకించేసాడు. సీజ్‌ఫైర్ ఉల్లంఘిస్తారని తెలిసి పాకిస్తాన్‌ను ముగ్గులోకి దింపారు. ఈ గ్యాప్ మన సైన్యానికి మరో స్పష్టమైన ఆబ్జెక్టివ్ ఇవ్వడానికి!
ఒక దేశానికి ఉండవలసిన లక్షణాలు లేని పాకిస్తాన్ సార్వభౌమాధికారం గురించి చైనా లాంటి కొంగ దేశాలు ముందుకు రాలేని దౌత్య నీతి నడుస్తోంది. అమెరికా అధ్యక్షుడి మాట కూడా మనం ప్రస్తావన చెయ్యలేదు. అతగాడి పరువు మురికి సంపులో పడిపోయింది. ఇప్పుడు వార్ డాక్ట్రిన్ మారింది. ఈ కాస్త సందులో మోదీ తలవంచిన ఫోటోలు లేపుకొచ్చేశారు దేశద్రోహులు. ఈ ఎలుకలు కూడా మనకి తెలియాలి.
చాలా ముఖ్యంగా ఇందిరాగాంది జరిగిన చరిత్ర. ఇఫుడు మోదీది జరుగుతున్న చరిత్ర. ఏభై ఏళ్లు. ఎన్ని రాజకీయ, ఆర్ధిక, సామాజిక, వైవిధ్యమైన కోణాలు ఎన్ని మారాయి? పిక్చర్ అభీ బాకీ హై అని తెలిసినా తొందర పడుతూ వాగుతున్న గ్రామ సింహాలు ఎప్పుడూ అలానే అరుస్తాయి. జాతీయవాద కోయిలలం అయిన మనం కూడా తొందరపడి ముందే కూస్తే ఎలా?
భారతీయ సైన్యం పాకిస్తానీ సైన్యం లాంటిది కాదు. వరుసగా ప్రధానులను చంపుకంటూ..రేప్‌లు చేసుకుంటూ పోవడానికి! మన సైన్యం దేవగణం. మనదేశం పుణ్యభూమి. మనది అసలైన ధర్మయుద్దం. చివరగా చెప్పిన మాట మళ్లీ మళ్లీ. యుద్దం అంటే వ్యూహాలు… యుద్ధం అంటే ఒకటే కొట్టుడు కాదు… ఆగడం.. కొట్టడం.. వేచి చూడడం.. వేడుకుంటే ఆగడం.. ఆచితూచి కొట్టడం…విజయం సాధించడం. మన ఆలోచనలు మోదీ ఆలోచనలు ఎప్పటికీ వేరు వేరు కాదు.
జైజవాన్ – జైహింద్
అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
ఆపరేషన్ సిందూర్ ను, పాతకాలంలో (ఇ.గా) జరికిన సైన్య, దౌత్య వివరాలతో సమగ్రంగా సమీకరించి సమీక్ష చేసిన అద్భుతమైన వ్యాసం ఇది. ఇంత చక్కగా సమీక్ష చేసిన రచయత శ్రీ సుబ్రహ్మణ్యం గారికి అభినందనలు. ఇకముందు కూడా వారు ఇంత సమగ్రమైన వ్యాసాలు అందించగలరని ఆశిస్తున్నాను.