సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

ఎంతటి కార్యమైనా నేర్పుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సహాయపడతారు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. రాబడి గతంతో పోలిస్తే మరింత మెరుగ్గా ఉంటుంది. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. ఉద్యోగాన్వేషణలో విజయం. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు మరింత లాభాలు దక్కే అవకాశం. ఉద్యోగులు విధి నిర్వహణలో సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు విశేష గుర్తింపు తథ్యం. 16,17 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. స్నేహితులతో వివాదాలు. శివాష్టకం పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

కష్టానికి ఫలితం కనిపించదు. అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు. రాబడికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. అయితే పట్టుదలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు నెమ్మదిగా కొనసాగిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపండి. వ్యాపారస్తులకు స్వల్పమొత్తం లాభాలు అందుతాయి. ఉద్యోగులు మరిన్ని బాధ్యతలతో సతమతమవుతారు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు విదేశీ పర్యటనలు వాయిదా. 17,18 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

రాబడి కొంత పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన, గృహయోగాలు. వి• నిర్ణయాలను కుటుంబసభ్యులు సమర్థిస్తారు. శత్రువులను కూడా స్నేహితులుగా మార్చుకుంటారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులు కోరుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలు, రచయితలు, క్రీడాకారులకు ఆహ్వానాలు అందుతాయి. 15,16 తేదీల్లో శారీరకరుగ్మతలు. బంధువులతో తగాదాలు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

అవసరాలకు తగినంతగా సొమ్ము సమకూరుతుంది. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం. ముఖ్య కార్యక్రమాలు సమయానుసారం పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. భూవివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనసౌఖ్యం. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు హోదాలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు దక్కవచ్చు.  13.14 తేదీల్లో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

మధ్యమధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. రాబడి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తూ ముందడుగు వేస్తారు. చిన్ననాటి స్న్భ్ఞే తులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పరపతి పెంచుకుంటారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారులు కొద్దిపాటి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 18,19 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

పట్టింది బంగారమా అన్నట్టుంటుంది. ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. ఆప్తుల నుంచి అందిన సమాచారంతో ఊరట చెందుతారు. స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు మరింత సానుకూలత ఉంటుంది. కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు సత్కారాలు జరుగుతాయి. 16,17తేదీల్లో అనారోగ్యం. కుటుంబసమస్యలు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

ఆశ్చర్యకరమైన రీతిలో ధనప్రాప్తి. సమాజంలో ప్రత్యేకత నిలుపుకుంటారు. శత్రువులను సైతం ఆదరిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహవంతంగా గడుపుతారు. స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది.14,15 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. హనుమాన్‌ఛాలీసా పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

ప్రారంభంలో కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. అయితే క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనప్రాప్తి. చిన్ననాటి స్నేహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎంతటి వారినైనా వాక్పటిమతో ఆకట్టుకుంటారు. అవసరాలకు తగినంతగా రాబడి ఉంటుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు దక్కే అవకాశం. కళాకారులు, రచయితలు, క్రీడాకారుల యత్నాలు ఫలిస్తాయి. 13,14 తేదీల్లో దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. అనారోగ్యం. శివపంచాక్షరి పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరతాయి. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. యుక్తితో వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు అవకాశాలు పెరుగుతాయి. 17,18 తేదీల్లో వృథా ఖర్చులు. బంధువులతో వివాదాలు. ఆదిత్య హృదయం పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గతం నుంచి  ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆశ్చర్యకరమైన రీతిలో ధనప్రాప్తి కలిగే అవకాశం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. శత్రువులను సైతం ఆకట్టుకుని వి•దారికి తెచ్చుకుంటారు. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి ఉపశమనం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు అంచనాలు నిజమవుతాయి. 18,19తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

పలుకుబడి, హోదాలు ఉన్నవారి పరిచయాలు ఏర్పడతాయి. వి• ఆలోచనలు, అభిప్రాయాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. స్థిరాస్తి విషయంలో సమస్యలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి లోటు లేకుండా గడుస్తుంది. ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువిజయం. వ్యాపారస్తులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులకు విదేశీ పర్యటనలు, సన్మానాలు. 14,15 తేదీల్లో దూరప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. వేంకటేశ్వరస్తుతి చేయండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

చేపట్టిన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. తరచూ ప్రయాణాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు మరింత అనుకూల సమయం. వ్యాపారస్తులు లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ్యోన్నతి లభించే వీలుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు. రచయితలు, పరిశోధకులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. 15,16 తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. శారీరక రుగ్మతలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

About Author

By editor