కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం ఇప్పుడు ప్రతిపక్షాలకు అందివచ్చింది. అయితే కథనంలో వాస్తవమెంతో బయటపడే లోపలే అసత్యాలతో విపక్షాలు వీధుల్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటికి కొత్తగా కాక్రోచ్‌ ‌జనతా పార్టీ(సీజేపీ) బొద్దింకలు కూడా తోడయ్యాయి. ముగ్గురు కమిషనర్లతో కూడిన ఎన్నికల సంఘం(ఈసీ)లో ప్రతి అంశాన్ని చర్చించిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ముగ్గురిలో మెజార్టీ సభ్యులు వ్యతిరేకిస్తే ఆ నిర్ణయం వెలువడదు. ప్రస్తుత సర్‌ ‌పక్రియపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌(‌సీఈసీ) జ్ఞానేశ్‌ ‌కమార్‌కు ఇద్దరు కమిషనర్‌లు సుక్బీర్‌ ‌సింగ్‌ ‌సంధూ, వివేక్‌ ‌జోషి 14 సార్లు అభ్యంతరాలు చెప్పారని పత్రికలో వచ్చిన కథనాన్ని ఆధారం చేసుకొని, మొత్తం ఎన్నికల వ్యవస్థనే ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. ఈ కథనంపై ఎన్నికల సంఘం స్పందించింది. ఉమ్మడి నిర్ణయం మేరకే దేశంలో ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ‌పక్రియ కొనసాగుతున్నట్టు తెలిపింది. అయినప్పటికీ విపక్షాలు ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టిస్తున్నాయి. ఒకవేళ కథనంలో పేర్కొన్నట్టు అది ఏకపక్ష నిర్ణయమైన పక్షంలో దానితో విభేదించిన వారు ఎందుకు బయటపడటం లేదనేది ప్రతిపక్షాలకే తెలియాలి.

‘‘ఓటు చోరీ’’ అనే పదాన్ని రాహుల్‌ ‌గాంధీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించే ముందు భారత ఎన్నికల సంఘంతో గాంధీ కుటుంబానికి ఉన్న ఘర్షణల చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవడం సముచితం. 1984లో ప్రధానిగా రాజీవ్‌ ‌గాంధీ బాధ్యతలు చేపట్టాక ఎన్నికల సంఘంలో వివాదాలు మొదలయ్యాయి. ఆయన హయాంలో నాటి ఎన్నికల కమిషనర్‌ ఆర్‌.‌వి.ఎస్‌. ‌పేరిశాస్త్రిపై ఎన్నికల తేదీల విషయంలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చినట్లు నాడు పలు నివేదికలు పేర్కొన్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడానికి పేరి శాస్త్రి నిరాకరించడంతో అక్టోబర్‌, 1989‌లో ఇద్దరు అదనపు ఎన్నికల కమిష నర్లను రాజీవ్‌గాంధీ ప్రభుత్వం నియమించింది. వివాదాలకు శ్రీకారం చుట్టింది. అయితే తర్వాత వచ్చిన వి.పి.సింగ్‌ ‌ప్రభుత్వం ముగ్గురు కమిషనర్ల స్థానంలో ఒకే కమిషనర్‌ ఉం‌డేలా పాత నిర్ణయాన్ని పునరుద్ధరించింది. అనంతరం పి.వి.నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మళ్లీ రాజీవ్‌గాంధీ ప్రభుత్వం తరహాలో 1993-95 మధ్యకాలంలో నాటి సీఈసీ టి.ఎన్‌.‌శేషన్‌ అధికారాలను కుదిస్తూ,  ఎం.ఎస్‌.‌గిల్‌, ‌జి.వి.జి కృష్ణవ•ర్తిలను కమిషనర్లుగా నియమించడంతో ముగ్గురి మధ్య తరచూ విభేదాలు బహిర్గతమవడమే కాకుండా న్యాయపోరాటాలు కూడా జరిగాయి. ఇక్కడ మరో విషయమేమిటంటే శేషన్‌ ‌తన పదవికాలం ముగిసిన తర్వాత ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు. మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గాంధీనగర్‌ ‌నుండి బీజేపీ అగ్రనేత అద్వానీపై పోటీ చేసి ఓడిపోయారు. మరో కమిషనర్‌ ‌గిల్‌ అయితే పదవీకాలం ముగిసిన అనంతరం మన్మోహన్‌సింగ్‌ ‌ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషనర్లను కాంగ్రెస్‌ ఎలా ప్రలోభాలకు గురిచేసింది చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు. ఇప్పుడు అదే కాంగ్రెస్‌ ‌ప్రస్తుత సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను బీజేపీ వ్యక్తిగా ప్రచారం చేయడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. 2009లో సీఈసీ ఎన్‌. ‌గోపాలస్వామి, ఆయన సహచర కమిషనర్‌ ‌నవీన్‌ ‌చావ్లా మధ్య తరచూ వివాదాలు రేగినప్పుడు సీఈసీకి వ్యతిరేకంగా మన్మోహన్‌సింగ్‌ ‌సర్కారు వ్యవహరిం చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో సీఈసీ సునీల్‌ ఆరోడా, కమిషనర్‌ అశోక్‌ ‌లవాసాల మధ్య విభేదాలు రావడంతో తన పదవికి అశోక్‌ ‌రాజీనామా చేశారు. భారత ఎన్నికల సంఘంలో కమిషనర్ల మధ్య విభేదాలు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు వెలుగు చూశాయి. ఒక సంస్థలో ఇలాంటివి సహజమే. అయితే ఇదే తొలిసారి అన్నట్టు, దీనిపై స్వరాజ్య సమరం తరహాలో ఉద్యమించాలని విపక్షాలు పిలుపు ఇవ్వడం హాస్యాస్పదం.

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌తో మరో ఇద్దరు కమిషనర్లు విభేదిస్తున్నారంటూ పూర్తి ఎన్నికల సంఘం వ్యవస్థనే ప్రతిపక్షాలు తప్పు పట్టడం వాటి అవగాహనారాహిత్యానికి నిదర్శనం. లోక్‌సభలో  ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ‌పార్టీ మరో అడుగు ముందుకేసింది. జ్ఞానేశ్‌ ‌కుమార్‌ అం‌డదండలతో సర్‌లో అవకతవకలకు బీజేపీ పాల్పడిందని, తద్వారా 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని కాంగ్రెస్‌ ‌చెప్పడం విడ్డూరం. 2024లో ఈసీ కమిషనర్‌గా  జ్ఞానేశ్‌కుమార్‌ ఉన్నారు. అనంతరం ఫిబ్రవరి, 2025లో సీఈసీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2025లో సీఈసీగా ఉన్న జ్ఞానేశ్‌ ‌కుమార్‌ 2024 ఎన్నికలను ఎలా ప్రభావితం చేశారనేది కాంగ్రెస్‌ ‌పార్టీకే తెలియాలి. సీజేపీ చీఫ్‌ అభిజీత్‌ ‌దీప్కే మరో అడుగు ముందుకేసి, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీఈసీ జ్ఞానేశ్‌ ‌కుమార్‌ ‌చొరవతోనే బీజేపీ గెలిచిందని చెప్పారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరిగాయని, అప్పుడు సీఈసీ రాజీవ్‌ ‌కుమార్‌ అని, నాడు ఎన్నికల సంఘంలో జ్ఞానేశ్‌ ‌కుమార్‌ ‌లేరనే విషయం తెలియకుండా విమర్శించడం, భారత రాజకీయాల పట్ల దీప్కే అవగాహనా రాహిత్యానికి ప్రత్యక్ష నిదర్శనం.

సీఈసీ జ్ఞానేశ్‌ ‌కుమార్‌ ‌భారత ఎన్నికల వ్యవస్థను నీరు గారుస్తున్నారని చెబుతున్న కాంగ్రెస్‌ ‌సర్‌ను నిలిపేయాలని డిమాండ్‌ ‌చేస్తోంది. దేశవ్యాప్తంగా 13 కోట్లకుపైగా ఓటర్లను తొలగించారని ఆరో పిస్తోంది. వీరంతా అర్హులైన ఓటర్లే అని వాదిస్తోంది. అయితే ఆ పార్టీ వాస్తవాలను విస్మరిస్తోంది. 2002 -2004 తర్వాత దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన చేపట్టలేదు. ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఓటర్లను చేర్చుకోవడం, ఆ సమయంలో ఎవరైనా లేనివారి గురించి సమాచారం ఇస్తే తొలగించడం మాత్రమే చేశారు కానీ ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టలేదు. దీంతో రెండు దశాబ్దాలకుపైగా దేశ ఓటర్ల జాబితాలో పేరుకుపోయిన మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, డూప్లికేట్‌ ‌నమోదులు, గుర్తించలేని ఓటర్ల వివరాలను సరిచేసే రాజ్యాంగబద్ధమైన పక్రియ నిలిచిపోయింది. ఇలాంటి పేర్లు జాబితాల్లో కొనసాగితే ఒకే వ్యక్తి పేరుతో బహుళ నమోదులు ఉండే అవకాశం ఉంటుంది. మరణించిన వ్యక్తుల పేర్లు కూడా ఎన్నికల జాబితాల్లో ఉండటం వల్ల జాబితా విశ్వసనీయత దెబ్బతినడమే కాకుండా దొంగ ఓట్లకు అవకాశాలుం టాయి. ఓటు లేనివారు ఫారమ్‌ -6‌తో కొత్తగా నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఫారమ్‌ -6‌పై గతంలో ఉన్న నిబంధనలను సడలించేందుకు ఈసీ ముందుకు రావడంతో సర్‌ ‌పక్రియ మరింత సులభంగా మారుతుంది. గతంలో 40 నుండి 60 శాతం ఓట్లు నమోదైన స్థానాల్లో సర్‌ అనంతరం 90 శాతానికిపైగా ఓటింగ్‌ ‌నమోదైనట్టు పలు రాష్ట్రాల ఎన్నికల్లో తేలింది. అంటే అనవసరమైన ఓట్లను తొలగించి, అర్హులైన వారినే జాబితాలో ఉంచడంతో ఓటింగ్‌ ‌శాతం కూడా పెరుగుతోందని స్పష్టమవుతోంది. సర్‌ ‌పక్రియపై కాంగ్రెస్‌ ‌పార్టీ ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తోంది. 2018లో ఓటర్ల జాబితాల్లో తప్పులు, డూప్లికేట్‌ ‌పేర్లు, అనర్హుల నమోదుపై కాంగ్రెస్‌ ‌నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్పట్లో సుమారు 70 లక్షల తప్పు నమోదులను వారు ప్రస్తావించారు. గతంలో ఆంధప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌కేరళ, తదితర రాష్ట్రాల్లో డూప్లికేట్‌, ‌నకిలీ ఓటర్ల నమోదుపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. సూటిగా చెప్పాలంటే గతంలో ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్నాయని వేలెత్తి చూపిన పార్టీలే ఇప్పుడు వాటిని సరిచేసే పక్రియనే ‘ఓటు చోరీ’గా పిలుస్తున్నాయి.తద్వారా అనర్హులైన వారి ఓట్ల తొలగింపునకు అడ్డుపడుతూ బుజ్జగింపు రాజకీయాకు పాల్పడుతున్నాయి. ఇది ఆయా పార్టీల ద్వంద్వ వైఖరికి నిదర్శనం.

ఎన్నికల సంఘం(ఈసీ)లో అంతర్గతంగా అధికారులు లేదా కమిషనర్లు ప్రశ్నలు లేవనెత్తడం సంస్థ వైఫల్యానికి నిదర్శనం కాదు. అది స్పష్టతకు నిదర్శనం. బహుళ సభ్యుల రాజ్యాంగ సంస్థలో చర్చ, పరిశీలన, భిన్నాభిప్రాయాలు సహజమే. ఈసీలో అంతర్గత నోట్స్, ‌పరిశీలనలు, సాంకేతిక సూచనలు నిర్ణయ పక్రియలో సర్వసాధారణం. తుది నిర్ణయాలను ఈసీ సమష్టిగా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి విభేదాలు లేవని, సర్‌పై నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల సమ్మతితోనే జరిగాయని ఈసీ అధికారికంగా ప్రకటించింది. అయినప్పటికీ ఈసీపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌ ఈ అం‌శాన్ని ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పదం చేస్తోంది.

 సీఈసీ జ్ఞానేశ్‌ ‌కుమార్‌ అం‌శాన్ని అడ్డం పెట్టుకొని కుటిల రాజకీయాలకు  కాంగ్రెస్‌ ‌పార్టీ తెర తీసింది. ఆయన అభిశంసనకు తొలుత నిర్ణయించింది. ఇతర పార్టీల మద్దతుకు ప్రయత్నించింది. అయితే పార్లమెంట్‌లో సంఖ్యా బలం లేని తనకు అభిశంసన అసాధ్యమని కాంగ్రెస్‌ ‌పార్టీకి తెలుసు. సీఈసీని తొలగించడం అంత సులభం కాదని కూడా తెలుసు. అయితే తాను ప్రభుత్వంపై పోరాడుతున్నట్లు కనిపించడానికి ఆ పార్టీ తాయత్రయపడుతోంది. ప్రతిపక్షాలపై పట్టుకు, స్వలాభానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఇండీ కూటమి సమావేశంలో సర్‌ ‌కంటే ఎక్కువగా కూటమికి ఎవరు నాయకత్వం వహించాలనే అంశంపైనే చర్చ జరిగినట్టు వార్తలు కూడా వచ్చాయి. సమావేశంలో అభిశంసన అంశాన్ని ప్రస్తావించకుండా సీఈసీతో పాటు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ ‌షాలపై విపక్ష నేతలు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ‌పన్నాగాలను పసిగట్టిన ఎస్పీ నేత అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌సమావేశానికి రాలేదు. ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌), ‌డీఎంకే పార్టీలు కూడా ముఖం చాటేశాయి. కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ఆప్‌కు లబ్ధి చేకూరేలా విడిగా ఉద్యమానికి సీజేపీ సిద్ధమవుతోంది. మొత్తం మీద అసత్యాలతో కూడిన ఈ అంశం ఆధారంగా ప్రతి పక్షాలపై పెత్తనం చెలాయించడానికి కాంగ్రెస్‌ ‌ప్రయ త్నిస్తుంటే, ఆ పార్టీతో సంబంధం లేకుండా స్వప్రయో జనాలకు ఇతర పార్టీలు ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అసత్యాలను మళ్లీ మళ్లీ చెబుతూ, అవే నిజమనేలా కాంగ్రెస్‌ ‌గోబెల్స్ ‌ప్రచారం చేస్తుంది.  వరుసగా వ•డు లోక్‌ ‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్న కాంగ్రెస్‌ ‌పార్టీ తన పరాజయాలకు సాకులు వెతుకుతూ ప్రజా తీర్పును ఆపహాస్యం చేస్తోంది. 2019లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ ‌యంత్రాలు(ఈవీఎంలు)పై బురదజల్లిన కాంగ్రెస్‌ 2024 ‌నుండి ‘ఓటు చోరీ’ అంటూ, ఇప్పుడు సర్‌ ‌పక్రియను తప్పుపడుతోంది. ఎన్నికల్లో వరుస పరాజయాలపై ఆత్మవిమర్శ చేసుకోకుండా ఎన్నికల పక్రియనే వేలెత్తి చూపుతోంది. ఈవీఎంలు తీసేసి బ్యాలెట్‌ ‌పేపర్‌ ‌ద్వారా ఎన్నికల నిర్వహణకు డిమాండు చేసే స్థాయికి ఆ పార్టీ దిగజారింది. పరాజయాలు ఎదురైనప్పుడల్లా భిన్న డిమాండ్లతో ఈసీ చేపడుతున్న ఎన్నికల పక్రియను తక్కువ చేస్తూ, వీధులకు ఎక్కుతున్న కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాల తీరు చూస్తుంటే, మరోసారి మోదీ చేతిలో ఓటమి తప్పదనే భయంతో అసలు ఎన్నికలే వద్దు అని ఇవి భవిష్యత్తులో అన్నా ఆశ్చర్యం లేదు.

ఆలస్యమైనా ఒక మంచి పనికి నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం(ఈసీ) వెనకడుగు వేయకుండా సర్‌ ‌పక్రియను పూర్తి చేయాలి. ఈసీ కమిషనర్లలో భిన్నాభిప్రాయాలు వచ్చాయనే సాకుతో, ఈ పక్రియకు ముగింపు పలకించేలా కుట్రల పనుతున్న ప్రతిపక్షాల వ్యూహాలు పారకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈసీ కమిషనర్లు ఏకతాటిపైకి వచ్చి ఆరోపణలు తిప్పికొట్టాలి. ఈసీలో విభేదాలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌ ఇప్పుడు అదే సాకుతో సృష్టిస్తున్న గందరగోళాన్ని ప్రజలు గమనించాలి.

గత అనుభవాల దృష్ట్యా, సమష్టిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, ఎప్పటికప్పుడు అసత్య ఆరో పణలను తిప్పికొడుతూ కేంద్ర ప్రభుత్వం  వ్యూహాత్మ కంగా వ్యవహరించాలి. అలా కాకుండా సమస్యను కాలానికి వదిలివేసిన పక్షంలో బొద్దింకలు వంటి చీడపురుగులకు అవకాశమిచ్చినట్టవుతుంది. మరోసారి జంతర్‌ ‌మంతర్‌ ‌సమస్యను కొనితెచ్చు కున్నట్టు అవుతుంది.

అసత్యమే నిజమనేలా సర్వత్రా వ్యాపించక ముందే, నకిలీ ఓట్లన్నింటినీ తొలగించి, అర్హులైన ఓటర్లతో దేశ ప్రజాస్వామ్యం చల్లగా ఉండా లంటే, అత్యంత అప్రమత్తతో సర్‌ను సంపూర్ణం చేయాల్సిన ఆవశ్యకత అటు ప్రభుత్వానికి, ఇటు ఈసీకి ఎంతైనా ఉంది.

– శ్రీపాద

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.