నాలుగు గోడలకే పరిమితం కాకుండా ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్ని చుట్టి రావాలనేది అనేకమంది మహిళల స్వప్నం. కానీ, రక్షణ, భద్రతా సందేహాలు వారిని వెనక్కి తగ్గేలా చేస్తుంటాయి. ఈ భయాలను పటాపంచలు చేస్తూ, మహిళల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దు కున్న ‘ఉమెన్‌ ఓన్లీ టూర్స్’  ‌ప్రయాణరంగంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తున్నాయి.

‌ప్రశాంతంగా, సురక్షితంగా ప్రయాణించాలను కునే మహిళల కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక టూర్‌ ‌ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌ ‌కేంద్రంగా పనిచేసే సంస్థల నుంచి జాతీయ స్థాయి ట్రావెల్‌ ‌కంపెనీల వరకు మహిళల భద్రతే ధ్యేయంగా టూర్లను నిర్వహిస్తున్నాయి. ఉమెన్‌ ఓన్లీ టూర్స్ ‌పేరున ఒంటరి ప్రయాణాలు చేయాలనుకునే మహిళలకు అభయం ఇస్తూ, కొత్త ప్రదేశాలను అన్వేషించాలనే తపన ఉన్నవారికి సరికొత్త మార్గాన్ని చూపిస్తూ కొందరు టూర్‌ ఆపరేటర్లు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కేవలం ప్రయాణ ఏర్పాట్లే కాకుండా, పూర్తి భద్రత, సురక్షితమైన వసతి, అనుభవ జ్ఞులైన మహిళా గైడ్‌లు మాత్రమే కాక  తోటి ప్రయాణీకులతో అనుబంధాన్ని ఏర్పరిచే ఒక నమ్మకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.

రాజస్థాన్‌ ‌చారిత్రక కోటల నుంచి కేరళ ప్రశాంత మైన బ్యాక్‌వాటర్స్ ‌వరకు, లడఖ్‌ ‌సాహసవంతమైన పర్వతాల నుంచి ఈశాన్య భారత ప్రకృతి సౌందర్యం వరకు ప్రతీ ప్రయాణాన్ని మహిళల సౌకర్యానికి, అభిరుచులకు అనుగుణంగా ప్రయాణాలను రూపుదిద్దడమే ఈ యాత్రల ముఖ్య ఉద్దేశం. వావ్‌ ‌క్లబ్‌, ఎఫ్ఫైవ్‌ఎస్కేప్స్, ‌వీగోబాండ్‌ ‌వంటి ప్రముఖ సంస్థలు మహిళలు స్వేచ్ఛగా విహార యాత్రలు చేసేందుకుప్రత్యేక సౌకర్యాలను అందిస్తున్నారు.

సాహసాలను ఇష్టపడే మహిళల కోసం లడఖ్‌, ‌స్పితి వ్యాలీవంటి పర్వత ప్రాంతాల టూర్లుఏర్పాటు చేస్తారు. ప్రశాంతమైన బీచ్‌లు, హౌస్‌బోట్‌ ‌ప్రయాణాలు, ఆయుర్వేద రిసార్ట్‌లు ఇష్టపడే వారి కోసంకేరళ,అండమాన్‌ ‌వంటి ప్రాంతాలను ఎంచుకుంటారు. తెలుగు మహిళల కోసం కేరళ, లడఖ్‌, ‌కాశ్మీర్‌, ‌రాజస్థాన్‌, ‌గోవా వంటి ప్రదేశాలకు ప్రత్యేక గ్రూప్‌ ‌టూర్లను హైదరాబాద్‌ ‌లేడీస్‌ ‌ట్రావెల్‌ ‌క్లబ్‌ ‌నిర్వహిస్తోంది. మహిళా టూరిస్టుల కోసం ప్రత్యేకంగా మహిళా గైడ్‌లు,  డ్రైవర్ల సదుపాయంతో సేఫ్‌ ‌టూర్‌ ‌ప్యాకేజీలను ‘వోవాయేజ్‌’ అం‌దిస్తోంది. ఒంటరి మహిళా ప్రయాణికులు, గ్రూపుల కోసం ప్రత్యేక సోలో, అడ్వెంచర్‌ ‌యాత్రలను వాండరింగ్‌ ఉమెన్‌ ‌పేరిట లడకి ఉమెన్‌ ‌ట్రావెల్‌ ‌కంపెనీ అందుబాటు లోకి తెస్తోంది. అలాగే వాండర్‌ ఉమానియా కంపెనీ దేశీయ, అంతర్జాతీయ పర్యటనల కోసం మహిళలకు ప్రత్యేక యాత్రలను తక్కువ బడ్జెట్‌లో అందిస్తాయి.

ఇటువంటి సోలో ప్రయాణాల్లో మహిళలు సులువుగా, సురక్షితంగా, తేలికగా లగేజ్‌ ‌సర్దుకొనే ప్పుడు గుర్తు పెట్టుకొని తమతోపాటు ఉంచుకోవా ల్సిన వస్తువులు ముందుగానే లిస్ట్ ‌తయారుచేసు కోవాలి. లగేజ్‌లో ఎమర్జెన్సీ కిట్‌ ఒకటి తప్పనిసరిగా ఉంచుకోవాలి. కిట్‌లో పెప్పర్‌ ‌స్ప్రే, పర్సనల్‌ అలారమ్‌ ‌కీచైన్‌, ‌హోటల్‌ ‌గది తలుపులకు వేసుకునే పోర్టబుల్‌ ‌లాక్‌ ‌లేదా ఎమర్జెన్సీ సౌండ్‌ అలారమ్‌, ‌చిన్న మెడికల్‌ ‌కిట్‌, ‌పెయిన్‌ ‌కిల్లర్స్, ‌బ్యాండ్‌-ఎయిడ్స్, ‌యాంటాసిడ్లు, ప్యాడ్స్, ‌టాంపన్లు తోపాటు రోజువారీ మందులు కూడా కిట్‌లో ఉంచుకోవాలి. నైట్‌ ‌వాకింగ్‌ ‌లేదా పవర్‌ ‌కట్‌ ‌సమయాల్లో ఉపయోగపడే చిన్న టార్చ్, ‌కీలకమైన పత్రాలు, అవసరానికి సరిపడే డబ్బు దగ్గర ఉంచుకోవాలి. అలాగే ఆధార్‌ ‌కార్డ్, ‌డ్రైవింగ్‌ ‌లైసెన్స్, ‌పాస్‌పోర్ట్ ‌ఫోటోకాపీలు సర్దుకోవడం మర్చిపోకూడదు.  ప్రయాణానికి అవసరమైన డిజిటల్‌ ‌కాపీలు అన్ని గూగుల్‌ ‌డ్రైవ్‌ ‌లేదా ఫోన్‌లో సేవ్‌ ‌చేసుకోవాలి.

తక్కువ బట్టలతో ఎక్కువ కాంబినేషన్లు వేసుకునేలా ప్లెయిన్‌ ‌టీ-షర్టులు, జీన్స్ ‌లేదా కుర్తీలు ప్లాన్‌ ‌చేసుకోవాలి.  ఆలయాల కోసం ప్రత్యేకంగా సంప్రదాయ దుస్తులు ఒక జత పెట్టుకోవాలి. త్వరగా ఆరిపోయే మైక్రోఫైబర్‌ ‌టవల్స్ ‌లగేజ్‌ ‌స్పేస్‌ను ఆదా చేస్తాయి. లగేజ్‌ ‌బరువును 10-12 కేజీలలోపు ఉండేలా చూసుకోవాలి. బ్యాగ్‌ను స్వయంగా సులభంగా మోయగలగడం భద్రత పరంగా ముఖ్యం.

మహిళా సోలో ప్రయాణీకులు హోటల్‌ ‌లేదా హోమ్‌స్టేను ఎంచుకునేటప్పుడు, బుక్‌ ‌చేసుకునే ముందు, గదిలో చెక్‌-ఇన్‌ అయిన తర్వాత కొన్ని ముఖ్యమైన భద్రతా అంశాలు గమనించాలి. బుకింగ్‌కు ముందు ప్రాంతం, లొకేషన్‌ ‌గమనించాలి. హోటల్‌ ‌ప్రధాన రహదారికి లేదా నగర కేంద్రానికి దగ్గరగా ఉందో లేదో చూసుకోవాలి. చీకటిగా, నిర్జనంగా ఉండే సందులు లేదా రాత్రివేళల్లో రాకపోకలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్న హోటళ్లను నివారించాలి.గూగుల్‌  ‌మాప్స్ , ‌ట్రిప్‌ అడ్విజర్‌, ‌మాక్‌ ‌మై ట్రిప్‌ ‌వంటి యాప్‌లలో ప్రత్యేకంగా సోలో లేదా ఉమెన్‌ అనే  ఫిల్టర్‌/‌సెర్చ్ ‌వర్డ్ ఉపయోగించి ఇతర మహిళా ప్రయాణికులు ఇచ్చిన రివ్యూలను చదవడం మర్చిపోవొద్దు. సీసీటీవీ, కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవాలి.

గ్రౌండ్‌ ‌ఫ్లోర్‌ ‌లేదా కారిడార్‌ ‌చివరి వ•లన ఉండే రూములను తీసుకోకుండా ఉండటంమంచిది. మొదటి లేదా రెండో అంతస్తులోని గదులు మరింత సురక్షితం. అలాగే లిఫ్ట్ ‌లేదా రిసెప్షన్‌కు సమీపంలో ఉండే గదులను కోరడం మంచిది. ఇంటర్‌కామ్‌ ‌సదుపాయం చెక్‌ ‌చేసుకొని అత్యవసర సమయంలో రిసెప్షన్‌ ‌నంబర్‌ ‌స్పీడ్‌ ‌డయల్‌లో ఉందో లేదో చూడండి. హిడెన్‌ ‌కెమెరాలుఇన్ఫ్రారెడ్‌ ‌లైట్లను ఉపయోగిస్తాయి. ఇవి ఫోన్‌ ‌కెమెరాకు కనిపిస్తాయి. ఫోన్‌ ‌కెమెరా ఆన్‌చేసి, స్క్రీన్‌ ‌వైపు చూస్తూ, అనుమానం ఉన్న ప్రదేశాల వైపు  ఫోన్‌ను తిప్పండి. స్క్రీన్‌పై ఏవైనా తెల్లటి మెరిసే చుక్కలు కనిపిస్తే, అక్కడ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇలాహోటల్‌ ‌బుకింగ్‌లో జాగ్రత్తలు, హిడెన్‌ ‌కెమెరాల తనిఖీ, అత్యవసర కిట్‌ అమర్చుకోవడం లాంటి చిన్నచిన్న అంశాలపై అవగాహన ఉంటే సోలో ప్రయా ణాలు ఎంతో సులభమవుతాయి. మన భద్రత మన చేతుల్లోనే ఉంచుకుంటూ, తోటి మహిళలతో కొత్త స్నేహబంధాలను బలపరుచుకుంటూ సోలో  ప్రయాణాన్ని మనసారా ఆస్వాదించవచ్చు.

జయశ్రీ ఆచంట
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.