సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

కొన్ని కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధల నుంచి బయటపడే అవకాశం. స్థిరాస్తుల వ్యవహారాలలో  కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఒక వర్తమానంశ్రీమీలో కొత్త ఆశలు నింపుతుంది. దేవాలయాలు సందర్శిస్తారు. అందరిలోనూ మీ పట్ల గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు పెట్టుబడులు అనూహ్యంగా దక్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో గందరగోళం తొలగుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు శుభవార్తలు అందుతాయి. క్రీడాకారులు, పరిశోధకులకు విజయాలు వరిస్తాయి. 6,7 తేదీల్లో్య అనుకోని ఖర్చులు. స్నేహితులతో విభేదాలు. హనుమాన్‌ఛాలీసా పఠించండి..

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

అనుకున్నంత రాబడి దక్కి అవసరాలు తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు.. చిన్ననాటి స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. కుటుంబంలో వివాహాది శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహం కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారులకు  తగినంత పెట్టుబడులు సమకూరి లాభాలు సైతం అందుతాయి. ఉద్యోగులకు బాధ్యతల భారం నుంచి కొంత విముక్తి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కలసివస్తుంది. రచయితలు, క్రీడాకారులు లక్ష్యసాధనలో ముందడుగు వేస్తారు. 11,12 తేదీల్లో స్నేహితులతో తగాదాలు. స్వల్ప శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు శివాష్టకం పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

ఆదాయం మరింత మెరుగ్గా ఉంటుంది. అప్పులు తీరి ఊరట చెందుతారు. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో విశేష గౌరవం పొందుతారు. మీ అభిప్రాయాలను అందరూ ఆమోదిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనయోగం. స్థిరాస్తుల  విషయంలో వివాదాలు తీరతాయి. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు  పనిభారం కొంత తగ్గవచ్చు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఇబ్బందులు తొలగుతాయి. రచయితలు, పరిశోధకులకు ముఖ్య సమాచారం. 9,10 తేదీల్లో స్వల్ప శారీరక రుగ్మతలు. కుటుంబసభ్యులతో విభేదాలు. రామరక్షాస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఎంతటి వారినైనా చాకచక్యంగా  ఆకట్టుకంటారు. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని తీరి ఊరట చెందుతారు. విద్యార్థులకు అవకాశాలు అనుకోకుండా దక్కుతాయి. వాహనాలు, ఇళ్లు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు అనుకున్న హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. కళాకారులు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 7,8 తేదీల్లో సన్నిహితులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు.• కార్యక్రమాలలో ఆటంకాలు  తొలగుతాయి. ధార్మిక  కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలపై  కుటుంబంలో చర్చలు సాగిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. మీ సత్తా, శక్తిసామర్థ్యాలను అందరూ గుర్తిస్తారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఉద్యోగులు  పనిభారం నుంచి బయటపడతారు. కళారంగం వారికి మరింత ఊహించని అవకాశాలు. రచయితలు, క్రీడాకారులకు కొత్త ఆశలు. 6,7 తేదీల్లో  ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. శ్రీకృష్ణాష్టకం పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.  అదనపు ఆదాయం సమకూరి అప్పులు తీరతాయి. నిరుద్యోగులకు. ఉద్యోగలాభం.. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.  స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆధ్యాత్మిక  కార్యక్రమాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలకు చికాకులు, సమస్యలు తొలగుతాయి. పరిశోధకులు, క్రీడాకారులకు అంచనాలు నిజమమవుతాయి. 8,9 తేదీల్లో అనుకోని ఖర్చులు. శారీరక రుగ్మతలు. శివపంచాక్షరి పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

కొత్త కార్యక్రమాలు అత్యంత వేగంగా ప్రారంభించి పూర్తి చేస్తారు. బంధువుల ప్రేమ మరింత లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అప్పులు తీరి ఊరట చెందుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని  సమస్యల నుంచి బయటపడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులకు మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలకు శుభవర్తమానాలు. రచయితలు, క్రీడాకారులకు కొత్త ఆశలు. 10,11 తేదీల్లో సన్నిహితులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

కొన్ని ముఖ్య కార్యక్రమాలు నిదానించినా చివరికి పూర్తి కాగలవు.. ఆలోచనలు అంతగా కలసిరాక మదనపడతారు. కష్టానికి తగిన ఫలితం అంతగా కనిపింగీ దు. స్థిరాస్తి వివాదాలు గందరగోళంగా మారవచ్చు.  దైవకార్యాలలో పాల్గొంటారు. స్నేహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో మనశ్శాంతి చేకూరుతుంది. కాంట్రాక్టులు ఎట్టకేలకు లభిస్తాయి.. పారిశ్రామిక, రాజకీయవేత్తల కృషి కొంత ఫలించే అవకాశం. పరిశోధకులు, రచయితల కృషి కొంతమేర ఫలిస్తుంది. 11,12 తేదీల్లో వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. అన్నపూర్ణాష్టకం పఠించండి..

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.   ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది.. ముఖ్యకార్యక్రమాలు సకాలంలో  పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. ఉద్యోగార్ధుల యత్నాలు కొలిక్కి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు కొంతమేర తొలగుతాయి. ఒక ఆహ్వానం మరింత సంతోషం కలిగిస్తుంది. స్నేహితులతో విభేదాలు తొలగి సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారులు అనుకున్నంత లాభాలు అందుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తల ప్రయత్నాలు  విజయవంతంగా సాగుతాయి. రచయితలు, క్రీడాకారులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.  7,8 తేదీల్లో  శ్రమాధిక్యం. శారీరక రుగ్మతలు. గణేశాష్టకం పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆదాయం మరింత మెరుగుపడుతుంది. కొన్ని అప్పులు సైతం తీరే అవకాశం. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగార్ధులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి ఒడ్డున పడతారు.  వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు సఫలమవుతాయి, అనుకున్నంత లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఒత్తిడులు, సమస్యలు  తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు. క్రీడాకారులు, పరిశోధకుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. 7,8 తేదీల్లో శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యమైన కాంట్రాక్టులు తప్పిపోతాయి. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తుల వివాదాలు కొంత సమస్యగా మారవచ్చు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. కొన్ని ముఖ్య నిర్ణయాలు మార్చుకుంటారు. గృహ  నిర్మాణయత్నాలు మందగిస్తాయి. కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి   ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపారులకు  చికాకులు తప్పవు. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. 8,9 తేదీల్లో ధనలాభం.. శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

కొన్ని కార్యక్రమాలను శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేసేందుకు యత్నిస్తారు. దైవకార్యాలలో పాల్గొంటారు.  బంధువులు, స్నేహితులతో తగాదాలు క్రమేపీ పరిష్కారమవుతాయి. ఆస్తుల ఒప్పందాలలో కొంత జాప్యం. శారీరక రుగ్మతలు కాస్త చికాకు పరుస్తాయి, జాగ్రత్తలు పాటించండి. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కే సూచనలు. గృహ నిర్మాణ యత్నాలలో  అవాంతరాలు తొలగుతాయి. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు.  వ్యాపారులు కొంతమేర లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో  బాధ్యతలు మరింత  పెరుగుతాయి. కళాకారులు, రాజకీయవేత్తలకు కష్టానికి ఫలితం కనిపిస్తుంది. క్రీడాకారులు, పరిశోధకులకు కాస్త ఊరట లభిసుంది. 11,12 తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు.. ఆదిత్య హృదయం పఠించండి.

About Author

By editor