‌ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన,అతి పెద్ద బహుళ రహదారులతో నిర్మిస్తున్న జోజీలా సొరంగ (కనుమ) మార్గం అతి త్వరలో పూర్తికానుంది. నిజానికి ఇది కొద్ది కాలం క్రితమే వినియోగంలోకి వచ్చింది. జవ్మ-కశ్మీర్‌లోని గందర్బల్‌ ‌జిల్లాలోని సోనేమార్గ్-‌లద్దాక్‌లోని కార్గిల్‌ ‌జిల్లాలోని డ్రాస్‌ ‌ప్రాంతాల మధ్య ఈ సొరంగ మార్గం నిర్మిత మవుతోంది. హైదరాబాద్‌ ‌నగరానికి చెందిన మేఘా ఇంజనీరింగ్‌ అం‌డ్‌ ఇ‌న్ఫాస్ట్రక్చర్‌ ‌లిమిటెడ్‌ (ఎం.ఇ.ఐ.ఎల్‌) ఇం‌జనీరింగ్‌ ‌కంపెనీ దీని నిర్మాణం చేపట్టింది. ఈ సొరంగ మార్గం వెడల్పు 9.5 మీటర్లు కాగా, 7.57 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గుర్రపు డెక్క ఆకారంలో సుమారు 14 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగం సముద్ర మట్టానికి 11, 578 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ మార్గంలో అతి తేలికగా రాకపోకలు సాగించడానికి వీలుగా రెండు రోడ్లు వేశారు.

దీని పక్కనే జెడ్‌-‌మోర్‌ ‌సొరంగ మార్గం కూడా నిర్మాణమవుతోంది. ఈ రెండు సొరంగాల నిర్మాణం పూర్తయ్యే పక్షంలో ఎటువంటి వాతావరణంలోనైనా లద్దాక్‌, ‌బైతాల్‌ల మధ్య తేలికగా రాకపోకలు సాగించ వచ్చు. ఇది శ్రీనగర్‌-‌హ్‌ ‌జాతీయ రహదారి మీద ఉంది. అమర్నాథ్‌ ‌గుహ వరకు సురక్షితంగా ప్రయా ణించేందుకు కూడా వీలుంటుంది. లద్దాక్‌, అమర్నాథ్‌ ‌గుహ మధ్య ప్రయాణానికి పట్టే గంటన్నర సమయం, పదిహేను నిమిషాలకు తగ్గిపోయింది. పర్యాటక రంగం మరింత పురోగతి సాధించడానికి మార్గం సుగమం అయింది. లద్దాక్‌ ఆర్థిక వ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది. అంతే కాదు, ఇది చైనా, పాకిస్థాన్‌ ‌దేశాలకు సరిహద్దు ప్రాంతమైనందువల్ల భారత సైనికులు, సైనిక శకటాలు తేలికగా రాకపోకలు సాగించడానికి కూడా అవకాశం కలిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018 మేలో ఈ నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ చేశారు. ఏడేళ్లలో పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుటికీ మధ్యలో కోవిడ్‌ ‌కారణంగా ఇక్కడి నిర్మాణ కార్యక్రమాలకు బ్రేక్‌ ‌పడింది.

సొరంగం ఉపయోగాలు

ఈ జోజీలా సొరంగ నిర్మాణం పూర్తయితే, శ్రీనగర్‌, ‌లద్దాక్‌ల మధ్య ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. సురక్షితంగా ప్రయాణం సాగించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎటువంటి వాతావరణంలోనైనా ప్రయాణం చేయడానికి వీలు కలుగుతుంది. సోనేమార్గ్, ‌మీనామార్గ్‌ల మధ్య ప్రయాణ సమయం కూడా నాలుగు గంటల నుంచి నలభై నిమిషాలకు తగ్గిపోతుందని భావిస్తున్నారు. శ్రీనగర్‌-‌లేహ్‌ ‌జాతీయ రహదారిలో సుమారు 12 వేల అడుగుల ఎత్తున గల జోజీలా కనుమ నవంబర్‌-‌మధ్యకాలంలో (ఏడాదిలో ఏడు నెలలు) మూతపడి ఉండేది. ఈ మార్గంలో హిమపాతం, కొండ చరియలు విరిగిపడడం కారణంగా వ•సేయ డంతో కొన్ని ప్రాంతాలకు మిగిలిన ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడం వంటివి జరుగుతుండేవి. జోజీలా సొరంగ నిర్మాణంతో ఇప్పుడు ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఏడాది పొడవునా, ఎలాంటి వాతా వరణంలోనైనా ఇక్కడ రాకపోకలు సాగించడానికి అవకాశం కలిగింది. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 8,038 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేసింది. 2028 ఫిబ్రవరి నాటికి ఈ సొరంగ నిర్మాణం పూర్తి స్థాయిలో వినియోగం లోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ జోజీలా కనుమ ప్రాంతం వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఉండడం, జాతీయ భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉన్నందువల్ల ఈ సొరంగ మార్గ నిర్మాణం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. సైనికులు తిరగడానికి, ప్రజలు తమ రోజువారీ కార్యకలాపాలు సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగించడానికి ఇది చక్కటి అవకాశం కల్పిస్తుంది. సుమారు 1948 ప్రాంతంలో దీన్ని పాకిస్థాన్‌ ‌సైనికుల నుంచి కాపాడుకోవాల్సి వచ్చింది. కార్గిల్‌ ‌ప్రాంతానికి ఆహార పదార్థాలను, ఆయుధాలను సరఫరా చేయడానికి, సైనికులు రాకపోకలు సాగించడానికి ఇదివరకు ఏడాదిలో ఎక్కువ కాలం అవకాశం ఉండేది కాదు.

కార్గిల్‌ ‌ప్రాంతానికి కొత్త దశ

సరిహద్దు ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. సరిహద్దుల్లో మారువ•ల ప్రాంతాల్లో ఉన్న పట్టణాలు, గ్రామాలను మిగిలిన భారత దేశంతో అనుసంధానం చేసి, సంస్కృతిని, నాగరికతను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. ఇటీవలే ప్రారంభోత్సవం జరిగిన సోనేమార్గ్, ‌నిర్మాణంలో ఉన్న జోజీలా సొరంగ నిర్మాణాల వల్ల లద్దాక్‌, ‌సోనేమార్గ్, ‌మీనామార్గ్ ‌వంటి ప్రాంతాలు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. సరిహద్దులో రక్షణ వ్యవస్థలు మరింత మెరుగుపడడానికి కూడా అవకాశం ఉంది. ఒక్క వేసవి కాలంలో తప్ప శీతకాలం, వర్షాకాలాల్లో ఈ ప్రాంతాలకు వెళ్లడం చాలా కష్టమైన వ్యవహారం. ఈ ప్రాంతంతో కవ్యనికేషన్‌ ‌వ్యవస్థ విచ్ఛి•న్నం అవుతోంది. నిర్మాణ సమయంలో కూడా కొండ చరియలు విరిగిపడడం, మంచు కురవడం వంటివి ఎదురవుతున్నా, సిబ్బంది ప్రాణాలకు లెక్క చేయకుండా ఈ నిర్మాణ పనులను కొనసాగిస్తోంది. సుమారు ఎనభై శాతం నిర్మాణం పూర్తయినందువల్ల ఈ సొరంగ మార్గంలో రాకపోకలు ప్రారంభం అయ్యాయి.

లద్దాక్‌, ‌కార్గిల్‌, ‌సోనేమార్గ్, ‌మీనామార్గ్, ‌బైతాల్‌ ‌ప్రాంత ప్రజలు వాతావరణంలో చోటు చేసుకుంటున్న ఒడుదొడుకులు, హెచ్చుతగ్గుల వల్ల నానా అవస్థలూ పడుతున్నారు. ఏడాదిలో సుమారు ఏడు నెలల పాటు ఆహార ధాన్యాల సరఫరాకు అవకాశం ఉండదు. పేదరికం వల్ల, సరైన వసతి సౌకర్యం లేకపోవడం వల్ల ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోవడం వారికి సాధ్యపడడం లేదు. జోజీలా, జెడ్‌-‌మోర్‌ ‌సొరంగాల నిర్మాణం పూర్తయిన తర్వాత ఏడాది పొడవునా ఆహార ధాన్యాలు సరఫరా అయ్యే అవకాశం ఉంది. ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి వివిధ రకాల వాహనాల సౌకర్యం ఏర్పడుతుంది. అంతేకాదు, ప్రభుత్వం వీరికి నిత్యావసర వస్తువుల సరఫరాను పెద్ద ఎత్తున చేపట్టబోతోంది. ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం, విద్యుత్‌, ‌తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది.

కాగా, ఈ జోజిలా సొరంగ మార్గాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులు, పర్యాటకులు ఒక ఇంజనీరింగ్‌ అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. పర్వత సానువుల్లో, సముద్ర మట్టానికి ఎంతో ఎత్తులో, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, మిగిలిన భారతదేశంతో సంబంధం లేకుండా ఉన్న ఈ సొరంగ నిర్మాణాన్ని అతి తక్కువ కాలంలో నిర్మించడం ఆషామాషీ వ్యవహారం కాదని ఆ ప్రాంతాన్ని సందర్శించిన వారెవరికైనా తేలికగా అర్థమైపోతుంది. దేశానికి ఒక రక్షణ కవచంగా పని చేయడమే కాక, ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఈ సొరంగం జవ్మ-కాశ్మీర్‌, ‌లద్దాక్‌ల ఆర్థిక, పర్యాటక ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. నిజానికి, కార్గిల్‌ ‌జిల్లాలో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొని ఉంది.

About Author

By editor