సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
అప్పుల భారం తగ్గుతుంది. ఆదాయం మరింత అనుకూలిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. మీరు తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. బంధువుల నుంచి ధనలాభ సూచనలు. నిరుద్యోగులకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతారవణం నెలకొంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు నూతనోత్సాహం. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. రచయితలు విశేష గుర్తింపు లభిస్తుంది. 28,29 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఎంతటి కార్యక్రమమైనా విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కుటుంబసభ్యులతో తగాదాలు తీరతాయి. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి.్య ఆథ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకోని కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారులకు ఆశించినరీతిలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పనిభారం చాలావరకూ తగ్గుతుంది. రాజకీయవేత్తలకు శుభవర్తమానాలు. క్రీడాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 24,25 తేదీలలో శారీరక రుగ్మతలు. స్నేహితులతో విభేదాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. బంధువులతో సంబంధబాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. కీలక సమాచారం అందుతుంది. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కవచ్చు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన వాతావరణం. 26,27 తేదీల్లో స్నేహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దుర్గాస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కుటుంబంలో ఒత్తిళ్లు తొలగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆధ్యాత్మిక,సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. యత్నకార్యసిద్ధి. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాబడి గతం కంటే మెరుగుపడుతుంది. భూలాభాలు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు బాధ్యతలు తగ్గుతాయి. కళాకారులకు అవకాశాలు అనుకోకుండా దక్కుతాయి. క్రీడాకారులు, పరిశోధకులకు పూర్వవైభవం. 28,29 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొన్ని కార్యక్రమాలు కొంత నెమ్మదిస్తాయి. శ్రేయోభిలాషులు, ఆప్తుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని పాతబాకీలు వసూలవుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. కొన్ని వివాదాలు మీ చొరవతో పరిష్కారమవుతాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు కుదురుతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు లాభాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు సమస్యలు తీరతాయి. రచయితలకు పురస్కారాలు. 25,26 తేదీల్లో ఖర్చులు అధికం. దూరప్రయాణాలు. శివపంచాక్షరి పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
కుటుంబంలో కొన్ని సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి స్నేహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి విషయంలో నెలకొన్న చిక్కులు తొలగుతాయి. కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కుతాయి. రాబడి గతం కంటే మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు ఫలప్రదమవుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు అందుతాయి. రాజకీయవేత్తలకు పూర్వవైభవం. 27,28 తేదీల్లో వృథా ఖర్చులు. స్నేహితులు, బంధువులతో విభేదాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. స్థిరాస్తుల విషయంలో ఇబ్బందులు అధిగమించి ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అందరిలోనూ పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారులకు లక్ష్యాలు నెరవేరతాయి. ఉద్యోగులకు మరింత అనుకూల సమయం. పారిశ్రామికవేత్తల ప్రయత్నాలలో పురోగతి. రచయితలు, పరిశోధకులకు శుభవార్తలు. 26,27 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఆదాయం కొంత నిరాశ పరుస్తుంది. కొత్తగా అప్పులు చేస్తారు. పరిస్థితుల ప్రభావంతో కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో మీపై వ్యతిరేకత ఉంటుంది. ఆస్తుల విషయంలో కొత్త వివాదాలు నెలకొంటాయి. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. బంధువర్గం నుంచి ఒత్తిళ్లు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు తృటిలో చేజారతాయి. వ్యాపారులకు లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలకు అంచనాలలో పొరపాట్లు. రచయితలు, క్రీడాకారులకు గందరగోళ పరిస్థితులు. 29,30తేదీల్లో శుభవార్తలు. వాహనసౌఖ్యం. వస్తులాభాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరుల నుంచి రావలసిన డబ్బు అంది ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. గృహ, వాహనయోగాలు కలుగుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు అనూహ్య లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు లక్ష్యాలు సాధిస్తారు. క్రీడాకారులు, కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. 27,28 తేదీల్లో బంధువుల నుంచి ఒత్తిడులు. స్వల్ప రుగ్మతలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆదాయం మరింత మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం. కుటుంబంలో ఒత్తిడులు, సమస్యల నుంచి బయటపడతారు. వ్యతిరేకులు కూడా మీపై విధేయత చూపుతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు విస్తరణ యత్నాలు సఫలం. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం. కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనసౌఖ్యం. వ్యాపారులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు విశేషంగా కలసివస్తుంది. పరిశోధకులు విజయాల బాటలో పయనిస్తారు. 24,25 తేదీల్లో శ్రమ తప్పదు. అనుకోని ప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఇంతకాలంగా చికాకు పరుస్తున్న సమస్యలు కొన్ని పరిష్కరించుచకుంటారు. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. మీ ప్రతిపాదనలు, సూచనలు కుటుంబసభ్యులను ఆలోచింపజేస్తాయి. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆశించినంత ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు సంతోషకరమైన సమాచారం. ఉద్యోగులకు సహచరుల సాయం అందుతుంది. రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కుతాయి. 28,29 తేదీలలో బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. శివాష్టకం పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వ్యతిరేక పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. సమాజంలో గౌరవప్రతిష్ఠలు పొందుతారు. స్నేహితులు, సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని మరింత ఆకట్టుకుంటాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. కొన్ని వ్యూహాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. క్రీడాకారులు, కళాకారులకు 27,28తేదీల్లో స్వల్ప రుగ్మతలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అంగారక స్తోత్రాలు పఠించండి.