సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కాంట్రాక్టర్లకు ఊహించని అవకాశాలు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. మీ ఆశయాలు నెరవేరతాయి. వాహనాలు, గృహం కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. ఎంతోకాలంగా ఎదురవుతున్న కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆదాయానికి లోటు లేకుండా గడుస్తుంది. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. కొత్త పెట్టుబడులు సైతం సమకూరతాయి. ఉద్యోగులు తమ సత్తా, నేర్పుతో ముందడుగు వేస్తారు. పారిశ్రామికవేత్తలు, రచయితలు, కళాకారులకు గౌరవ పురస్కారాలు అందుతాయి. 31,1 తేదీలలో అనుకోని ఖర్చులు. శారీరక రుగ్మతలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
అన్నింటా విజయమే సిద్ధిస్తుంది. అనుకున్న కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. నిరుద్యోగులకు భరోసా ఏర్పడుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు మరింత అనుకూలత ఉంటుంది. లాభాలు సంతోషం కలిగిస్తాయి. ఉద్యోగులకు నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. పారిశ్రామికవేత్తలు, రచయితలు, కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 5,6 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. దేవీఖడ్గమాల పఠించండి..
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల ద్వారా ఆహ్వానాలు అందుతాయి. చిరకాల ప్రత్యర్థులు కొంత మెతకబడతారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. రుణాలు సైతం తీరి ఉపశమనం పొందుతారు. కుటుంబంలోని పెద్దల సలహాలు పాటిస్తారు. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. కొత్త భాగస్వాములు జతకడతారు. ఉద్యోగాలలో విధి నిర్వహణలో అవాంతరాలు తొలగి ఊరట లభిస్తుంది. పైస్థాయి నుంచి అభినందనలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. 2,3 తేదీలలో వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సమాజసేవలో భాగస్వాములవుతారు. కొన్ని సమస్యలు, వివాదాలు పరిష్కరించుకుంటారు. సోదరులతో ఆనందంగా గడుపుతారు. ఇంటి నిర్మాణాలపై మరింత దృష్టి పెడతారు. విద్యార్థుల యత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వాహనసౌఖ్యం. మీ నిర్ణయాలు అందరూ హర్షిస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. కళాకారులు, రచయితలు, క్రీడాకారులకు అనుకూల సమయం. 2,3 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిచయాలు పెరిగి ఉత్సాహంగా సాగుతారు. ఆప్తుల సలహాలు పాటిస్తారు. కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సొమ్ముకు లోటు ఉండదు. వివాహయత్నాలు సానుకూలం. వాహన, కుటుంబసౌఖ్యం. కీలక నిర్ణయాలకు తగిన సమయం. ఆరోగ్యం మెరుగుపడి ప్రశాంత జీవనం సాగిస్తారు.వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుతాయి. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులకు సత్కారాలు, ప్రజాదరణ పెరుగుతుంది. 1,2తేదీలలో దుబారా ఖర్చులు. ప్రయాణాలు సాగిస్తారు. శివాష్టకం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం మరింత పెరిగి అవసరాలు తీరతాయి. దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనసౌఖ్యం. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. విశేష గుర్తింపు రాగలదు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలు మరిన్ని విజయాలు సాధిస్తారు , 3,4 తేదీలలో అనారోగ్యం. శ్రమ తప్పదు. గణేశాష్టకం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. స్థిరాస్తుల విషయంలో ఇబ్బందులు అధిగమించి ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అందరిలోనూ పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారులకు లక్ష్యాలు నెరవేరతాయి. ఉద్యోగులకు మరింత అనుకూల సమయం. పారిశ్రామికవేత్తల ప్రయత్నాలలో పురోగతి. రచయితలు, పరిశోధకులకు శుభవార్తలు. 26,27 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
అప్రయత్నంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు మరింత సహకరిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. రావలసిన సొమ్ము అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తుల వ్యవహారం కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. వ్యాపారాలలో భాగస్వాముల నుంచి మరింత పెట్టుబడులు రాగలవు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. క్రీడాకారులు, రచయితల యత్నాలు సఫలం.5,6 తేదీలలో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. శ్రీహయగ్రీవస్తుతి మంచిది.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేసి ముందడుగు వేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. రావలసిన డబ్బు అందే సూచనలు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణంలో గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వేడుకలు నిర్వహిస్తారు. ఆరోగ్యసమస్యలు తీరతాయి. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు, కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగులు విధి నిర్వహణలో అవాంతరాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు సత్కారాలు జరుగుతాయి. 31,1 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు.. శ్రీగాయత్రీ ధ్యానం చేయండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. నిరుద్యోగుల జీవితాశయం నెరవేరుతుంది. ఆర్థికంగా మరింత అనుకూలిస్తుంది. అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఔషధసేవనం నుంచి విముక్తి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి, విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు రాగలవు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. 2,3 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. స్నేహితులతో వివాదాలు. మహాలక్ష•?మ ప్రార్ధన మంచిది.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్నేహితులతో వివాదాలు నెలకొంటాయి. దేవాలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు పరిస్థితులు అనుకూలించవు. రావలసిన సొమ్ము అందక కొంత నిరాశ చెందుతారు. ప్రతి విషయంలోనూ ఓర్పుతో వ్యవహరించడం మంచిది. కొన్ని రుగ్మతలు బాధిస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు కొంత అనుకూలించినా లాభాలు తగ్గడం నిరాశ పరుస్తుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు తథ్యం. పైస్థాయి వారి ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. కళాకారులు, క్రీడాకారులకు ఒత్తిడులు. 2,3 తేదీల్లో శుభవార్తలు. ఆస్తిలాభ సూచనలు. లక్ష్మీస్తుతి మంచిది.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సమాచారం. స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సమాజ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. రావలసిన డబ్బు అందుతుంది. అందరిలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. బంధువుల రాకతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు తీరతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో అనుకున్న రీతిలో విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల మెప్పు పొందుతారు. రాజకీయవేత్తలు, కళాకారుల ఆశయాలు నెరవేరతాయి. రచయితలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 5,6 తేదీల్లో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. ఆదిత్య హృదయం పఠించండి.