సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నిదానించినా సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇళ్లు,వాహనాలు సమకూర్చుకుంటారు. మీపట్ల బంధువులు మరింత ప్రేమానురాగాలు చూపుతారు. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉండి అప్పులు తీరతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. వ్యాపారులకు క్రమేపీ అనుకూల పరిస్థితులు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ యానం. కళాకారులు, సాంకేతిక నిపుణులు విదేశీ పర్యటనలకు సంసిద్ధులవుతారు. 9,10 తేదీలలో అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. దేవీఖడ్గమాల పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురై ఇబ్బంది కలిగించవచ్చు. అనుకున్న కార్యక్రమాలలో శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం గందరగోళం పెట్టవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీ నిర్ణయాల కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తారు. అయినా తొందరపాటు వద్దు. తరచూ ప్రయాణాలు సంభవం. దేవాలయాల సందర్శనం. వ్యాపారులు లాభనష్టాలు సమానస్థాయిలో భరించాల్సిన పరిస్థితి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవేత్తలు, రచయితలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. 10,11 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. హనుమాన్ఛాలీసా పఠించండి.
.మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
యత్నకార్యసిద్ధి. కుటుంబసభ్యులతో వివాదాలు సద్దుమణ గి సఖ్యత ఏర్పడుతుంది. ఆదాయం కొంత పెరిగి సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు చాలావరకూ తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారులకు లాభాలు దక్కి ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు పదవీయోగం. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులకు విశేష గుర్తింపు దక్కుతుంది. 12,13తేదీల్లో ఖర్చులు. శారీరక రుగ్మతలు. లక్ష్మీస్తుతి మంచిది.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. అనుకున్న కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. కుటుంబంలో మీ మాటంటే శిలాశాసనంగా ఉంటుంది. ఎంతటి వారినైనా వాక్పటిమతో ఆకట్టుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అంచనాలు నిజమవుతాయి. క్రీడాకారులు నైపుణ్యాన్ని చాటుకుంటారు. 7,8 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. విష్ణుసహస్రనామ పారాయణ పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. మీ ఆశయాలు నెరవేరే సమయం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులు అన్నింటా చేదోడుగా నిలుస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలపై సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. కళాకారులకు సన్మానాలు. పరిశోధకులు, క్రీడాకారులకు అరుదైన పురస్కారాలు దక్కవచ్చు. 9,10 తేదీలలో వివాదాలు. శారీరక రుగ్మతలు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసే వరకూ విశ్రమించరు. మీ ఆశయాలు, లక్ష్యాలు సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రాగల అవకాశం. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. రచయితలు, పరిశోధకులు అందరిలోనూ ప్రత్యేకతను నిలుపుకుంటారు. 11,12 తేదీలలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్త కార్యక్రమాలు చేపడతారు. దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను
కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. భూ,గృహయోగాలు కలిగే సూచనలు. మీ నిర్ణయాలను అందరూ హర్షిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారులకు మరింత అనుకూలస్థితి. ఉద్యోగులకు ఉన్నత శ్రేణి నుంచి ప్రశంసలు అందుతాయి. కళాకారులకు అవార్డులు. పరిశోధకులు, క్రీడాకారులు సత్తా చాటుకుంటారు. 8,9 తేదీల్లో దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. దక్షిణావ•ర్తి స్తోత్రాలు పఠించండి.
చయితలు, పరిశోధకులకు శుభవార్తలు. 26,27 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
కొన్ని అద్భుతాలు ఎదురై ఆశ్చర్యం కలిగిస్తాయి. మీతో విభేదిస్తున్న వారు సన్నిహితులుగా మారతారు. ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. బంధువులు,స్నేహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆశించిన రాబడి సమకూరి అవసరాలు తీరతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు మరింత అనుకూలిస్తాయి. వాహనయోగం. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులు పెట్టుబడులకు తగినంతగా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు. రచయితలు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు. 9,10 తేదీల్లో ఆరోగ్య,కుటుంబసమస్యలు. మానసిక అశాంతి. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. శత్రువులు కూడా స్నేహితులుగా మారతారు. అందరిలోనూ ప్రత్యేకత నిలుపుకుంటారు. దేవాలయ దర్శనాలు. రాబడి మరింత పెరిగి అప్పులు కూడా తీరే మార్గం ఏర్పడుతుంది. విద్యార్థులు ప్రతిభను నిరూపించుకుంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు ఊహించని లాభాలు దక్కవచ్చు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు. కళాకారులు, పరిశోధకులకు ఆహ్వానాలు అందుతాయి. 8,9 తేదీలలో దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ఖర్చులు అధికం. ఆదిత్య హృదయం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆదాయం ఆశించినంతగా సమకూరుతుంది. దీర్ఘకాలికంగా వేధిస్తున్న కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. చర,స్థిరాస్తుల వృద్ధి. కుటుంబపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు చిక్కులు అధిగమిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. రాజకీయవర్గాలకు అరుదైన అవకాశాలు. కళాకారులు, క్రీడాకారులకు అవార్డులు దక్కుతాయి. 11,12 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. అంగారక స్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
నిరుద్యోగులు ఇంతకాలం చేసిన కృషి ఫలించే సమయం. కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అదనపు రాబడి దక్కి మరింత ఉత్సాహంగా గడుపుతారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు. ఇంటిలో శుభకార్యాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు హోదాలు మరింత పెరుగుతాయి. కళాకారులకు పురస్కారాలు,సన్మానాలు. సాంకేతిక నిపుణులు, రచయితలు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. 7,8 తేదీల్లో ఖర్చులు. ఆస్తి వివాదాలు. గణేశాష్టకం పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
రాబడి సమకూరి అవసరాలు తీరతాయి .విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. ముఖ్య కార్యక్రమాలు మొదట్లో మందగించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. వ్యాపారులు ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు సామాన్యంగా ఉంటుంది. రచయితలు, మేథావులు తమ సత్తాను నిరూపించుకుంంటారు. 9,10 తేదీల్లో ఆస్తి వివాదాలు. అనుకోని ఖర్చులు. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.