సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
కొత్త కార్యక్రమాలు చేపడతారు. సమాజంలో మరింత గౌరవమర్యాదలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. రుణాలు చాలావరకూ తీరుస్తారు. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. భూములు కొనుగోలు యత్నాలు సానుకూలం. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అదనపు విధులు మీదపడవచ్చు. రాజకీయ, పారిశ్రామివర్గాల కృషి ఫలిస్తుంది. 19,20తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. హనుమాన్‌ఛాలీసా పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కొత్త వ్యక్తుల పరిచయం. ముఖ్యమైన కార్యక్రమాలు చకచకా సాగుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారం. కొన్ని నిర్ణయాలను కుటుంబసభ్యులు స్వాగతిస్తారు. సమాజంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇంటిలో శుభకార్యాలపై చర్చిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహనసౌఖ్యం. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. కళాకారులు, పరిశోధకులకు కాస్త ఊరట లభిస్తుంది. 14,15 తేదీల్లో బంధువులతో వివాదాలు. అనారోగ్యం. ఆదిత్య హృదయం పఠించండి
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న సమయానికి సజావుగా సాగుతాయి. ఆర్థికంగా మరింత అనుకూలమైన సమయం. రుణబాధలు తొలగుతాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. విద్యార్థులకు కొన్ని అవకాశాలు సంతృప్తినిస్తాయి. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా ధన, ఆస్తిలాభాలు కలిగే సూచనలు. వ్యాపారులు మరింత లాభాలు దక్కించుకుంటారు. విస్తరణ యత్నాలలో పురోగతి. ఉద్యోగులకు సంతోషం కలిగించే సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. రచయితలు, క్రీడాకారులకు నూతనోత్సాహం. 16,17తేదీల్లో ఆస్తి వివాదాలు. శారీరక రుగ్మతలు. దక్షిణావ•ర్తి స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. రుణదాతల ఒత్తిడులు కాస్త తొలగుతాయి. సన్నిహితులతో వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్నేహితులనుకలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు శుభవార్తలు వింటారు. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు కొంత ఉత్సాహవంతంగా ఉంటుంది. రచయితలు, క్రీడాకారులకు ఊరట లభిస్తుంది. 17,18 తేదీల్లో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొన్ని కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. నిర్ణయాలలో మరింత నిదానం పాటించండి. బంధువులతో ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులకు పెట్టుబడులు ఆలస్యమవుతాయి. లాభాలు స్వల్పంగా అందుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు ఎదురుకావచ్చు.కళాకారులు, రచయితలకు అవకాశాలు నిరాశ పరుస్తాయి. 16,17 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. నూతన పరిచయాలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
కొత్త కార్యక్రమాలు చేపడతారు. కుటుంబంలో మీదే పైచేయిగా నిలుస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. స్నేహితుల ద్వారా అందిన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. విద్యార్థులకు కాస్త అనుకూల పరిస్థితులు. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహనాలు, భూముల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులకు ఆశించిన విధంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలు, రచయితలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.18,19 తేదీల్లో శారీరక రుగ్మతలు. మానసిక ఆందోళన. విష్ణుధ్యానం చేయండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. విద్యార్థులు కొంత ఊరట చెందుతారు. దూరపు బంధువులను కలుసుకుని కుటుంబ•విషయాలు చర్చిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. వ్యాపారులకు లాభాలు కొంత ఊపందుకుంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు కొంత పెరిగినా సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామివర్గాలు, రచయితలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 14,15తేదీల్లో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఉత్సాహంగా చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థులకు కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆత్మీయులు మీకు తోడుగా నిలిచి సహకరిస్తారు. అదనపు ఆదాయం సమకూరి ఉత్సాహంగా సాగుతారు. బంధువర్గం నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహన, గృహయోగాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు మరింత ప్రోత్సాహం. రాజకీయవర్గాలు, రచయితలు అనుకున్న విజయాలు స్యాధిస్తారు. 19,20 తేదీల్లో బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
కొత్త్త వ్యక్తులతో పరిచయం. అనుకున్న రాబడి దక్కి అవసరాలు తీరతాయి. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమే. ఆలోచనలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. బంధువులతో కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు గుర్తింపు పొందుతారు. 16,17 తేదీల్లో ఖర్చులు. కుటుంబంలో ఒత్తిడులు. గణేశాష్టకం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసభ్యుల సాయంతో ముఖ్య కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థులకు కొంత ఊరట లభిస్తుంది. స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వాహనాలు, ఆభరణాల కొనుగోలు యత్నాలు సఫలం. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొంత ఉత్సాహవంతంగా ఉంటుంది. రచయితలు, పరిశోధకులకు కొత్త ఆశలు.19,20 తేదీలలో శారీరక రుగ్మతలు, బంధువులతో తగాదాలు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
పట్టుదలతో ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేస్తారు. శ్రేయోభిలాషులు మీకు చేదోడుగా నిలుస్తారు. గృహం, వాహనాల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహంతో అడుగువేస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కాస్త ఊరట లభిస్తుంది. రచయితలు, క్రీడాకారులు కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటారు. 14,15 తేదీల్లో దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. దేవీఖడ్గమాల పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అనుకోని విధంగా ఆదాయం మెరుగుపడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు మరింత సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఫలితాలు కాస్త అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగయత్నాలు కలసివస్తాయి ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారులకు మరింత అనుకూల సమయం. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు గందరగోళం కాస్త తొలగుతుంది. 16,17 తేదీల్లో శారీరక రుగ్మతలు. స్నేహితులతో తగాదాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.