‌సెప్టెంబర్‌ 17 ‌హైదరాబాద్‌ ‌విమోచనం


విదేశీపాలకుల నుండి విముక్తి లభించి యావత్‌ ‌భారత్‌ ‌సంబరాలు జరుపుకుంటుంటే దేశం నడిబొడ్డునున్న హైదరాబాద్‌ ‌సంస్థానంలోని ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ గడిపారు. హైదరాబాద్‌ ‌సంస్థానంలో హిందువులు మెజార్టీలుగా ఉన్నా మత మౌఢ్యంతో ఊగిపోతున్న నిజాం పాలనలో కాలం వెళ్లదీస్తున్న ప్రజలకు సర్దార్‌ ‌వల్లభ్‌ ‌భాయ్‌ ‌పటేల్‌ ‌దృఢ సంకల్పంతో 1948 సెప్టెంబర్‌ 17‌న విమోచన లభించింది. పాకిస్తాన్‌ ‌కుట్రలతో భారత దేశానికి గుండెకాయలా ఉన్న హైదరాబాద్‌ను ఇస్లామిక్‌ ‌దేశంగా మార్చానే నిజాం కుతంత్రాలను ‘ఆపరేషన్‌ ‌పోలో’తో సర్దార్‌ ‌పటేల్‌ ‌ఛేదించడంతో హైదరాబాద్‌కే కాకుండా భారతదేశానికి కూడా పెనుప్రమాదం తప్పింది.

నిరంకుశ నిజాం పాలన నుండి విమోచన లభించినా బుజ్జగింపు ఓటు రాజకీయాలతో  అధికారికంగా విమోచన దినోత్సవం జరుపుకోవ డానికి ఆసక్తి చూపకపోవడం దురదృష్టకరం. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని హైదరాబాద్‌ ‌సంస్థానంలో భాగమైన ప్రాంతాల్లో అధికారికంగా సెప్టెంబర్‌ 17‌వ తేదీన ఉత్సవాలు నిర్వహిస్తున్నా, నిజాం సంస్థానంలో అధిక భాగమైన తెలంగాణ ప్రాంతంలో మాత్రం దశాబ్దాలుగా ఉద్దేశపూర్వకంగా దాటవేశారు.2022లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారికంగా ‘హైదరాబాద్‌ ‌విమోచన దినోత్సవం’ నిర్వహించాలని నిర్ణయించింది. బుజ్జగింపులకు అలవాటు పడిన ప్రభుత్వాలు, పార్టీలు హైదరాబాద్‌ ‌సంస్థానం స్వాతంత్య్ర ఉత్సవాలను ఏ పేరుతో జరుపుకోవాలనే రాజకీయాలకు తెరలేపాయి.

భారతదేశ చరిత్రలో కొన్ని తేదీలు కేవలం కాలగమనంలో మిగిలిపోయిన గుర్తులు కావు. అవి ఒక జాతి చైతన్యానికి ప్రతీకలు. ఒక తరం చేసిన పోరాటానికి గుర్తులు. ఒక దేశం తన భౌగోళిక, రాజకీయ సమైక్యతను కాపాడుకోవడానికి తీసుకున్న నిర్ణయాలకు సాక్ష్యాలు. అలాంటి చారిత్రక తేదీల్లో సెప్టెంబర్‌ 17 ఒకటి. 1947 ఆగస్టు 15న భారత దేశం బ్రిటిష్‌ ‌పాలన నుంచి స్వాతంత్య్రం పొందింది. కానీ భారతదేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్‌ ‌సంస్థాన ప్రజలకు మాత్రం ఆ స్వాతంత్య్రం వెంటనే అందలేదు. నిజాం దమనకాండ కొనసాగింది. భారత •••నియన్‌లో విలీనానికి నిరాకరించింది. మరోవైపు హిందువులపై దాడులే లక్ష్యంగా రజాకార్ల హింస, ప్రజలపై అణచివేత ఎక్కువవడంతో, అదే స్థాయిలో వారిపై ప్రజల తిరుగుబాటు కూడా పెరిగిపోయింది. సర్దార్‌ ‌పటేల్‌ ‌నేతృత్వంలో భారత సైన్యం 1948 సెప్టెంబర్‌ 13‌న ఆపరేషన్‌ ‌పోలో ప్రారంభించడం, 17న నిజాం లొంగిపోవడంతో హైదరాబాద్‌ ‌భారత •••నియన్‌లో విలీనమైంది. భారత దేశానికి స్వాతంత్య్రం లభించిన 399 రోజులకు  హైదరాబాద్‌కు విమోచన లభించింది.

సెప్టెంబర్‌ 17‌ను హైదరాబాద్‌ ‌విమోచన దినంగా గుర్తించడం కేవలం ఒక రాజకీయ అభిప్రాయం కాదు. అది భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఒక కీలకమైన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకోవడం. హైదరాబాద్‌ ‌విమోచనం అంటే ఒక సంస్థానం భారతదేశంలో కలిసిన సంఘటన మాత్రమే కాదు. దేశం ఒక్కటే, జాతీయ సమైక్యత ఒక్కటే అనే భావన చారిత్రక విజయానికి ప్రతీక. 1947 ఆగస్టు 15న బ్రిటిష్‌ ‌పాలన ముగిసిన అనంతరం భారతదేశంలోని సంస్థానాలను భారత •••నియన్‌లో విలీనం చేయడం అతిపెద్ద సవాలుగా మారింది. దేశ తొలి హోంమంత్రి పటేల్‌ ‌నాటి ఉన్నతాధికారి వి.పి. మీనన్‌తో కలిసి ఈ మహత్తర ఏకీకరణ పక్రియకు శ్రీకారం చుట్టారు. దేశంలో ఉన్న అనేక సంస్థానాలు చర్చలు, సంప్రదింపుల ద్వారా భారత్‌లో చేరినా, హైదరాబాద్‌ ‌నిజాం ప్రభుత్వం మాత్రం మొండికేయడంతో క్లిష్టమైన సవాలుగా మారింది. భారత భూభాగం మధ్యలో విస్తరించి ఉన్న హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని స్వతంత్రంగా ఉంచాలని భావించిన ఏడవ నిజాం ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ‌భారత •••నియన్‌లో విలీనానికి సిద్ధపడలేదు. పాకిస్తాన్‌ ‌కుట్రతో పాటు ఇస్లాం మత మౌఢ్యం కూడా తోడవడంతో నిజాం ఎదురు తిరిగాడు. దేశం మధ్యలో తమ చెప్పుచేతుల్లో ఉండే ఒక ఇస్లాం ర్యాం ఉంటే భారత్‌ను ఇబ్బంది పెట్టవచ్చనే కుట్రలకు పాకిస్తాన్‌ ‌తెరదీయగా సర్దార్‌ ‌పటేల్‌ ‌వేగవంతమైన నిర్ణయంతో నేడు హైదరాబాదే కాకుండా భారత్‌ ‌కూడా సురక్షితంగా ఉంది. నాటి దేశ ప్రధాని నెహ్రూ నిజాం ప్రభుత్వంపై సైనిక చర్య చేపట్టేందుకు ఊగిసలాడితే, ఏడవ నిజాం పాకిస్తాన్‌ ‌నుండి సైనిక సహాయం ఆశిస్తున్నట్టు పసిగట్టిన సర్దార్‌ ‌పటేల్‌ ‌తాత్సారం చేయకుండా సైన్యాన్ని పంపడంతో తప్పని పరిస్థితుల్లో నిజాం భారత్‌ ‌ప్రభుత్వానికి లొంగి పోయారు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో భారత్‌ ‌సరిహద్దులో ఉన్న ఇస్లాం దేశాలతో ఎదురవుతున్న పలు సమస్యలను మనం నిత్యం చూస్తున్నాం. అదే దేశం నడిబొడ్డున మరో ఇస్లాం దేశం ఉండుంటే పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉంది.

 సర్దార్‌ ‌పటేల్‌ ‌దీన్ని కేవలం హైదరాబాద్‌ ‌సమస్యగా చూడలేదు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భారతదేశం మళ్లీ అనేక రాజకీయ ముక్కలుగా విడిపోవాలా, లేక ఒక సమైక్య దేశంగా ముందుకు సాగాలా అనే ప్రశ్నకు తావివ్వకుండా భారతదేశం ఒక్కటే అనే భావనతో సైనిక చర్యకు పూనుకున్నారు. హైదరాబాద్‌ ‌సంస్థానంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కులు, స్వేచ్ఛ, భారతదేశంతో విలీనం కోసం అనేక పోరాటాలు జరిగాయి. నిజాం పాలనకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు, రచయితలు, కవులు, ఉద్యమకారులు అనేకమంది పోరాటంలో పాల్గొన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగం ఈ చరిత్రలో అంతర్భాగం కావడంతో హైదరాబాద్‌ ‌విమోచన గాథ ప్రజల స్వేచ్ఛా ఆకాంక్షకు ప్రతిబింబంగా మారింది.

హైదరాబాద్‌ ‌విమోచన చరిత్రలో రజాకార్ల పాత్రను విస్మరించలేం. నిజాంకు వెనుదన్నుగా ఉండేందుకు మజ్లీస్‌ ఇత్తేహాద్‌ ‌ముస్లిమీన్‌ను ప్రారంభించిన ఖాసీం రిజ్వీ నేతృత్వంలో రజాకార్లు పట్టణాల్లో, గ్రామాల్లో అరాచకాలు సృష్టించి మహిళలపై అత్యాచారాలు చేశారు. రజాకార్ల దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని నిర్ణయానికొచ్చిన పటేల్‌ ‌హైదరాబాద్‌ ‌సమస్య పరిష్కారంలో పోషించిన పాత్రను చరిత్ర ఎప్పటికీ మరచిపోలేదు.

 అయితే, ఇంతటి కీలకమైన చారిత్రక ఘట్టం దశాబ్దాల పాటు ఎందుకు పెద్దగా జాతీయ గుర్తింపును పొందలేదు అనే ప్రశ్న కూడా సహజంగానే తలెత్తుతుంది. సెప్టెంబర్‌ 17‌ను ‘విమోచన దినం’గా పిలవాలా, ‘విలీన దినం’గా పిలవాలా? ‘జాతీయ సమైక్యతా దినం’గా పిలవాలా? ‘ప్రజాపాలన దినం’గా పిలవాలా? అనే చర్చలు  చాలాకాలంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు తగిన గుర్తింపు దక్కడం లేదని ఉద్యమించిన సంఘాలు, పార్టీలు మలిదశ తెలంగాణ ఉద్యమంలో సెప్టెంబర్‌ 17‌వ తేదీని కూడా ఒక అంశంగా చేసుకున్నాయి. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌దీన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు. బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కంటితుడుపుగా ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా ప్రకటించింది. ముస్లిం మైనార్టీల ఓట్లు దూరమవుతాయనే భయంతో, ఎంఐఎం ఒత్తిడితో బీఆర్‌ఎస్‌ ‌నేతలు సెప్టెంబర్‌ 17‌వ తేదీని పార్టీ కార్యాలయంలో జరుపుకునేవారు. 2023లో తెలంగాణలో అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి  ప్రభుత్వం సెప్టెంబర్‌ 17‌ను ‘ప్రజా పాలన దినోత్సవం’గా ప్రకటించింది. ఇక వామపక్షాలు, సంఘాలు దీన్ని ‘విలీన దినోత్సవం’గా జరుపుకుంటాయి. బీజేపీ మాత్రం నిజాం నిరాంకుశ పాలన నుండి ప్రజలకు విముక్తి లభించిందనే క్ష్యంతో ‘విమోచన దినోత్సవం’గా జరుపుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్నే అనుసరించాలని డిమాండ్‌ ‌చేస్తోంది.

హైదరాబాద్‌ ‌సంస్థానంలో ప్రజలకు నిజాం పాలకుల నుండి స్వాతంత్య్రం లభించిన తర్వాత ఉత్సవాలు నిర్వహించుకోవడంలో వెనకడుగు వేయడం వెనుక బుజ్జగింపు రాజకీయాలే కాకుండా పిరికితనం కూడా కనిపిస్తోంది. దీన్ని ఒక మత కోణంలో చూడడమే దుర్మార్గం. నిజాం నిరంకుశత్వం పాలన నుండి కేవలం హిందువులకే కాదు ముస్లింలకు కూడా ముక్తి లభించింది. అయితే నిజాం మత పిచ్చితో హిందువులను హింసించారనేది సత్యం. నిజాం పానలలో మత పిచ్చే కాకుండా విపరీతమైన నిరంకుశత్వం కొనసాగింది. ప్రజాస్వామ్య హక్కులు లేకపోవడం, భూస్వామ్య, జాగీర్ధారి వ్యవస్థ, వెట్టి చాకిరీ , రైతులపై ఆర్థిక రెవెన్యూ భారాలు, విద్యా రంగంలో వెనుకబాట, భావ వ్యక్తీకరణపై ఆంక్షలు ఇలా నిజాం పాలనలో నిరంకుశం, ఆంక్షాలు కొనసాగాయి. ఇలాంటి ఇబ్బందులు హిందువులతో పాటు ముస్లింలు కూడా ఎదుర్కొన్నారు. అలాంటిది దీన్ని కేవలం మత కోణంలో చూస్తూ ‘విమోచన దినోత్సవం’ జరుపుకోవడానికి భయపడడం దురదృష్టకరం.

నిజాం పాలనలో అన్ని సామాజిక వర్గాలు ఇబ్బందులు పడితే దాన్ని హిందూ, ముస్లిం విభజనతో రజాకార్ల వారసులైన ఎంఐఎం స్వాతంత్య్రం అనంతరం కూడా అదే పంతాలను కొనసాగిస్తూ ఈ అంశాన్ని ముస్లింల ఓటు బ్యాంకుగా మల్చుకుంది. మన రాజకీయాల పార్టీలు కూడా అదే పంథాను కొనసాగిస్తూ విమోచన దినోత్సవం పేర్ల వెనుక ఉన్న రాజకీయాలు చేస్తున్నాయి. 1948 సెప్టెంబర్‌ 17‌న భారత త్రివర్ణ పతాకం హుందాగా హైదరాబాద్‌ ‌నేలపై ఎగిరింది. ప్రజలు గర్వంగా వందేమాతరం ఆలపించారు. ప్రజల విముక్తి భారత జాతీయ సమైక్యతతోనే సంపూర్ణమైంది. అందువల్ల ప్రజల పోరాటాన్ని, భారత జాతీయ సమైక్యతను పరస్పరం వేరు చేయడం చారిత్రకంగా అసంపూర్ణ మైన దృక్పథం. విలీనానికి ముందు ఉన్న పరిస్థితిని కుహనా సెక్యులరిస్టులు స్పష్టంగా చెప్పకపోవడం వారి బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనం. ‘సమైక్యత’ అనకుండా, ఆ సమైక్యతకు దారితీసిన ‘విమోచన’ పక్రియను వారు గుర్తుంచుకోవాలి. ఇక్కడ సైనిక చర్య జరిగింది కాబట్టి నిజాం పాలన నుండి విమోచనం లభించిదనడమే న్యాయమైంది.  ‘విమోచన’ అనే పదం ఆ రోజు వరకు కొనసాగిన నిరంకుశ పాలన నుంచి ప్రజలకు వచ్చిన స్వేచ్ఛను ప్రత్యేకంగా గుర్తుచేస్తుంది.

హైదరాబాద్‌ ‌విమోచనం పోరాటం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగింది. విమోచనం ప్రజాస్వామ్యం కోసం జరిగింది. భారతదేశంలో విలీనం అంటే అందరికీ సమాన రాజ్యాంగ హక్కులు కలిగిన దేశంలో చేరడం. నిజాం ప్రభుత్వంపై• చర్యలు తీసుకుంటే ముస్లిం మైనార్టీలకు తప్పుడు సందేశం వెళ్తుందని, అంతర్జాతీయంగా ఇబ్బందులు వస్తాయని నాటి ప్రధాని జంకినా సర్దార్‌ ‌పటేల్‌ ‌ముందడుగు వేశారు. విశాలమైన దృక్పథంతో హైదరాబాద్‌కు పటేల్‌ ‌స్వతంత్య్రం కల్పించారనే సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

 నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. 2022లో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17‌ను ప్రతి సంవత్సరం ‘హైదరాబాద్‌ ‌విమోచన దినం’గా అధికారికంగా నిర్వహించాలని ప్రకటించింది.  దీనిని ఒక రాజకీయ కార్యక్రమంగా కాకుండా చరిత్రలో తగిన గుర్తింపు పొందాల్సిన ఒక అధ్యాయానికి జాతీయ స్థాయి గుర్తింపుగా చూడాలి.  1948లో హైదరాబాద్‌ ‌సంస్థానంలో నేటి తెలంగాణతో పాటు మహారాష్ట్ర లోని మరాఠ్వాడా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందువల్ల సెప్టెంబర్‌ 17 ‌కేవలం తెలంగాణ చరిత్రకు పరిమితమైన రోజు కాదు. ఇది డెక్కన్‌ ‌ప్రాంతాన్ని భారత జాతీయ స్రవంతిలో మరింత బలంగా కలిపిన రోజు. అందుకే దీనికి ‘హైదరాబాద్‌ ‌విమోచన దినం’ అనే జాతీయ గుర్తింపు ఇవ్వడం ప్రాంతీయ భావజాలాన్ని బలహీనపరచడం కాదు. దానికి విరుద్ధంగా, తెలంగాణ చరిత్రను భారతదేశపు విస్తృత జాతీయ చరిత్రలో స్థిరపరచడం. నేటి యువతకు సెప్టెంబర్‌ 17 ‌గురించి ఎంత తెలుసు అనే ప్రశ్న వేసుకోవాలి.

సెప్టెంబర్‌ 17 అం‌టే నిజాం నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించిన రోజు. భారత త్రివర్ణ పతాకం హైదరాబాద్‌ ‌గడ్డపై గర్వంగా ఎగిరిన రోజు. భారతదేశ రాజకీయ సమైక్యత మరింత బలపడిన రోజు. సర్దార్‌ ‌పటేల్‌ ‌జాతీయ సంకల్పం విజయవంతమైన రోజు. అమరవీరుల త్యాగాలను స్మరించు కోవాల్సిన రోజు. అందుకే సెప్టెంబర్‌ 17 ‌విమోచనను గుర్తుచేసే రోజు మాత్రమే కాదు. జాతీయ సమైక్యతను పునరుద్ఘాటించే రోజు. చరిత్రను మరచిపోకుండా, చరిత్రను వక్రీకరించకుండా, చరిత్రలోని జాతీయ స్ఫూర్తిని భవిష్యత్‌ ‌తరాలకు అందించడమే హైదరాబాద్‌ ‌విమోచన దినానికి నిజమైన నివాళి. దేశం ఒక్కటే.. జాతీయ గౌరవం ఒక్కటే.. త్రివర్ణ పతాకం ఒక్కటే.. భారతదేశమే మనందరి సావ•హిక అస్తిత్వం అనే భావనను మరింత బలపరచడమే సెప్టెంబర్‌ 17 ‌మనకు అందించే గొప్ప సందేశం.

– శ్రీపాద

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.