హిందూ పురాణాల్లో పలు రకాలైన జంతువుల ప్రస్తావన ఉండడమే కాకుండా వాటి ప్రాముఖ్యత కూడా విస్తారంగా వర్ణించారు. ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడనే భావన కలిగిన హిందూ మతం ఓ మహోన్నత జీవ వైవిధ్య పరిరక్షణ మహా మంత్రాన్ని అందించింది. అనేక రకాల జంతువులను దేవతా రూపాలుగా కొలవడం కూడా జరుగుతోంది. సాధారణ చిన్న వ•షికం నుంచి భయానక పులి, సింహం లాంటి వన్యప్రాణుల వరకు అన్ని రకాల జంతువుల ప్రస్తావన ఉంది. మనకు అత్యంత విశ్వాసపాత్రమైన కుక్క లేదా పిల్లి నుంచి పక్షులు, గోమాత, ఏనుగు వరకు అన్ని జంతువుల పాత్రలు మన పురాణ ఇతిహాసాల్లో ప్రస్తావించారు. హిందూ సమాజంలో జంతువులు జీవితాల్లో భాగం అయిపో యాయి. ‘సర్వప్రాణి సేవయే మాధవ సేవ’ అనే నినాదం మన జీవనవిధానంలో ఇమిడిపోయింది. పలు రకాల జంతువులు దేవుళ్లు, దేవతలకు వాహనాలుగానే కాకుండా కొన్ని వారి సేవలో పునీతమయ్యాయి. మన సంస్కృతిలో జంతువులను జ్ఞానం, విశ్వాసం, భక్తికి ప్రతిరూపాలుగా భావిస్తు న్నాం. హిందూపురాణాలు, వేదాలు, ఇతిహాసాల్లో పేర్కొన్న కొన్ని జంతువుల గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోపాలకుడిగా కృష్ణయ్య గోవుల కాపరిగా మారిపోయాడు.
వినాయకుడి వాహనంగా ఎలుక
ఆది దేవుడైన గణేశుని వాహనంగా ఎలుక లేదా వ•షికాన్ని చూస్తున్నాం. వినాయకున్ని వ•షిక వాహనుడిగా పిలుస్తాం. చిన్న ఆకారం కలిగిన ఎలుకపై భారీ వినాయకుడు స్వారీ చేయడం వెనుక పరమార్థానికి వివరణ ఉంది. కోరికలకు చిహ్నంగా భావించే చిట్టి ఎలుక మన మనసులో దొంగచాటుగా దూరి మనల్ని పక్కదారి పట్టిస్తుందని పేర్కొన్నారు. గణేశుడు తన కోరికలను నియంత్రించుకోవడానికి కోరిక అనే ఎలుకను వాహనంగా చేసుకున్నాడని పేర్కొన్నారు. ఆయన వాహనంగా భక్తుల పూజలందుకుంటున్నది ఈ వ•షికం.
శ్రీ విష్ణువు వాహనం – గరుత్మంతుడు
విష్ణువుకు సేవ చేస్తూ అత్యంతవేగంగా ప్రయాణించే దివ్యపక్షి రాజు గరుడుడు. అత్యంత శక్తివంతమైన పక్షిగా గురుత్మంతుడికి పేరుంది. వేగంగా, అతిబలశాలిగా పేరొందిన గరుడ పక్షిని చెడుపై పోరాడగల యోధుడిగా వర్ణించారు. గురుడు తన తల్లిని పాముల బారిన పడకుండా రక్షించడానికి చేసి ప్రయత్నంలో తన యజమానిని రక్షించడానికి, సత్యానికి ప్రతీకగా చెబుతారు.
శివుడి వాహనం – నంది, మెడలో నాగుపాము
శివుడి ధర్మం, బలానికి ప్రతిరూపం వృషభం. మహాశివుడి అత్యంత విశ్వాసపాత్రమైన సేవకుడిగా నందిని భావిస్తారు. శివుడి ముందు గంభీరంగా కూర్చొని ఉన్న నంది తన ప్రభువును కంటికి రెప్పలా కాపాడుకుంటూ శివ రక్షణకు సిద్ధంగా ఉండడం చూస్తున్నాం. అత్యంత శివభక్తుడైన నంది భక్తిని మెచ్చి తన వాహనంగా చేసుకున్నాడని మన పురాణాలు వెల్లడిస్తున్నాయి. శక్తి, సంయమనం, సత్యం, ధర్మం, న్యాయం, క్రమశిక్షణలకు మారు పేరుగా నందిని పూజిస్తున్నాం. నందీశ్వరుడి చెవుల్లో చెప్పిన కోరికలను శివుడు వింటాడని కూడా నమ్మకం ఉండడం విశేషం. శివుడి మెడలో ఉండే నాగుపాముకు వాసుకి అని పేరు. క్షీరసాగర మథనంలో వాసుకిని మంధర పర్వతానికి తాడుగా వాడిన కథ మనకుతెలుసు. వాసుకి చూపిన భక్తికి మెచ్చి శివయ్య తన మెడలో నాగుపాముకి స్థానం కల్పించాడు. శివయ్య మెడ చుట్టు వ•డుచుట్టులుగా అమర్చిన నాగుపాము భూత భవిష్యత్ వర్తమానమనే వ•డు కాలాలను సూచిస్తున్నది. పాము కుబుసం విడిచినట్లు మనిషి కూడా పుట్టుక, మరణం, పునర్జన్మ అనే చక్రంలో సాగిపోతున్నాడని అర్థం చేసుకోవాలి.
విష్ణువు పాన్పు – ఆదిశేషుడు
ఆదిశేషుడు తన పడగపై భూమిని మోస్తాడు. భగవాన్ విష్ణువు విశ్రాంతి తీసుకునే పానుపుగా శేషుడు సేవలు అందిస్తున్నాడు. స్థిరత్వం, అనంతతత్వాలకు ప్రతీక అయిన ఆదిశేషుడు చూడడానికి కొంత భయంకరంగా కనిపిస్తాడు.
రామ భక్తుడి వానర రూపం – హనుమంతుడు
శ్రీరామాయణంలో అద్వితీయ భక్తికి చిహ్నంగా హనుమంతుడిని భావిస్తున్నాం. శక్తి, యుక్తి, భక్తి, స్వామిపై చూపిన అవ్యాజమైన ప్రేమ లాంటి విలక్షణ గుణాలు హనుమంతుడిని దేవుడిగా నిలిపాయి. తన ఇష్ట దైవమైన రాముని సేవలో హనుమ చూపిన భక్తి అనిర్వచనీయం. నిజమైన విధేయత, నిస్వార్థ సేవ, భక్తికి సజీవ సాక్ష్యంగా వానరరూపంలో ఉన్న ఆంజనేయుడు నిత్య పూజలు అందుకుంటున్నాడు.
జాంబవంతుడిగా ఎలుగుబంటి
రామాయణంలో మరో విలక్షణ పాత్ర ఎలుగు బంటి రూపంలో ఉన్న జాంబవంతుడు. మహాభారతంలో కూడా ప్రస్తావించిన జాంబవంతుడు అత్యంత శక్తివంతుడు. రాముడికి కూడా సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు. భారతంలో శ్రీ కృష్ణుడిని కూడా కలిసిన సందర్భం ఉంది.
యుధిష్టిరుడి విశ్వాసం పొందిన కుక్క
మహాభారత కథలో యుధిష్టిరుని వెంట కడదాక ఉన్నది కుక్క మాత్రమే. యుధిష్టిరుడు స్వర్గద్వారం వద్దకు చేరి తన వెంట వచ్చిన కుక్కను వెనక్కి వెళ్లమం టాడు. ఆ శునకం ధర్మ దేవతగా మారి నిజరూపం ధరించి, వాస్తవం వెల్లడిస్తుంది.
సరస్వతీ దేవి వాహనం – హంస
సృజనాత్మకత తెలివితేటలు, స్వీయ-నియంత్రణ, అందం, ఆకర్షణకు చిహ్నం అయిన హంస జ్ఞానదేవత సరస్వతికి వాహనంగా ముడిపెట్టారు. హంస రంగు రంగుల ఈకలు సమృద్ధిని సూచిస్తాయి. యుద్ధ దేవత, శివ-పార్వతుల కుమారుడైన కార్తికేయునికి వాహనంగా నెమలి ఉంటుంది. ఈ దైవస్వరూప పక్షి అపారశక్తికి, అద్వితీయ భక్తికి ప్రతిరూపంగా నమ్ముతున్నాం.
దుర్గా దేవి వాహనం – సింహం
అడవికి రాజు సింహం. అత్యంత బలమైన సింహాన్ని నరసింహ అవతారంగా కొలుస్తున్నాం. నిర్భయత్వం, గంభీరరూపం చెడును అంతం చేసే సామర్థ్యం కలిగిన సింహం వాహనంపై దుర్గాదేవి దర్శనం ఇస్తుంది. దుష్ట శక్తులు దీని ముందు నిలబడలేవు.
లక్ష్మీ దేవి వాహనం- గుడ్లగూబ
ధనం, శ్రేయస్సుకు ప్రతిరూపమైన లక్ష్మీదేవి వాహనంగా తెల్ల గుడ్లగూబ. జ్ఞాన అవగాహనలకు చిహ్నమైన గుడ్లగూబ కూడా మన మనసుల్లో భక్తి భావనలను రెట్టింపు చేస్తున్నది.
ఐరావతం
ఇంద్రుడి ఏనుగు తెల్లని రంగులో మేఘాల రూపంలో ఐరావతం అనే పేరుతో కీర్తి అందుకుంది.
కామధేనువు
సురభి అనే కామధేనువు మానవ సమస్త కోరికలను తీర్చగల గోమాతగా నేటికీ ఆరాధిస్తున్నాం. తన యజమానికి పోషణ, దయ, సమృద్ధిని ప్రసా దించే తల్లిగా, దైవిక జీవిగా గోమాతను కొలు స్తున్నాం.
మత్స్య, కూర్మ, వరాహ అవతారాలు
విష్ణువ•ర్తి తొలి అవతారంగా మత్స్యప్రభువును చూస్తున్నాం. తొలి జీవులు జలచరాలు అంటూ మన పురాణాలు ఘోషిస్తున్నాయి. రెండవ అవతారమైన కూర్మం లేదా తాబేలు ఉభయచరంగా నీటిలో, నేల మీద మనుగడ సాగించగలదు. వ•డవ అవతారమైన వరాహస్వామి పంది రూపంలో భూదేవిని హిరణ్యాక్షుడనే రాక్షసుడి బారి నుంచి రక్షించినట్లు తెలుసుకుంటున్నాం.
రామాయణంలో ఉడుతల ప్రస్తావన ఉంది. లంకకు వారధి కట్టడానికి తనవంతు సహకారం అందించి రాముడి ప్రశంసలను పొందడం, రాముడి చేతితో నిమరడంతో చారలు రావడంలాంటి కథలను విన్నాం. ఉడుతలతో పాటు చిలుకలు, రాబందులు, జింకలు, ఆవులలాంటి జంతువుల ప్రస్తావన ఉండడం గమనిస్తున్నాం. రామాయణంలో గద్దను ‘జటాయువు’ అని పిలుస్తున్నాం. రావణుడు సీతను అపహరించిన సమయంలో ఆమెను రక్షించడానికి ప్రాణాన్ని ఫలంగా పెట్టింది. చిలుక ముఖం కలిగిన ‘‘శుక’’ అనే మహర్షి వ్యాసుడి కుమారుడు. బ్రహ్మ/వరుణల ఏడు హంసల వాహనం, శక్తికి రూపంగా ఎద్దు, శని వాహనంగా కాకి, వాయు వాహనంగా వెయ్యి గుర్రాలు, విశ్వకర్మకు ఏనుగు, భైరవుని చిహ్నంగా కుక్క, యముడి వాహనంగా దున్నపోతు లాంటి అనేక జంతువుల విశిష్టతను మన పురాణాలు వివరించాయి. నీటిని పాలను వేరు చేయగల గుణం హంసకు ఉంటుంది. సరస్వతికి సంబంధించిన ఈ జంతువులో విచక్షణ గుణాన్ని ప్రతిబింబిస్తున్నది. కల్కి, రేవంతు, చంద్రుడు, సూర్యుడు, ఖండోబ వంటి దేవతలతో గుర్రానికి సంబంధం ఉన్నది.
హిందూ సంస్కృతిలో జంతువులతో పాటు పలు రకాల వృక్షాలను కూడా పేర్కొన్నారు. వాటిలో ముఖ్యంగా రావి చెట్టు (అశ్వత్థ వృక్షం), పరమ పవిత్రమైన తులసి, కోర్కెలను తీర్చే కల్పవృక్షం లాంటి వృక్ష సంపద కూడా మన సంస్కృతితో బంధాలను పెనవేసుకున్నాయి. హిందూ పురాణాల్లో జంతురాజ్యంలోని విభిన్న ప్రాణులు ఆధ్యాత్మికతతో సంబంధాలను కలిగి ఉండడం విశేషం. ప్రకృతిలోని ప్రాణికోటి పరిరక్షణతోనే జీవ వైవిధ్యం పరిరక్షితమవుతూ, మానవ మనుగడకు బారులు వేయడం జరుగుతున్నది. ఇలా ప్రతిజీవికి ఒక ప్రత్యేకత ఉందని తెలుపుతున్న హిందూ పురాణాలు మానవ జాతికి లభించిన అపూర్వ వరాల్ని గుర్తించి జీవులను కాపాడుకోవడానికి నిరంతర కృషి జరగాలని ఆశిద్దాం.