దుర్గాదేవి విశ్వవ్యాప్త దేవత. మనోమాలిన్యాలను తొలగించే దుర్గాదేవిని విశ్వజనని/దేవతగా ఆరాధిస్తారు. దానవబాధ ప్రబలినప్పుడు వారి సంహారానికి అవతరిస్తుంటానని (ఇత్థం యదాయదా బాధా దానవోత్థా భవిష్యతి/తదా తదావతార్యహం కరిష్యామి) అని భగవతి చెప్పినట్లు ‘దుర్గా సప్తశతి’ పేర్కొంటోంది. శుంభవిశుంభులు, చండముండులు, రక్తబీజుడు, దుర్గముడు, అరుణుడు, మహిషాసురుడు తదితర అసురులను దుర్గాదేవి శరన్నవరాత్రులలోనే, సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించింది.
శక్తిపూజ జాతి మనుగడకు శ్రీరామరక్ష అనే నిత్యసత్యాన్ని ప్రతిపాదించేవే శరన్నవరాత్రులు వేడుకలు. శరదృతువులో జరుగుతాయి కాబట్టి శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు అని పిలుస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని అర్చిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో పరాశక్తి మొదటి వ•డునాళ్లు మహాకాళిగా, తరువాతి వ•డు రోజులు మహా లక్ష్మిగా, చివరి వ•డు రోజులు మహాసరస్వతిగా కొలువుదీరి ఉంటుంది. ఆలయాలలో, మఠాలలో, మందిరాల్లో, వీధి మండపాల్లో భక్తి శ్రద్ధలతో దేవీ పూజ జరుపుకోడం ఆనవాయితీగా వస్తోంది.
శైవులు, వైష్ణవులు, శాక్తేయులు ఆయా ప్రాంతాలలో కొద్ది మార్పులతో దేవీపూజ నిర్వహిస్తారు. అమ్మవారిని శైవులు శివశక్తిగానూ, వైష్ణవులు శ్రీమహావిష్ణువు హృదయంలో ప్రకాశించే శ్రీదేవిగా, శాక్తేయులు సర్వదేవతలకు, సర్వ జగత్తులకు జననిగా అర్చిస్తారు. బౌద్ధంలోని వజ్రయాన శాఖకు చెందిన వారు తాంత్రిక పద్ధతులలో ఆరాధన చేసే సంప్రదాయం ఉంది. జైనులు శక్తిరూపాలైన విద్యా దేవతలను,శాసన దేవతలను పూజించేవారు. సిక్కు మత గురువు గరుగోవింద్సింగ్ దశమగ్రంథంలో శాక్తేయ దేవతలను ప్రస్తా వించారు.
నవరాత్రులలో నిత్యం పారాయణం చేసే గ్రంథం దేవీమహాత్మ్యం. అమ్మవారి ప్రతిరూపంగా పరిగణించే ఈ సప్తశతి పారాయణం శుభప్రదమని, కలుషహార మని శాక్తేయుల విశ్వాసం. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్దిధాత్రి…అనే పేర్లతో దుర్గా దేవిని ఈ తొమ్మిది రోజులు అర్చిస్తారు (‘మహా మాయ, మహిషారుమర్దని, మహాసరస్వతి, నంద, రక్తదంతి, శాకంబరి, దుర్గాదేవి, మాతంగి, భ్రమర… అనే పేర్లను చండీ సప్తశతి.. పేర్కొంటోంది).
నవరాత్రులలో వరుసగా కనకదుర్గ, బాలా త్రిపురసుందరి, గాయత్రీమాత, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరీ దేవి, సరస్వతీ దేవి, మహా లక్ష్మీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, శ్రీరాజ రాజేశ్వరీదేవి రూపాలుగా అమ్మవారు దర్శనం ఇస్తూ, వైభవోపేతంగా పూజలు అందుకుంటారు. అమ్మవారిని రోజుకో రంగు వస్త్రంతో అలంకరించి, ప్రీతికర పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో పరాశక్తి మొదటి వ•డునాళ్లు మహాకాళిగా, తరువాతి వ•డు రోజులు మహా లక్ష్మిగా, చివరి వ•డు రోజులు మహాసరస్వతిగా కొలువుదీరి ఉంటుంది. కారణాంతరాల వల్ల నవరాత్రులూ పూజించలేని వారు త్రిరాత్ర (సప్తమి, అష్టమి, నవమి) దీక్ష చేసే సంప్రదాయం ఉంది. ఈ దీక్ష వ•లానక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి నాడు మహాసరస్వతిని ఆవాహన చేయడంతో ఆరంభమై విజయదశమి నాడు శమీపూజతో ముగుస్తుంది. శ్రీచక్రపూజ కూడా ప్రాధాన్యతను సంత రించుకుంది. కన్యకాపూజ, సుమంగళి, మహా చండీయాగం వంటివి నిర్వహిస్తారు. వ్రతదీక్షాపరులు అష్టమి నాడు కానీ, నవమి నాడు కానీ తొమ్మిది మంది కుమారీలకు (2-10 ఏళ్ల మధ్య వయస్కులు) భోజనంపెడతారు. వారిని కుమారి, త్రిమూర్తి, కల్యాణి, రోహిణి, కాళి, చండిక,శాంభవి, దుర్గ, సుభద్ర అని వ్యవహరిస్తారు.. నవరాత్రి పూజల ద్వారా సమాజంలో నిష్ఠ, సద్భావన, భక్తి భావనలు పెంపొందమే కాక, సమాజంలో వ్యక్తులు మధ్య సత్సంబంధాలు ఏర్పడి సంఘటిత శక్తిగా ఆవిర్భ వించేందుకు దోహదమవుతుంది.
‘న తే నామగోత్రే న తే జన్మమృత్యు/న తే ధామ చేష్టే న తే దుఃఖసౌఖ్యే/ న తే మిత్రశత్రు నతే బంధ మోక్షౌ/ స్వమేకా పరబ్రహ్మ రూపేణ సిద్ధా’(నీకు నామ గోత్రాలు లేవు. జనన మరణాలు లేవు. బంధ మోక్షాలులేవు. అద్వితీయ పరబ్రహ్మవు)అనే మహంకాళి సంహితలోని శ్లోకం జగన్మాత స్వభావ, స్వరూపాలను వివరిస్తోంది. ‘అవిద్య అనే అంతరంగపు చీకటిని పారదోలే సూర్యుని వంటి, జడత్వంలోని వారిని జాగృత పరచే అమృతధారవు. దరిద్రుల కోరికలను తీర్చే చింతామణివి.జనన మర ణాలనే సంసారంలో కూరుకపోయిన వారిని వరాహ మూర్తిలా ఉద్ధరించే దయామయివి’ (అవిద్యానామన్త స్తిమిర మిహిర ద్వీపనగరీ/జడానాం చైతన్య స్తబక మకరన్ద శ్రుతిఝరీ/దరిద్రాణం చింతామణి గుణనికా జన్మజలధౌ / నిమగ్నానాం దంష్ట్రా మురిరివ వరాహస్యయ భవతి)అని శంకరభగవత్పాదులు కీర్తించారు. అమ్మవారిని శ్రద్ధగా ఆరాధిస్తే అజ్ఞానం తొలగిపోతుంది. దారిద్య్రం ధ్వంసమైపోతుంది. కష్టాల నుంచి అమ్మ వాత్సల్యం కాపాడుతుంది. మన జీవితాలను ఆనందమయం చేస్తుందని విశ్వాసం. నవరాత్రులలో చివరి మూడు రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి మరింత విశిష్టమైనవి.
‘బతుకు’ ఇచ్చే అమ్మ
శరన్నవరాత్రులలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ‘బతుకమ్మ’ ప్రధాన పండుగ. బతు కమ్మను బతుకునిచ్చే అమ్మగా కీర్తిస్తూ, ‘త్రిమాత’ల స్వరూపంగా పూజిస్తారు. బతుకమ్మను పూజించడం అంటే ప్రకృతిని ఆరాధించడ•మేనని భావిస్తారు. తంగెడు, మోదుగ, గన్నేరు, తామర, బంతి, కనంకాబరం, నిత్యమల్లి,గానుగు తదితర పూవులతో బతుకమ్మను ఏడు పొరలుగా వలయాకారంలో తీర్చిదిద్దుతారు.బతుకమ్మ చుట్టూ తిరుగుతూ చేతులు తడుతూ, పాటలు పాడతారు. వాటికి అనుగుణంగా కోలాటాలు వేస్తారు. ఈ పాటలు జానపద సాహిత్యా నికి అద్దం పడతాయి. రామాయణ, భాగవతాది కథలను జానపదబాణీలో ఆలపిస్తారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘రాష్ట్ర పండుగ’గా గుర్తించింది.

డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్