‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన

“అసలు విషయం ఇప్పుడు చెబితేనే మంచిది. నిజం తాత్కాలికంగా బాధ పెట్టినా దానికి భవిష్యత్తులో మంచి చేస్తుంది. ఇంక ఆలస్యం మంచిది కాదు.” అన్నాడు నిర్వేదంగా శ్రీధర్.

“మరి ఎప్పుడు చెబుతారు? ఎలా చెబుతారు?” కళ్లు తుడుచుకుంటూ అడిగింది కౌసల్య.

“నిజం చెబితే అది దూరం అవుతుందని నీ పెంచిన మమకారం ఆందోళన చెందుతోంది. అయినా ఇది ఎప్పుడో అప్పుడు చెప్పక తప్పదు. ఎల్లుండి ఆదివారం నాడు దాన్ని బయటకు తీసికెళ్లి అక్కడ అన్ని వివరాలు చెబుతాను” అన్నాడు శ్రీధర్.

అతని మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక కౌసల్య మౌనం దాల్చింది.

 * * *

ఆదివారం నాడు శ్రీధర్ కుటుంబంతో ఊరికి దగ్గర్లోని బౌద్ధారామానికి దగ్గరికి వెళ్లాడు. ఆదివారం కనుక అక్కడికి చాలా మంది విహారయాత్రకి వస్తుంటారు.ఆ బౌద్ధారామానికి గొప్ప చరిత్ర ఉంది. దానికి సంబంధించిన వివరాలను పురావస్తు శాఖ ఒక బోర్డు విÖద మÖడు భాషల్లో విపులంగా రాసింది.

అక్కడ ఒక ఎత్తైన ప్రదేశంలో ఏడు మీటర్ల ఎత్తున్న ప్రధాన స్థూపం, పక్కనే బౌద్ధ విహారాలు ఉన్నాయి. ఆరామం చుట్టూ ప్రహారీ గోడ, నలు దిక్కులా ధ్యానముద్రలో ఉన్న బుద్ధ విగ్రహాలు ఉన్నాయి.

శ్రీధర్ కూతురు ప్రియతో బౌద్ధారామం గురించి చెబుతుంటే, కౌసల్య వాటిని ఆసక్తిగా గమనించ సాగింది. ఇంతలో వాళ్ల దగ్గరికి ఒక గైడ్ వచ్చాడు. అతని మెడలో పురావస్తు శాఖ వారిచ్చిన గుర్తింపు కార్డు ఉంది.

“సార్! ఈ బౌద్ధారామం చాలా గొప్పది. దీని గురించి తెలుసుకోవాలంటే నాలాంటి గైడ్ ఉండాలి. చూపించమంటారా?” అడిగాడు.

శ్రీధర్ అతని వైపు ఆసక్తిగా చూస్తూ “మీ ఫీజు ఎంత?” అడిగాడు.

“రెండు వందలు. డబ్బు గురించి చూడకండి.మీ అమ్మాయికి కూడా వీటి గురించి బాగా తెలుస్తుంది. పిల్లల” చరిత్ర గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం”అన్నాడతను.

“సరే! చూపించండి” అన్నాడు శ్రీధర్.

అతను వాళ్లను ఆరామం వైపు తీసికెళ్లాడు.

శ్రీధర్ అతనితో ‘అసలు ఈ బౌద్ధ ఆరామాలు అంటే ఏమిటి? ఎందుకు వీటిని కట్టారో చెప్పండి” అడిగాడు.

అతను కొద్దిసేపు ఆలోచించి “సార్! అసలు ఆరామాలు కంటే బౌద్ధమతం గురించి తెలుసు కోవటం ముఖ్యం. ప్రపంచంలో బౌద్ధమతం ఎంతో ముఖ్యమైనది. 50 కోట్ల మంది దీన్ని అనుసరిస్తు న్నారు. గౌతమ బుద్ధుడు బోధించిన ధర్మ సూత్రాలు బౌద్ధానికి మÖలం. ‘త్రిపిటకములు’ అనే శాస్త్ర గ్రంథం బౌద్ధానికి ప్రధాన ఆధామని చరిత్ర చెబుతోంది. ఇందులో మహాయానం, హీనయానం (థెరÁవాడ) అని ఉంటాయి. తూర్పు ఆసియా, టిబెట్టులలో మహాయానం అధికంగా ప్రాచుర్యంలో ఉంది.

అతను చెబుతుంటే ప్రియ “అంకుల్! గౌతమ బుద్ధుడు ఎవరో చెప్పండి?’ ’ అడిగింది.

అతను ప్రియవైపు తిరిగి “చాలామంచి ప్రశ్న అడిగావు. ఆయన గురించి చెబుతాను” అంటూ చెప్పడం ప్రారంభించాడు.

“గౌతమ బుద్ధుడు బౌద్ధ ధర్మానికి మÖల పురుషుడు. ఇతన్ని సిద్ధార్థుడు అనీ పిలుస్తారు. ఆయన కపిలవస్తు దేశానికి చెందిన లుంబినీ పట్నంలో క్రీ.పూ. 563లో జన్మించాడు. ఇది ప్రస్తుత నేపాల్ దేశంలో ఉంది. సిద్ధార్థునికి 16 ఏండ్ల ప్రాయంలో యశోధరతో వివాహమైంది. వీరికి రాహులుడు అనే కుమారుడు పుట్టాడు. సిద్ధార్థుడు 29 ఏళ్ల వరకు రాజభోగాలను అనుభవించాడు.

ఆయనకు ప్రపంచంలోని కష్టసుఖాలు తెలియ కూడదని ఆయన తáండ్రి శుద్ధోధనుడు ఎంత ప్రయ త్నించినా ఒకరోజు సిద్ధార్థుడు ఒక ముసలి వ్యక్తిని, ఒక రోగ పీడితుడిని, కుళ్లి పోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూశాడు. వీటిని నాలుగు దృశ్యాలు అంటారు.

అప్పుడు సిద్ధార్థుడు తన రథసారథి చెన్నుడు ద్వారా, ‘ప్రతి మానవుడూ ముసలితనం నుంచి తప్పించుకోలేడు’అని తెలిసి తీవ్రంగా కలత చెందాడు. ముసలితనాన్ని, రోగాన్ని, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితం గడపాలనుకున్నాడు.

ఎవరికీ చెప్పకుండా రాజమందిరం విడిచి వెళ్లిపోయాడు. దీన్నే మహాభి నిష్కమణ అంటారు. ఆ తరువాత సన్యాసిగా ఎన్నో ప్రదేశాలు తిరిగాడు. చివరకు బుద్ధ గయలో ఒక బోధివృక్షం నీడలో పరమ సత్యం తెలుసుకునేందుకు భగవధ్యానం చేశాడు.

తన 35వ ఏట, 49 రోజుల ధ్యానం తరువాత సిద్ధార్థునకు జ్ఞానోదయం అయింది. మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు సిద్ధార్థుడు. దీన్నే బౌద్ధంలో నిర్వాణ మంటారు.

తాను నిర్యాణం చెందేవరకు గంగానదీ పరివాహక ప్రాంతాలైన ఉత్తర ప్రదేశ్, బిహార్‌లలో పర్యటించి ప్రజలకు తన సిద్ధాంతాలను వివరించాడు.

తన 80వ ఏట బుద్ధుడు ఁAశ్రీశ్రీ cశీఎజూశీsఱtవ tష్ట్రఱఅస్త్రs జూass away. Stతీఱఙవ fశీతీ yశీuతీ శీwఅ శ్రీఱbవతీatఱశీఅ wఱtష్ట్ర dఱస్త్రఱశ్రీవఅcవఁ అని చెప్పి నిర్యాణం చెందాడు.

బుద్ధుని శరీరానికి అంత్యక్రియలు జరిపిన తరువాత ఆయన అస్థికలను వివిధ బౌద్ధస్థూపాలలో భద్రపరిచారు. శ్రీలంకలోని దలదమారిగావ స్థూపంలో బుద్ధుని కుడి పన్ను భద్రపరచారు. దీన్నే ‘టెంపుల్ ఆఫ్ టూత’ అంటారు. అలాగే అతని కర్ణాభరణం ఇప్పటికీ నాగార్జున కొండ ప్రదర్శన శాలలో బంగారు డబ్బీలో భద్రపరచపడింది. బుద్ధుడు పాళీ భాషలో మాట్లాడేవాడనీ చెబుతారు” అని వివరించాడు.

“ఇప్పుడు బౌద్ధమతం,ఆరామాల గురించి చెప్పండి. అసలు ఈ స్థూపాలు ఎందుకు నిర్మిస్తారు?” అడిగాడు శ్రీధర్.

“ప్రపంచంలో క్రైస్తవ, ఇస్లాం, హిందూ మతాల తరువాత నాలుగవ పెద్ద మతం బౌద్ధం. బుద్ధుడు, మానవులందరూ సమానమని ప్రవచించి, కుల వ్యవస్థలోని అంతరాలను నిరసించాడు. ఒక వ్యక్తి జన్మవలన కాకుండా కర్మ కారణంగా మాత్రమే బ్రాహ్మణుడు లేదా ఛండాలుడుగా నిర్ణయించ బడతాడని చెప్పాడు.

బౌద్ధమతంలో నాలుగు పరమ సత్యాలు చెప్పారు. దుఃఖం నుంచి విముక్తిని పొందే మార్గం. ఇవి బుద్ధుడు తన జ్ఞానోదయం తరువాత తన సహచరులైన శ్రమణులకు చెప్పిన బోధనలు.

ఆంధ్రదేశంలో గుంటుపల్లి, భట్టిప్రోలు బౌద్ధ క్షేత్రాలు. క్రీ.పూ. 300 కాలం నాటివి. బుద్ధుడు స్వయంగా భట్టిప్రోలును సందర్శించాడు.అమరావతి స్థూపంలో బుద్ధుడి ధాతువులను నిక్షిప్తం చేసినట్లు చరిత్ర చెబుతోంది. భట్టిప్రోలు, అమరావతి, నాగార్జున కొండ, ఘంటశాల, శాలిహుండం, రామతీర్థం, కోటిలింగాల మొదలైన ప్రాంతాల్లో బౌద్ధ స్థూపాలు బయటపడ్డాయి. అశోకుడి శిలాశాసనాలు కర్నూలు జిల్లాలోని ఎర్రగుడిలో లభించాయి” వివరంగా చెప్పాడు గైడ్.

అప్పటికి సమయం ఒంటిగంటైంది. అతనికి డబ్బిచ్చి పంపి వేశాడు శ్రీధర్.

ఆ తరువాత అక్కడికి దగ్గరలోని రావి చెట్టు కింద కూర్చొని ముగ్గురూ ఇంటి నుంచి తెచ్చుకున్న పులిహోర, దద్ద్యోజనం తినడం మొదలు పెట్టారు.

“ప్రియా! ఎలా ఉంది బౌద్ధ ఆరామం? ఇప్పుడు బౌద్ధమతం గురించి, స్థూపాలు గురించి తెలిసిందా?” అడిగాడు శ్రీధర్.

“గైడ్ వాటి గురించి బాగా చెప్పాడు నాన్నగారూ! తెలియని ఎన్నో విషయాలు తెలిశాయి. రేపు నా ఫ్రెండ్సందరికీ వాటి గురించి చెబుతాను” అంది ప్రియ.

ఆ తరువాత కొద్దిసేపు మౌనం తరువాత….

“ప్రియా! నేను నిన్ను ఇక్కడికెందుకు తీసుకు వచ్చానో తెలుసా? కేవలం ఈ బౌద్ధ ఆరామాన్ని చూడటానికి మాత్రమే కాదు.మొన్న నువ్వు నన్ను “నేను మీ పిల్లనేనా?’అని అడిగావు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే నిన్ను పిలిచాను. వాస్తవానికి, ఈ నిజాన్ని నీకు చెప్పవలసిన అవసరం లేదు.కానీ భవిష్యత్తులో అది నీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే నీ గురించిన కొన్ని విషయాలు చెబుతాను.అది పూర్తిగా వింటే నీకు సరియైన అవగాహన వస్తుంది. నీ అనుమానాలు, సందేహాలు తొలగిపోయి నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు”అన్నాడు శ్రీధర్.

తండ్రి మాటలకు ప్రియ ఆశ్చర్యపోయి, తండ్రి ఏం చెబుతాడోననీ ఆమెకు ఆసక్తిగా ఉంది.

శ్రీధర్ జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు. కౌసల్య, ప్రియ ఇద్దరూ ఏకాగ్రతతో వినసాగారు.

 * * *

నేను డిగ్రీ విజయనగరంలో పాసయ్యాను. ఆ తరువాత బి.ఈడీ చేశాను. నాకు లెక్చరర్ కావాలని ఉండేది. దానికి కారణం మా లెక్చరర్లు. మరీ ముఖ్యంగా ఇంగ్లీషు లెక్చరర్ అనంతరామ్ గారు. ఆయన పాఠం చెబుతుంటే.. పాఠాన్ని కాక ఆయన హావభావాలను, ఆయన డ్రెస్సును, ఆయన మాట్లాడే భాషను ఎక్కువగా గమనించేవాడిని. ఆయన చెబుతుంటే తరగతి గదిలో సూది మొన పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం ఉండేది.

అప్పట్లో మా కాలేజీ కుర్రవాళ్లకు ఆయన హీమాన్. అందరూ ఆయనలా దుస్తులు ధరించే వారు. చెప్పులు వేసుకొనే వాళ్లు.

అలా ఆయనను చూసి నేను లెక్చరర్ కావాలనుకున్నాను. బీఏ అయిపోగానే ఎమ్.ఎ. ఇంగ్లీషు లిటరేచర్ చదువుతానని మా నాన్నగారితో చెబితే ‘నాకు ఇంక చదివించే స్తోమత లేదు. నీకు ఇద్దరు చెల్లెళ్లున్నారు. వాళ్లకి పెళ్లిళ్లు చేయాలి. అందుకు నీ సహాయం అవసరం. బి.ఈడీ చేస్తే టీచరుగా ఉద్యోగం వస్తుంది”అన్నారు..

ఆ మాటలతో నాలో ఉత్సాహం నీరు కారిపోయింది. చేసేదేంలేక బి.ఈడీ చేసాను. అదృష్టవశాత్తూ నేను పాస్ అయిన వెంటనే డీయస్సీ ద్వారా టీచర్‌గా ఎంపికయ్యాను. అరకు దగ్గర ఏజన్సీలో పోస్టింగ్ ఇచ్చారు.

పాడేరుకి 40 కిలోమీటర్ల దూరంగా గిరిజన పాఠశాలలో ఏకోపాధ్యాయుడిగా వేసారు.అక్కడికి చేరాలంటే 10 కిలోవిÖటర్లు కొండ ఎక్కాలి.

అది ఏజెన్సీ ప్రాంతం…అంటే కొండ ప్రాంతం. అది తూరుపు కనుమల్లో ఉంది. అక్కడ చిన్న చిన్న గిరిజన తండాలుంటాయి. రోడ్డు మార్గం ఉండదు. మనిషికి అనారోగ్యం చేస్తే అతన్ని మంచం మీద పడుకోబెట్టి మనుషులు మోస్తూ కొండ దిగి హాస్పిటల్‌కి తీసికెళ్లాలి. నీటి సదుపాయం కూడా ఉండదు. కొండల్లో పారే గెడ్డ నీరే తాగాలి. గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతారు.

అక్కడ నాలుగేసి గ్రామాలకు ఒక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తుంటాయి.ఆ పాఠశాలలో విద్యార్థుల హాజరు చాలా తక్కువగా ఉంటుంది. దానికి కారణం ఉపాధ్యాయులు అక్కడ ఉండరు. మైదానం ప్రాంతంలో పట్నాల్లో ఉంటూ వారానికి ఒకటి, రెండు రోజులు వస్తుంటారు.

అలాగే వైద్య సౌకర్యాలు కూడా తక్కువే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నా డాక్టర్లు ఉండరు. వారు కింద పట్నాల్లో ప్రైవేట్‌గా ప్రాక్టీసు చేసుకుంటూ ఉంటారు. నర్సులే వైద్యం చేస్తుంటారు.

ఉద్యోగస్తులు హాజరు కాకపోవడానికి వాళ్లు చెప్పే కారణం విచిత్రంగా ఉంటుంది. నక్సలైట్లు ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకమని, వాళ్ల వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉండటం వల్ల అక్కడ ఉండటం ప్రమాదం అని ఉద్యోగులు చెబుతుంటారు.

ప్రభుత్వ ఉద్యోగస్తులు, అధికారుల అవినీతి వల్లే మేము గిరిజనులకు సహాయం చెయ్యవలసి వస్తోందని నక్సలైటు నాయకులు చెబుతుంటారు. పోలీసులు తమని విచక్షణారహితంగా చంపుతుంటా రనీ నక్సలైట్లు అంటే… ప్రభుత్వ ఉద్యోగులుగా శాంతి భద్రతలను కాపాడటం తమ బాధ్యత అన్నది పోలీసుల వాదన..

ఈ పిల్లీ ఎలుకల పోరాటంలో నలిగి పోయేది, బాధలు పడేది మాత్రం అమాయకులైన గిరిజనులే.

అందుకే ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు పెడుతున్నా..గిరిజనుల జీవితల్లో పెద్దగా మార్పు లేదు. ఇప్పటికీ వాళ్లకి సరియైన విద్య, వైద్యం అందుబాటులో లేవు. వర్షాకాలంలో కలుషితమైన నీరు తాగడం వల్ల చాలామంది డయేరియాతో చనిపోతుంటారు.

ఇక చదువుల్లో, ఉద్యోగాల్లో ప్రభుత్వం వాళ్లకి 7.5 శాతం రిజర్వేషన్లు కల్పించినా వాటిని మైదాన ప్రాంతానికి చెందిన గిరిజన విద్యావంతులే అనుభవిస్తూ ఉండటం వల్ల కొండల్లో అతి దీనావస్థలో నివసిస్తున్న గిరిజనులకు అన్యాయం జరుగుతుంటుంది.

నన్ను కెంగువ అనే గిరిజన గ్రామంలోని ఏకోపాధ్యాయ పాఠశాలలో నియమించారు. ఆ ఊరు వెళ్లాలంటే..పాడేరులో దిగి కొండల్లో 20 కిలోవిÖటర్లు నడవాలి.పదిహేను కిలోవిÖటర్ల వరకు ఆటోలు వెళతాయి. అక్కడ నుంచి కొండ ఎక్కాలి.

ఆ ఊరికి నేను వెళ్లేసరికి మిట్టమధ్యాహ్నం అయింది.ఊరి సర్పంచ్ పేరు బిడ్డికదొర. నేను ఆయన ఇంటికి వెళ్లేసరికి పూటుగా తాగి మంచం విÖద పడుకుని ఉన్నాడు.

ఊళ్లోని పిల్లలు అతన్ని లేపి నేను స్కూల్లో చేరడానికి వచ్చానని చెప్పారు. అతను లేచి తూగుతూ స్కూలు దగ్గరకు వచ్చాడు.ఆ ఊళ్లో 20 ఇళ్లు ఉన్నాయి. అన్ని పెంకులతో వేసినవే.ఆ పెంకులు ఎగిరి పోకుండా వాటివిÖద రాళ్లు పెట్టి తాళ్లతో కట్టారు. అన్ని ఇళ్లూ ఒక వరసలో లేవు. అక్కడక్కడ కొండవాలులో విసిరేసినట్లున్నాయి. ఊరి మధ్యలో చింతచెట్లు. దారిలో మురికి నీరు.అక్కడే కొందరు పిల్లలు మామిడి టెంకలతో ఆడుతూ కనిపించారు.

స్కూలు ఊరికి చివర్లో ఉంది. ఆ స్కూలు 8 నెలల నుంచి మÖతపడి ఉందనీ అక్కడి పిల్లలు చెప్పారు. ఉపాధ్యాయుడు ఉద్యోగం మానేయడంతో ఆ స్కూలు మÖతపడింది. మళ్లీ ఇన్నాళ్లకు నన్ను వేశారు. స్కూలు అన్న పేరే గానీ చాలా ఘోరంగా ఉంది.

ఏస్బెస్టాస్ రేకుల షెడ్డు అది. లోపల గోడలన్నీ బూజుపట్టి ఉన్నాయి. ఇది వరకటి ఉపాధ్యాయుడు అందులోనే ఉండేవాడనీ, వంట కూడా ఆ గదిలోనే చేసుకునేవాడని పిల్లలు చెప్పారు.

తలుపు కూడా చాలా ఘోరమైన స్థితిలో ఉంది. లోపల ఏ పాములుంటా యోనని భయం వేసింది. తలుపు తియ్యగానే అందులోంచి గబ్బిలాలు ఎగురు కుంటూ బయట కొచ్చాయి. తలుపుని గట్టిగా లాగగానే అది ఊడిపోయింది. ఆ స్కూలుని చూడగానే నాకు చాలా నిరుత్సాహం కలిగింది.

నేను వచ్చాననీ తెలిసింది కాబోలు ఊళ్లోని మరి కొంతమంది అక్కడికి వచ్చారు. నన్ను అందులోనే ఉండమని సర్పంచు బిడ్డిక దొర చెప్పి వెళ్లిపోయాడు.

ఆ తరువాత పిల్లల సాయంతో స్కూలుని చీపుళ్లతో శుభ్రంగా తుడిపించాను. తలుపును బాగు చేయించి మళ్లీ ద్వారానికి బిగించాను. దగ్గర్లోని కొండగెడ్డ దగ్గరికి వెళ్లి స్నానం చేసి వచ్చాను. ఇంతలో ఇద్దరమ్మాయిలు స్టీలు బిందెలతో నీళ్లు తెచ్చారు.

ఆ రోజంతా స్కూలుని శుభ్రం చెయ్యడంతోనే గడిచిపోయింది. రాత్రి పక్కింటి నుంచి ఒక వైరుతో బల్బు పెట్టాను.ఆ వెలుగులో వండుకున్నాను. అక్కడ ఏవిÖ దొరకవని ముందుగానే ఊహించి బియ్యం, కూరగాయలు నాతోపాటు తెచ్చుకున్నాను.

ఆ మర్నాడు ఊళ్లోకి వెళ్లి పిల్లల్ని స్కూలుకి పంపవలసిందిగా తల్లితండ్రులకు చెప్పాను. ఆరోజు ఓ పదిమంది పిల్లలు స్కూలుకి వచ్చారు. బోర్డుని శుభ్రం చేసి వాళ్లకి అ,ఆలు, ఏబీసీడీలు చెప్పాను.

 (సశేషం)

– గన్నవరపు నరసింహ మూర్తి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.