‘‌హిందూయిజం’, ‘హిందుత్వ’పై గురూజీ అభిప్రాయాలను మత ఛాందసవాద (ఫండమెంట లిజం) ప్రాజెక్ట్, ‌హిందుత్వపై కోర్టు తీర్పులు ఆమోదించాయి. ఇవి గురూజీ అభిప్రాయాలను చరిత్ర పదేపదే ధృవీకరించిన వైనాన్ని పాఠకులకు ఆసక్తికరంగా తెలియజేసే రెండు ఉదాహరణలుగా నిలిచాయి. ఈ రెండు కూడా, అప్పట్లో పాలక వర్గం తిరస్కరించిన గురూజీ ఆలోచనలను, ఆ తర్వాత కాలగమనంలో, కాల ప్రభావంతో ఎలా అంగీకరిం చిందీ స్పష్టం చేస్తాయి. అలాగని మత ఛాందసవాద ప్రాజెక్ట్,  ‌హిందుత్వ తీర్పులు సాహిత్య రచనలు కావు. అవి గురూజీ తదనంతరం చోటు చేసుకున్న చారిత్రక పరిణామాల నుంచి పుట్టుకొచ్చిన ఫలితాలు. ఈ రెండు చారిత్రక పరిణామాలు ఆవిష్కృతమైన వైనాన్ని తెలిపే నేపథ్యం ఇక్కడ ఉంది.

మౌలికవాద ప్రాజెక్టు మూలాలు

విజ్ఞాన శాస్త్రంపై మతం ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ మత ఛాందసవాద అనేది దశాబ్దాల కాలంగా ప్రజలలో చర్చనీయాంశంగా ఉంది. అయితే దీనిపై ప్రపంచవ్యాప్త పండితులతో అధ్యయనానికి బీజం మాత్రం 1987లో పడింది. అందుకు అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ‌సోషల్‌ ‌సైన్సెస్‌ ‌కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిణామాలకు, పాశ్చాత్య దేశాల నేతృత్వంలో జరిగిన చారిత్రక పక్రియల ఫలితాలకు ప్రతిస్పందనగా మత ఛాందసవాద ప్రాజెక్టు ఉద్భవించింది. ఈ అధ్యయనం యాదృచ్ఛికమైనది కాదు. ఇది చారిత్రకంగా అనివార్యమైనది. కవ్యనిజాన్ని ఎదుర్కోవడానికి పాశ్చాత్య దేశాలు సృష్టించిన తీవ్రవాద ఇస్లాం ఎదుగుదల, చర్చి పునరుజ్జీవనం, ఈ రెండూ 1950-1960 దశాబ్దాలలో, పాశ్చాత్య దేశాలలో అభివృద్ధి చెందిన ‘‘లౌకికీకరణ సిద్ధాంతాన్ని’’ బలహీనపరిచాయి.ఆ సిద్ధాంతం ప్రకారం ఒక సాంప్రదాయ సమాజం ఎంత ఎక్కువగా పాశ్చాత్యీకరణకు గురైతే, అది అంతే స్థాయిలో ధార్మికంగా పతనమవుతుంది. ఆధునికతది పై చేయి అవుతుంది. సాంప్రదాయం చివరి శ్వాస తీసుకుంటుంది. ఈ ఆధునికీకరణ పక్రియ, మధ్యప్రాచ్యంలోని ఇస్లామిక్‌ ‌దేశాలను సోవియట్‌ •••నియన్‌ ‌నుండి దూరం చేసి, తన కక్ష్యలోకి ఆకర్షించే అవకాశాన్ని అమెరికా ముందు ఉంచింది. కానీ, గురూజీ పరమపదించిన ఆరు సంవత్సరాల తర్వాత, 1979లో లౌకికీకరణ సిద్ధాంతానికి ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌లో విప్లవం, ఆఫ్ఘనిస్తాన్‌పై సోవియట్‌ ‌యూనియన్‌ ‌దండయాత్ర, కవ్యనిజం ఏలుబడిలో ఉన్న పోలాండ్‌కు చెందిన ఒక కార్డినల్‌, ‌పోప్‌ ‌జాన్‌ ‌పాల్‌ 2 అవ్వడం అనే వ•డు చారిత్రాత్మక పరిణామాలు అదే సంవత్సరంలో  చోటుచేసుకున్నాయి.

ఈ చారిత్రక పరిణామాలు, లౌకికీకరణ సిద్ధాంతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధ్యయనం చేయడానికి, వాటికి ప్రతిస్పందించడానికి పాశ్చాత్య దేశాలను నిర్బంధించాయి. పాశ్చాత్య ఆధునికత ప్రపంచీకరణ పట్ల వివిధ మతాలను అనుసరిస్తున్న వారి స్పందన  ‘‘మత ఛాందసవాదం’’గా పరిణమిం చేలా చేయడం ఈ అధ్యయనం ముఖ్యోద్దేశ్యం. తద్వారా మతంతో విభేదించే ‘విజ్ఞానశాస్త్రం’ స్థానంలో ‘ఆధునికత’ను ప్రతిక్షేపించింది. తమ పనిలో భాగంగా హిందూ ధర్మాన్ని, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావజాలాన్ని విశ్లేషించిన ప్రాజెక్ట్ ‌పండితులు గురూజీ అభిప్రాయా లతో ఏకీభవించారు.

ఆధునిక హిందూ పండితుల ప్రకారం, ఇతర విశ్వాస వ్యవస్థలలోని అనేక రకాల మత ఛాందసవాదాల తరహాలో ‘ఆధార గ్రంథాలు, నిర్వచించిన సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణాలు’ లేకుండా ఉండటం వల్ల, హిందూ జీవన దృక్పథం ‘సారాంశంలో హేతుబద్ధమైన, మానవతా వాదమైన ఆధ్యాత్మిక అనుభవం’లో వేళ్లూనుకుంది. ఇది నిస్సందేహంగా, హిందూ ధర్మం ఇతర ధర్మాల కన్నా భిన్నమైనదనే గురూజీ అభిప్రాయాన్ని ధ్రువీకరించింది. మత ఛాందసవాద ప్రాజెక్టు చేపట్టిన అధ్యయనం పై విధంగా స్పష్టం చేసింది.

హిందుత్వ కేసు చారిత్రక నేపథ్యం

సాధారణంగా వ్యాజ్యాలు జరిగే విధంగా హిందుత్వ కేసు రెండు పక్షాల మధ్య జరిగిన ద్వైపాక్షిక వ్యాజ్యం కాదు. ఇది రెండు పరస్పర విరుద్ధమైన ఆలోచనల మధ్య జరిగిన సైద్ధాంతిక ఘర్షణకు ప్రతీక. ఒకటి, పండిట్‌ ‌నెహ్రూ వ్యక్తీకరించిన వ్యవస్థాగత దృక్పథం. ఇది హిందూమతాన్ని ఏకేశ్వర వాద మతాల వంటి ఒక మతంగా పరిగణించింది. అవి పరస్పరం, అలాగే లౌకిక పాలనతో కూడా ఘర్షణ పడతాయి. మరొకటి, గురూజీ వ్యక్తీకరించిన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దృక్పథం. దాని ప్రకారం, సమ్మిళిత హిందూ ధర్మం ఏ మతంతోనూ గానీ, లౌకికవాదంతో గానీ ఎన్నడూ ఘర్షణ పడలేదు, పడబోదు. ఎందుకంటే అది అన్ని మతాలను స్వీకరిస్తుంది కానీ దేనినీ తిరస్కరించదు, కాబట్టి అది లౌకికవాదం కంటే శ్రేష్ఠమైనది. అయితే, ఈ ఘర్షణపూరిత సైద్ధాంతిక కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? హిందుత్వ కేసు అయోధ్య ఉద్యమం ఫలితం. అయితే హిందుత్వ భావన లౌకికవాదానికి వ్యతిరేకమని, కాబట్టి అది ఓట్ల కోసం చేసే మతతత్వ ఆకర్షణ అని వాదిస్తూ కొందరు కుహనా లౌకికవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హిందుత్వ కేవలం ఒక మతం, మతతత్వ భావన అని  వారు వాదించగా, దానికి ప్రతిగా దశాబ్దాల క్రితం గురూజీ వ్యక్తీకరించిన వాదనను ప్రతివాదులు ముందుకు తెచ్చారు. ఆ వాదన ప్రకారం, హిందుత్వ అనేది భారతీయు లందరినీ కలుపుకొనిపోయే ఒక భావన, జీవన విధానం, అంతేగానీ అది ఒక సంకుచిత మతం కాదు, ఇతర మతాలకు గానీ, లౌకికవాదానికి గానీ వ్యతిరేకం కాదు. హిందూ ధర్మం, హిందుత్వ భావనలను విశ్లేషించిన సుప్రీంకోర్టు గురూజీ అభిప్రాయాన్ని అంగీకరించింది.

గురూజీ ఆలోచనలకు మానవాళి మద్దతు

మత ఛాందసవాద ప్రాజెక్టు, హిందుత్వపై కోర్టు తీర్పులు అనే రెండు ఉదాహరణల నుండి అనేక ఇతర ఉదంతాలు, సంఘటనలు క్రమంగా ఆవిష్కృత మయ్యాయి. ఇవి, వివిధ విషయాలపై గురూజీ అభిప్రాయాలతో ఏకీభవించాయి. అవి ఈ దిగువన ప్రస్తావనకు నోచుకున్నాయి.

*       భారతదేశంలోని అల్పసంఖ్యాక వర్గాల ప్రజలు ఎల్లప్పుడూ మాతృ హిందూ సమాజం, సంస్కృతిలో భాగమేనన్న గురూజీ అభిప్రాయాన్ని ఆ తర్వాత కాలంలో భారత సుప్రీంకోర్టు ధ్రువీకరించింది.

*        భరతవర్షం, భరతఖండంలోని ప్రజలందరికీ ఉమ్మడి సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయన్న గురూజీ భావనను పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం కూడా అంగీకరించింది. అంతే స్థాయిలో సమర్థించింది.

*        మిశ్రమ సంస్కృతి లేదా బహుళసాంస్కృతిక వాదం పేరుతో వ•ల సంస్కృతిని విస్మరించడం, బలహీనపరచడం పట్ల గురూజీ హెచ్చరించారు. ఇప్పుడు అదే హెచ్చరికను అమెరికా, తదితర పాశ్చాత్య దేశాలు శిరోధార్యంగా భావిస్తున్నాయి. బహుళ సాంస్కృతికవాదం వైపు మళ్లడం వల్ల అది వ•ల సమాజాలను, వ•ల సంస్కృతులను బలహీనపరిచిందన్న అవగాహన ఆ దేశాల్లో పెరిగింది.

*        గురూజీ కాలంలో పాశ్చాత్య ఆలోచనాపరులు అప్రజాస్వామికమైనవిగా వ్యతిరేకించిన సాంస్కృతిక జాతీయవాదంపై గురూజీ అభిప్రాయాలు, ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో బహుళసాంస్కృతికవాదానికి దిద్దుబాటుగా తిరిగి ఆవిర్భవిస్తున్నాయి.

*      సామాజిక, జాతీయ విచ్ఛిన్నం, హింసను నివారించడానికి అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన ప్రజలను ప్రధాన జనజీవన స్రవంతి లోకి తీసుకొని రావడం లేదా సమాజంలో విలీనం చేయడం అనివార్యమని గురూజీ ప్రతిపాదించిన భావనను, ఇప్పుడు పాశ్చాత్య ఆలోచనాపరులు సానుకూలంగా చూస్తున్నారు.

*   గురూజీ హెచ్చరించినట్లుగానే, సాంస్కృతిక జాతీయవాదంలోని అస్పష్ట వైఖరి పశ్చిమ దేశాలను గందరగోళానికి గురిచేసి, సమాజాలను అస్థిరపరిచే బహుళసాంస్కృతిక వాదాన్ని ప్రోత్సహిస్తోంది.

*        సాంస్కృతిక పతనం, జాతీయ గందరగోళానికి విరుగుడుగా సాంస్కృతిక జాతీయవాదం ఒక రక్షణ కవచంగా గురూజీ పేర్కొన్న సంగతి ఇప్పుడు పాశ్చాత్యులకు అనుభవపూర్వకంగా తెలిసి వస్తోంది.

*        మైనారిటీలను బుజ్జగించడం అనేది మైనారిటీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తుందని గురూజీ చేసిన హెచ్చరికను పెడచెవిన పెట్టిన కారణంగా ఇప్పుడు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆ బుజ్జగింపు వినాశనానికి దారి తీస్తున్నది.

*        ఒక జాతికి, దేశానికి సంస్కృతి, నాగరికత అనేవి అత్యవసరమైన గుర్తింపులని గురూజీ నొక్కిచెప్పిన విషయం, ప్రస్తుతం అటువంటి విభిన్న గుర్తింపులను గుర్తించకపోతే ప్రపంచం హింస, అస్తవ్యస్తతలోకి జారిపోతుందనే కొత్త అవగాహన ద్వారా ధ్రువీకరణకు నోచుకుంది.

*        సందర్భోచితమైన ఒత్తిళ్లకు అతీతంగా, మెజారిటీ-మైనారిటీ సంబంధాలను రూపొందిం చడం ద్వారా దేశాన్ని, హిందూ సమాజాన్ని, మైనారిటీలను కాపాడటానికి గురూజీ చేసిన పోరాటాన్ని యావత్‌ ‌మానవాళి గుర్తు చేసుకుంటున్నది.

*     ప్రచారంలో ఉన్న భావనకు విరుద్ధంగా, సాంస్కృతిక ఐక్యత, మైనారిటీలను కలుపుకొని పోవడంపై గురూజీ, పండిట్‌ ‌నెహ్రూ స్థూలంగా ఏకీభవించారు. కానీ ‘హిందూ’ దేశం అనే పదాన్ని వర్తింపజేయడంలో మాత్రమే వారు విభేదించారు.

*        ప్రచారంలో ఉన్న అభిప్రాయానికి విరుద్ధంగా, భారతదేశ సాంస్కృతిక, నాగరిక ఐక్యత, కొనసాగింపు, మైనారిటీలను కలుపుకొని పోవడంపై గురూజీ, గాంధీజీల అభిప్రాయాలు ఒకే తీరుగా ఉన్నాయి.

*        ‘‘ధర్మం’’ అనేది ‘‘మతం’’ కన్నా భిన్నమైనదని నిరూపించడానికి గురూజీ చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు ఇప్పుడు బహిరంగ చర్చల ఆమోదం పొందుతున్నాయి.

*        దశాబ్దాల క్రితం ధర్మం అనేది మతాతీత భావన అని గురూజీ వ్యక్తం చేసిన అభిప్రాయాలను న్యాయవ్యవస్థ, రాజకీయ రంగం క్రమక్రమంగా ఆమోదించాయి.

*        భారతదేశపు ప్రాచీన సంస్కృతి పట్ల సున్నితత్వం లేని, ఆంగ్లో-సాక్సన్‌ ‌భారత రాజ్యాంగ నిర్మాణాన్ని, సమ్మిళిత హిందూ జీవన దృక్పథంతో మిళితం చేయాలన్న గురూజీ విజ్ఞప్తి ప్రస్తుత న్యాయ వర్గాలలో, బహిరంగ చర్చలలో విస్తృతంగా ఆమోదం పొందింది.

*        మత ఛాందసవాద ప్రాజెక్ట్ ‌ప్రకారం, ‘‘సమకాలీన భారత నాయకత్వపు మరో భావజాలం’’ గురించి గురూజీ చేసిన సూచన ఇప్పుడు ప్రధాన జనజీవన స్రవంతి అభిప్రాయంగా మారింది.

*        ఇస్లామిస్టుల స్వభావం, ఒక దేశంగా పాకిస్తాన్‌, ‌పాకిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులపై గురూజీ చెప్పింది సరైనదని రుజువైంది.

*        గురూజీ తన జీవితకాలం తర్వాత ఒక దశాబ్దానికి చైనా స్వభావం, దాని పరిణామ క్రమం గురించి కచ్చితంగా అంచనా వేశారు.

*        అప్పట్లో ప్రబలమైన వ్యవస్థాగత ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా గురూజీ ప్రకటించిన అసమ్మతి, భారతదేశపు మథనపడే మనస్సాక్షికి చేసిన విజ్ఞప్తిగా నిలిచింది. ఆయన తదనంతరం ఆ అసమ్మతికి ఎనలేని దాని ప్రామాణికత చేకూరింది.

అందువల్ల, గురూజీ ఒక ద్రష్టగా నిలిచారు. ప్రవక్త అనే పదం ఆయన దరిదాపుల్లోకి కూడా రాదు. గురూజీ భవిష్యత్తును ముందుగానే అంచనా వేశారు. అలా అంచనా వేసిన దానిని తన అభిప్రాయాలుగా వ్యక్తీకరించారు. అలాంటి విలువైన అభిప్రాయాలను చరిత్ర ధ్రువీకరించింది. అయినప్పటికీ, దూరదృష్టి కలిగిన ద్రష్ట గురూజీని లౌకికవాదానికి వ్యతిరేకి అని, మతవాది అని అప్పట్లో కొందరు దురుద్దేశ పూర్వకంగా విమర్శించారు. కానీ, కాలానుగుణంగా సాగే చరిత్ర ప్రస్థానం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గురూజీ ఆలోచనలను పదేపదే ధ్రువీకరించింది.

(ఎస్‌.‌గురుమూర్తి రచించిన ‘‘గోల్వాల్కర్‌ ‌ది మోడరన్‌ ‌రిషి విత్‌ ‌మిల్లేనియల్‌ ‌విజన్‌’’ ‌పుస్తకం నుంచి)

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.