నేడు రక్షాబంధన్ ఉత్సవం సంపూర్ణ భారతదేశంలో కనిపిస్తోంది. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములకు రాఖీ కట్టడం అనే సంప్రదాయం విస్తృతమైంది. మన సాంస్కృతిక కార్యక్రమం భారత దేశవ్యాప్తంగా జరుగుతోందని సంస్కృతి గురించి ఆలోచించేవారందరికీ ఆనందం కలుగుతుంది. కానీ, దీనిని బాహ్యంగా కనిపించే చర్యగా పరిగణించడం సరికాదు. ఈ పని వెనుక ఒక భావన ఉంది. సంకల్పపూర్వకంగా ఏదో ఒక లక్ష్యాన్ని సాధించేందుకు పనిచేయాలి. అప్పుడు అది ఫలవంతం అవుతుంది. కేవలం పూర్వం నుంచి వస్తోంది కాబట్టి చేయాలనుకునే వారు ఎవరైనా ఉంటే, ఆ పని చేసినప్పుడు, కృషి, శ్రమ అయితే ఉంటుంది, కానీ వారికి ఫలితం దక్కదు.

రక్షాబంధన్ పండుగ నాడు మనం రాఖీ కడతాం. దానిని రక్షా సూత్రం అంటారు. ఒక సోదరి తన సోదరుడికి రాఖీ కట్టినప్పుడు, కట్టే వారిని రక్షించడం కోసమే ఆ రాఖీని కడుతున్నారని సోదరికి, సోదరుడికి అర్థమవుతుంది. ఒక సోదరుడు తన సోదరిని రక్షిస్తాడు.

సమాజ పురోగతికి మొదటి షరతు భదత్ర. ఎవరైతే సురక్షితంగా ఉండరో, వారి పురోగతి కూడా జరుగదు.  అలాంటివారు పురోగతి, అభివృద్ధిపై ఎలా దృష్టి పెట్టగలరు? వారికి ప్రతి రోజూ తమ ప్రాణాలను రక్షించుకోవలసి వస్తుంది. దానికి ఏర్పాట్లు చేసుకోవడానికే వారి సమయం, వనరులు ఖర్చైపోతాయి.  భద్రత లభించిన తర్వాతే పురోగతి జరుగుతుంది. ఈ ప్రగతికి మొదటి మెట్టునుంచే ప్రతి విషయంలో భద్రత, రక్షణ అవసరం. ఇంతకుముందు భద్రత అనే విషయం చాలా సరళంగా ఉండేది, అంటే బయటి దాడుల నుండి, శత్రువుల నుండి, అడవి జంతువుల నుండి, మానవ శత్రువులు మొదలైన వాటి నుండి రక్షణ. వ్యాధులు, అనారోగ్యాలు, పర్యావరణ సమస్యల నుంచి భద్రత – ఇంతటితో ముగిసిపోయే సమస్యలు ఇవి మాత్రమే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు, మానవుడు కత్తిని మాత్రమే ఉపయోగించడం మానేసి, దానికంటే ప్రాణాంతకమైన ఆయుధాలను సృష్టించాడు. అంతేకాక చేతిలో కత్తి పట్టుకోకుండానే ఇతరులను జయించే మార్గాలను కూడా కనుగొన్నాడు.

మన సొంత దేశంలో, మన సొంత ప్రభుత్వంలో కేవలం ఒక వ్యక్తిని సాధనంగా చేసుకుని, మన ప్రభుత్వం విధించిన ఆర్థిక ఆంక్షల ద్వారా మనల్ని ఓడించగలడు. ప్రపంచవ్యాప్తంగా ఇలాగే జరిగింది. మన మనసును మార్చడం ద్వారా,  తమ ఆలోచనలను ప్రభుత్వంలోకి ప్రవేశపెట్టడం ద్వారా, విద్య ద్వారా, వివిధ ప్రలోభాలద్వారా, టెలివిజన్‌లో చేసే సూక్ష్మ ప్రచారం ద్వారా ప్రభుత్వాన్ని తమ నియంత్రణ లోకి తెచ్చుకోవాలన్నదే ప్రస్తుతం వారి వాదన. ఇవే వారు ఉపయోగిస్తున్న పద్ధతులు. జరుగుతున్న దాని నుండి నిజాన్ని ఎవరూ రాబట్టలేరు. అందుకే ఈ రోజుల్లో భద్రత అనే అంశం ఇంతగా విస్తరించింది. మన దేశ ప్రజలు, భూమి నీరు, అడవులు, జంతువులు, సంప్రదాయాలు సహా మిగతా అన్నింటి రక్షణ అవసరం. ఆహార భద్రతకు, మన దేశ సరిహద్దు భద్రతతో కూడా సంబంధం ఉంది. నీటి భద్రత, ఆహార భద్రత, పర్యావరణ భద్రత, మన ఆర్థిక భద్రత, మన వ్యాపారుల భద్రత వంటి  ద్వారాలలో దేనిలోకైనా రంధ్రం ఉంటే, శత్రువు దాని గుండా ప్రవేశించగలడు.

ఇది ధర్మ యుద్ధాల యుగం కాదు. ఇది ట్రోజన్ హార్స్  (ఒక విధ్వంసకరమైన ప్రణాళికను దాగి ఉండే కానుక) యుగం. వారి ఇతిహాసాల ప్రకారం, ఇది పరోక్ష యుద్ధాల యుగం. అందువల్ల, సురక్షితంగా ఉండాలంటే ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇది మన శత్రువులకు ద్వారాలు తెరుస్తోందా? వ్యక్తుల నుండి విధానాల వరకు, దీనిని జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద భద్రతా సమస్య. అందుకే ప్రపంచవ్యాప్తంగా భద్రతను సమర్థించేవారికి, అభివృద్ధిని సమర్థించేవారికి మధ్య నిరంతర పోరాటాన్ని మనం చూస్తున్నాం. మనం అభివృద్ధిని సాధించాలంటే, పర్యావరణవేత్తలతో పోరాడాలి. పర్యావరణానికి వ్యతిరేకంగా అభివృద్ధి, అభివృద్ధికి వ్యతిరేకంగా పర్యావరణం, ఈ రెండూ కలిసి ఉండలేవు. సంపద, సంస్కృతి ఒకదానికొకటి పొసగనివి అనే భావనతో ప్రపంచం నడుస్త్తోంది. భారత్‌లో అలా కాదు. మన నమ్మకాలన్నీ ఒకదానికొకటి పూరకంగా ఉంటాయి. అవి ఒకదానికొకటి మద్దతు ఇచ్చుకుంటాయి. ఎందుకంటే అభివృద్ధి అంటే అనుసరణ, అనుకరణ కాదని మనం తెలుసుకున్నాం.

మనం పేరుకే స్వేచ్ఛగా ఉన్నాం, కానీ వాస్తవంలో కాదు. కాలక్రమంలో, మనం మరిన్ని బంధాల్లో చిక్కుకుపోతాం. ఇంట్లో ఒక చిన్నబిడ్డ పుడుతుంది. ఆ బిడ్డకు మాటలు రావు. కేవలం ఏడవగలదు. ఆకలి వేసినా, భయం వేసినా, ఏ భావాన్ని వ్యక్తం చేయాలన్నా ఆ బిడ్డకు ఏడుపే మార్గం. కేవలం తల్లి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే నవ్వుతుంది. ఆ బిడ్డకు ఉన్న బుద్ధి అంతే. దాని కర్తవ్యం ఏమిటి? ఏమీలేదు. ఉనికిలో ఉండడమే దాని ఏకైక కర్తవ్యం. బిడ్డ అక్కడే ఉం టుంది. ఇతరులు ఆ బిడ్డను చూసుకుంటారు. దానికి ఎలాంటి ఆంక్షలు, బంధాలు లేవు. కానీ అదే బిడ్డ,  17-18 ఏళ్ల వయసుకి వచ్చి, ‘నేను చిన్నప్పుడు చాలా స్వతంత్రంగా ఉండేవాడిని. బట్టలు వేసుకునేవాడిని కాదు. ఇప్పుడెందుకు బట్టలు వేసుకోవాలి?’ అంటే, అది చెల్లదు. మిమ్మల్ని పెద్దవాళ్లు అని పిలవాలంటే, అప్పుడు మీరు కొన్ని హద్దులు పెట్టుకోవడం మొదలుపెట్టాలి. వయసు పెరిగే కొద్దీ, ‘నేను ఎదుగుతున్నాను, మరింత స్వతంత్రంగా మారుతున్నాను. ఇప్పుడు మీపై ఆధారపడి లేను. నా పనులు నేను సొంతంగా చేసుకోగలను,’ అని అనుకుంటాడు. కానీ, అలా చేయడానికి, అతను మరికొన్ని పరిమితులను, బంధా లను అంగీకరించాల్సి ఉంటుంది. అప్పుడు అతను, తల్లిదండ్రుల ఆంక్షల మధ్య ఉండటం కన్నా, తాను జీవనోపాధి సంపాదించుకుని, తనకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకోగలనా అని ఆలోచిస్తాడు. కదా? అతను అలా చేయాలి. కానీ డబ్బు సంపాదించి స్వతంత్రుడయ్యాక, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యతను స్వీకరించకపోతే, అతడిని ప్రపంచంలో ఎక్కడా మంచివాడిగా పరిగణించరు. ఇది వరుసగా, మరింత సంక్లిష్టంగా మారే బంధాలలోకి వెళుతోంది.

 ‘మనకు పాలు ఇచ్చేది మన అమ్మే; ఆమెను సంతోషపెట్టాలి’ అని అనుకున్నాను. ఆమె నన్ను మౌనంగా ఉండమంది. నేను ఈ విషయం అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు, నేను పెద్దవుతున్నానని అందరూ అనడం ప్రారంభించారు. అమ్మా, నాన్న, అన్న, చెల్లి అందరూ ఉన్నారు. వారి గౌరవాన్ని కాపాడాలి. తల్లి దండ్రుల పాదాలకు నమస్కరించాలి. అన్నయ్య చెప్పినట్లే జీవించాలి. నా చెల్లెలిని కాపాడటం నా బాధ్యత. రాఖీ కడుతోంది కాబట్టి, ఆమెకు ఏదైనా ఇవ్వాలి, అని అనుకోవడం మొదలుపెడతారు. దానివల్ల మరింత విస్తృతమైన బంధం ఏర్పడుతుంది. నేను అనే భావనను వదిలేసి మనం అనే తాదాత్మ్యతతో కుటుంబబంధనాల్లో చిక్కుకుంటాడు.

కుటుంబబంధాలను పాటించేవారు మంచివారని కుటుంబసభ్యులు అంటారు. కానీ ఎవరైనా కుటుంబ బంధాలను తెంచుకుని, తమ సమాజం కోసం, గ్రామం కోసం, దేశం కోసం పని చేస్తే, అతను కుటుంబానికి కీర్తిని తెచ్చాడంటారు. అతను కుటుంబబంధాలను తెంచు కున్నాడు. కానీ, అతని గురించి కథలు కథలుగా చెప్తారు. వివేకానందుడు ఏం చేశాడు? అతడి కుటుంబ మేమీ గొప్ప స్థితిలో లేదు. కానీ, అతడు కుటుంబ బంధాలను తెంచు కున్నాడు. వివేకానందుడు చేసిన పనితో, కుటుంబంలోని వారంతా  తమను వదిలిపోయాడనకుండా మా కుటుంబానికి కీర్తి, ప్రతిష్టలు తెచ్చాడంటారు. ఆయన ఒక బంధాన్ని తెంచుకున్నాడు, కానీ తన చుట్టూ మరొక బంధాన్ని ఏర్పరచుకున్నాడు. సమాజం నుంచి అంచలంచెలుగా ముందుకు సాగాలి. ఈ క్రమంలో కొత్త బంధాలను స్వీకరించడం అవసరమవుతుంది. ప్రతి ఒక్కరూ ఇలా చేయాల్సిందే. ఎందుకంటే, ధర్మ మార్గాన్ని అనుసరించేవారిని ధర్మమే పరిరక్షిస్తుంది.

మనకు భద్రత కావాలంటే, అభివృద్ధి కావాలంటే, ప్రపంచంలో మరెక్కడా లభించని ఈ రెండూ మనకు ఒకేసారి కావాలంటే, మనం మన సంప్రదాయాల గురించి ఆలోచించాలి, వాటిని గుర్తు చేసుకోవాలి, వాటిని మన ప్రవర్తనలో భాగం చేసుకోవాలి. కాలానికి అనుగుణంగా ఉండే వాటి రూపాన్ని మనం సృష్టించుకోవాలి.

కానీ, భూమి ప్రాచీనమైంది, ఆకాశంలో ఎగిరేవి కూడా భూమికి తిరిగి రావాల్సిందే. అందువల్ల, తన సంప్రదాయాల నుండి వారసత్వంగా పొందిన విలువలను దృఢంగా స్వీకరించి, ఆ సంప్రదాయా లను కొత్తకాలపు గాలులకు అనుగుణంగా మార్చుకుని, తన ప్రవర్తన ద్వారా తనను తాను వ్యక్తపరిచే సమాజమే ముందుకు సాగుతుంది. అది తనను తాను కూడా కాపాడుకోగలదు.

‘స్వ’ను పరిరక్షించుకోవడం ద్వారా భద్రత లభిస్తుంది. భద్రంగా ఉండటం ద్వారా అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందుతున్న క్రమంలో భారతదేశం తన ఉనికిని కోల్పోతే, ఎన్నటికీ అభివృద్ధి చెందదు. తనకంటూ ఒక గుర్తింపులేని భారత్‌ను ప్రపంచం తన బానిసగా వాడుకుంటుంది. ఇది నిశ్చయం. ఎందుకంటే, ప్రపంచంలో గుర్తింపు లేని వారికి భద్రతగానీ, ప్రతిష్టగానీ ఉండవు. వారి అభివృద్ధి ఒక ధనవంతునికి సంతోషంగా బానిసగా ఉండటం లాంటిదే అవుతుంది. మనకు అలాంటి అభివృద్ధి వద్దు. భద్రతతోపాటు అభివృద్ధి కూడా కావాలంటే, మనం కాలానికి తగిన ప్రవర్తన ద్వారా మనల్ని మనం వ్యక్తపరచుకోవాలి. ఈ రెండింటినీ కలిపి నడపగల సామర్థ్యం ఉన్న ఏకైక దేశం ప్రపంచంలో భారత్ మాత్రమే. ఇది మనందరి బాధ్యత. ఇది బయటివారికి అప్పగించాల్సిన విషయం కాదు. ఇది రాజుకు వదిలివేయవలసినది. ఇది ప్రజాస్వామ్య యుగం. ప్రజలే యజమానులు. వారు అప్రమత్తంగా ఉంటే, దేశంలో గొప్ప మార్పును తీసుకువస్తారు. కానీ, ప్రజలు ఆ ఘనతను వేరొకరికి ఆపాదిస్తారు. వారు ఆ గొప్పదనాన్ని వ్యక్తులకు, పార్టీలకు, సంస్థలకు ఇస్తారు. కానీ అసలైన ఘనత ఎవరికి దక్కాలి? ఏ వ్యక్తి తన సమాజంలోని సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకున్నాడో వారికి. దక్కాలి. ఆ సంస్థలు అంతకు ముందే ఉన్నాయి, ఆ వ్యక్తులు ముందే ఉన్నారు, ఆ పార్టీలూ ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకూ అది జరుగలేదు. ఇప్పుడు ఎందుకు జరిగింది? ఎందుకంటే, ఇప్పుడు ప్రజల మనస్సులోకి వచ్చింది, అందుకే జరిగింది.

 మనం సంతోషంగా ఉండాలంటే, ప్రపంచ మంతా సంతోషంగా ఉండాలి. కానీ, ప్రపంచమంతా సంతోషంగా ఉండాలంటే, మీరు చేసే ప్రతి పనిపైనా ఆంక్షలు లేదా నియమాలు విధించుకోవాలి. మన అవసరాలను కూడా పరిమితం చేసుకోవాలి. ఇతరుల స్వేచ్ఛను కాపాడడానికి మీరు మీ అహాన్ని, స్వేచ్ఛను త్యాగం చేయాల్సి ఉంటుంది. థామస్ పేయిన్ అనే అమెరికా మేధావి , ‘నా చేతిని నా ఇష్టం వచ్చినట్లు కదిలించే స్వేచ్ఛ నాకు ఉంది. కానీ నా చేతి స్వేచ్ఛకు హద్దు నీ చెంపతో ముగుస్తుంది’ అన్న మాటలు ప్రాచుర్యం పొందాయి.  అంటే, నా చేయి పొరపాటున మీ చెంపకు తగిలితే, అది నా తప్పే అవుతుంది. నియమాలు లేదా కట్టుబాటు వల్ల ఆ దశకు వెళ్లాలనుకోవడం లేదు. కనుక, దీనిని స్వయంగా అర్థం చేసుకుని, తమకు తామే వివరించుకుని, గ్రహించి, ఆ విధంగా ప్రవర్తిస్తే, అప్పుడు ఆ వ్యక్తులను ధార్మికులు అంటారు. మొత్తం ప్రపంచం అలా ఉన్నప్పుడు, ఏ రాజు అవసరం లేకపోయింది. ఆ పరిస్థితిని ‘న రాజ్యం న రాజాసీన్ న దండ్యో న చ దాండికః । ధర్మేణైవ ప్రజాస్సర్వా రక్షంతి స్మ పరస్పరం ॥’ అని వర్ణించారు (రాజ్యం లేదు, రాజు లేడు. ఎవరూ శిక్షార్హమైన రీతిలో ప్రవర్తించలేదు. అందువల్ల, శిక్షించడానికి ఎవరూలేరు. మరి అప్పుడు అది ఎలా పనిచేసింది? ప్రజలు ధర్మంతో ఒకరినొకరు రక్షించుకున్నారు (ధర్మ ప్రజా సర్వే రక్ష). అయితే మనం మన సొంత భాషను మర్చి పోయామా? ఈ రోజుల్లో ‘ధర్మం’ అనే పదం వినగానే మనకు పూజ, ఆరాధన గుర్తొస్తాయి. ధర్మం గురించి మాట్లాడేవారిని మతతత్వవాదులు అంటున్నారు.  ధర్మానికి ఈ విషయాలతో సంబంధం లేదు. ధర్మం అంటే అందరూ ఆచరించేది. ధర్మం అంటే అందరినీ ఏకంచేసేది. ధర్మం అంటే ప్రతి ఒక్కరినీ చీకటి నుండి వెలుగులోకి నడిపించేది. మృత్యువు నుంచి అమరత్వానికి/ అమృతత్వానికి దారి తీసేది ధర్మం. దేనివల్ల అయితే, ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సుఖం ప్రాప్తిస్తుందో అది ధర్మం. రక్షాబంధన్ ఈ ధర్మపు బంధం.

రక్షాబంధన్ ఎందుకు చేసుకోవాలి? మనందరం బంధంలో ఉన్నామని మనకు మనం గుర్తు చేసుకునేందుకు. అదృష్టవశాత్తు మన దేశంలో ఇంకా కుటుంబ బంధాలు ఉన్నాయి. కుటుంబం గురించి అందరూ ఆలోచిస్తారు. ఎంత దూరం వెళ్లినా, ఒక ప్రదేశంలో అందరూ కూడి పండుగ జరుపు కుంటారు. ఎందుకు? తమ కుటుంబం కాబట్టి. కుటుంబ బాంధవ్యాలు ఉన్నాయి కనుక. తర్వాత అడుగు ఏమిటి? తర్వాతి అడుగు రాష్ట్రం/ దేశం. యావత్ ప్రపంచానికి అభివృద్ధిని, భద్రతను రెండింటినీ అందించగల దేశం మనది. మానవుని స్వేచ్ఛ, కర్తవ్య బంధం రెండింటినీ కలపవచ్చు. శరీరం, మనస్సు, బుద్ధిని ఏకకాలంలో సంతృప్తి పరచడం ద్వారా, శరీరాన్ని ఆత్మ వైపుకు నడిపించ వచ్చు. మానవుడిని, సమాజం అనే మానవ సమూహాన్ని, సమస్త విశ్వాన్ని ఏకకాలంలో అభివృద్ధి చేయడం ద్వారా, సమస్త విశ్వాన్ని పరమాత్మ వైపుకు నడిపించవచ్చు. మనకు ఆ ధర్మం ఉంది. మనకు ఆ సమతుల్యత ఉంది. మనకు ఆ కళ, జ్ఞానం ఉన్నాయి. ఎప్పటికప్పుడు దానిని యావత్ ప్రపంచానికి అందించడమే ప్రపంచంలో మన దేశ ఉనికికి గల ఉద్దేశ్యం. మన దేశం ప్రపంచం మీద మార్కెట్‌ను రుద్దడానికి ఉద్దేశించింది కాదు. ప్రజల సంస్కృతిని మార్చి, ప్రతి ఒక్కరికీ తన రంగు పులిమి, ప్రపంచవ్యాప్తంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించు కోవడం మన దేశ ఉద్దేశ్యం కాదు. మన దేశం ప్రతిఒక్కరికీ సంతోషకరమైన జీవితాన్ని గడిపే కళకు జీవంపోసి నిరూపిస్తోంది. అందుకే ఆరఎసఎస్ మనది హిందూ జాతి అని అంటోంది. ఈ దేశం సురక్షితంగా, సుసంపన్నంగా ఉన్నప్పుడే మనకు రక్షణ లభిస్తుంది. అందువల్ల, ఈ దేశాన్ని సుసంపన్నంగా, సురక్షితంగా తీర్చిదిద్దడానికి మనం కృషి చేయాలి. కనుక, కేవలం మీ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల వద్దకే వెళ్లకండి. కేవలం మీ పురోహితుల వద్దకే వెళ్లకండి. ప్రతి ఒక్కరూ మీ ఇళ్లలోంచి బయటకు రండి. మైదానానికి రండి. ఒకరికొకరు రాఖీ కట్టుకోండి. సంస్కృతిని పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నవారు, సంస్కృతిని తప్పక కాపాడాలనే అవగాహనను సమాజమంతటా వ్యాప్తిచేయాలి. దీనిని విశ్వసించేవారు ఈ విషయాన్ని అర్థం చేసుకుని, తమ నుంచే ప్రారంభించాలి. ఇంట్లో రక్షాబంధన్ జరుపుకుంటున్నప్పుడు ` నా జీవిత పరమార్థం ఏమిటి? నా కుటుంబ పరమార్థం ఏమిటి? నా జీవితం, నా కుటుంబం, వారి జీవితాలు ఎప్పుడు సంతోషంగా, సుసంపన్నంగా, సురక్షితంగా ఉండగలవు? అని ప్రశ్నించుకోండి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఈ దేశం సుసంపన్నంగా, సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే. తన కుమారులతో అజ్ఞాతవాసం చేస్తున్న కుంతి, బకాసురుడి సంకటానికి భయపడిన కుటుంబానికి తన  కుమారులలో ఒకరిని పంపి కాపాడతానని అని చెప్పింది. తర్వాత ఆమె పాండవులతో, “ఏ లక్ష్యంతో నేను మిమ్మల్ని పెంచి పెద్దవారిని చేశానో, ఆ బాధ్యత నిర్వర్తించాల్సిన సమయం వచ్చింది. అందుకే భీముడి లాంటివాడు వెళ్లి, పాండవులను ఎందుకు పెంచానో నిరూపించాలని నేను కోరుకుంటున్నాను. కేవలం రాజ్యం కోసం మిమ్మల్ని పెంచలేదని రుజువు చేయాలని కోరుకుంటున్నాను” అంది. సమాజం ఇటువంటి సంక్షోభాలలో పడినప్పుడు, ఆ రాక్షసుడిని ఎదుర్కోవడానికి ఎవరు వెళ్తారు? సొంత కొడుకే వెళ్తాడని ఒక కుటుంబం ముందుకు వచ్చింది. అందువల్ల, భగవంతుడు ఆ కుమారుడిని, ఆ మొత్తం కుటుంబాన్ని భారతదేశంలో తిరిగి ధర్మస్థాపనకు పునాదిగా చేశాడు. కౌరవులు వందమంది ఉన్నారు. అది చాలా పెద్ద సంఖ్య. కృష్ణుడు వారితో ఎందుకు ఉండలేదు? వారిని మార్చే శక్తి కృష్ణుడికి లేదా? ఆ శక్తి ఉంది. కానీ వారు మారలేకపోయారు. నిరంతరం విస్తరించే బంధాలను విశ్వసించే, గౌరవించే రక్షాబంధనం అంటే ఏంటో పాండవులకి తెలుసు. దేశం కోసం బంధనాన్ని స్వీకరించే ధైర్యం వారికి ఉంది. అందుకే ధర్మాన్ని పునఃస్థాపించిన సామ్రాజ్యానికి పాండవులు ఆదర్శ రాజులయ్యారు. ఈరోజు మన దేశానికి అలాంటివారు కావాలి.  ఎన్నో సంక్షోభాలు ప్రపంచాన్ని, మన దేశాన్ని చుట్టు ముడుతున్నాయి. ఆ సంక్షోభాలను తప్పించుకోవ డానికి ప్రపంచానికి మార్గం లేదు. మనకు కావలసినంత సామర్థ్యం ఉంది, దానిని ప్రపంచానికి అందించడం మన కర్తవ్యం. మన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి మనం ఎదగాలి. భారతదేశం ఎదగాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? భారత్‌లోని సామాన్య కుటుంబాలు, సాధారణ ప్రజలు రక్షాబంధన్ అనే ఈ సామాజిక సాంస్కృతిక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ముందుకు రావాలి. అందుకే ప్రతి సంవత్సరం వారంతా ఏకమై ఒక ప్రసంగ కార్యక్రమాన్ని నిర్వహించాలి.ఆ ప్రసంగం కేవలం వినోదం కోసం కాకుండా, ఆలోచన కోసం ఉండాలి. ఆ ఆలోచనలో మార్పు కోసం, ఈ బంధాన్ని స్వీకరించడం ద్వారా జీవితం ముందుకు సాగుతోందా లేదా అని మనం ఆత్మపరిశీలన చేసుకోవడానికి.

మనం సాధారణ ప్రజలం.  వివేకానంద, శివాజీ, సుభాష్ చంద్ర కూడా సాధారణ ప్రజలే. వారు గొప్పవారిగా పుట్టలేదు. క్రమంగా అలా మారారు. మనం కూడా అలా మారగలం. మనం అంతదూరం వెళ్లలేకపోవచ్చు. ఈ రోజు ఉన్న చోటు నుండి కనీసం పది అడుగులు ముందుకు వేయగలం. ఈ వ్యక్తులు అవతార పురుషులు కాదు. మనలాంటి కుటుంబంలో పుట్టినప్పటికీ వ్యక్తి ఎంత దూరం పురోగమించగలడో చెప్పడానికి వారు ఆదర్శంగా నిలిచారు. మనం ఎంత ముందుకు వెళ్తే అంత పురోగమిస్తాం, అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే, మనం ఎంతముందుకు వెళ్తే అంతగా వ్యక్తిత్వమున్న మనుషులుగా ఎదుగుతాం. మనం ఇళ్లకే పరిమితమై ఉండి, ఏ చర్యా తీసుకోకపోతే జంతువులతో సమానం. మనకు, జంతువులకు మధ్య ఉండే ఏకైక తేడా, జీవసంబంధమైనది మాత్రమే అవుతుంది తప్ప మరేమీ ఉండదు. మనం మానవులం. మనకు వ్యక్తిత్వాలు ఉన్నాయి. కనుక, రక్షణ కోసం మనం బంధాలను అంగీకరించాలి. భద్రత కోసం బంధాలను స్వీకరించే సమాజం రక్షణను కూడా పొందుతుంది. అభివృద్ధి వృద్ధికి, ప్రతిష్టకు దారి తీస్తుంది. అంతేకాక, వాటిని సాధించిన సమాజం ఇతర సమాజాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. మార్గదర్శక సమాజంగా ఎదగాలంటే, మనం, మన కుటుంబాలతోపాటు విశ్వాసం ఉన్న తోటివారిని కూడా కలుపుకొని ముందుకు నడిపించే వ్యక్తులుగా మనం మారాలి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుని, అవగాహనతో నేడు రక్షాబంధన్ ను జరుపుకుంటే, మన దేశానికి, ప్రపంచానికి సంక్షోభం నుండి విముక్తి లభించి, అదృష్టం మారే రోజు ఎంతో దూరంలో ఉండదు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.