సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
క్లిష్టమైన కార్యక్రమాలు సైతం పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. రుణవిముక్తులవుతారు. కుటుంబంలో సమస్యల నుంచి కొంత గట్టెక్కుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు అందుతాయి. మరింతగా లాభాలు గడిస్తారు. ఉద్యోగులు కొన్ని చిక్కులు తొలగి ఊరట చెందుతారు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. రచయితలు, వైద్యులకు ఊహించని అవకాశాలు.25,26 తేదీల్లో బంధువులతో తగాదాలు. ప్రయాణాలు చేస్తారు.శ్రీ కృష్ణస్తుతి మంచిది.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. సేవ, ధార్మిక కార్యక్రమాలపై మరింత దృష్టి సారిస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు. రెండువ•డు విధాలుగా ధనలాభ సూచనలు. ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కవచ్చు. కళాకారులకు కొన్ని వివాదాలు తీరతాయి. వైద్యులు, క్రీడాకారులకు సంతోషకరమైన సమాచారం. రచయితలు, పరిశోధకులకు వివాదాలు పరిష్కారమవుతాయి. 20,21తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప రుగ్మతలు.మేథా దక్షిణావ•ర్తి స్తుతి మంచిది.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆప్తులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది. కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కాంట్రాక్టర్లకు సంతోషకరమైన సమాచారం. అవసరాలకు తగినంతగా సొమ్ము సమకూరుతుంది. కుటుంబంలో శుభకార్యాలపై ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్య నుంచి ఊరట లభిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. లాభాలు అనూహ్యంగా దక్కుతాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. రచయితలు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 22,23 తేదీల్లో దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. ఒశ్రీ ఆంజనేయ ప్రార్ధన చేయండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
చేపట్టిన కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. సొమ్ముకు ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. రుణబాధల నుంచి విముక్తి. కుటుంబసభ్యుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు లాభాలు అందుతాయి. కొత్త సంస్థలు ఏర్పాటు చేస్తారు. ఉద్యోగులకు నూతనోత్సాహం, విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు అనూహ్య అవకాశాలు. కళాకారులు, రచయితల శ్రమ ఫలిస్తుంది. 23.24 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. శ్రీసూర్యప్రార్థన చేయండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకున్న కార్యక్రమాలలో కొంత జాప్యం. కుటుంబంలో కొన్ని చిక్కులు. కష్టానికి తగిన ఫలితం కనిపించక ఇబ్బంది పడతారు. విద్యార్థులకు కాంట్రాక్టర్ల యత్నాలు ఫలించవు. ఆస్తి వివాదాలు జఠిలం కాగలవు. రావలసిన సొమ్ము కొంత ఆలస్యంగా అందుతుంది. కొత్తగా అప్పులు చేస్తారు. కుటుంబసభ్యులతో కొన్ని విషయాలలో రాజీపడతారు. కొద్దిపాటి అనారోగ్యం, తద్వారా ఔషధసేవనం. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సామాన్య లాభాలు దక్కుతాయి, ఉద్యోగులకు•నిరుత్సాహవంతంగా ఉంటుంది. ఊహించని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలకు కాస్త అనుకూలమైన కాలమనే చెప్పాలి. రచయితలు, క్రీడాకారులకు పరీక్షాకాలంగా ఉన్నా క్రమేపీ సర్దుబాటు కాగలవు 22,23 తేదీల్లో శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. ధన్వంతరీ స్తోత్రం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
నూతన ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రముఖులతో ఊహించని పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులతో గతాన్ని నెమరువేసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలలో అనుకూల పరిస్థితులు. సమాజంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రాబడి మరింత అనుకూలిస్తుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం. రచయితలు, క్రీడాకారులకు మరింత సానుకూలమైన సమయం. 24,25 తేదీల్లో దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. విష్ణుధ్యానం చేయండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
విద్యార్థులకు కాస్త ఊరట. బంధువర్గం నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. శత్రువులను కూడా విధేయులుగా మార్చుకుంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. కుటుంబసభ్యుల మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆదాయం మరింత పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం. ఒక సుదీర్ఘ వివాదం చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వాణిజ్య, వ్యాపారవేత్తల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు. కళాకారులకు పురస్కారాలు. పరిశోధకులు, వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది 20,21 తేదీల్లో అనారోగ్యం. నిర్ణయాలు మార్చుకుంటారు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఆర్థిక ఇబ్బందులు కొంత తీరతాయి. ఆప్తులు, స్నేహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆశ్చర్యకరంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దగ్గరకు వస్తాయి. కొన్ని సమావేశాలకు హాజరవుతారు. పరిచయాలు విస్తృతమవుతాయి. గృహ, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. పరిశోధకులు, వైద్యుల సేవలకు విశేష ఆదరణ లభిస్తుంది. 23,24 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. ద్వాదశ సూర్య నమస్కారాలు చేయండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
గతం నుంచి వ్యేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కే సూచనలు. ఆదాయం మెరుగ్గా ఉన్నా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు చేయూతనందించి ప్రశంసలు పొందుతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలపై చర్చలు సఫలం. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలలో విజయం. ఉద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అందుతాయి. రచయితలు, క్రీడాకారుల యత్నాలు సఫలం 24,25 తేదీల్లో ఇంటాబయటా చికాకులు. అనారోగ్య సూచనలు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
చేపట్టిన కార్యక్రమాలు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు లోటు రాదు. ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులకు అనుకూల పరిస్థితి. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి. వ్యాపారులకు క్రమేపీ లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు దక్కే అవకాశాలు. కళాకారులకు కొత్త అవకాశాలు. రచయితలు, క్రీడాకారులకు పేరుప్రతిష్ఠలు దక్కుతాయి. 20,21 తేదీల్లో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో కలహాలు.శ్రీరామధ్యానం మంచిది.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. రాబడి గతం కంటే ఆశాజకనంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఇంతకాలం పడిన కష్టం కొలిక్కి వస్తుంది. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లు అనుకున్న టెండర్లు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలలో విజయం. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతమైన కాలం. కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 22,23 తేదీల్లో బంధువులతో తగాదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
చేపట్టిన కార్యక్రమాలు చకచకా పూర్తి కాగలవు. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. నూతన వ్యక్తుల పరిచయం. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. గతంలోని కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు మరింత లాభాలు అందే సూచనలు. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. క్రీడాకారులు, పరిశోధకులకు అనుకున్న అవకాశాలు దక్కుతాయి. 23.24 తేదీల్లో బంధువిరోధాలు. చోరభయం. లలితాదేవిస్తుతి మంచిది