ఇటీవల రాజమండ్రి వద్ద గోదావరి వంతెన పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య విడివిడిగా రాసిన సూసైడ్ నోట్స్ అనేక దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చాయి. సాధిక్‌ఖాన్ అనే వ్యక్తి వేధింపుల వల్లే తాము తనువు చాలిస్తున్నట్లు వారు ఆ లేఖల్లో ఆవేదన వ్యక్తం చేశారు. సాధిక్‌ఖాన్, వివాహిత అయిన సౌజన్యకు మాయమాటలు చెప్పి దగ్గరై, వివాహేతర సంబంధం నెరపి, చివరికి ఆమె భర్త మరణానికి సైతం కారణమయ్యాడన్న ఆరోపణలు విస్మయపరుస్తున్నాయి.
ఒక కుటుంబ ఉసురుతీసిన నిందితుడు సాధిక్‌ఖాన్ కుటుంబం బాధితుల పట్ల ఎదురుదాడికి దిగడం విస్తుపరుస్తోంది. సౌజన్య ఆస్తిని చేజిక్కించు కునేందుకు నిందితుడు ఆమెను హింసించడంతో పాటు ఆమె పదేళ్ల కుమారుడిని ఉగ్రవాదులకు అప్పగిస్తామని బెదిరించడం అతని పైశాచికత్వానికి అద్దం పడుతోంది. ఒకపక్క అతని కుట్ర స్పష్టంగా కనబడుతున్నా… తమ కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, తప్పంతా బాధితులదేనని అతని కుటుంబం ప్రత్యారోపణలకు దిగడం గమనార్హం. పైగా, తాము ఆత్మహత్య చేసుకుంటే అందుకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్లు బెదిరింపులకు పాల్పడుతున్న తీరు ఇలాంటి శక్తులు సమాజంలో ఏ స్థాయిలో వేళ్లూనుకున్నాయో స్పష్టం చేస్తూ ఆందోళన కలిగిస్తోంది. ఒక గౌరవప్రదమైన కుటుంబం ఇలాంటి బ్లాక్‌మెయిల్‌కు బలికావడం సమాజంలో దాగివున్న అత్యంత ప్రమాదకరమైన చీకటి కోణాన్ని బట్టబయలు చేస్తోంది.
ప్రేమ పేరుతో అమాయకపు మహిళలను లోబరుచుకుని వారి జీవితాలను నాశనంచేసే అకృత్యాలకు ఈ ఘటనే సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. సౌజన్యను బుట్టలో వేసుకున్న తర్వాత, సాధిక్‌ఖాన్ ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయాల్లో రహస్యంగా వీడియోలు తీసి, వాటిని బహిర్గతం చేస్తానని బెదిరించడం అత్యంత హేయమైన చర్య. ఈ బ్లాక్‌మెయిల్ పర్వంతో పాటు, తనను పెళ్లి చేసుకోవాలని, కుటుంబ ఆస్తులన్నీ తన పేరున రాయాలని చిత్రహింసలు పెట్టినట్లు ఆ లేఖల ద్వారా స్పష్టమవుతోంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కొందరు యువకులు పథకం ప్రకారం మహిళలను లక్ష్యంగా చేసుకుని, వలపు వల విసిరి, రహస్యంగా వీడియోలు చిత్రీకరించి ఆపై వారి కుటుంబాల పరువు, ప్రాణాలతో ఆడుకుంటున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ దారుణ ఘటన నేపథ్యంలో ‘లవ్‌జిహాద’, మతమార్పిడుల కోణంపై తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. హిందూ యువతులను వ్యూహాత్మకంగా లక్ష్యంగా చేసుకుని, ప్రేమ పేరుతో వంచించి, ఆపై మతం మారాలంటూ ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలకు ఈ ఉదంతం బలం చేకూరుస్తోంది. సౌజన్యను పెళ్లాడతానని నమ్మించి, మతం మారాలని సాధిక్‌ఖాన్ ఒత్తిడి చేయడం, తీవ్ర స్థాయి బెదిరింపులకు పాల్పడటం చూస్తుంటే, దీని వెనుక ఒక వ్యవస్థీకృత నేరాల తీరు దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల మానసిక బలహీనతలను ఆసరాగా చేసుకుని, వారిని ట్రాప్ చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకుని వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ మతమార్పిడు లకు పురిగొల్పడం సమాజ భద్రతకు, మత సామరస్యానికి పెనుముప్పుగా మారుతోంది. నిందితుడు సాధిక్‌ఖాన్‌ను పోలీసులు వెంబడించి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అదుపులోకి తీసుకోవడం, అక్కడి నుంచి కాకినాడకు తీసుకువచ్చి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించడం కాస్త ఊరట నిచ్చే అంశం.
భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు
తన కుమారుడు జగదీశ్వరరెడ్డికి ప్రొటీన్ పౌడర్‌లో విషం కలిపి ఇచ్చినట్లు సౌజన్య మామ భాస్కరరెడ్డి ఆరోపించారు. సౌజన్య కూడా తన లేఖలో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ ఆరోపణలు కేసు తీవ్రతను మరింత పెంచుతున్నాయి. అలాగే భాస్కరరెడ్డి పదేళ్ల మనుమడు కార్తికేయరెడ్డిని తీవ్రవాదులకు అప్పగిస్తానని సాధి¿Ž బెదిరించినట్లు వస్తున్న వార్తలు అత్యంత కలకలం రేపుతున్నాయి. నిందితుడికి కేవలం నేర చరిత్రే కాకుండా తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆయన అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
నిందితుడి కుటుంబం బెదిరింపులు!
ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు విచారణలో ప్రధాన నిందితుడు సాధిక్‌ఖాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న కొద్దీ, ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆధారాలు, బాధితుల మరణ వాంగ్మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, నిందితుడి కుటుంబ సభ్యులు తమ కుమారుడు చేసిన పనికి సమర్థించడం, బాధితులపై నేరాన్ని తప్పును నెట్టివేయడం, పైగా ప్రభుత్వాన్ని బెదిరించడం పలు విమర్శలకు తావిస్తున్నాయి. సాధిక్ ఏ తప్పూ చేయలేదని అతని తల్లి, సోదరి బహిరంగంగా వెనకేసుకు రావడం విస్మయం కలిగిస్తోంది. విచారణను ఎదుర్కోవడానికి బదులుగా, సాధిక్‌పై ఆరోపణలు చేస్తే తాము ఆత్మహత్య చేసుకుంటామని, దానికి ప్రభుత్వానిదే బాధ్యత అంటూ వారు నేరుగా దర్యాప్తు సంస్థలను, ప్రభుత్వాన్ని బెదిరిస్తుండటం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, ఈ కేసును ఉద్దేశపూర్వకంగా “మతపరమైన కుట్ర”గా చిత్రీకరించి అసలు నేరాన్ని, విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
సాధిక్‌ఖాన్ కుటుంబం ఎన్ని సమర్థింపులు చేసుకున్నప్పటికీ, ఈ కింది తార్కిక ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. ఆ కుటుంబం చెబు తున్నట్లుగా అతనికి ఎలాంటి పాపమూ తెలియక పోతే, ఏ తప్పు చేయకపోతే కాకినాడ వదిలి మీరట్‌కు ఎందుకు పారిపోయినట్లు? పోలీసుల కళ్లుగప్పి తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది?
సమాజంలో మంచి హోదా, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న నూకరాజు కుటుంబం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతూ, చివరికి పసివాడితో సహా గోదావరిలో దూకి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఆత్మహత్యకు ముందు వారు రాసిన లేఖల్లో సాధిక్‌ఖాన్ పెట్టిన మానసిక క్షోభ, బ్లాక్‌మెయిల్ గురించి స్పష్టంగా పేర్కొనడం అతని నేరానికి ప్రత్యక్ష సాక్ష్యం.
వాస్తవాలు ఇంత నిర్ద్వంద్వంగా కనిపిస్తుంటే, నిందితుడిని కాపాడుకోవడానికి అతని కుటుంబం వ్యవస్థలను బెదిరించడం, మతం కార్డు వాడటం కేవలం దర్యాప్తును నీరుగార్చే ఎత్తుగడలే. సాధిక్ పారిపోవడం, ఆస్తుల కోసం బాలుడిని తీవ్రవాదులకు అప్పగిస్తాననడం లాంటి భయానక అంశాలు అతని నేర ప్రవృత్తిని స్పష్టం చేస్తున్నాయి. నిందితుడి కుటుంబం చేస్తున్న బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గకుండా ఈ కేసులో తీవ్రవాద కోణాన్ని కూడా పోలీసులు నిశితంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.
ఉగ్రవాద సంబంధంపై అనుమానం?
పదేళ్ల బాలుడు క్రియాన్ష్‌ను తీవ్రవాదులకు అప్పగిస్తానని సాధిక్ బెదిరించినట్లు వస్తున్న వార్తలు అత్యంత కలకలం రేపుతున్నాయి. ఇదే నిజమైతే పసివాడిని అడ్డుపెట్టుకుని ఇలాంటి పైశాచిక బెదిరింపులకు పాల్పడటం తీవ్రమైన నేరం. రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఉగ్రవాదుల కదలికలు సంచలనం కలిగిస్తున్న విషయం, తీవ్రవాదుల కదలికలు, పోలీసులు అరెస్టులు తెలిసిందే. ఇప్పుడు సాధిక్‌ఖాన్ ఉగ్రవాదుల గురించి పేర్కొనడంతో అతనికి వాళ్లతో సంబంధాలు ఉన్నాయని హిందూ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగేళ్లక్రితం ఆత్మకూరులో మసీదు ఘటనలో పోలీసుస్టేషన్ వద్ద వాహనాలను దహనం చేయడం నుంచి ఏడాది క్రితం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న కారణంగా కొత్వాల్ నూర్ మహమ్మద్ అరెస్టు, అంతకుముందు విజయ నగరంలో పేలుడు పదార్థాల స్వాధీనం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థల పీ¾ఎఫఐ, ఎస్‌డీపీఐ వంటి తీవ్ర వాద సంస్థలు కార్యకలాపాల వంటివి రాష్ట్రంలో ఉగ్రవాద సంసల ఉనికిని తెలియచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్తికేయరెడ్డిని ఉగ్రవాదులకు అప్పగిస్తానని సాధిక్‌ఖాన్ బెదిరించడంతో అతనికి ఉగ్రవాదులతో ఏమైనా సంబంధం అనే ఉందా అనే విషయంపై అనుమానులు వ్యక్తం అవుతున్నాయి.
కార్తికేయకు రక్షణ:బాలల హక్కుల కమిషన్
ఈ విషయంలో తగిన విచారణ చేయాల్సిందిగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశించింది. నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై కాకినాడలో పోలీసు, విద్యాశాఖాధికారులు, రైఫిల్ శిక్షణ ఇచ్చిన స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులతో కమిషన్ ఛైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు సమీక్ష నిర్వహించారు. ఈ కేసు కోర్టు తదుపరి కస్టడీ విచారణకు అక్టోబర్ 2వ తేదీకి వాయిదా వేసినట్టు అధికారులు తెలిపారు. విషయాలు బయటపెడితే బాలుడిని తీవ్రవాదులకు అప్పగిస్తామని నిందితుడు బెదిరించడం వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో బాలుడికి, అతడి కుటుంబానికి రక్షణ కల్పించాలని కోనసీమ ఎస్పీని ఆదేశించారు. బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రతపై కాకినాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ బెంచ్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ నిర్వహిస్తామని వేటుకూరి తెలిపారు. కమిషన్ సభ్యులు డా. కె.నాగమానస, గంగా సూర్య నారాయణ, రావులపాలెంలోని భాస్కరరెడ్డి నివాసానికి వెళ్లి బాలుడితో మాట్లాడారు. విషాద ఘటన, తదుపరి పరిణామాలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా సూర్యనారాయణరాజు మాట్లాడుతూ బాలుడికì భద్రత కల్పించడంలో ఎలాంటి రాజీ ఉండదని, అతనికి విద్య, భవిష్యత్ అంశాలపై అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పదేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోవడం బాలుడి భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్