‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన


“భయపడకే. పోలీసులు ఆ నక్సలైట్లను ఏటీ సెయ్యలేక మన మీద పడతన్నారు. పోలీసులకు సెప్పకూడదనీ నక్సలైట్లు, ఆళ్లెక్కడున్నారో సెప్పమనీ పోలీసులు మనల్ని యేపుకు తింటన్నారు. ఈళ్లిద్దరి మధ్య మనం నలిగిపోతన్నాం. మళ్లీ ఇద్దరూ మేం గిరిజనుల గురించే పోట్లాడుతున్నామంటారు. కానీ జరుగుతున్నదేటి? నక్సలైట్లు చంపెత్తారని ఒక్క ఉద్యోగి కూడా మన కొండల్లో పని చెయ్యడానికి రావటం నేదు” అన్నాడు సోమన్న భార్యను అనునయిస్తూ.

 ఆళ్ల వల్ల మనం సచ్చిపోతన్నాము. ఇప్పటికే ఈ పోలీసుల బాధ పడలేక మనోళ్లు ఎంతోమంది అన్నల్లో చేరిపోతున్నారు. మరేటి సేత్తారు. నేకపోతే… నక్సలైట్లు పోలీసులోళ్లని ఎక్కడ, ఎప్పుడు సంపినా మనల్నే పట్టుకుపోతన్నారు ఈ పోలీసులు” అన్నాడు కోపంగా.

“మరిప్పుడేటి సేత్తావు? పోలీసులకు లొంగి పోతావా?” అడిగింది ధరణి.

“నేదే! నొంగిపోతే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చెత్తారు. అసలే మనోళ్లు ఆరుగురు పోలీసోళ్లని, ఆ ఎస్సై రంగారావును సంపేసినారు. ఆ కోపంతో వాళ్లు ఉడికిపోతన్నారు. ఇప్పుడు దొరికితే నా శవాన్ని కూడా ఆనవాళ్లు లేకుండా సేసేత్తారు” అన్నాడు సోమన్న.

“మరైతే ఎక్కడికెళతావు? మనకేటి ఈ కట్టాలు?” అంది ఏడుస్తూ ధరణి.

 * * *

 “మావా! మేట్టారు బాబుతో నేను సెబుతాను. అతను సెబితే పోలీసులు ఇంతారు. నువ్వు లొంగిపోతే మంచిదేమో” అంది ధరణి.

“ఇప్పుడయన్నీ అయ్యేవి కావే. కొన్నాళ్లకు ఇవన్నీ సద్దుమణిగితే అప్పుడు సెప్పొచ్చు. ఇప్పుడు ఎవురు సెప్పినా ఆ పోలీసులు ఇనరు” అన్నాడు సోమన్న.

“మావా? మళ్లీ ఎప్పుడొత్తావు? డబ్బులు నేవు. బయటకెళ్లాలంటే పోలీసుల బయం. రెండు రోజులైంది మా అక్క దగ్గర భోజనం సేత్తన్నాను.” చెప్పింది ధరణి.

“భయపడకే.అన్నిటికీ ఆ మరిడమ్మే ఉంది. ఎర్రకొండ మీద గూడెంలో నక్సలైట్లున్నారు. ఆళ్లని కలిసి మన బాధలు సెబుతాను. ఇప్పుడు ఆళ్లే ఏదో ఒకటి చెయ్యగలరు. అన్నీ బాగుంటే పదిరోజుల్లో తిరిగొత్తాను నేను వొచ్చినా రాకపోయినా పిల్లని మాత్రం జాగ్రత్త. బయటకు ఎక్కడికీ ఎల్లకు. నేనెక్కడున్నా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాల” అన్నాడు సోమన్న చెమర్చిన కళ్లను తుడుచుకుంటూ.

“మావా! అన్నల్ని కలిస్తే ప్రమాదమేమో? ఆ యిసయం పోలీసోళ్లకు తెలిస్తే ఊరుకుంతారా సెప్పు?“ అంది.

“తప్పదే నాకు యింకో దారి నేదు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు” అంటూ ధరణిని గట్టిగా కావలించుకొని ఆ తరువాత పెరట్లోంచి వెళ్లి పోయాడు.

వెళుతున్న అతడిని ధరణి బాధగా చూడసాగింది. అతను మళ్లీ ఎప్పుడొస్తాడోనన్న బాధ ఆమె ముఖంలో కనిపిస్తోంది. అలా వెళుతూ అతను చీకట్లో కలిసిపోయాడు.

 * * *

ఆ మర్నాడు మరికొన్ని పోలీసు బలగాలు మన్యంలో దిగాయి. పోలీసు స్టేషన్ని ముట్టడించి ఆరుగురు పోలీసులను, ఎస్సై రంగారావుని చంపిన వాళ్ల కోసం పోలీసుల వేట ముమ్మరం అయింది.

ప్రతీ గూడెం విÖద దాడిచేసి యువకులను అరెస్ట్ చెయ్యడం మొదలు పెట్టారు. దాడిలో ఇంకెవరు ఉన్నారంటూ ప్రశ్నిస్తూ హింసించడం మొదలు పెట్టారు.

ఈ విషయం నాకు తెలిసి ధరణితో చెప్పాను. ఎందుకంటే..ఒక పోలీసు కానిస్టేబుల్ కెంగువ గ్రామం వచ్చి ధరణిని అరెస్ట్ చేస్తామని నాతో అన్నాడు. ధరణిని అరెస్ట్ చేస్తే ఆ దాడిలో పాల్గొన్న వాళ్లను గురించి తెలుస్తుందని పోలీసుల ఆలోచన. అందుకే ఆ రాత్రి నేను ధరణి ఇంటికి వెళ్లి ఆమెను హెచ్చరించాను.

“ధరణీ! నీ గురించి పోలీసులు వెతుకుతున్నారు. బహుశా నేడో, రేపో వచ్చి నిన్ను అరెస్ట్ చేయవచ్చు. చాలా పోలీసు బలగాలొచ్చాయి. ఈసారి వాళ్లను ఎదిరించటం కష్టం. పైగా ప్రమాదం కూడా! ఎందుకంటే గ్రేహౌండ్స్ దళాలు వచ్చాయి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు” అని చెప్పాను.

“మేట్టారు బాబూ! ఇప్పుడు నేనేటి సెయ్యాలి? ఉజ్జోగానికెళ్లకపోతే జీతం రాదు. మా మావ కూడా ఎక్కడికో ఎల్లిపోయాడు. ఎప్పుడొత్తాడో తెలియదు. చూస్తే చిన్నపిల్ల. పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే ఈ పిల్ల గతేటి కాను? మా అక్క గౌరి నన్ను ఎన్నాళ్లు సూత్తాది సెప్పండి?” అంది ఏడుస్తూ.

“తప్పదు ధరణీ! నువ్వు నీ పిల్లని తీసుకొని ఇంకెక్కడికైనా కొన్నాళ్లపాటు వెళ్లిపో. కొన్ని రోజులు పోతే ఈ అలజడి తగ్గుతుంది. ఇప్పుడైతే పోలీసులు మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్లను ఎదిరించి మీరేమి చెయ్యలేరు ” అన్నాను.

ఇంతలో అక్కడికి గౌరి వచ్చింది.

‘గౌరీ! చెల్లెలు ధరణి జాగ్రత్త. పోలీసులు అన్ని ఊళ్లనూ జల్లెడ పడుతున్నారు. ఇప్పుడు దొరికిందో పరిస్థితి మన చెయ్యి దాటిపోతుంది”అన్నాను.

“నాకు అదే బాధగా ఉంది బాబూ! ఓ పక్క దాని మొగుడు కూడా లేడు. ఇప్పుడు దీన్నెక్కడుంచాలి?పైగా దానికి చిన్నపిల్ల? మా చెడ్డ ఘోరం జరిగింది ” అంది గౌరి.

“పిల్లను నీ దగ్గరే ఉంచుకొని. ధరణిని కొన్నాళ్ల పాటు మీ చుట్టాలింటికి పంపు. పరిస్థితులు సద్దుమణిగితే మళ్లీ వస్తుంది” సలహాలాంటిది ఇచ్చాను.

“మాస్టారు బాబూ! ఈ నక్సలైట్లు, పోలీసోళ్ల వల్ల మాకేటీ లాభం చెప్పండి? ఆళ్ల గొడవల్లో మేము నలిగిపోతున్నాము. నక్సలైట్లు మా కోసం పోరాడుతున్నామంతారు. పోలీసులు కూడా మా గురించే నక్సలైట్లతో యుద్ధం చేస్తున్నామంతారు. కానీ ఈళిద్దరి వల్లా మేము నట్టపోతున్నాము.

ఈళ్ల గొడవల వల్ల మా వూళ్లోని కుర్రోళ్లంతా ఎక్కడికో పారిపోనారు. ఊళ్లో ఒక్క గుంటడూ నేడు. కొందరు నక్సలైట్లలో కలిసిపోయారు. ఇలాగే పోలీసోళ్లు మమ్మల్ని అల్లరి పెడితే అందరూ అన్నల్లో కలిసి పోవడం ఖాయం” అంది ఏడుస్తూ గౌరి.

ఆ మర్నాడు పోలీసుల కూంబింగ్ మొదలైంది. గ్రేహౌండ్స్ దళాలు నక్సలైట్ల స్థావరాలపై దాడులు మొదలు పెట్టాయి. ఈసారి వాళ్లు వ్యానులు గానీ, బస్సులు గానీ వాడటం లేదు. వాడితే వాటిని పేల్చేస్తారనీ పోలీసుల భయం.

రెండు రోజుల తరువాత పోలీసులు ఒక నక్సల్స్ స్థావరం విÖద దాడి చేసారు.అప్పుడు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు నక్సల్స్, ముగ్గురు పోలీసులు చనిపోయారు. మిగతా నక్సలైట్లు పారిపోయారు.

ఒక పోలీసొచ్చి ఎస్సై గారు నన్ను స్టేషన్‌కి రమ్మన్నారనీ చెప్పాడు.

నన్నెందుకు పిలిచారోనన్న సందేహం నాకు కలిగింది. పోలీసుల దృష్టిలో పడటం మంచిది కాదు. వాళ్లకి గానీ అనుమానం వచ్చిందో అది పోదు. ఇంక ప్రతి కేసులో మనల్ని పిలుస్తుంటారు.

నేను స్టేషన్‌కి వెళ్లేసరికి కొత్తగా వచ్చిన ఎస్సై రవీంద్ర ఉన్నాడు.

“శ్రీధర్ గారూ! మీరు టీచరుగా పనిచేస్తున్న కెంగువ గ్రామంలోనే నక్సల్స్ కదలికలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఊరి యువకులే నక్సలైట్లకి మా పోలీసు బస్సు గురించి చెప్పడంవల్ల వాళ్లు దాన్ని బ్లాస్ట్ చేసారు. వాళ్లలో ముఖ్యుడు సోమన్న. వాడివల్లే ఇదంతా జరిగింది. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో తెలియదు. మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే… వాడి ఆచూకీ విÖకు తెలిస్తే చెప్పండి. మీరు చెప్పారని ఎవ్వరితోనూ చెప్పను”అన్నాడు రవీంద్ర.

“ఇనస్పెక్టర్ గారూ! నేను ఆ ఊరికి టీచరుగా వచ్చి ఆరునెలలైంది. నాకు ఆ ఊళ్లో ఎవ్వరూ పెద్దగా తెలియదు. నేను ఆ స్కూల్లో ఒంటరిగా ఉంటున్నాను. ఆ యువకులు ఎవరో… సోమన్న ఎవరో నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? కాకపోతే గౌరి అనే నర్సు, ధరణి అనే అంగన్‌వాడి టీచరు నాకు తెలుసు. ఆ ధరణి మొగుడే సోమన్న అని కూడా తెలుసు. అంతే తప్ప ఆ ఊరి యువకుల గురించి కానీ, నక్సలైట్ల గురించి కానీ ఏమీ తెలియదు. కాకపోతే ఒకటి మాత్రం చెప్పగలను. నేను ఎమ్.ఏ. బీఈడీ చదివి ఏజన్సీ ప్రాంతంలోని స్కూల్లో టీచరుగా చేరడానికి కారణం..పేదవారు, అమాయకులు, ఏ అభివృద్ధికీ నోచుకోని గిరిజనుల పిల్లలకు చదువు చెప్పాలనే ..

కానీ ఇక్కడి పరిస్థితి నేనూహించిన దానికి భిన్నంగా ఉంది.గిరిజనులకు మేలు చేస్తున్నామనీ నక్సలైట్లు, నక్సలైట్లు సంఘ విద్రోహశక్తులనీ మీ పోలీసులు భావించుకుంటూ… ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఈ ఏజన్సీ ప్రాంతాన్ని యుద్ధం భూమిగా మార్చేశారు.

అందుకే ఈ ప్రాంతంలో పనిచెయ్యడానికి ఏ ఒక్క ఉపాధ్యాయుడు గానీ, డాక్టరు గానీ ముందుకు రావటం లేదు. అందువల్లే స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా ఈ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఏ ఊరికి రహదారి సౌకర్యాలు లేవు. తాగడానికి గెడ్డ నీరే వాళ్లకు ఆధారం. అనారోగ్యం చేస్తే రోగిని మంచం విÖద పడకోబెట్టి డోలీల్లో తీసుకెళ్లవలసిందే.

ఒక పక్క దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందనీ చెబుతున్న ప్రభుత్వాలు ఈ ఏజన్సీ ప్రాంతం వెనకబాటు గురించి ఆలోచించదు. కేవలం నగరాలు, పట్నాలు మాత్రం అభివృద్ధి చెందితే సరిపోదు. ప్రతీ పల్లె, ప్రతీ గిరిజన తండా అభివృద్ధి చెందాలి. పట్నంలోని ప్రతీ పౌరుడూ పొందుతున్న అన్ని సేవలూ వాళ్లకి అంది తీరాలి. అప్పుడే అభివృద్ధి చెందినట్లు. మీరు..మిమ్మల్ని చంపుతున్న నక్సలైట్లను కాకుండా అమాయకులైన గిరిజనులను హింసిస్తున్నారు. దానివల్ల ఈ గిరిజన గ్రామాల్లో యువకులు భయపడి ఎక్కడికో వెళ్లిపోతున్నారు. కొందరు నక్సలైట్లలో కలిసిపోతున్నారు.

ఒక విధంగా మీ వల్లే.. వాళ్లు అలా తయారవు తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ల వైపు నెట్టబడు తున్నారు” అన్నాను ఆవేశంగా.

నా మాటలు ఆ ఇనస్పెక్టర్ విÖద బాగా ప్రభావం చూపినట్లున్నాయి.

అతను లేచి నిలబడి “సారీ మిస్టర్ శ్రీధర్! ప్రభుత్వం, పోలీసులు, అభివృద్ధి, పేదరికం, హింస ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ లింక్. అభివృద్ధి జరిగితే పేదరికం పోతుందన్నది ప్రభుత్వాల భావన. కానీ అభివృద్ధి వల్ల బాగుపడేది ధనికవర్గాలే అన్నది నక్సలైట్ల వాదన.

దేశంలో 80 శాతం సంపద కేవలం ఒక్క శాతం ఉన్న దóŠనవంతుల దగ్గర ఉంది. ధనవంతులున్న చోట దోపిడీ జరుగుతుంది.దానివల్ల పేదలు నష్టపోతారు. అప్పుడు నక్సల్స్ రూపంలో ఉద్యమాలు పుట్టుకొచ్చి హింస చెలరేగుతుంది.

ఇదంతా ఒక వలయం. మేము ఇందులో చిక్కుకున్నాము. బయటపడటం కష్టం. బయట పడాలంటే ఒకటే మార్గం. ఉద్యోగాన్ని వదిలేసి నక్స లైటుగా మారటం. అప్పుడు కూడా మళ్లీ పోరాటం చెయ్యవలసిందే. నక్సలైట్లు,పోలీసుల యుద్ధం ‘కేట్ రేట్ రేస’ లాంటిది. ఈ పిల్లీఎలకల పోరాటంలో నలిగిపోయేది పేద గిరిజనులే. దయచేసి ఇక్కడ నుండి త్వరగా బదిలీ చేయించుకొని వెళ్లి పోండి. లేకపోతే విÖరు కూడా ఈ ఊబిలో కూరుకుపోతారు” చెప్పాడు ఎస్సై రవీంద్ర.

“రాతి గుహలు పాలరాతి భవనాలైనా

అడవి బతుకు మారిందా ఎన్ని యుగాలైనా?

అడవిలో సింహాన్ని బోనులో పెడితే

అది మృగరాజు అవుతుందా ?

పేదలపై ధనికుల దమనకాండ

శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్య కాండ” అనీ నేనెప్పుడో రాసుకున్న గీతం గుర్తు కొచ్చింది నాకు రవీంద్ర మాటలు విన్న తరువాత.

రవీంద్ర మాట్లాడి కెంగువ వచ్చేసాను.

ఆ రాత్రి 9 గంటలప్పుడు కూతురు వనజని ఎత్తుకొని నా దగ్గరికి వచ్చింది ధరణి. అంత రాత్ర ప్పుడు వచ్చిన ఆమెని చూసి నేను ఆశ్చర్యపోయాను.

“మాట్టారు గారూ! పోలీసులు నన్ను చాలా ఇబ్బంది పెడుతునారు. మా మావ గురించి చెప్పమనీ వేధిస్తున్నారు. నాకు తెలీదని సెప్పినా ఆళ్లు వినటం లేదు.చెప్పకపోతే నన్ను, నా పిల్లనూ చంపేస్తామనీ బెదిరి స్తున్నారు.ఏటి చెయ్యాలో అర్థం కావటం లేదు”అంది ఏడుస్తూ.

“ధరణీ! మీ మావ సోమన్న ఎందుకు తప్పించు కొనీ తిరుగుతున్నాడు? తను తప్పు చెయ్యనప్పుడు తప్పించుకు తిరగవలసిన అవసరం ఏముంది? అతను భయపడి పారిపోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి” అన్నాను.

“బాబూ! ఆడెక్కడున్నాడో నాకు తెలియదు. మొన్న రాత్రి నన్ను సూడ్డానికి వొచ్చి ఎల్లిపోయాడు. ఆడు ఏ తప్పు చెయ్యనేదు. పోలీసులు అనవసరంగా ఆడిని అనుమానిస్తున్నారు. ఆడే అన్నలకు పోలీసోళ్ల గురించి చెప్పాడనీ ఆళ్ల అనుమానం. ఒకవేళ మా మావ దొరికితే ఆళ్లు సంపేత్తారు. అందుకే భయపడి పారిపోయాడు” అంది కళ్లు తుడుచుకుంటూ.

“మరిప్పుడేం చేస్తావు? పోలీసులు ఈ రోజు నన్ను పిలిచి సోమన్న గురించి అడిగేరు. నాకు తెలియదని చెప్పినా వాళ్లు నమ్మడం లేదు. నువ్వు మాత్రం కొన్నాళ్ల పాటు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడతావు” అన్నాను.

“బాబూ! ఈ చిన్నపిల్లతో ఎక్కడికి వెళ్లిపోగలను సెప్పండి? నాకా ఎవరూ నేరు. మా అత్త మామల్ది ఈ ఊరే. మేమిద్దరం ఇష్టపడి మనువాడుకున్నాము. కష్టపడి బతకుతున్నాము. మా మానాన మేము బతుకుతుంటే ఆ దేవుడు ఈ కట్టాలు మాకిచ్చాడు. నేను పిల్లతో బయటకు వెళితే దానికి పెమాదం. అలా అనీ ఇక్కడే ఉండిపోతే నన్ను బతకనివ్వరు ఆ పోలీసోళ్లు. ఆణ్ణి వాళ్లు తకినిచ్చేలా లేరు. ఇప్పుడు నేనేటి సెయ్యాలి“ అంది ఏడుస్తూ.

 “ఊరుకో ధరణీ! పోలీసులకూ, నక్సలైట్లకూ మధ్య విÖరు నలిగిపోతునారు. సమిధలుగా మారిపోతునారు. ఇంతకన్నా నీకేం చెప్పాలో తెలియటం లేదు. పోలీసులు కేవలం ఉద్యోగస్తులు. వాళ్ల డ్యూటీ వాళ్లు చెయ్యక తప్పదు. తుపాకీ చేత పట్టుకుంటే ప్రభుత్వాలు ఊరుకోవు.ఏదైనా చట్ట ప్రకారం మాత్రమే పోరాడాలి. మీరు ఆ నక్సలైట్లకు ఆశ్రయం ఇస్తున్నారనీ పోలీసుల అనుమానం. అది నిజం కాదని మనం చెప్పినా వాళ్లు నమ్మరు. ఈ పోరాటం ఇప్పట్లో ఆగేలా లేదు. దీనివల్ల ఎంతమందో పోలీసులు, మరెంతమందో నక్సలైట్లు, వాళ్ల మధ్య సమిధóల్లా గిరిజనులూ చనిపోయారు. చనిపోతున్నారుకూడా. ఈ కొండల్లో ఈ అగ్గి ఇప్పట్లో ఆరేటట్టు లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. పోలీసులకు దొరికితే ప్రమాదం.అర్ధరాత్రి అయింది. వెళ్లిపో” అన్నాను ధరణితో.

 ఆమర్నాడు సాయంత్రం నేను స్కూల్లో ఉన్నప్పుడు ధరణి అక్క గౌరి వచ్చింది.

గన్నవరపు నర్సింహ మూర్తి

(సశేషం)

About Author

By editor