‘మేస్టారు గారూ! మా చెల్లి ధరణి చంటిపిల్లను నా దగ్గర వదిలేసి వెళ్లి యింది. తెల్లవారి పోలీసులు ఇక్కడికి వచ్చారని మా తమ్ముడి ద్వారా తెలిసి వెళ్లిపోయింది’’ చెప్పింది గౌరి.
ఆమె మాటలు నాకాశ్చర్యం కలిగించాయి.
‘‘ఎక్కడికి వెళ్లింది? అసలే పోలీసులు గాలిస్తున్నారు. వాళ్లకి దొరికితే ప్రమాదం. అయినా నువ్వెందుకు ఆమెను వెళ్లనిచ్చావు? అడిగాను.
‘‘అది ఆలోచించే స్థితిలో లేదు బాబూ! అందుకే వెళ్లిపోయింది. సోమన్న దగ్గరకు వెళుతానంది. ఈ పోలీసుల గొడవ తగ్గిన తరువాత వస్తానంది. అంతవరకూ నేను పిల్లను చూడక తప్పదు. మరో మార్గం కూడా లేదు.దానికేటి అవుతుందోనని బెంగగా ఉంది బాబూ!’’ అంది గౌరి ఏడుస్తూ.
‘‘ఈ మన్యంలో ఏ జరుగుతున్నదో నాకూ అర్థం కావటం లేదు గౌరీ! అందరూ బిక్కు బిక్కుమని బతుకుతున్నారు. అరాచకం రాజ్యం ఏలుతోంది. నక్సలైట్లు తుపాకులు పట్టుకొని కొండల వి•ద కూర్చుంటే… ఇక్కడ గిరిజనులు సుఖంగా ఉంటారా? వాళ్లు ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పోరాడాలి. మధ్యలో వి•రంతా నలిగిపోతున్నారు. అయినా వి• ఆక్రందనలు వినేదెవ్వరు?
బధిర శంఖారావం! దశాబ్దాల నుంచి మన్యం ప్రాంతాలన్నీ ఇలానే బాధలతో రగిలిపోతున్నాయి. నక్సలైట్ల వైఖరిలో మార్పులేదు. ప్రభుత్వాల దమనకాండ ఆగటం లేదు.
ధరణి పిల్లని నీ దగ్గర వదిలేసినట్లు ఎవ్వరికీ తెలియనీయకు. ఈ విషయం పోలీసులకు తెలిస్తే నిన్ను హింసిస్తారు’’ అన్నాను.
‘‘చెప్పను బాబూ! ఆ పిల్లను దాని తల్లి దగ్గరికి చేర్చే బాధ్యత నాపై ఉంది. తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు. అసలు వాడు వస్తాడో, రాడో తెలియదు. కనీసం తల్లి ఉన్నా పరవాలేదనుకున్నాను. ఇప్పుడు అది కూడా వెళ్లిపోయింది. ఆ పిల్లను ఆ దేవుడే కాపాడాలి. నా పిల్లల్నే నేను పోషించుకోలేక పోతున్నాను. వాళ్లకి తోడు ఇప్పుడు ఇది. మా కష్టాలకు అంతులేకుండా ఉంది సార్‌’’ అని అంది గౌరి కన్నీళ్లు తుడుచుకుంటూ.
‘‘గౌరీ! నీ చెల్లెలు కుటుంబం కష్టాల్లో ఉంది. వాళ్లని నువ్వే ఆదుకోవాలి. కొన్నాళ్లు ఓపిక పట్టు. మళ్లీ మంచి రోజులు వస్తాయి. అంత వరకు నువ్వే ఆ కుటుంబానికి అండగా ఉండాలి’’ అని ఓదార్చారు.
ఆ మర్నాడు సాయంత్రం నా దగ్గరకు ఒక న్యూస్‌ ‌ఛానల్‌ ‌విలేకరి వచ్చాడు. అతన్ని నేనెప్పుడూ చూడలేదు. ముప్పై ఏళ్లుంటాయి అతనికి.
అతను వస్తూనే ‘‘సార్‌! ‌నేను ‘నిజం’ ఛానల్‌ ‌విలేఖరిని. నా పేరు రమేష్‌. ‌పోలీసులకు, గిరిజను లకు జరిగిన గొడవకు సంబధించిన వివరాలను, వార్తల్ని కవర్‌ ‌చేశాను. మరిన్ని వివరాలు సేకరించేం దుకు వచ్చాను. దాని గురించి మీతో మాట్లాడాలను కుంటున్నాను’’ అన్నాడతను.
‘‘పదండి. స్కూల్‌కు కెళదాం’’ అంటూ అతన్ని లోపలికి తీసికెళ్లాను.
అతను కొండెక్కి రావడం వల్ల బాగా అలసి పోయినట్లు కనిపిస్తున్నాడు. అతనికి మంచినీళ్ల సీసా ఇచ్చాను. అతను అందులోని నీళ్లన్నీ గడగడ తాగే సాడు.ఆ తరువాత చెప్పడం మొదలు పెట్టాడు.
‘‘సార్‌! ‌మొన్న ఈ ఊరికి చెందిన ధరణి అనే అమ్మాయి సహా చాలామంది యువతీ యువకులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి మీకు తెలుసు. ఆమె తన భర్త ఎక్కడున్నాడో తనకి తెలియదని చెప్పినా వినకుండా వాళ్లు ఆమెను హింసించడం, దాంతో ఈ చుట్టుపక్కల యువకులు పోలీసు స్టేషన్‌పై దాడి చేయడం మీకు తెలుసు. పోలీసులు ధరణిని చాలా ఘోరంగా హింసించారు. ఆమెను కొట్టరాని చోట్ల కొట్టారు.పెట్టరాని హింసలు పెట్టారు. వాటిని నేను ఓ చెట్టుచాటు నుంచి నా కెమెరాలో చిత్రీకరించాను. ఆ వీడియో నా దగ్గర ఉంది. అది చూస్తే పోలీసులు ఎంతటి ఘోరమైన పని చేసారో అర్థం అవుతుంది’’ చెప్పాడు రమేష్‌.
‘‘చాలా ఆశ్చర్యంగా ఉంది రమేష్‌ ‌గారూ..మీ చెప్పింది వింటుంటే. అయినా మీరు పోలీస్‌ ‌స్టేషన్‌ ‌దగ్గరికి ఎలా వెళ్లగలిగారు? మీరు చాలా ప్రమాదకర మైన పని చేసారు. మీరు పోలీసుల కంటబడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో కదా? అయినా ఇందుకు మిమ్మల్ని అభినందించక తప్పదు’’ అన్నాను.
‘‘మాస్టారూ! మా జర్నలిస్టు వృత్తిలో ఇవి మామూలే. భయపడితే నిజం బయటకు రాదు. సమాజంలోని అవినీతిని, దౌర్జన్యాలను వెలికి తీయాలంటే ధైర్యం చెయ్యక తప్పదు. ఇప్పుడు రాజకీయ నాయకులు, అధికారులు ఒకటె• పోయారు. న్యాయవ్యవస్థ తనకు తానుగా జోక్యం చేసుకోలేదు. కాబట్టి నాలుగవ స్తంభం అయిన పత్రికలే ఈ పని చెయ్యాలి’’ అన్నాడు రమేష్‌.
‘‘ఈ ‌వృత్తిలో చేరిన రోజే ప్రాణం వి•ద ఆశ వదులుకున్నాను. ప్రాణం వీ•ద ఆశలేనప్పుడు ఎక్కడికైనా వెళ్లవచ్చు.అందుకే పోలీసుల దాష్ట్టీకాలు, దౌర్జన్యాలనూ చిత్రించగలిగాను. కానీ వీటిని మా పత్రికా ఆఫీసుకు చేరవేయడం ఓ పెద్ద పని. ఇక్కడ నెట్‌ ‌సౌకర్యం ఉంటే ఆ పని చెయ్యగలిగేవాడిని. నేను వీడియో, ఫోటోలు తీసినట్లు పోలీసులకు తెలిసిపోయింది.వాళ్లు మా పత్రిక ఎడిటర్‌కి ఫోన్‌ ‌చేసి తమకు వ్యతిరేకంగా ఏమీ ప్రచురించవద్దని చె•ప్పారు’’
‘‘మరిప్పుడేం చేస్తారు? ఇంత కష్టపడీ వాటిని చిత్రించిన తరువాత వి• యాజమాన్యం ప్రచురించక పోతే ఉపయోగం ఏమిటి? ప్రపంచానికి ఇవి ఎలా తెలుస్తాయి? పైగా పోలీసులకు తెలుసు అంటున్నారు కాబట్టి వి• ప్రాణాలకు కూడా ప్రమాదం’’అన్నాను.
‘‘ఎప్పుడైతే రాజకీయ నాయకులు పత్రికాధి పతులయ్యారో అప్పుడే జర్నలిజం పూర్తిగా భ్రష్టుపట్టి పోయింది. చాలావరకు ప్రతి పత్రిక, ఛానల్‌ ‌రాజకీయ పార్టీల కొమ్ము కాస్తున్నాయి. ఒకప్పటి నైతిక విలువలు ఇప్పుడు పత్రికా రంగంలో లేవు.అందుకే నేను వెలికితీసిన ఈ నిజం వెలుగు చూస్తుందో లేదో తెలియదు. అందుకే ఈ దగ్గరికి వచ్చాను’’ అంటూ రమేష్‌ ‌నాకు ఒక పెన్‌ ‌డ్రైవ్‌ ఇచ్చాడు.
‘‘సార్‌! ఇం‌దులో నేను తీసిన ఫోటోలు, వీడియో ఉన్నాయి. నేను గానీ పోలీసులకు దొరికిపోతే నన్ను బత•కనివ్వరు. ఎన్‌కౌంటర్‌ ‌చేసేస్తారు. అందుకే ఈ పెన్‌‌డ్రైవ్‌ ‌వి•కిస్తున్నాను. దయచేసి దీన్ని మీరు కలెక్టర్‌ ‌గారికి గానీ ,ఎస్పీ గారికి చేరే ఏర్పాటు చేయండి. పత్రికలకిస్తే వాళ్లు వేయరు.
ప్రస్తుతం నేను పద్మవ్యూహం లాంటి ఈ ఏజన్సీలో చిక్కుకుపోయాను. ఇక్కడ నుంచీ బయట పడటం కష్టం. నిజం ఆలస్యంగా మేలుకొంటుంది. అప్పటికే అబద్ధం లోకం చుట్టేసి, గమ్యం చేరు కుంటుంది’’ అన్నాడు రమేష్‌.
‘‘మీ ఉద్దేశ్యంలో ఎవరిది తప్పంటారు? పోలీసులదా?నక్సలైట్లదా? గిరిజనులకు వీళ్లు మేలు చేస్తున్నట్లా?లేక అన్యాయం చేస్తున్నారా?’’ అడిగాను.
‘‘ఇద్దరిదీ తప్పే సార్‌! ‘కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం ’ అన్నట్లు ఇద్దరి తీరూ ఒకటే. రెండు పక్షాల నరమేధం మధ్యలో గిరిజనులు నలిగిపోతునారు. తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నామని పోలీసులు,పేద గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నామని నక్సలైట్లు ఎవరికి వారు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. వాళ్లిద్దరూ గిరిజనుల కోసమే పాటుపడుతున్నామని చెబుతున్నా, అది వాస్తవరూపం ధరించటం లేదు. నక్సలైట్లను పట్టుకోవడానికి పోలీసులు గిరిజనులను పావులుగా వాడుకుంటు న్నారు. అలాగే నక్సల్స్… ‌పోలీసుల నుంచి తప్పించుకోవడానికి గిరిజనులను అడ్డుపెట్టు కుంటున్నారు. ఈ తీరుతో మన్య ప్రాంతం ఏ విధమైన అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకో వందేళ్లైనా ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు ఎవ్వరూ ఈ ప్రాంతానికి రావటానికి భయపడుతున్నారు.వచ్చినా మనస్ఫూర్తిగా పనిచేయ లేకపోతున్నారు.
ఈ చుట్టుపక్కల ఉన్న పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కదానిలో కూడా డాక్టరు లేడు. నర్సులతోనే వైద్యం జరుగుతోంది. ప్రాణాపాయం సంభవిస్తే డోలీ కట్టి కిందకు తీసుకు వెళ్లాలి.దీనికి కారణం ఎవరు? గిరిజనులను ఎవరు ఉద్ధరిస్తారు? వీళ్ల ఆక్రందనలను ఎవరు వింటారు చెప్పండి?
దేశంలో ప్రజాస్వామ్యం ధనవంతుల చేతిలో కీలుబొమ్మ.రాజకీయ నాయకులు, అధికారులు చేతులు కలిపి దేశాన్ని దోచుకుతింటున్నారు.వీళ్లని అడిగే వాళ్లెవరు లేరు. మొన్నటి దాకా పత్రికలకు భయపడేవారు కానీ ఇప్పడవి కూడా ధనవంతులు, పెట్టుబడీదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.ఇక ప్రజలను ఆదేవుడే రక్షించాలి‘‘ అన్నాడు రమేష్‌.
‘‘ఒకే రమేష్‌! ‌పోలీసుల కంటబడకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ పెన్‌‌డ్రైవ్‌ని కలెక్టర్‌, ‌పోలీసు అధికారులకు చేరవేసి ఈ దౌర్జన్యాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తాను’’ అని హామీ ఇచ్చాను.
రమేష్‌ ‌వెళ్లిపోయాడు. ఆ తరువాత అతని ఆచూకీ తెలియలేదు. ఏమయ్యాడో తెలియదు. అతను సమాజం గురించి ఎంతో ఆలోచించి జీవితాన్ని కూడా పణం పెట్టి ఆ వీడియో, ఫొటోలు తీశాడు.
కానీ అధికార పదఘట్టనల కింద నలిగి పోయాడేమో. అతను బయట ఉంటే సమాజానికి నగ్నసత్యాలు తెలుస్తాయని అధికారుల••, రాజకీయ నాయకుల భయమే అతన్ని మాయం చేసిందేమో! ఈ దేశంలో అవినీతి, అశ్రిత పక్షపాతం, స్వార్థ పరత్వం ఎందరో నిరపరాధ యువకుల ప్రాణాలను బలితీసు కుంటున్నాయి.
‘ఈ దేశం మాకేమిచ్చిందని కాదు,దీనికి మనమేమిస్తున్నాం’ అని యువత ఆలోచించాలని కుహనా మేధావి వర్గం చెబుతూ ఉంటుంది. మరి రమేష్‌ ‌లాంటి యువకులకు ఈ దేశం ఏమిచ్చింది? నిజాన్ని ఎంత దాచినా అది అంకురంలా బయటకు వస్తుందని విప్లవకారులు, రచయితలు చెబుతూంటారు. కానీ రమేష్‌ ‌లాంటి అంకురాలను చిదిమేసే ప్రయత్నాలతో నిజాన్ని సమాధి చేస్తున్న అరాచక శక్తులను ఎవరు అడ్డుకోగలరు?
దేశంలో ఇంకా 46 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉండటానికి ఎవరు కారకులు?దేశపు సంపదలో 90 శాతం కేవలం 200 మంది కార్పోరేట్‌ ‌దిగ్గజాల దగ్గర ఉండటానికి కారణం ఎవరు? ప్రభుత్వ పరిశ్రమలు ఎందుకు నష్టాల పాలవుతూ, ప్రైవేట్‌ ‌పరిశ్రమలు లక్షల కోట్ల లాభాలను ఎలా ఆ ర్జిస్తున్నాయి?
దేశంలోని ప్రముఖ విద్యాకేంద్రాలైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎమ్‌ ‌లాంటి వాటిలో చదువుకున్నవారు, అమెరికా వంటి ధనిక దేశాలకు సేవ చేయడానికి వలస పోతుంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వారు చదివింది ఈ దేశ ప్రజల డబ్బుతో…కానీ వాళ్లు ఇతర దేశాల సేవలో పడి మాతృదేశానికి ద్రోహం చేస్తునారు? ఇదా మన అభివృద్ధి అంటే?
ఆలోచనలతో నామస్తిష్కం వేడెక్కిపోసాగింది. పెళ్లి కోసం బడికి నెల రోజులు సెలవు పెట్టి ఆ రాత్రి ఇంటికి బయలుదేరాను. బయలు దేరుతుండగా, మరోసారి గౌరి వచ్చి తన చెల్లెలు ధరణి గురించి చెప్పి ఏడ్చింది.
‘‘మాస్టారు గారూ! నా చెల్లెలు వెళ్లిపోయి వారం పైగా అయింది. దాని పిల్లను ఎలా పెంచాలో అర్థం కావటం లేదు. నా పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది’’ ఏడుస్తూ చెప్పింది.
‘‘గౌరీ! మీ చెల్లెలు పోలీసుల దౌర్జన్యాలను తట్టుకోలేక వెళ్లిపోయింది తప్ప కావాలనీ కాదు. కొన్నాళ్లు ఎదురు చూడటం మినహా ఏం చెయ్యగలం చెప్పు? పరిస్థితులు అనుకూలిస్తే తను, భర్త సోమన్న తిరిగి వస్తారు. అంతవరకు నువ్వే ఆ పిల్లని కంటికి రెప్పలా చూడాలి. నేను నా పెళ్లి నిమిత్తం మా ఊరు వెళుతున్నాను. అయినా.. నా కెందుకో ఇక్కడ పని చేయాలనిపించడంలేదు. బహుశా ఇక్కడి నుంచి బదిలీ కోసం ప్రయత్నిస్తాను. అది జరగకపోతే మళ్లీ వస్తాను. ఏమైనా ధైర్యంగా ఉండు. అని చెప్పి మా ఊరు బయలుదేరాను.
ఇంటికి చేరే ముందు… నేను జిల్లా కేంద్రంలో కలెక్టర్‌, ఎస్పీ గార్లను కలసి విలేకరి రమేష్‌ ఇచ్చిన పెన్‌‌డ్రైవ్‌లను అందచేశాను. ఏజన్సీవాసుల సమస్యలను వారికి వివరించాను.
గిరిజన యువకులను హింసించిన పోలీసులపై చర్య తీసుకుంటామని వాళ్లిద్దరూ నాకు హావి• ఇచ్చారు.
* **
ఊరు చేరిన పది రోజుల తరువాత కౌసల్యతో నా వివాహం జరిగింది. ఈలోగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారా డి.ఈ.ఒ.ని కలసి బదిలీ చెయవలసిందిగా కోరాను.అదృష్టవశాత్తు మా ఊరికి దగ్గరలోని మిరపవలస జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు నన్ను బదిలీ చేశారు.
అప్పటి వరకు ఏజన్సీ ప్రాంతంలో సమస్యలు ఎదుర్కొన్న నాకు ఈ స్కూలులో ఉద్యోగం సంతృప్తి నిచ్చింది. ఇది చెప్పాలంటే పెద్ద జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల. ఇరవై మంది ఉపాధ్యాయులు ఉన్నారు. స్కూల్లో 200 మంది పిల్లలు చదివేవారు. నేను ఆరు, ఏడు తరగతులకు పాఠాలను బోధించేవాడిని.
మా ఊరికి మిరపవలస పదిహేను కిలోవి•టర్ల దూరం. బైక్‌ ‌మీద రోజూ 9 గంటలకు స్కూలుకెళ్లి సాయంత్రం వచ్చేవాడిని. సంవత్సరం పాటు మా కాపురం హాయిగా సాగింది. కౌసల్య చాలా మంచిది. మా తల్లిదండ్రులను, కుటుంబాన్ని బాగా చూసుకునేది.
సంవత్సరం తరువాత కౌసల్యకు పిల్లల వి•ద దృష్టి మళ్లింది.ఆమెకు తల్లి కావాలనే కోరిక బాగా ఉండేది. కానీ ఆమె కోరిక ఫలించటం లేదు. ఒకసారి ఇద్దరం పక్క పట్నం వెళ్లి డాక్టరుకి చూపించు కున్నాము. మా ఇద్దర్నీ పరీక్షించి న డాక్టరు, నా భార్యకు ఫెలోపియన్‌ ‌ట్యూబ్స్ ‌మూసుకుపోయి ఉన్నాయని, అది పుట్టుక నుంచి ఉన్న సమస్య అనీ, దానివల్ల ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదనీ చెప్పాడు.
ఆ మాటలు కౌసల్యను బాగా నిరాశ పరిచాయి. అయినా, రెండవ అభిప్రాయం కోసం తనను విశాఖపట్నంలో ఒక గైనకాలజీ స్పెషలిస్టుకు చూపించాను. ఆమె కూడా అన్ని పరీక్షలు చేసి, మొదటి డాక్టర్‌ ‌చెప్పనదానినే ధ్రువీకరించారు.
‘‘ఆపరేషన్‌ ‌చేస్తే ఏమైనా ఫలితం ఉంటుందా’ అని డాక్టర్‌ను అడిగాను. అది సాధ్యం కాదని డాక్టర్‌ ‌చెప్పడంతో నిరాశతో వెనుతిరిగాము.
అప్పట్నుంచీ కౌసల్య డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.తాను తల్లిని కాలేనన్న చేదు నిజాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది.అప్పటి వరకూ ఎంతో చలాకీగా, సరదాగా, ఆరోగ్యంగా ఉండే కౌసల్య, ఈ సమాచారం తెలిసినప్పటి నుంచి మూగనోము పట్టింది. ఆమెలో ఉత్సాహం తగ్గిపోయింది.
రాను రాను ఆమె ఆరోగ్యంలో మార్పులు మొదలయ్యాయి. సరిగ్గా భోజనం చెయ్యకపోవడం వల్ల నీరసంతో బరువు బాగా తగ్గింది. తెల్లగా నిగనిగలాడుతూ ఉండే తన ముఖంలో కళ తప్పింది.
(సశేషం)

– ‌గన్నవరపు నరసింహ మూరి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.