‘‌భారత్‌ ‌సమ్మిట్‌-2026‘  ‌పేరుతో హైదరాబాద్‌లో ఈనెల 13, 14 తేదీల్లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు రసాభాసాగా ముగిసింది. అంతర్జాతీయ స్థాయి సదస్సు అంటే. ఆ సదస్సు జరిగిన నగరానికి,  రాష్ట్రానికి, దేశానికి గల పేరు ప్రతిష్ఠలు   ప్రపంచ వ్యాప్తంగా  మరింత ఇనుమడించేలా సాగాలి. ప్రపంచ పటంలో కొత్త గుర్తింపు తెచ్చే అవకాశంగా కొనసాగాలి. అంతర్జాతీయ పెట్టుబడులు, ప్రపంచస్థాయి ఒప్పందాలు, భాగస్వామ్యాలు దానికి కొలమానాలుగా నిలవాలి. కానీ, బయటకు కనిపించే ఎజెండా ఒకటి, రహస్య ఎజెండా మరొకటిగా ఈ సమ్మిట్‌ ‌జరిగిందన్న వాదనలు, విమర్శలు దేశవ్యాప్తంగా చుట్టుముట్టాయి. అంతేకాదు.. సభల్లో వక్తల  వ్యాఖ్యలు దేశ సమగ్రతను,   కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా సాగాయన్నది బహిరంగంగా బయటపడింది.
‌ప్రపంచ వ్యాప్తంగా ప్రగతిశీల రాజకీయశక్తుల మధ్య అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడం, తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను అంతర్జాతీయ ప్రతినిధులకు పరిచయం చేయడం లక్ష్యంగా భారత్‌ ‌సదస్సును నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సదస్సుకు  70కి పైగా దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరవు తారని నిర్వాహకులు ప్రచారం చేశారు. అయితే  సదస్సులోని   ప్యానల్‌ ‌చర్చలు ఆద్యంతం రాజకీయ ప్రసంగాలతో నిండిపోయాయని విమర్శకులు అంటున్నారు.

సాధారణంగా పెట్టుబడుల సదస్సుల్లో పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులు పాల్గొం టారు. అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదురుతాయి, కొత్త పరిశ్రమలకు మార్గం సుగమం అవుతుంది. భారత్‌ ‌సమ్మిట్‌లో ఐటీ, పారిశ్రామికా భివృద్ధి, ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పులు, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చలు జరిగాయని నిర్వాహకులు ప్రకటించారు. కానీ, వాటిని పెట్టుబడులుగా మలిచే కార్యాచరణ ఏమిటో, ఎన్ని ఒప్పందాలు కుదిరాయో మాత్రం ప్రభుత్వం గానీ నిర్వాహక సంస్థలు గానీ వెల్లడించలేదు. ఈ పరిస్థితులే భారత్‌ ‌సమ్మిట్‌ ‌ఫలితంపై సందేహాలకు కారణమయ్యింది.

మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఈ సదస్సును డిసెంబర్‌ 7, 8, 9 ‌తేదీల్లో జరగనున్న ‘ఇన్వెస్ట్ ‌తెలంగాణ గ్లోబల్‌ ‌సమ్మిట్‌’‌కు సన్నాహక వేదికగా అభివర్ణించారు. ‘చూస్తేనే నమ్ముతారు’ అనే సిద్ధాంతంతో ప్రపంచ ప్రతినిధులను హైదరాబాద్‌కు ఆహ్వానించి మౌలిక సదుపాయాలను చూపించడమే లక్ష్యమని చెప్పారు. కానీ, పెట్టుబడుల కోసమే అయితే ప్రత్యేకంగా కాంగ్రెస్‌ ‌పార్టీ రాజకీయ అజెండాతో ఈ సదస్సును  నిర్వహించాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు లేరు.

వేదికపై విదేశీయుల కన్నా కాంగ్రెస్‌ ‌నేతలే ఎక్కువ

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం, జాతీయ స్థాయిలో ఆ పార్టీ చేసిన ప్రచారానికి, సదస్సు  జరిగిన  తీరుకు  మధ్య అంతరం సదస్సు హాజరులో స్పష్టంగా కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అభివర్ణించారు. ఒక సందర్భంలో వేదికపై గ్రూప్‌ ‌ఫొటో సమయంలో 25 మందికి గాను 13 మంది కాంగ్రెస్‌ ‌నేతలు ఉండటం,అదీ  తెలంగాణ వాళ్లే మెజార్టీ నేతలు ఉండటం విమర్శలకు మరింత తావిచ్చింది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌, ‌శాసనమండలి చైర్మన్‌, ‌ముఖ్యమంత్రితో పాటు.. రాష్ట్రానికి చెందిన ఆరుగురు మంత్రులు అందులో ఉన్నారు. ఆ  ఫొటోలో విదేశీ ప్రతినిధులు 12 మంది మాత్రమే కనిపిస్తున్నారు. వారు కూడా   ఏవో చిన్న దేశాలకు చెందినవారే కావడం అంతర్జాతీయ  సదస్సు  ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. రెండు రోజుల పాటు జరిగిన ప్రతి ప్యానెల్‌ ‌చర్చలోనూ రాష్ట్ర,  జాతీయ  స్థాయి కాంగ్రెస్‌ ‌నేతలే కనిపించడం విమర్శలకు   బలం చేకూర్చింది,

ఇక, ఈ సదస్సు  హాజరయ్యే మొత్తం వెయ్యి మంది ప్రతినిధుల్లో 315 మంది దాకా విదేశీ ప్రతినిధులే ఉంటారని నిర్వాహకులు ముందుగా ప్రకటించారు. కానీ, వారి  సంఖ్య  కేవలం 115 మందికే పరిమితమైందని  చెబుతున్నారు. సదస్సు నిర్వాహకులు, తెలంగాణ ప్రభుత్వం గాని  ఈ హజరీ వివరాలు మాత్రం ప్రకటించలేదు.

ఫిలిబెక్‌ ‌ప్రసంగం, ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓకు ఫిర్యాదు

 సదస్సు  ముగిసిన తర్వాత వివాదం కొత్త మలుపు తిరిగింది. పార్టీ ఆఫ్‌ యూరోపియన్‌ ‌సోషలిస్టస్ (‌జు•) సెక్రటరీ జనరల్‌, ఇటలీ నేత గియాకోమో పి•లిబెక్‌ ‌తమ ప్రసంగంలో  ‘భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో  ఉంద’ని సభా వేదికపై వ్యాఖ్యానించారు.ఢిల్లీ రాంలీలా మైదానంలో కాంగ్రెస్‌ ‌ర్యాలీని ప్రస్తావిస్తూ ‘ఓట్‌ ‌చోర్‌, ‌గద్దీ ఛోడ్‌’ ‌నినాదాన్ని ఇంగ్లీషులోకి అనువదించి మరీ పలికారు. ఆ సమయంలో వేదికపై రాహుల్‌ ‌చప్పట్లు కొట్టడం జాతీయ స్థాయిలో చర్చను లేవనెత్తింది.

కాగా, భారత్‌ ‌సమ్మిట్‌కు హాజరై భా•రతదేశంపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జియాకోమోకు సొంత దేశం నుంచే ప్రతిఘటన ఎదురైంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పార్టీ నేత డెబోరా బెర్గమినీ.. ఫిలిబెక్‌ ‌వ్యాఖ్యలను తప్పుపట్టారు.  భారత్‌కు తన సొంత ప్రజాస్వామ్య సంస్థలు, ఎన్నికల వివాదాలను పరిష్కరించే న్యాయవ్యవస్థ ఉన్నాయని, ప్రజాస్వామ్యం గురించి యూరోపియన్లు భారత్‌పై ఉపన్యాసాలు ఇవ్వకూడదని బెర్గమినీ నొక్కి చెప్పారు.భారత్‌లో ప్రజాస్వామ్యం వ్యవహారం ఆ దేశ అంతర్గత అంశమని, అక్కడ ప్రజాస్వామ్మం దాడికి గురవుతోందనే వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు.. ఈ పరిణామంపై భారతీయ జనతా పార్టీ కన్నెర్ర జేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం ఈనెల 16వ తేదీన శంషాబాద్‌లోని ఫారినర్స్ ‌రీజినల్‌ ‌రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) ‌కార్యాలయంలో  ఫిర్యాదు చేసింది. ఫిలిబెక్‌ ఏ ‌వీసాపై వచ్చారు? ఆయన వీసా నిబంధనలను ఉల్లంఘిం చారా? అనే  దానిపై విచారణ జరపాలని కోరింది. ఇమ్మిగ్రేషన్‌ అం‌డ్‌ ‌ఫారినర్స్ ‌చట్టం-2025లోని సెక్షన్లు 23, 24, 29 ప్రకారం చర్యలు తీసుకోవా లని, ఉల్లంఘనలు నిర్ధారణైతే బహిష్కరణనూ పరిశీలించాలని డిమాండ్‌ ‌చేసింది. సమ్మిట్‌కు కేంద్ర హోం, విదేశాంగ శాఖల అనుమతులు తీసుకున్నారో లేదో, ఆహ్వాన పత్రాలు, వీసా దరఖాస్తులు, డిక్లరేషన్లు పరిశీలించాలని కూడా కోరింది.  తెలంగాణ డీజీపీకి కూడా ఆ బృందం ఫిర్యాదు చేసింది.

‘ఇది యాంటీ భారత్‌ ‌సమ్మిట్‌’: ‌బీజేపీ

 ఇది ‘భారత్‌ ‌సమ్మిట్‌‘ ‌కాదని, ‘యాంటీ భారత్‌ ‌సమ్మిట్‌’ అని భారతీయ జనతా పార్టీ నేతలు ఆరోపించారు.  కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి దీన్ని భారత వ్యతిరేక సమ్మిట్‌గా అభివర్ణించారు. ఫస్ట్ ‌క్లాస్‌ ‌టికెట్లు, స్టార్‌ ‌హోటళ్లకు ప్రజాధనం వెచ్చించారని ఆరోపిస్తూ, ఈ సదస్సు వల్ల  రాష్ట్రానికి ఒరిగిందేమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ‘ఫాసిస్టుల చేతిలో భారత్‌ ఉం‌దని చెబుతూ, పెట్టుబడులు వస్తాయని చెప్పడం ఎలా?’ అని రాహుల్‌ ‌గాంధీ, రేవంత్‌ ‌రెడ్డిలను ప్రశ్నించారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఈ ‌సదస్సును ‘అట్టర్‌ ‌ఫ్లాప్‌’‌గా పేర్కొన్నారు. రాహుల్‌ ‌మధ్యలోనే వేదిక నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు. సదస్సులో కౌలు రైతుల స్టాల్‌ ‌పెట్టిన ప్రభుత్వం వారికిచ్చిన హామీలను వ•డేళ్లుగా ఎందుకు అమలు చేయలేదని, రైతు భరోసా ఎందుకివ్వలేదని నిలదీశారు. రాంచందర్‌ ‌రావు మరింత ముందుకెళ్లి జార్జ్ ‌సోరోస్‌ ‌నిధులతో నడిచే సంస్థలతో సంబంధ మున్నవారిని రప్పించారని, ఇది దేశద్రోహ చర్య అని ఆరోపించారు. ప్రధానమంత్రి మోదీపై గల అక్కసుతో దేశ ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా కాంగ్రెస్‌ ‌పార్టీ వ్యవహరించిందని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఖజానా ఖాళీ అంటూనే…

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని తరచూ ప్రకటించే ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి..ఇంత భారీ వ్యయంతో ఇలాంటి సదస్సు నిర్వహించడం సమంజసమా అని విపక్షాలతో పాటు సామాన్య ప్రజల నుంచి కూడా నిలదీతలు ఎదురవు తున్నాయి. అయినా, సమ్మిట్‌లో చర్చాంశాలపై, అతిథుల ప్రసంగాలపై వస్తున్న ఆరోపణలను కాంగ్రెస్‌ ‌పార్టీతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. భిన్నాభిప్రాయాలను గౌరవించడం, చర్చించడం రాజ్యాంగ మౌలిక సూత్రమని, ప్రగతిశీల భావజాలం ఉన్న నేతలను ఒకే వేదికపైకి తేవడం తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచుతుందని సమర్థించుకుంటున్నాయి.

మీడియాకు దూరం, సమన్వయ లోపం

అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహణ సాధారణంగా అంత సులభం కాదు. ప్రతినిధుల జాబితా ధ్రువీకరణ, వీసా సమన్వయం, ప్రోటోకాల్‌, ‌మీడియా నిర్వహణ అన్నీ కీలకం. ఈ సదస్సులో స్థానిక మీడియాకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్న వాదనలు బలంగా ఉన్నాయి. దీంతో పెద్దగా కవరేజ్‌ ‌రాలేదని, ఒక్క రోజు ముందు హడావిడిగా ప్రెస్‌మీట్‌ ‌పెట్టారన్న విమర్శలు వచ్చాయి. చివరకు ఆ పార్టీ అగ్రనేత, ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్‌ ‌గాంధీ కూడా ప్రతినిధుల హాజరు, నిర్వాహకుల సమన్వయ లోపాలపై పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 ఎంఓయూలెన్ని, ఉద్యోగాలెన్ని?

మొత్తానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి నిర్వహించిన ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు వల్ల ఎన్ని ఎంఓ•••లు కుదిరాయి? ఎంత పెట్టుబడి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం స్పష్టంగా చెప్పగలిగితే విమర్శల ధాటి తగ్గే అవకాశం ఉంది. ఖర్చుపై అధికారిక లెక్కలు బయటపెడుతూ, విదేశీ ప్రతినిధుల హజరీ వివరాలు ప్రకటిస్తే  పారదర్శ కంగా ఉంటుంది.  రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు డిసెంబర్‌లో జరిగే ఇన్వెస్ట్ ‌తెలంగాణ గ్లోబల్‌ ‌సమ్మిట్‌కు పెట్టుబడిదారుల విశ్వాసం కీలకం. అక్కడ కూడా పెట్టుబడులు, అభివృద్ధికి సంబంధించిన చర్చలకే పరిమితమై, రాజకీయ వివాదాలకు దూరంగా ఉండగలిగితేనే ఆ సదస్సుకైనా ఫలితం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్‌ ‌సమ్మిట్‌ ఒక అంతర్జాతీయ వేదికగా గుర్తింపు పొందలేదన్నది నిర్వివాదాంశం అని విశ్లేషకులే చెబుతున్నారు. ఇక, దీంతో రాష్ట్రానికి ఏం ఒరిగిందన్న ప్రశ్నకు సమాధానం వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదంటున్నారు.

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.