ఆం‌ధప్రదేశ్‌ ‌సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ భారీ ప్రాజెక్టులు మంజూరు చేస్తూ, నిధులు కేటాయిస్తోందని విశాఖపట్నంలో నవంబర్‌ 12, 13 ‌తేదీల్లో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 చాటిచెప్పింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ,ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా ‘ప్రపంచానికి నూతన క్రమ మార్గాన్వేషణ: వాణిజ్యం, సాంకేతికత, విశ్వాసం, ఆలోచనాత్మక నాయకత్వం’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సదస్సులో 60 దేశాల ప్రతినిధులు, అయిదుగురు కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో కుదిరిన 17 అవగాహన ఒప్పందాలు, జారీ చేసిన 3 ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా రాష్ట్రానికి రూ.43,871 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 4,700 మందికి ఉపాధి లభించనుంది. దుగరాజపట్నంలో రూ.30,000 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ ‌నౌకా నిర్మాణ క్లస్టర్‌ ఏర్పాటుకు సూతప్రాయ ఆమోదం లభించగా, ఏపీ మారిటైమ్‌ ‌బోర్డు, విశాఖ పోర్ట్ అథారిటీ భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రయోజన సంస్థ ఏర్పాటైంది. విశాఖ పోర్టులో రూ.600 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు రహదారులు, విమానయాన రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ ‌సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ఆంధప్రదేశ్‌కు మొత్తం రూ. 9.89 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేందుకు ఒప్పందం కుదిరింది. వీటి ద్వారా రాష్ట్రంలో సుమారు 3.48 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌మాట్లాడుతూ, ‘అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారత్‌ మూడు హామీలు రాష్ట్రంలో అక్టోబర్‌ 28, ‌నవంబర్‌ 3 ‌తేదీల్లో వరుసగా రెండు తుపాన్లు సంభవించినా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో విశాఖపట్నం సదస్సుకు సన్నద్ధమైన తీరు అమోఘం అని అన్నారు. కార్తిక మాస దీపదానంలాగే భాగస్వామ్యం అందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. కేంద్రం వాణిజ్య ఒప్పందాలతో ప్రపంచ మార్కెట్లను అందుబాటులోకి తెస్తుంటే, ఏపీ ప్రభుత్వం ఎస్క్రో ఖాతా, ‘స్పీడ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌’ ‌విధానాలతో వాటిని పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఉద్యోగాలుగా మారుస్తోందని కొనియాడారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారత్‌ ‌వ•డు హామీలు ఇస్తోందని తెలిపారు. మొదటిది ‘స్వేచ్ఛాయుత మార్కెట్‌’ ‌గత నాలుగున్నరేళ్లలో 38 దేశాలతో కుదుర్చుకున్న 9 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా 60 ట్రిలియన్‌ ‌డాలర్ల జీడీపీ మార్కెట్‌ అం‌దుబాటులోకి వచ్చిందని, ఇది 85 ట్రిలియన్‌ ‌డాలర్లకు చేరనుందని చెప్పారు. రెండోది ‘సామర్థ్యం’ విశాఖలో ఉక్కు నుంచి సిలికాన్‌ ‌వరకు, ఓర్వకల్లు డ్రోన్‌ ‌సిటీ, తిరుపతి స్పేస్‌ ‌సిటీ, పూడి మడక గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌హబ్‌తో పాటు తక్కువ ఖర్చుతో ఆర్‌డీ, మేధో సంపత్తి హక్కులకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. వ•డోది ‘విశ్వసనీయత’ బాహుబలి కథను ప్రస్తావిస్తూ, భారత్‌ ‌వెన్నుపోటు పొడవని నమ్మకమైన భాగస్వామి అని, ఏపీలో పరిశ్రమలు, గ్లోబల్‌ ‌కెపాబిలిటీ సెంటర్లు, హోటళ్లు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీ ప్రసంగిస్తూ, వికసిత్‌ ‌భారత్‌ ‌లక్ష్యానికి అనుగుణంగా ఆంధప్రదేశ్‌లో రహదారి మౌలిక సదుపాయాలను సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు రూ.3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రణాళిక, అమలు, దశల్లో ఉన్నాయని ప్రకటించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్‌వర్క్ 2014‌లో 4,100 కి.మీ. ఉండగా, 2026 నాటికి రెట్టింపై 8,700 కి.మీ.కు చేరిందన్నారు. ఇప్పటికే రూ.60 వేల కోట్లతో 4,750 కి.మీ. పనులు పూర్తయ్యాయని, రూ.లక్ష కోట్లతో 2,500 కి.మీ. రహదారుల నిర్మాణం, రూ.1.20 లక్షల కోట్లతో 4,600 కి.మీ. ఆధునికీకరణ పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. ‘రూ.14,000 కోట్ల బెంగళూరు-కడప-విజయవాడ కారిడార్‌ (2027 ‌డిసెంబర్‌ ‌నాటికి పూర్తి), రూ.16,000 కోట్ల రాయ్‌పూర్‌-‌విశాఖపట్నం కారిడార్‌ (96 ‌శాతం పూర్తి) ద్వారా ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. రూ.12,000 కోట్ల హైదరాబాద్‌-‌విజయవాడ-మచిలీపట్నం ఆరు వరుసల విస్తరణ, ఎన్టీఆర్‌, ‌కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల మీదుగా రూ.32,000 కోట్లతో నిర్మించే 190 కి.మీ. అమరావతి ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుకు పీపీపీఏసీ పరిశీలన పూర్తయి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం లభించనుంది.అలాగే రూ.71,000 కోట్ల ఖరగ్‌పూర్‌-‌విశాఖ-అమరావతి కారిడార్‌లో ఏపీ పరిధిలో రూ.30,000 కోట్లతో 460 కి.మీ. నిర్మించి విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులను అనుసంధానిస్తాం’అని వివరించారు. .

కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ ‌తమ ప్రసంగంలో ‘తూర్పు సముద్ర వాణిజ్య ముఖద్వారంగా ఏపీ బంగాళాఖాతం వెంబడి 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధప్రదేశ్‌ను అంతర్జాతీయ సముద్ర వాణిజ్య, రవాణా కేంద్రంగా, భారత తూర్పు-మధ్య ప్రాంతాల ప్రధాన ముఖద్వారంగా తీర్చిదిద్దుతున్నాం. ప్రధాని మోదీ సారథ్యంలో సాగరమాల, మారిటైమ్‌ ఇం‌డియా విజన్‌-2030, ‌మారిటైమ్‌ అమృత్‌ ‌కాల్‌ ‌విజన్‌-2047 ‌కింద దేశ సముద్ర రంగంలో అంచనా వేస్తున్న రూ.80 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఆంధప్రదేశ్‌ ‌కీలక భాగస్వామి. 2025-26లో రికార్డు స్థాయిలో 91.17 మిలియన్‌ ‌టన్నుల సరుకు రవాణాతో 10 శాతం వృద్ధి సాధించిన విశాఖపట్నం పోర్టులో సామర్థ్య విస్తరణ, ఉపాధి కల్పన కోసం రూ.600 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. వ•లపేట, మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ సెజ్‌.. ‌నాలుగు గ్రీన్‌ఫీల్డ్ ‌పోర్టుల నిర్మాణం వేగంగా సాగుతోంది. జాతీయ నౌకా నిర్మాణ మిషన్‌ ‌కింద దుగరాజ పట్నంలో రూ.30,000 కోట్ల పెట్టుబడితో, ఏటా 1.2 మిలియన్‌ ‌గ్రాస్‌ ‌టన్నేజీ సామర్థ్యంతో గ్రీన్‌ఫీల్డ్ ‌నౌకా నిర్మాణ క్లస్టర్‌ ఏర్పాటుకు సూతప్రాయ ఆమోదం లభించింది. వికసిత్‌ ‌భారత్‌-2047 ‘‌సప్తధార’ రోడ్‌మ్యాప్‌లో భాగంగా పోర్టుల ఆధారిత అభివృద్ధి, నౌకా నిర్మాణ-మరమ్మతుల కేంద్రంగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం’అని వివరించారు. .

కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషి మాట్లాడుతూ, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి ఈ సదస్సులో కుదిరిన 17 అవగాహన ఒప్పందాలు, 3 ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఆంధప్రదేశ్‌కు రూ.43,871 కోట్ల పెట్టుబడులు, 4,700 ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు ‘పీఎం సూర్య ఘర్‌ ‌ముఫ్త్ ‌బిజిలీ యోజన’ కింద దేశవ్యాప్తంగా 66 లక్షల కుటుంబాలు లబ్ధి పొందగా, ఒక్క ఆంధప్రదేశ్‌లోనే 7.86 లక్షల కుటుంబాలకు రూఫ్‌టాప్‌ ‌సోలార్‌ ‌విద్యుత్‌ ‌సదుపాయం కల్పించామని వెల్లడించారు. సోలార్‌ ‌వ్యవస్థల ఏర్పాటు సమయాన్ని 118 రోజుల నుంచి 6 రోజులకు తగ్గించామని, త్వరలో 5 రోజులకు కుదిస్తామని చెప్పారు. దీనివల్ల గృహ వినియోగదారుల, రైతుల కరెంటు బిల్లులు సున్నాకు తగ్గడంతో పాటు మిగులు విద్యుత్‌ ‌విక్రయంతో ఆదాయం పొందుతున్నారన్నారు. వ్యవసాయ పంపులకు సౌర విద్యుత్‌ అం‌దించేందుకు త్వరలో ‘పీఎం-కుసుమ్‌ 2’ ‌పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. దేశంలో సౌర విద్యుత్‌ ‌సామర్థ్యం 2014లో 2.8 గిగావాట్ల నుంచి 175 గిగావాట్లకు చేరిందని, మొత్తం స్థాపిత విద్యుత్‌ ‌సామర్థ్యంలో శిలాజేతర ఇంధన వాటా 55 శాతానికి పెరిగిందని తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్య సాధనలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సుస్థిర విధానాలు రాష్ట్రాన్ని హరిత తయారీ కేంద్రంగా నిలుపుతాయన్నారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ ‌నాయుడు ప్రసంగిస్తూ, కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ ‌కల్యాణ్‌ ‌సమన్వయంతో కూడిన ‘డబుల్‌ ఇం‌జిన్‌ ‌ప్రభుత్వం’ రాష్ట్ర అభివృద్ధికి పూర్తి దన్నుగా నిలుస్తోందని తెలిపారు. గత 12 ఏళ్లలో ‘మోదీనామిక్స్’ ‌వల్ల దేశంలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, 7.8 శాతం వృద్ధి రేటుతో పాటు యూపీఐ ద్వారా రోజుకు రూ.94 వేల కోట్ల విలువైన 80 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. పౌర విమానయాన రంగంలో ‘ఉడాన్‌’ ‌పథకాన్ని మరో పదేళ్లు పొడిగించి రూ.30 వేల కోట్లు కేటాయించామని, దేశవ్యాప్తంగా మరో 100 కొత్త విమానాశ్రయాలు, 200 ఆధునిక హెలీపోర్టులు నిర్మిస్తామని ప్రకటించారు. ఆంధప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 7 విమానాశ్రయాలను 14కు పెంచే లక్ష్యానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్, ‌ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఎయిర్‌ ‌కార్గో విస్తరణతో పాటు, కర్నూలులో దేశంలోనే తొలి డ్రోన్‌ ‌సిటీ ఏర్పాటు, ఈవీటీఓఎల్‌ ‌వంటి ఆధునిక సాంకేతికతలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అభినందించారు. ఆత్మనిర్భర్‌ ‌భారత్‌లో భాగంగా రెండేళ్లలో స్వదేశీ ప్రాంతీయ పౌర విమానాన్ని తయారు చేస్తామని వెల్లడించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, స్పీడ్‌ ఆఫ్‌ .‌డూయింగ్‌ ‌బిజినెస్‌’‌తో ఆంధప్రదేశ్‌ ‌కేవలం పెట్టుబడులను ఆహ్వానించే రాష్ట్రంగానే కాకుండా, ఆ పెట్టుబడులను ఉత్పత్తిగా, ఉత్పత్తిని ఉపాధిగా, ఉపాధిని ప్రజల ఆర్థికాభివృద్ధిగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ‘డబుల్‌ ఇం‌జిన్‌ ‌ప్రభుత్వం’ అందిస్తున్న సంపూర్ణ సహకారంతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతున్నాయని వివరించారు. ప్రపంచం ఇంకా ‘ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌’ ‌గురించే మాట్లాడుతుంటే, ఆంధప్రదేశ్‌ ‌మాత్రం ‘స్పీడ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌’ ‌దశకు చేరుకుందని, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలను సకాలంలో అందించేందుకు ప్రత్యేకంగా ‘ఎస్క్రో ఖాతా’ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. 1990లలో ఐటీ విప్లవాన్ని ప్రోత్సహించిన స్ఫూర్తితోనే నేడు కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్‌ ‌టెక్నాలజీ, డేటా సెంటర్లపై దృష్టి సారించి అమరావతిలో ‘క్వాంటమ్‌ ‌వ్యాలీ’ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. విశాఖపట్నాన్ని ఉక్కు నుంచి సిలికాన్‌ ‌హబ్‌గా మార్చడం, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో దేశంలోనే తొలి డ్రోన్‌ ‌సిటీ, తిరుపతిలో స్పేస్‌ ‌సిటీ, పూడిమడకలో తొలి గ్రీన్‌ ‌హైడ్రోజన్‌ ‌హబ్‌, ‌వ్యవసాయ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ ‌బయోగ్యాస్‌ ఉత్పత్తి, రాష్ట్రంలో విమానాశ్రయాలను 7 నుంచి 14కు పెంచడం ద్వారా ఆంధప్రదేశ్‌ను భవిష్యత్‌ ‌సాంకేతిక, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు.

తురగా నాగభూషణం
సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.