‌ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకమైన, విశ్వసనీయమైన ఎన్నికల నిర్వహణకు స్వచ్ఛమైన, కచ్చితమైన ఓటర్ల జాబితా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(ఎస్‌ఐఆర్‌) ‌పక్రియలో బీజేపీ ఆంధప్రదేశ్‌  ‌రాష్ట్ర శాఖ విస్తృత స్థాయిలో భాగస్వామ్యమైంది.రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ, రాష్ట్ర స్థాయి నుంచి బూత్‌ ‌స్థాయి వరకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేసింది. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధివిధానాలపై అవగాహన కల్పించడం, బూత్‌ ‌స్థాయి ప్రతినిధులను సమాయత్తం చేయడం, ప్రజలకు సరైన సమాచారాన్ని చేరవేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

బూత్‌ ‌స్థాయిలో పార్టీ ప్రతినిధుల భాగస్వామ్యం

ఎస్‌ఐఆర్‌ ‌పక్రియలో బూత్‌ ‌స్థాయిలో సమర్థవంతమైన భాగస్వామ్యం కల్పించేందుకు బీజేపీ ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర శాఖ పెద్ద సంఖ్యలో పార్టీ ప్రతి నిధులను నియమించి, కార్యాచరణలో భాగస్వాములను చేసింది. రాష్ట్రవ్యాప్తంగా  బీజేపీ తరఫున 175మంది బూత్‌స్థాయి ఏజెంట్లు( బీఎల్‌ఏ-1‌లు), 40,460 మంది బీఎల్‌ఏ-2‌లు ఎస్‌ఐఆర్‌ ‌పక్రియలో పాల్గొన్నారు. వీరు సంబంధిత బూత్‌ ‌స్థాయిలో బూత్‌స్థాయి అధికారులు (బీఎల్‌ ఓలు), ఎలక్టోరల్‌ ‌నమోదు అధికారులు (ఈఆర్‌ ఓలు),సహాయక ఎలక్టోరల్‌ ‌నమోదు అధి కారుల (ఏఈఆర్‌ఓలు)తో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల సంఘం నిర్దేశించిన విధివిధానాలకు అనుగుణంగా తమ బాధ్యతలను నిర్వహించారు. పక్రియలో అవసరమైన సహకారం అందించడం, ఓటర్లకు అవగాహన కల్పించడం, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.

రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక సమన్వయ వ్యవస్థ

పక్రియకు సంబంధించిన పార్టీ కార్యకలాపా లను పర్యవేక్షించేందుకు, సమన్వయం చేసేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక ఎస్‌ఐఆర్‌ ‌బృందాలను బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసింది. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పార్టీ ప్రతినిధులకు మార్గదర్శకత్వం అందించడం, బీఎల్‌ఏల కార్యకలాపాలను సమన్వయం చేయడం, వివిధ స్థాయిల్లో సమాచార మార్పిడి, కార్యాచరణ పురోగతిని పర్యవేక్షించడం వంటి బాధ్యతలను నిర్వహించాయి.

శిక్షణా కార్యక్రమాలు – వర్క్ ‌షాప్‌ల నిర్వహణ

ఎస్‌ఐఆర్‌ ‌పక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్‌ ‌స్థాయి ప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించేందుకు రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ, మండల స్థాయిల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, పర్క్ ‌షాప్‌లు జరిగాయి. ఈ కార్యక్రమాల ద్వారా ఎస్‌ఐఆర్‌ ‌విధివిధానాలు, బీఎల్‌ఏ-1‌లు ,బీఎల్‌ఏ-2‌ల బాధ్యతలు, ఓటర్ల జాబితా సవరణ పక్రియ, ఎన్నికల అధికారులతో సమన్వయం తదితర అంశాలపై పార్టీ ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు పలువురు పాల్గొని, ఎస్‌ఐఆర్‌ ‌పక్రియ ప్రాముఖ్యతను, ప్రజాస్వామ్యంలో కచ్చితమైన ఓటర్ల జాబితా అవసరాన్ని, పార్టీ కార్యకర్తల బాధ్యతలను వివరించారు. వారి మార్గదర్శకత్వం ద్వారా కార్యకర్తల్లో కార్యక్రమం పట్ల అవగాహన, బాధ్యతాభావం పెంపొందించేందుకు కృషి చేశారు.

ఫారం 6, ఫారం 7, ఫారం 8పై అవగాహన

ఓటర్ల జాబితాకు సంబంధించిన దరఖాస్తు పక్రియపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫారం 6, ఫారం 7, ఫారం 8 వినియోగం, వాటి ఉద్దేశ్యం, సమర్పించాల్సిన సందర్భాలపై పార్టీ ప్రతినిధులు, కార్యకర్తల ద్వారా అవగాహన కార్యక్రమాలు జరిగాయి.

ఫారం 6: కొత్తగా ఓటరుగా నమోదు కావడానికి అర్హులైనవారు దరఖాస్తు చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు.

ఫారం 7: ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు సంబంధించిన అభ్యంతరాలు, దరఖాస్తుల పక్రియపై వివరించారు.

ఫారం 8: ఇప్పటికే నమోదైన ఓటర్ల వివరాల్లో మార్పులు, సవరణలు, చిరునామా మార్పు వంటి అవసరాలకోసం దరఖాస్తు చేసే విధానాన్ని వివరించారు.

ఈ ఫారాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఓటర్ల జాబితా సవరణ పక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిం చేందుకు కృషి చేశారు.

యువత ఓటు నమోదు – బీజేపీ యువ మోర్చా కార్యక్రమాలు

18 సంవత్సరాలు నిండిన యువతతో పాటు ఓటరుగా సమోదు కావడానికి అర్హత పొందిన యువతలో ఓటు హక్కుపై అవగాహన పెంపొందించేందుకు  బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరిగాయి.యువత కొత్త ఓటర్లుగా నమోదు కావాల్సిన విధానం. ఫారం 6 సమర్పణ, ఓటు హక్కు ప్రాధాన్యత వంటి అంశాలపై ప్రచారం నిర్వహించి, అర్హులైన యువత ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేలా ప్రోత్సహించారు. యువతను ప్రజాస్వామ్య పక్రియలో భాగస్వాములను చేయడం, ప్రతి అర్హుడైన యువ ఓటరుకు తన ఓటు హక్కుపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యం.

మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన

ఎస్‌ఐఆర్‌ ‌పక్రియకు సంబంధించిన వాస్తవాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో బీజేపీ ఆంధప్రదేశ్‌ ‌సోషల్‌ ‌మీడియా విభాగం కీలక పాత్ర పోషించింది. పక్రియ ఉద్దేశ్యం, ప్రాధాన్యత, విధివిధానాలపై ప్రజలకు అవగాహన కల్పించడం. 1950 నుంచి భారతదేశంలో ఓటర్ల జాబితాల రూపకల్పన, సవరణలకు సంబంధించిన చారిత్రక నేపథ్యాన్ని వివరించడం, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు వాస్తవాధారిత సమాచారంతో సమాధానాలు అందించడం, ప్రజల్లో నెలకొన్న సందేహాలు, అపోహలను నివృత్తి చేసే పోస్టర్లు, వీడియోలు, ఇన్ఫోగ్రాఫిక్స్ ‌రూపొందించడం, ఓటర్ల హక్కులు, బాధ్యతలు, ఫారం 6, 7, 8 వినియోగంపై సమాచారాన్ని డిజిటల్‌ ‌వేదికల ద్వారా చేరవేయడం వంటి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. సోషల్‌ ‌మీడియా వేదికలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఎస్‌ఐఆర్‌పై వాస్తవ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ఈ విభాగం నిరంతర కృషి చేసింది. పక్రియపై ప్రజలకు సరైన అవగాహన కల్పించడంతో పాటు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, ప్రచారంలో ఉన్న అపోహలను దూరం చేయడంలో, వాస్తవాల ఆధారంగా వివరించడంలో బీజేపీ ఆంధప్రదేశ్‌ ‌మీడియా విభాగం క్రియాశీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పలు కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో విలేకరుల సమావేశాలు నిర్వహించింది.  టెలివిజన్‌ ‌ఛానళ్లు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా పార్టీ నాయకుల ప్రసంగాలతో ఎస్‌ఐఆర్‌ ‌చారిత్రక నేపథ్యం, ఎన్నికల సంఘం విధివిధానాలపై ప్రజలకు సమాచారం అందించింది.

సమగ్ర కార్యాచరణ – ప్రధాన అంశాలు

సంస్థాగత సమన్వయం, క్షేత్రస్థాయి భాగ స్వామ్యం, శిక్షణ, ఓటర్లకు అవగాహన, సమాచార ప్రచారం అనే ప్రధాన అంశాలు ఆధారంగా బీజేపీ ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర శాఖ చేపట్టిన కార్యక్రమాలు  కొన సాగాయి.  రాష్ట్ర స్థాయి నుంచి బూత్‌ ‌స్థాయి వరకు సమన్వయపూర్వకమైన కార్యాచరణ చోటు చేసుకుంది. పార్టీ నాయకత్వం, రాష్ట్ర, జిల్లా స్థాయి ఎస్‌ఐఆర్‌ ‌బృందాలు, మండల స్థాయి పార్టీ యంత్రాంగం, బీఎల్‌ఏలు, యువమోర్చా, సోషల్‌ ‌మీడియా, మీడియా విభాగాల సమష్టి భాగ స్వామ్యంతో కార్యక్రమాలు జరిగాయి. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా, పారదర్శకమైన ఎన్నికల పక్రియ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ అనే లక్ష్యాలకు అనుగుణంగా ఎస్‌ఐఆర్‌ ‌పక్రియపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, అర్హులైన ఓటర్ల నమోదు పక్రియకు సహకరించడం, క్షేత్రస్థాయిలో పార్టీ ప్రతినిధుల భాగస్వామ్యాన్ని కల్పించడం వంటి కార్యక్రమాలను  బీజేపీ ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర శాఖ చేపట్టింది.

పి.వి.ఎన్‌.‌మాధవ్‌
అధ్యక్షుడు, ఏపీ బీజేపీ

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.