భారత ఎన్నికల వ్యవస్థ అత్యంత పటిష్టమైనది, లోపాలు లేనిదిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ ఏడాది ఆగస్టులో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్ట్‌లో ఈ విషయాన్ని గుర్తించారు, తన ‘‘సేవ్ అమెరికా యాక్ట్’’కు మద్దతుగా దీనిని ఒక వాదనగా ఉదహరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ పోగ్రామ్ (ఐఇవిపి)లో భాగంగా 22దేశాల నుండి 38మంది ప్రతినిధుల బృందం భారతదేశాన్ని సందర్శించింది. ‘‘భారతదేశంలో ఓటింగ్… ప్రపంచం మొత్తానికీ నిజమైన ప్రజాస్వామ్యపు పండుగ… నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది ప్రజలలో ఓటు వేయాలన్న ఉత్సాహం… ఇది ఒక బృహత్తర పక్రియ, సరిగ్గా నిర్వహిస్తున్నారు’’ అని క్రొయేషియన్ ప్రతినిధి ప్రశంసించగా, మెక్సికో ప్రతినిధి మాట్లాడుతూ ‘‘ఎన్నికల పక్రియను ఖచ్చితంగా నేర్చుకోవలసిన చోటు భారతదేశం’’ అని అన్నారు. సియెరాలియోన్ ప్రతినిధి మాట్లాడుతూ ‘‘భారతదేశంలోని గొప్ప విషయాలలో ఒకటి ఈవీఎంల వినియోగం’’ అని పేర్కొన్నారు.
ఎటువంటి విశ్వసనీయమైన సాక్ష్యాలు లేకుండా, నిరాశానిస్పృహలవల్ల, అరాచక మన స్తత్వంతో నేడు ప్రతిపక్షాలు మన ఎన్నికల పక్రియ కీర్తిని దిగజార్చాలని ప్రయత్నిస్తున్నాయి. ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ) పక్రియను వారు వ్యతిరేకిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం. గత ఏడాది హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి నప్పుడు, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఒక పెద్ద ప్రెస్‌మీట్ నిర్వహించి, ‘ఓట్ చోరీ’కి పాల్పడటానికి ఎన్నికల సంఘంతో బీజేపీ కుమ్మక్కైందని ఆరోపిం చారు. ధృవీకరించిన 20మిలియన్ల ఓటర్ల జాబితాలో, నకిలీలు, బల్క్ ఓటర్లు, తప్పు చిరు నామాలు కలిగిన 2.5 మిలియన్ల మంది క్రమరహిత ఎంట్రీలు ఉన్నాయని తన బృందం కనుగొన్నట్లు ఆయన వాదించారు. తమ పార్టీ ఓటమికి ఓటర్ల జాబితాలో ఈ అక్రమాలే కారణమని ఆయన ఆరో పించారు. అయితే ఎన్నికల సంఘం ఆ ఆరోపణలను తీవ్రంగా తీసుకుని ఎస్‌ఐఆర్ ద్వారా అటువంటి అసాధారణతలను సరిదిద్దడానికి దేశవ్యాప్త పక్రియను చేపట్టినప్పుడు, ఆయన, ఆయన పార్టీ దానిని వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 95.40 కోట్లమంది ఓటర్లలో 13.39 కోట్ల మంది పరిశీలనలో ఉన్నారని, వారిలో 6.30 కోట్ల మంది శాశ్వతంగా నివాసాలు మార్చారని, 3.01 కోట్లమందిని భౌతికంగా కనుగొనలేకపోయామని, 2.80 కోట్లమంది మరణించారని, 1.02 కోట్లమంది నకిలీఎంట్రీలు ఉన్నాయని కమిషన్ స్పష్టంచేసింది. ఈ స్పష్టత రాహుల్ గాంధీని సంతృప్తిపరిచి ఉండాలి. కానీ ఆయన ఇప్పుడు బెంగాల్‌లో అటువంటి ఓటర్ల తొలగింపును ‘ఓట్ చోరి’ అని తలతిక్క వాదన చేస్తున్నారు. హరియాణాలో, ఓటర్లను జాబితా నుంచి తొలగించకపోవడమే బీజేపీ విజయానికి దారి తీసిందని ఆరోపించారు. కానీ, ఒక సంవత్సరం తర్వాత, తొలగింపు కూడా అదే ఫలితాన్ని ఎందుకు ఇచ్చింది?
డేటా, వాస్తవాల ప్రకారం ఆ వాదన కూడా నిలబడదు. బెంగాల్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గరిష్టంగా ఓట్ల తొలగింపు జరిగిన మొదటి ఐదు స్థానాలను టీఎంసీ గెలుచు కుందని, అయితే అత్యల్ప తొలగింపులు జరిగిన స్థానాలు బీజేపీకి దక్కాయని తేలింది. అదేవిధంగా, గరిష్టంగా ఓటర్ల చేర్పులు జరిగిన అగ్ర ఐదు స్థానాలు కూడా టీఎంసీ, కాంగ్రెస్‌కే వెళ్లగా, అత్యల్ప చేర్పులు జరిగిన స్థానాలను బీజేపీ గెలుచుకుంది. తొలగించిన ఓటర్ల గురించి అత్యంత ఆసక్తికరమైన డేటాపాయింట్ ఏమిటంటే, తొలగింపుకు గురైన మొత్తం 27 లక్షలమంది ఓటర్లను వారి సంబంధిత నియోజకవర్గాలకు చేర్చినప్పటికీ, ఆ ఓట్లన్నీ టీఎంసీకి ఇచ్చినప్పటికీ, చాలా స్థానాల్లో బీజేపీనే ముందుం టుందని సీటు వారీగా విశ్లేషణ చూపించింది.
నిజమైన ప్రజాస్వామ్య పక్రియ ద్వారా బీజేపీని ఎదుర్కోలేకపోవడాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అరాచక యుక్తులను ఆశ్రయించడానికి ఎన్నికల సంఘంపై ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారమే తప్ప ఇది వేరేమీ కాదని దేశంలోని చాలామంది ఎత్తి చూపుతున్నారు. రాజ్యాంగ సంస్థలపై, వ్యవస్థలపై బురదజల్లడాన్ని ఖండిస్తూ 40మందికిపైగా మాజీ న్యాయవ•ర్తులు ఒక ప్రకటన విడుదల చేశారు. సెర్బియా మాజీ అధ్యక్షుడు అలెగ్జాండర్ వుసిక్ వంటి అంతర్జాతీయ పరిశీలకుడు కూడా ఈ అరాచకవాదుల నైజాన్ని అర్థం చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ‘‘భారతదేశాన్ని ఆకాశానికి ఎత్తిన’’ నాయకుడిగా ప్రశంసిస్తూ, ఈ వారం ప్రారంభంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘‘మీకు నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ఉన్నారు. ఇప్పుడు ఆయనను అణగద్రొక్కే ప్రయత్నం జరుగుతోంది… ఆయన వలనే భారతదేశం ప్రపంచవేదికపై అంత ముఖ్యమైనదిగా మారింది. ఒక శక్తిగా అవతరించింది. ఆయన అద్భుతమైన పనులు చేశారు, అయినప్పటికీ వారు విఫలమయ్యారని లేదా ఏమీ తెలియదని చెప్పుకుంటూ ఆయనను కిందికి లాగడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని వుసిక్ అన్నారు. ‘‘ఇది ఒక సరళిగా మారిపోయింది’’ అని హెచ్చరించారు.
ప్రసిద్ధ జర్మన్ తత్వవేత్త, సాంస్కృతిక విమర్శకుడు ఫ్రెడరిక్ నీషే, అరాచక వాదుల గురించి ఒకసారి ప్రగాఢమైన పరిశీలన చేశారు. అరాచకవాదులకు ‘‘సమానత్వం’’, ‘‘న్యాయం’’ వంటి ఆదర్శాల పట్ల ఉండే వ్యామోహం ఏ గొప్ప సద్గుణం వల్ల రాదని, బదులుగా వారి బలహీనత, వ్యక్తిగత బాధను ఎదుర్కోలేని శక్తి వల్లే వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘క్షీణిస్తున్న సమాజ స్థాయిల ప్రతినిధిగా అరాచకవాది ‘హక్కు’, ‘న్యాయం’, ‘సమాన హక్కులు’ అని అందమైన ఆగ్రహంతో పట్టుబట్టి నప్పుడు, అతను తనలో సంస్కృతి లేమి ఒత్తిడివల్ల మాత్రమే అలా ప్రవర్తిస్తున్నాడు. తద్వారా తాను నిజంగా ఎందుకు బాధపడుతున్నాడో, తనకు జీవితంలో ఏది లోపించిందో అతడు గ్రహించలేక పోతున్నాడు’’ అని తన ప్రసిద్ధ రచన ‘ట్విలైట్ ఆఫ్ ది ఐడల్స్’లో రాశారు. మన పెరట్లోని స్వదేశీ అరాచకవాదులకు ఇది ఎంత చక్కగా వర్తిస్తుంది!
ప్రచారం తప్ప ప్రజామద్దతులేని ప్రతిపక్షం
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఒక నిరసన ర్యాలీని నిర్వహించాలని తలపెట్టాయి. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఎన్నికల సంఘం కోట్లాదిమంది అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించిందనే నిరాధారమైన ఆరోపణతో, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
దేశంలో ఎన్నికల విషయంలో ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు తమ మాటలను మార్చడం ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వారు పెద్ద రచ్చ చేశారు. ఈవీఎంలలో 99 శాతం బ్యాటరీ లెవెల్ ఉంటే బీజేపీకి విజయం దక్కిందని, అదే 60 లేదా 70 శాతం బ్యాటరీ లెవెల్ ఉంటే కాంగ్రెస్ గెలుపును సూచించిందని ఆరోపించారు. ఈవీఎంల కంట్రోల్ •••నిట్ బ్యాటరీ స్థితికి ఎన్నికల ఫలితాలతో ఎలాంటి సంబంధం లేదని వివరిస్తూ ఎన్నికల సంఘం ఎంతో శ్రమించింది. సరికొత్త, తిరిగి ఉపయోగించలేని ఆల్కలైన్ బ్యాటరీ లను ఈవీఎంలలో అమర్చి, అభ్యర్థుల పోలింగ్ సమక్షంలో సీల్ చేస్తామని సీఈసీ వివరించారు.
ఆ తర్వాత రాహుల్ గాంధీ, ఆయన పార్టీ సరైన రుజువులు చూపకుండానే ‘ఓటు చోరి’ (ఓట్ల దొంగతనం) అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. గత ఏడాది జరిగిన ఒక విలేకరుల సమావేశంలో, ‘ఓటు చోరి’ ఎప్పుడు, ఎలా జరిగిందో మీకు ఎప్పుడు అర్థమైంది? అని ఒక పాత్రికేయుడు ప్రశ్నించినప్పుడు, రాహుల్ ఇచ్చిన సమాధానం హాస్యాస్పదంగా ఉంది. ‘‘1975లో నాకు 7 సంవత్స రాల వయస్సు ఉన్నప్పుడు ఇందిరాజీ ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఆమెతో సహా అందరికీ తాము ఓడిపోతున్నామని తెలుసు. ఆ ఫీలింగ్ కలుగుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఆ భావన ఒకసారి తప్పు కావచ్చునని, కానీ ‘‘ఒకసారి జరగవచ్చు. కానీ రెండో సారి, వ•డోసారి, నాలుగోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఫీలింగ్ అని ఒకటి ఉంటుంది’’ అని ఆయన నొక్కి చెప్పారు. గత 2-3 ఎన్నికలలో ‘‘మా సాంకేతిక నిపుణులు ఇది సాధ్యం కాదని చెప్పారు. ఇది ఎలా జరుగుతుంది? మెల్లమెల్లగా అనుమానం బలపడింది’’ అని ఆయన వాదించారు. కాబట్టి, ఆయన అహంకారం వల్ల కలిగిన కేవలం ఒక భావన, సంశయం మాత్రమే అది. ‘‘మా సాంకేతిక నిపుణులు చెప్పారు’’ అన్నారే తప్ప ఎటువంటి బలమైన ఆధారాలు లేదా కాంక్రీట్ ప్రూఫ్ లేదు.
ఎలాంటి ఆధారాలు లేకుండానే విపక్షాలు భారత రాష్ట్రపతి తలుపు తట్టాయి. ఆమె మంచి వ్యక్తి కాబట్టి, ఎలాంటి ఆధారాలు లేకుండా ఫిర్యాదులతో వచ్చారని రాహుల్, ఆయన అనుచరులకు సున్నితంగా చెప్పారు. ఆ భేటీ ముగిసి బయటకు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ యువనేత మాట్లాడుతూ.. రాష్ట్రపతి తమ ఆందోళనలను కొట్టిపారేయకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఒక చిత్రమైన ప్రకటన చేశారు. రుజువు చూపాలని ఆమె కోరడాన్ని చూసి ఆశ్చర్యపోవడం కేవలం ఒక వ•ర్ఖుడికే సాధ్యమవు తుంది. ఆ తర్వాత రాహుల్ మరో అసంబద్ధమైన వాదన లేవనెత్తారు.. ‘‘ఎన్నికల్లో తాము మోసం చేయ లేదని అధికార పక్షమే ‘‘మాకు నిరూపించాలి’’ అన్నారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ ఫిర్యాదులలాగే, ఈ ఓటు చోరీ ఆరోపణకు కూడా బలమైన ఆధారాలు లేవు. దేశంలో ఏ ప్రాంతంలోనూ, ఏ బూత్‌లోనూ, ఏ గ్రామంలోనూ సాధారణ ఓటర్లు తమ ఓట్లు దొంగిలించారని ఫిర్యాదు చేయలేదు. అయితే, తిరిగి మాటమార్చి బ్యాలెట్ పేపర్లు మళ్లీ రావాలని పట్టుబట్టారు. కాగా, అక్టోబర్ ప్రారంభంలో సిల్చార్ మున్సిపల్ కార్పొరేషన్‌కు పేపర్ బ్యాలెట్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించినప్పుడు, మొత్తం 42 వార్డులలో కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. బీజేపీ 32 స్థానాల్లో, దాని మిత్రపక్షాలు 2 స్థానాల్లో గెలుపొందాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర అనే నాలుగు రాష్ట్రాల్లోని 28 శాసనమండలి (ఎమ్మెల్సీ) స్థానాలకు బ్యాలెట్ పేపర్లతో ఈ వారంలో నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలవగలిగింది, కాగా బీజేపీ, దాని మిత్రపక్షాలు 16 స్థానాలను కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో నాలుగు ఎమ్‌ఎల్‌సి స్థానాలను కూడా ఎన్‌డీఏ గెలుచుకుంది, అధికార పార్టీకి సున్నా స్థానాలు వచ్చాయి. ఈ ఎన్నికలలో ఓటర్లు పట్టభద్రులు, ఉపాధ్యాయులు కావడం గమనార్హం. అంటే మన దేశంలోని విద్యావంతులు, మేధావులు ఈవీఎంలు , ఓటు చోరి గురించి రాహుల్ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా తిరస్కరిస్తున్నారు.
ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న ప్రచారం కూడా అలాంటిదే. 1952 నుండి దేశంలో గతంలో ఎనిమిది సార్లు ఓటర్ల జాబితా సవరణలు జరిగాయి, ప్రస్తుత ఎస్‌ఐఆర్ తొమ్మిదవది. ఆ ఎనిమిది సవరణలలో ఏడు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయి. చివరిసారిగా ఇటువంటి సవరణ 2002-04లో జరిగింది. రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికల సంఘం మళ్లీ ఈ పక్రియను నిర్వహిస్తోంది.
కాంగ్రెస్‌పార్టీ దీనిపై రచ్చ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి: మొదటిది, వారు ఎన్నికల్లో నేరుగా బీజేపీ జోరును ఎదుర్కోలేకపోతున్నారు. అందుకే అరాచకం ద్వారా పాలనామార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. రెండవది, మోదీ, బీజేపీ కష్టపడి సాధించిన విజయాన్ని ఎన్నికలను దొంగలించడంగా చిత్రీకరించాలని వారు కోరుకుంటున్నారు.
రామ్‌లీలా మైదానంలో కేవలం 50-60 వేల మందిని మాత్రమే పట్టగలరు కానీ, విపక్షాలు మాత్రం పది లక్షలమందిని తీసుకొస్తామని ప్రచారం చేసుకుం టున్నాయి. విపక్షాల వద్ద ప్రచారం ఉంది, కానీ ప్రజలు మోదీ వెంట ఉన్నారు. కాంగ్రెస్‌పార్టీ బహుశా కొద్ది వేలమందిని ఢిల్లీకి తీసుకురావచ్చు, కానీ బీజేపీ వేలాది గ్రామాలకు వెళ్లి విపక్షాల అబద్ధాలు, పాపాల గురించి వందకోట్ల భారతీయు లకు తెలియజేస్తోంది. యాభై సంవత్సరాల క్రితం ఇందిరా గాంధీ నియంతృత్వం నుండి ప్రజా స్వామ్యాన్ని రక్షించిన చరిత్ర ఈ వ్యవస్థకు ఉంది. రాహుల్ సృష్టిస్తున్న అరాచకం నుండి కూడా ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది.

రాంమాధవ్
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు
