మనమంతా కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్‌ ఇం‌టెలిజెన్స్ – ఏఐ) ‌వల్ల వైట్‌-‌కాలర్‌ ఉద్యోగాలు పోతాయేమోనని భయపడుతున్నాం. కానీ మనం గమనించని అసలు విషయం- నైపుణ్యాల విషయంలో భయంకరమైన మానవ వనరుల కొరత.
ఇటీవల ఫోర్డు కంపెనీ సిఈఓ జిమ్‌ ‌ఫార్లీ ఒక పాడ్‌కాస్ట్‌లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడించేరు. అదేమిటంటే ఫోర్డు వద్ద 5,000 మెకానిక్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో ఉద్యోగానికి దాదాపు 1 లక్షా 20 వేల డాలర్లు (1 కోటి రూపాయలకు పైగా) వేతనం. అయినా కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చాలా తక్కువగా వస్తున్నాయి.

ఇది ఒక్క ఫోర్డు కంపెనీ సమస్య కాదు. అమెరికా మొత్తంలో 80 వేలకు పైగా ట్రక్‌ ‌డ్రైవర్‌ ‌పోస్టులు, 2 లక్షల ఎలక్ట్రిషియన్‌ ‌పోస్టులు, 4 లక్షల ప్లంబర్‌ ‌పోస్టులు, ఇంకా వేల సంఖ్యలో కార్పెంట్రీ సంబంధిత ఉద్యోగాలు ఎవరూ చేరకుండా ఖాళీగా ఉన్నాయి. ఫ్యాక్టరీ టెక్నీషియన్‌, ‌మెకానిక్‌ల కొరత లక్షలలో ఉంది. ఇదంతా ఇప్పుడున్న పరిస్ధితి. భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే సమస్య కాదు.
అసలు ఇలా ఎందుకు జరిగింది?
గత 30 ఏళ్లుగా మనం ఒక పెద్ద పొరపాటు చేశాం. ‘‘డిగ్రీ లేకపోతే జీవితం లేదు’’ అనే భ్రమను సమాజం మొత్తంలో నింపివేశాం. స్కూల్‌, ‌జూనియర్‌ ‌కాలేజీ, ఇంజనీరింగ్‌ ‌డిగ్రీ, ఐటీ ఉద్యోగం .. ఇదే జీవితంలో అద్భుత విజయమని అందరూ ఒకే దారిలో పరుగెత్తడంతో లక్షల మంది డిగ్రీల కోసం ఎగబడ్డారు. కానీ దేశాలను నడిపించే అసలు ఉద్యోగాల పట్ల ఎవరూ మొగ్గు చూపలేదు.
కష్టపడి, చెమటోడ్చి పనిచేయడం తక్కువ ప్రతిష్టగా భ్రమను కల్పించేరు. వ్యాపార ఉద్యోగాలు, ప్లంబర్‌, ఎలక్ట్రిషియన్‌, ‌ట్రక్‌ ‌డ్రైవర్‌, ‌వెల్డర్‌, ఇం‌డస్ట్రియల్‌ ‌టెక్నీషియన్‌.. ఇవన్నీ సమాజం ‘కిందిస్థాయి’గా చూసింది. కానీ ఇప్పుడు వీళ్లే ప్రపంచం నడవడానికి చాలా అవసరం. ఈ ఉద్యోగాలు ఏళ్లు గడిచే కొద్దీ అనుభవాన్ని ఇస్తాయి. ఇలాంటి ఉద్యోగాలకు ఏఐ ఏరకంగానూ ప్రత్యా మ్నాయం కాదు.
ఏఐతో చేసే ఉద్యోగాలు: డేటా ఎనాలిసిస్‌, ‌రిపోర్ట్ ‌తయారీ, డిజిటల్‌ ‌డిజైన్‌, ఎక్సెల్‌-ఆధారిత రోల్స్ .. ఇవి రొటీన్‌గా ఉంటాయి. కానీ ప్లంబర్‌, ‌మెకానిక్‌, ‌లైన్‌మ్యాన్‌ ఇలాంటి ఉద్యోగాలకు శారీరకశక్తి, అనుభవ జ్ఞానం అవసరం. ఏఐతో పనిచేసే రోబోట్లు ఇలాంటి పనులు సమర్థవంతంగా పనిచెయ్యలేవు.
అమెరికాలో
1. ఒకప్పుడు ‘‘సాధారణ’’ జాబ్‌ అని భావించిన లైన్‌మ్యాన్‌ ఉద్యోగానికి ఇప్పుడు 1 లక్షా 50 వేల డాలర్లకి పైగా జీతం అందిస్తున్నారు.
2. ఎలక్ట్రిషియన్‌ ‌కోసం 6 నెలలు ముందుగానే బుకింగ్‌ ‌చేసుకుంటున్నారు.
3. హెచ్‌.‌వి.ఎ.సి. (హీటింగ్‌, ‌వెంటిలేషన్‌, ‌మరియు నియంత్రణ) టెక్నీషియన్‌ ‌చెల్లింపులు రెట్టింపు అయ్యాయి.
కెనడాలో ట్రేడ్‌ ‌వర్కర్ల కొరత కారణంగా ఇళ్లు నిర్మించే ఖర్చు 30-40% పెరిగింది.
ఆస్ట్రేలియాలో ప్లంబర్లు, వెల్డర్లు దేశానికి ‘నైపుణ్యం ఆధారంగా ఉద్యోగ వలసదారులు’ (జూతీఱశీతీఱ•• •ఱశ్రీశ్రీవ• ఎఱస్త్రతీ•అ•)గా ప్రకటించారు.
భారతదేశంలో కూడా మెట్రో, ఇంటిగ్రేటెడ్‌ ‌ఫ్యాక్టరీలు, ఎలెక్ట్రికల్‌ ‌వాహనా తయారీ సంబం ధించిన సాంకేతిక నిపుణులు లేక పనులు సకాలంలో పూర్తి కావడంలేదు. టాటా, మారుతి, హ్యుందాయ్‌ ‌మొదలైన పరిశ్రమలు ఐటిఐ, పాలిటెక్నిక్‌ ‌టాలెంట్‌ ‌క్యాంపస్‌ ‌డ్రైవ్‌ ‌లు నిర్వహిస్తు న్నాయి. ఎలెక్ట్రికల్‌ ‌వాహనాకి సంబంధించిన స్కిల్స్, ‌రోబోటిక్స్ ‌మెయింటెనెన్స్, ‌మెషిన్‌ ‌టెక్నీషియన్స్ ‌వంటి ఉద్యోగాల జీతాలు వేగంగా పెరుగుతున్నాయి.
ఇప్పుడు అసలు ప్రశ్న
1. సమాజంలో ‘డ్రీమ్‌ ‌కెరీర్‌’ ‌నిర్వచనం పూర్తిగా మారిపోతుందా?
2. డిగ్రీతో ఆఫీస్‌ ‌క్యూబికల్‌లో కూర్చునే ఉద్యోగాల కంటే, కళతో, నైపుణ్యంతో, చేతిపనితో పనిచేసే ఉద్యోగాల విలువ పెరుగుతుందా?
అవును, ఇదే జరుగుతోంది.
పవర్‌ ‌పాయింట్‌ ‌చేయగలవారు, కంపెనీ సమావేశాలలో మాట్లాడగలిగేవారు, డిగ్రీ ఉన్నంత మాత్రాన గౌరవం, హోదా ఆశించే వారు కాదు; కొత్త వ్యవస్థలను నిర్మాణం చేయగలిగేవారు, ఎలాంటి సమస్యలనైనా సరిచేయగల నిర్వహణా సామర్థ్యం కలిగినవారు, ప్రపంచాన్ని నడిపించే మౌలిక వ్యవస్థ లను నిలబెట్టగలవారు కృత్రిమ మేధా యుగంలో ఏవిధమైన ప్రత్యామ్నాయం లేని అత్యవసరమైన, అమూల్యమైన శ్రామిక వనరులు.
శ్రామిక విప్లవం పోరాటాల వల్ల వస్తుందని కారల్‌ ‌మార్కస్ అన్నాడు. కానీ నైపుణ్యాలతో ఎదిగినవారి అవసరాన్ని సమాజం గుర్తించడం వల్ల అసలైన శ్రామిక విప్లవం వస్తుంది.
ఇది రక్తపాతం లేని విప్లవం. మానవ విలువలను ఆవిష్కరించే విప్లవం!!

పొ. దుగ్గిరాల రాజకిశోర్‌

About Author

By editor

Twitter
YOUTUBE