‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన రచన
ఇంతలో నలుగురు వ్యక్తులు దారికడ్డంగా వచ్చారు. వాళ్ల చేతుల్లో తుపాకులు, వీపుకి సంచులు ఉన్నాయి. టోపీలు, ముఖానికి ముసుగులు ధరించి ఉన్నారు. రామన్న, రమేష్ వాళ్లని చూసి ఆగిపోయారు. ప్రియ పరిగెత్తుకుంటూ శ్రీధర్ దగ్గరికి వచ్చింది.
వాళ్లలో పొడవుగా ఉన్న వ్యక్తి ‘‘ఎవరు వి•రు? ఎక్కడికి వెళుతున్నారు?’’ రామన్నను అడిగాడు.
అతని మాటలు వినగానే రామన్నకి వాళ్లెవరో అర్థమైంది. వాళ్లు నక్సలైట్లు అని పోల్చుకున్నాడు.
‘‘మేం కెంగువ నుంచి వస్తున్నాం. రెబ్బ వెళుతున్నాం’’ చెప్పాడు రామన్న.
‘‘అక్కడ వి•కేం పని?’’ అడిగాడు తుపాకీ సరిచేసుకుంటూ…
‘‘మా చెల్లెలికి ఒంట్లో బాగుండలేదు. చూడటానికి వెళుతున్నాం•’ ’చెప్పాడు.
‘‘నువ్వు అబద్ధం చెబుతున్నావు. నిజం చెప్పు. వి•రెవరు?’’ అని గట్టిగా అడిగాడు పక్కనున్న వ్యక్తి.
రమేష్ అతనికెదురుగా వెళ్లి‘‘ఇంతకీ వి•రెవరు?’’ అడిగాడు.
‘‘మేము ఎవరో మీకు అనవసరం. మీరు ఎవరో చెప్పండి. అబద్ధం చెబితే ప్రాణాలు పోతాయి’’ అన్నాడు మొదటి వ్యక్తి.
‘‘నా పేరు రమేష్. పత్రికా విలేఖరిని. ఈయన శ్రీధర్. టీచర్.మేము రెబ్బ వెళుతున్నాం. అక్కడ ఈ పిల్ల తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నది. ఆమెని చూడటానికి వెళుతున్నాము. ఇంతకీ మీరెవరు? మీరు అన్నలేనా?’’ తమ గురించి ఆడిగిన ఇద్దరిని ప్రశ్నించాడు రమేష్.
‘‘అవును. ఈ ప్రాంతం చాలా ప్రమాదకరం. పోలీసులు మా గురించి తిరుగు తున్నారు. మిమ్మల్ని చూస్తే పట్టుకొని కాల్చేసే ప్రమాదం ఉంది’’ ఒక వ్యక్తి.
‘‘పోలీసు అవుట్ పోస్ట్ దగ్గర పోలీసులు మమ్మల్ని ఆపేరు.మా వివరాలు చెప్పిన తరువాత వదిలేశారు. ఇక్కడ ఉంటే మీకే ప్రమాదం. ఇక్కడికి రెండు కిలోవి•టర్ల దూరంలోనే పోలీసులు మీ కోసం వెతుకుతున్నారు. వెళ్లిపోండి’’ అన్నాడు రమేష్.
‘‘ఆ విషయం మాకు తెలుసు. ఇప్పుడే వాళ్లు మా వి•ద ఎటాక్ చేసారు. ఆ గొడవలో కాల్పులు జరిగాయి. మా వాళ్లు నలుగురు చనిపోయారు. అందుకే మేము ఇటువైపు వచ్చాము. మళ్లీ మీ ఊరు వాళ్లే పోలీసులకు మా గురించి ఉప్పందించారు. అందుకే ఈ రోజు ఎన్కౌంటర్ జరిగింది. ఈసారి మీ ఊరి వాళ్లను వదిలే ప్రసక్తిలేదు’’ అన్నాడు ఆ వ్యక్తి.
వెంటనే శ్రీధర్ అతని దగ్గరకు వచ్చాడు.
‘‘కామ్రేడ్స్! ఎప్పుడూ మీ గురించి పోలీసులకు ఎవరో ఒకరు చెప్పారనీ ఎందుకు అనుకుంటూ ఉంటారు. అది తప్పు. దాని వల్ల గిరిజనులు చాలా నష్టపోతున్నారు. అసలు ఆ ఊరు వాళ్లే చెప్పారనీ వి••రెలా అనుకుంటున్నారు చెప్పండి? వి•రు దొరికిపోవడానికి కారణం మీ అజాగ్రత్తే కారణం తప్ప ఇంకోటి కాదు. పోలీసులు దగ్గర ప్రసుత్తం అధునాతన సమాచార వ్యవస్థ, పరికరాలు, ఆయుధాలు,తెలివైన సిబ్బంది, వాహనాలు, హైఫ్రీక్వెన్సీ వాకీటాకీలు, ఫోన్లు …అన్నీ ఉన్నాయి. డ్రోన్లు, హెలికాఫ్టర్ల సహాయంతో మీరుండే ప్రదేశాలను తెలుసుకుంటునారు.
అలా ఆచూకీ వాళ్లకి సులభంగా తెలిసిపోతూ దొరికిపోతున్నారు. మీరే చేజేతులా ప్రాణనష్టాన్ని కొనితెచ్చుకుంటున్నారు. మీ అజాగ్రత్తకు, వైఫల్యాలకు అమాయకులైన గిరిజనులను ఎందుకు బలి చేస్తారు? మీరు ఈ కొండల్లో ఆయుధాలతో రహస్యంగా సంచరిస్తున్నది గిరిజనుల మంచి కోసమే కదా?! మరి వాళ్లనే చంపేస్తుంటే వి• ఉద్యమం ఎందుకు? అది పక్కదారి పట్టినట్లు కాదా చెప్పండి?’’ అన్నాడు శ్రీధర్ ఆవేశంగా.
‘‘ఏయ్ మిస్టర్! మమ్మల్నే ప్రశ్నిస్తున్నావే? మేమెవరో తెలిసే మాట్లాడుతున్నావా? అడిగాడు ఆ కామ్రేడ్.
‘‘నేను టీచర్ని అని ఇందాకే చెప్పా. పదేళ్ల క్రితం ఈ ఏజన్సీలో పనిచేశాను. ఇక్కడి పరిస్థితులన్నీ తెలుసు. మీవల్ల, పోలీసుల వల్ల అమాయకులైన గిరిజనులు ఎలా నలిగిపోతునారో… ఎంతనష్ట పోతున్నారో… ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యక్షంగా చూశాను. నిజానికి మీ వల్ల వాళ్లకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతోంది. మీరేమో ఆశ్రయం ఇవ్వాలంటూ గిరిజనుల్ని బలవంత పెడతారు. ఆశ్రయం ఇవ్వకపోతే చంపేస్తారు. పోనీ ఆశ్రయం ఇస్తే నక్సలైట్ల సానుభూతిపరులనీ పోలీసులు అరెస్ట్ చేస్తారు. అందువల్లే చాలామంది గిరిజన యువతీ యువకులు మీలో చేరిపోయారు. అలా…వాళ్ల జీవితాలు నాశనం అవుతునాయి. ఒకసారి మీ ఉద్యమంలో చేరితే తిరిగి జనజీవన స్రవంతిలో కలవలేరు. వాళ్ల వి•ద సమాజం, ప్రభుత్వం నక్సలైటు అనే ముద్ర వేసి వెలివేస్తాయి. ఆ విధంగానే కెంగువ గ్రామానికి చెందిన ధరణి, సోమన్న లాంటి అమాయకులు ఎంతో నష్టపోయారు. ధరణి పన్నెండేళ్ల క్రితం మీలో చేరిపోయింది.ఆమె కూతురే ఈ అమ్మాయి. తల్లిని చూపించడానికి ‘రెబ్బ‘ వెళుతున్నాము.
అలాగే ఆమె భర్త సోమన్న కూడా. కానీ అతని ఆచూకీ ఇప్పటి దాకా తెలియలేదు. చనిపోయాడని కొందరు, పోలీసులు ఎన్కౌంటర్ చేశారని ఇంకొందరు చెబుతున్నారు. మీ వల్ల ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అయింది. ఇలాంటి కుటుంబాలు ఎన్నో నష్టపోయాయి. అయినా వీళ్ల ఆక్రందనలు వినే వాళ్లెవ్వరు? మీకు ఎంత సేపు మీ ఉద్యమం,మీ సిద్ధాంతాలే కానీ అమాయక గిరిజనులు పట్టరు’’ అన్నాడు శ్రీధర్ ఆవేశంగా.
శ్రీధర్ మాటలకు ఆ కామ్రేడ్‌కి కోపం వచ్చింది.
‘‘ఏయ్ మిస్టర్! నువ్వు టీచర్ అయి ఉండి కూడా ఇలా మాట్లాడటం అన్యాయం. మేము ఈ కొండల్లో సరియైన ఆహారం, నిద్ర లేకుండా పోలీసులతో పోరాటం చేస్తున్నది ఎవరి కోసం? ఈ గిరిజనుల కోసమే కదా? మేమే గాని లేక•పోతే నీ లాంటి తెలివైన ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులు, దళారులు ఈ గిరిజనులను పీడించుకొని తినేవారు.మేము ఉండ బట్టే మాకు భయపడీ వాళ్లను ఏవి• చెయ్యటం లేదు? ఈ ఉద్యమంలోని మేమంతా బాగా చదువుకున్న వాళ్లం.మా భవిష్యత్తుని, జీవితాలను పణంగా పెట్టి వాళ్ల కోసం ఈ కొండల్లో ఎన్నో బాధలు, కష్టలూ పడుతూ పోరాడుతున్నాము. ఈ పోరాటంలో మా వాళ్లెంత మందో ప్రాణాలు పోగొట్టుకున్నారు…. పోగొట్టుకుంటున్నారు. అయినా అన్నింటినీ ఓర్చుకొంటూ పోరాటం కొనసాగి స్తున్నాము. అటువంటి మమ్మల్ని తప్పుపట్టడం అన్యాయం‘‘ అన్నాడు అతను.
‘‘కామ్రేడ్! వి•రు ఆయుధాలు పట్టుకొని ఈ కొండల్లో రహస్యంగా తలదాచుకుంటూ బతుకు తుంటే ఆ గిరిజనులకు ఏమి ఉపయోగం చెప్పండి? అంతగావాళ్లకి సహాయం చెయ్యాలని ఉంటే ఆయుధాలు వదలి కిందకు రండి. అన్యాయమై పోతున్న పేద గిరిజనులకు అండగా ఉండండి. దళారులను అడ్డుకొని వాళ్లను కాపాడండి. పోలీసుల దాడుల నుంచి రక్షించండి. అప్పుడు మీ ఉద్యమానికి ఓ సార్థకత ఉంటుంది. ఈ కొండల్లో రహస్యంగా బతకడం వల్ల ఏమి ఉపయోగం చెప్పండి? ఈ విషయం వి•రు ఆలోచించుకోవాలి‘‘ అన్నాడు శ్రీధర్.
‘‘మీలాంటి స్వార్థ్ధపరులైన తెలివైన వాళ్ల వల్లే అమాయకులైన గిరిజనులు నష్టపోతున్నారు. మీలో ఒక్క ప్రభుత్వోద్యోగైనా గిరిజనుల కోసం పనిచేస్తున్నారా? అవినీతికి పాల్పడకుండా పని చేస్తున్నారా?ప్రభుత్వం నుంచి జీతాలు తీసు కుంటూ ప్రజలకు అన్యాయం చేస్తున్నార••. మీ లాంటి వారి కోసమే మేము తుపాకీ పట్టుకుంది’’ అన్నాడు ఆ కామ్రేడ్.
‘‘కామ్రేడ్! ఈ వాదనకు అంతుండదు. ఇంతకీ సోమన్న ఏమయ్యాడు? అతని కోసం అతని కుటుంబం ఎదురు చూస్తోంది’’ చెప్పాడు శ్రీధర్.
‘‘సోమన్నను మావాళ్లు ఛత్తీస్‌గఢ్ పంపించారు. కానీ దురదృష్టవశాత్తూ అక్కడ అనారోగ్యంతో చనిపోయాడు. ఆ విషయాన్ని ధరణికి తెలియనివ్వ లేదు. అనారోగ్యంతో ఉన్న ఆమెకు మేమే వైద్యం చేయిస్తున్నాము.
ఇప్పుడామె మా ఉద్యమంలో లేకపోయినా, బయటకు వస్తే పోలీసులు అరెస్ట్ చేయవచ్చు. అందుకే గ్రామంలో రహస్యంగా ఉంచాము. వి•రు వెళ్లి ఆమెను చూసి వచ్చేయండి. ఆమె ఆచూకీ ఎక్కడ పొక్కకూడదు.అలా అయితే ఆమెకే ప్రమాదం’’ అంటూ కామ్రేడ్లు కొండల్లోకి వెళ్లిపోయారు.
‘సోమన్న చనిపోయాడన్న విషయం విన్న శ్రీధర్ బాధపడ్డాడు. గుండె బరువెక్కింది.ఈ విషయం తెలిస్తే ధరణి తట్టుకోలేదు. ప్రియకు కూడా తండ్రి చనిపోయాడన్న వార్త తెలిసి పోయింది. ఈ విషయాన్ని తల్లికి చెప్పొద్దనీ ఆమెకు చెప్పాలి.’ అని మనసులో అనుకున్నాడు.
తండ్రి వార్త విని ఏడుస్తున్న ప్రియను దగ్గరికి తీసుకున్నాడు. ఆమె చూడకుండానే తండ్రి చనిపోయాడు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదను కున్నాడు.
నలుగురూ రెబ్బ గ్రామం వైపు నడకసాగించారు. ఊరు దగ్గరపడుతున్నా అతనిలో ఉత్సాహం సన్నగిల్లింది. పది నిమిషాల్లో ఊరు పొలిమేరలు చేరుకున్నారు. రెబ్బ చాలా చిన్న గ్రామం. కొండవాలులో విసిరేసినట్లున్నాయి ఇళ్లు. కొద్ది నిమిషాలకు ఊళ్లోకి ప్రవేశించారు.వాళ్లని రామన్న ఊరు మధ్యలో ఉన్న ఇంటికి తీసికెళ్లాడు. అది ఓ చిన్న పెంకుటిల్లు. వి•ద పెంకులన్నీ వెదురు కర్రల వి•ద లూజుగా అమర్చబడి ఉన్నాయి. ఇంటి ముందర వీధిలో మురికి నీరు ప్రవహిస్తోంది.
ఆ ఇంటిని చూడగానే శ్రీధర్‌కి బాధవేసింది. అందలో ధరణి ఎలా ఉంటున్నదో అనే ఆలోచన బాధ కలిగించింది. ఆ మురికి కాలవను దాటుకొని నలుగురూ ఇంట్లోకి ప్రవేశించారు. ముందు చిన్న వరండా. అక్కడ కర్రల పేళ్లు, కోళ్ల గంప, ఓ ధాన్యం బుట్టి ఉన్నాయి.
లోపల చిన్న గది. అందులో మూలగా ఓ నులక మంచం వి•ద ధరణి పడుకొని ఉంది. శరీరం శుష్కించి పోయి ఉంది. ముఖంలో జీవకళ లేదు. నిజానికి ఆమె వయస్సు నలభై ఏళ్లే అయినా 60 ఏళ్ల వృద్ధురాలిలా కనిపిస్తోంది. శరీరమంతా బక్క చిక్కిపోయి ఉంది. ఎముకల గూడు స్పష్టంగా కనిపిస్తూ ఆమె అనారోగ్యాన్ని సూచిస్తోంది. మంచం కింద ఓ బకెట్. ఆ గదిలో దుర్వాసన వేస్తోంది.ఆమె మంచం దగ్గర ఓ ముప్పై ఏళ్ల స్త్రీ నిలబడి ఆమెకు మందు పడుతూ కనిపించింది.
గదిలోకి ప్రవేశించిన నలుగురిని చూడగానే ధరణి ముందు ఆశ్చర్య పోయింది.
అయితే ఎదురుగా రామన్నని చూడగానే ధైర్యం వచ్చింది. ఇంతలో దగ్గు ముంచుకొచ్చింది. రామన్న వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి మంచి నీళ్లు అందించాడు. ఆమెకు దగ్గు తగ్గలేదు సరికదా.. మరింత ఎక్కువైంది. దగ్గుతున్నప్పుడు నోటి నుంచి కళ్లె పడటం మొదలైంది.
ఆమె పరిస్థితికి శ్రీధర్‌కి బాధ కలిగింది. ధరణి పరిస్థితి బాగులేదంటే ఏదో కొద్దిపాటి అనారోగ్యం అనుకున్నాడు గానీ మరీ ఇంత విషమస్థితిలో ఉందనుకోలేదు.
ఆమె ఉత్తరాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ప్రియని అంత దూరం తీసికెళ్లి ఆమెకు చూపించవలసిన అవసరం లేదనుకున్నాడు. కానీ కౌసల్య సలహా వల్లే ప్రియని తీసికొచ్చాడు. ఇప్పుడు ధరణి పరిస్థితిని చూసిన తరువాత తాను మంచి పనే చేశానని అనుకోసాగాడు.
ఇంతలో ధరణి దగ్గు కాస్త తగ్గింది. ఎదురుగా ఉన్న శ్రీధర్ని, అతని పక్కన బిత్తర చూపులు చూస్తున్న పిల్లని చూడగానే మొదట గుర్తు పట్టలేకపోయింది. కానీ శ్రీధర్ని ఎక్కడో చూసినట్లు అనిపించ సాగింది.
ఇంతలో రామన్న ‘‘చెల్లీ! టీచరు శ్రీధర్ బాబు గారు..నీ కూతురు వనజని నీకు చూపించాలనీ మనూరు తీసుకొచ్చారు. అప్పుడు గౌరక్క నీ దగ్గరికి తీసికెళ్లమనీ చెబితే వాళ్లని ఇక్కడికి తీసుకొచ్చినాను’’ అంటూ ప్రియని ఆమె దగ్గరకు తీసికెళ్లాడు.
ఎదురుగా ఉన్న కన్నకూతురు వనజని చూడగానే ధరణి మనసు పులకించిపో సాగింది.ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె కింకా తన కూతురన్న నమ్మకం కలగటం లేదు. ఎప్పుడో నెలల పిల్లగా ఉన్న తనను వదిలి వచ్చేసింది. ఇప్పుడు దాని రూపు బాగా మారిపోయింది. బొద్దుగా, తెల్లగా, అందంగా కనిపిస్తోంది. వనజను కౌగిలించుకొని ముద్దు పెట్టుకో సాగింది.
ఆ దృశ్యాన్ని చూస్తున్న శ్రీధర్ కళ్లు చెమ్మగిల్లసాగాయి. ఇన్నేళ్ల తరువాత కన్నబిడ్డను తల్లి దగ్గరకు చేర్చి మంచి పని చేశా•నన్న తృప్తి కలగ సాగింది.
ఇక ప్రియకైతే అమ్మ స్పర్శలోని వెచ్చదనం ఆనందం కలిగించసాగింది. కన్నతల్లిని చూస్తాననీ ఆమె అనుకోలేదు. అసలు తన తల్లి ఇంత దూరంలో కొండల మధ్య ఉందన్న సంగతే ఇన్నాళ్లు తెలియకుండా పెరిగింది. ఇప్పుడు తల్లిని ఈ స్థితిలో చూస్తుంటే ఆమెకు ఏడుపు ముంచుకు రాసాగింది.
ఇక ధరణి పరిస్థితి చూస్తే ఆవేదన కలుగుతోంది.ఒక పక్క కొన్ని ఏళ్ల తరువాత కన్నబిడ్డ స్పర్శ కలిగించే ఆనందం, ఇంకో పక్క తన ఆరోగ్య పరిస్థితి కలిగించే ఆందోళన.

గన్నవరపు నరసింహ మూర్తి