యువవాణి


కాలం మారింది. దానితోపాటు ఆహారపు అలవాట్లూ మారిపోతున్నాయి. ఒకప్పుడు ఇంట్లో వండింది తినడమే అలవాటుగా ఉండేది, నేడు సమయం లేకో లేదా భిన్నమైన ఆహారాన్ని తినాలని పించో, అది వండడం తెలియక పోవడంతోనో, బయటకు వెళ్లక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బయటకు వెళ్లినా హోటళ్లలో రద్దీ భరించలేనంత ఉండడంతో ఇబ్బంది పడడం కూడా కద్దు. అయితే, ఈ శ్రమను తప్పించేందుకు ఇప్పుడు రకరకాల యాప్‌లు మనకు అందుబాటులోకి వచ్చాయి. అందులో క్లిక్‌ ‌చేసి, ఆర్డర్‌ ‌చేయడమేమిటి, ఇట్టే అవి వేడివేడిగా మన ఇంట్లో వచ్చి వాలుతున్నాయి.
ఈ సమస్యలను స్వయంగా ఎదుర్కొని అర్థం చేసుకున్న పంకజ్‌ ‌చద్దా, దీపేందర్‌ ‌గోయెల్‌ అనే ఇద్దరు యువకులు, పరిష్కారంగా ‘జొమాటో’ ఆహార బట్వాడా అప్లికేషన్‌ను తయారు చేశారు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ తరచుగా కాకపోయినా, ఒకసారో, అరసారో దీన్ని ఉపయోగించే ఉంటారు. పెద్ద పెద్ద నగరాల నుంచి పట్టణాల వరకూ ఇప్పుడు జొమాటో యాప్‌ను ఉపయోగిస్తున్నా రనడం అతిశయోక్తి కాదేమో. ఐఐటీ ఢిల్లీ విద్యార్ధులు, బెయిన్‌ అం‌డ్‌ ‌కంపెనీలో పనిచేస్తున్న దీపేందర్‌ ‌గోయల్‌, ‌పంకజ్‌ ‌చద్దాలు ఈ యాప్‌ను అభివృద్ధి చేయడానికి కారణం, తమ ఆఫీసు కాంటీన్లలో తమ సహచరులు ఆహారాన్ని ఆర్డర్‌ ‌చేయడం కోసం మెనూ కార్డులను పట్టుకొని వేచి ఉండ•మే. కొన్ని సందర్భాల్లో వారికి కూడా ఆ అనుభవం అయింది. ఈ ప్రహసనమే, ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలనే ఆలోచన వారి మనసులో పుట్టేందుకు కారణమైంది. తొలుత ‘ఫుడీబే’ సృష్టికి కారణమైంది.
వారు మెనూకు సంబంధించిన సాఫ్ట్ ‌కాపీలను వెబ్‌సైట్‌పై అప్‌లోడ్‌ ‌చేయడంతో, ఆఫీసులో అందరూ దీనిని ఉపయోగించడం ప్రారంభించారు. ఇది వారికి ఎంతో సమయాన్ని ఆదా చేసింది. అయితే, దీనివల్ల వెబ్‌సైట్‌లో ట్రాఫిక్‌ ‌పెరిగింది. ఈ ఆలోచన విజయవంతం కావడంతో వారు వెబ్‌సైట్‌ను అందరికీ అందుబాటులోకి వచ్చేలా విస్తృత పరిచారు. తొలుత ఢిల్లీలో ప్రారం భమైన ఫుడీబే సేవలు నెమ్మదిగా ముంబై, కోల్‌కతాలకు విస్తరించాయి. ఈ అప్లికేషన్‌ను ఉపయోగిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరగడం ప్రారంభమైంది. వినియోగదారులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నం దున్న ఫుడీబే ఆ నగరాలలో అత్యంత ప్రాచుర్యం పొందింది.
దీనితో, తమ ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయికి పెంచాలని వ్యవస్థాపకులు భావించి, ప్రయత్నించారు. అలాగే, ఫుడీబేను మరింత ఆకర్షణీయంగా, సులభంగా గుర్తుపెట్టుకునేలా చేయడానికీ, ‘ఈబే’ వెబ్‌సైట్‌తో ఉండే గందరగోళాన్ని తొలగించడానికి ‘జొమాటో’గా దాని పేరు మార్చారు. ఈ రకంగా, 2010లో ఫుడీబే పేరును అధికారికంగా జొమాటోగా మార్చారు. ఇదే, కాలక్రమంలో అత్యంత విజయవంతమైంది.
జొమాటో వాడకం అసాధారణంగా పెరగడంతో, దాని వ్యవస్థాపకులు వినియోగదారుల కోసం అప్లికేషన్‌ ‌యాక్సెస్‌ను సులభతరం చేయాలని నిర్ణయించు కున్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి, వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉండేలా చేయడానికి జొమాటో వంటి మొబైల్‌ ‌యాప్‌ ‌రూపొందించారు. అయితే, ఆవిష్కరణలకు నిధులు అవసరం అవుతాయి. ఈ క్రమంలో ‘నౌకరీ’ సెర్చ్ ఇం‌జన్‌ ‌వ్యవస్థాపకుడు సంజీవ్‌ ‌బిఖ్‌చందానీ జొమాటో విజయగాథ విని ఆకర్షితుడయ్యాడు. దీనితో అతడు ఈ స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు.
అతడు, 2010లోనే ఇన్ఫో ఎడ్జ్ (ఇం‌డియా) ద్వారా దాదాపు ఒక మిలియన్‌ ‌డాలర్లను పెట్టుబడిగా పెట్టాడు. ఆ మరుసటి సంవత్సరంలోనే, ఆదే పెట్టుబడిదారులు వారికి 3.5 మిలియన్‌ ‌డాలర్ల నిధిని అందించారు. ఆ మరు సంవత్సరం ఇన్ఫో ఎడ్జ్ ‌ద్వారా దాదాపు 10 మిలియన్‌ ‌డాలర్లు వరదలా జొమాటోను ముంచెత్తాయి. నేడు ఈ కంపెనీలో ఇన్ఫో ఎడ్జ్ ‌సహా ముగ్గురు పెట్టుబడిదారులు 50శాతం వాటాను కలిగి ఉన్నారు. నిజానికి, నేడు ఏరకమైన వ్యాపారానికి అయినా మొబైల్‌ ‌యాప్‌ను అభివృద్ధి చేయడం అన్నది వృద్ధి చోదకంగా మారిందనేది వాస్తవం.
కాగా, సరైన వ్యక్తుల నియామకమే కంపెనీ వేగవంతమైన వృద్ధికి కారణమన్నది జొమాటో వ్యవస్థాపకులు దీపేందర్‌ ‌గోయల్‌, ‌పంకజ్‌ ‌చద్దాల నిశ్చితాభిప్రాయం. పైగా, వారు జొమాటోను నిర్మిస్తున్న కాలంలో ఎదుర్కొన్న అతిపెద్ద ఆటంకం కూడా అదే. ఈ ప్రాజెక్టును పటిష్టం చేసే సైన్యమే నేడు వారి బలమైంది.
జొమాటో విజయం అంత తేలికగా రాలేదు. వారు ఎదుర్కొన్న కీలకమైన అడ్డంకి ఏమిటంటే, అన్ని ముఖ్య నగరాల్లోని అన్ని ప్రాంతాలను కవర్‌ ‌చేయడానికి ఒక మార్గాన్ని కనుగొనడం, తద్వారా వాటిపై ఆధారపడిన ప్రజలు అత్యుత్తమ రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని కోల్పోకుండా చూడటం. ఇది తొలి దశలో సమస్యగా ఉన్నా, వ్యవస్థాపకులు తమ సైన్యంతో పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషిని ఆపలేదు. మరొక పెద్ద సమస్య ఏమిటంటే, మొదట్లో డోమినోస్‌, ‌కెఎఫ్‌సి వంటి అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్‌ ‌చైన్లు, స్థానిక హోటళ్లు జొమాటో వారు తమ వద్దకు రాకుండా అడ్డుకున్నారు. అందుకు కారణం, వారి వద్ద కూడా డెలివరీ సిబ్బంది ఉండటమే. అయితే, క్రమంగా జొమాటో సిబ్బంది తమపనిలో చూపుతున్న నైపుణ్యం కారణంగా, పెరిగిన అమ్మకాల కారణంగా వారు జొమాటోను అనుమతించారు.
నేడు జొమాటో స్టార్టప్‌ ‌విజయగాథ అనేక స్టార్టప్‌లకు ప్రేరణగా నిలుస్తోంది. ముఖ్యంగా, ఇది ఉనికిలో ఉన్న ఉదాహరణ కావడంతో అనేకమంది యువకులు ప్రేరితులు అవుతున్నారు. నేడు దేశవ్యాప్తంగా లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న జొమాటో, యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ వ్యవస్థాపకులు దీపేందర్‌, ‌పంకజ్‌లు ఒక సఫలవంతమైన వ్యాపార నమూనాను నిర్మించాలని అంకిత భావంతో చేసిన కృషిని విస్మరించలేం. అదే వారు నేడు విజయబాటలో ముందుకు సాగేందుకు కారణమైంది.

– ‌జాగృతి డెస్క్

About Author

By editor