సనాతన ధర్మానికి సంబంధించిన సాహిత్యంలో ఉటంకించిన ఒక చిన్న ధ్యేయ వాక్యం సంఘేశక్తి కలౌయుగే అన్న దానికి అనుగుణంగా, సంభవామియుగే యుగే అన్న వాక్యానికి అనుగుణంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘస్థాపన జరిగింది. సంఘ స్థాపన జరిగి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి. సంఘం స్థాపించిన ఒక సంవత్సరం తర్వాత అశోక్‌ ‌సింఘాల్‌ ‌జన్మించారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌తయారు చేసిన అత్యుత్తమ, దేవదుర్లభ కార్యకర్తలలో అశోక్‌ ‌సింఘాల్‌ ఒకరు. వారి కర్తృత్వ శక్తిని గుర్తించి, 1982వ సంవత్సరంలో విశ్వహిందూపరిషత్‌ ‌బాధ్యతను వారికి ఇచ్చారు. విశ్వహిందూపరిషత్‌ ‌రూపురేఖలను మార్చినటువంటి కార్యకుశలత అశోక్‌ ‌సింఘాల్‌జీది. హిందూ సమాజానికున్నటువంటి రుగ్మతలు, సమస్యలు పరిష్కారానికి అవసరమైన విధంగా ఆలోచించి, ప్రతి ఒక్క పనికీ ఒక విభాగాన్ని  విశ్వహిందూపరిషత్‌లో ఏర్పాటుచేసినవారు ఆయన.

రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘం హిందూ సమాజ ధార్మిక, సాంస్కృతిక, సామాజికమైన సమస్యలను పరిష్కరించడానికి అవసరమైనటువంటి కార్యకర్తలను నిర్మాణం చేసేటువంటి సంస్థ అంటూ హరిద్వారలో భారతమాత మందిరం నిర్మాత పూజ్య సత్యామిత్రానంద్‌జీ అశోక్‌ ‌సింఘాల్‌జీ గురించి అన్న విషయాన్ని విశ్వహిందూపరిషత్‌ అఖిలభారత సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వరశర్మ గుర్తు చేశారు. విశ్వహిందూపరిషత్‌ – ‌దక్షిణాంధ్ర శాఖ అక్టోబర్‌ 4‌వ తేదీన కర్నూలులో నిర్వహించిన అశోక్‌ ‌సింఘల్‌ ‌శతజయంతి సందర్భంగా విశిష్ట వ్యక్తుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

సంఘ కార్యకర్తలను గురించి తృతీయ సర్‌సంఘ చాలక్‌ ‌బాలాసాహెబ్‌ ‌దేవరస్‌, ‌తన బాధ్యతలను స్వీకరించిన తరువాత తమ ఉపన్యాసంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ను నిర్వహించే బాధ్యతను నాకు అప్పగించారు. సంఘానికి డాక్టర్జీ, గురూజీ  దేవదుర్లభ కార్యకర్తలను తయారుచేసినందుకు రుణపడున్నాను అని అన్నారు. అటువంటి కార్య కర్తల్లో అశోక్‌ ‌సంఘాల్‌జీ ఒకరు. విశ్వహిందూ పరిషత్‌ ‌బాధ్యతను అప్పగించడానికి వెనుక ఒక చారిత్రకమైనటువంటి నేపథ్యముంది. సంఘ చరిత్రను సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ విషయం మనకు బోధపడుతుంది. హిందూసమాజం సామాజిక జీవనంలో 1975 అనేది ఒక నిర్ణయాత్మకమైన మలుపును తిప్పిన సంవత్సరం. రామజన్మభూమి ఉద్యమం తర్వాత సమాజం ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ఇదిగో అద్వానీ వెళ్తున్నాడు, ఫలానా ఆయన వెళ్తున్నాడు అనే దాని దగ్గర నుంచి, జైశ్రీరామ్‌ ‌విశ్వవ్యాప్తమైనటువంటి స్థితి.

అలాగే, 1975 కూడా చరిత్రాత్మక మలుపు. ఎమెర్జన్సీ విధించారు. సంఘ పెద్దలందరూ, ముఖ్యమైనవారందరూ జైల్లో ఉన్నారు. బయట లోక్‌సంఘర్ష్‌సమితి పేరుతో ఉద్యమం జరుగుతోంది. అదొక అంశం. జైళ్లలో ఉన్నటువంటి సంఘ పెద్దలందరూ కలిసి 15 నుండి 18 మాసాలపాటు హిందూ సమాజ అవసరాలు, సమస్యలు, రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘము, సంఘ పరివారము, భవిష్యత్తు కార్యాచరణ గురించి విస్తృతంగా చర్చించే విధంగా కష్టకాలాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నారు. జైల్లో ఉన్నటువంటి అఖిల భారత అధికారులందరూ కూడా భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆలోచన చేశారు. ఎమర్జన్సీ తర్వాత సంఘ సంస్థలన్నింటి వికాసానికి సంబంధించిన యోజనలో ధార్మికంగా, సాంస్కృతి కంగా ఈ సమాజాన్ని చైతన్యం చేయవలసిన అవసరాన్ని గుర్తించి, విశ్వ హిందూపరిషత్‌ ‌పనిని ముందుకు తీసుకువెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా తగినటువంటి కార్యకర్తలను ఇవ్వాలనేటువంటి ఆలోచనలో నుంచి సందర్భం వచ్చినప్పుడు అశోక్‌ ‌సింఘాల్‌ ‌గారిని విశ్వహిందూపరిషత్‌కు ఇవ్వడం జరిగింది.

సీనియర్‌ ‌జర్నలిస్టు భాను ప్రతాప్‌ ‌శుక్లా ఒక సందర్భంలో పరమపూజనీయ గురూజీతో సంభాషిస్తూ ‘గురూజీ మీ అభిప్రాయంలో వర్తమాన సామాజిక పరిస్థితుల్లో సంఘం మాధ్యమంగా హిందూ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి,  సంఘం లక్ష్య పూర్తికి భవిష్యత్తులో అవసరమైనటు వంటి నేతృత్వం ఇవ్వగలిగినటువంటి వారు మీకెవరైనా కనిపిస్తున్నారా?’ అని అడిగారు. ‘చాలా మంది ఉన్నారు అంటూ, బాపూరావుమోఘే వంటి పాతతరం వారితో పాటుగా, కొత్తతరంలో కాన్పూర్‌లో పనిచేస్తున్న అశోక్‌ ‌సంఘాల్‌ ‌కూడా ఉన్నారని’ చెప్పారు. అశోక్‌ ‌సింఘాల్‌ ‌ప్రతినిత్యం ఆరాధించేటువంటి మహనీయ వ్యక్తిత్వాల్లో పరమపూజనీయ శ్రీ గురూజీ, తర్వాత వారి కుల గురువు రామచంద్ర తివారీ ఉన్నారు. కుటుంబం మొత్తానికీ కూడా ఆధ్యాత్మిక విషయాల్లో మార్గదర్శనం చేసేవారు తివారీ. వారు ప్రతినిత్యం నాలుగు వేదాల పఠనంతో హోమం చేస్తుండేవారు. అందులో అశోక్‌ ‌సింఘాల్‌ ‌పాల్గొంటుండేవారు.

 ప్రచారక్‌గా వచ్చినటువంటి కొత్తల్లో అంటే 1962-63 ఆ ప్రాంతంలో, పరమపూజనీయ గురూజీకి అశోక్‌జీ ఒక లేఖ రాశారు. రామచంద్ర తివారీగారు మా గురువుగారు, వారితోపాటు వేద హవనంలో పాల్గొంటూ ఉన్నప్పుడు నా మనసు ఈ వేదాల్లో ఉండేటువంటి విషయాలపట్ల ఆకర్షితమవు తోంది, నేను ప్రచారక్‌గా మానివేసి, వేదాలకు సంబంధించినటువంటి పనిచేద్దామనే ఆలోచన కలుగుతోంది. మీ మార్గదర్శనం కోసం లేఖ రాస్తున్నాను అని చెప్పి రాశారు. గురూజీ ప్రత్యుత్తరం రాస్తూ, వాస్తవమే, వేదం అంతటి శక్తిమంతమైనటు వంటిది, వేద మార్గదర్శనంలో పనిచేయడం, వేదాలను ప్రచారం చేయడం అనేది చాలా ఉత్తమ మైనటువంటి పని. సంఘకార్యం కూడా సమానంగా ఉత్తమమైనటువంటిదే. రెండూ సమానమైనటు వంటివే. నువ్వు ఆలోచించుకుని, ఉచితమైన నిర్ణయం తీసుకోమని రాశారు.

అప్పటి నుంచీ గురూజీ, అశోక్‌జీ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతుండేవి మార్గదర్శనం కోసం. సంఘం విశ్వహిందూపరిషత్‌ ‌పనిని ముందుకు తీసుకువెళ్లాలని ఎమర్జన్సీలో చేసిన ఆలోచన పరిణామంగా, వేదమంత్రాలను దర్శించినటువంటి వారిలాగా. ఎమర్జన్సీ పూర్తి అయిన తర్వాత 1980-81వ సంవత్సరం వచ్చే సమయానికి మీనాక్షిపురం సంఘటన జరిగింది. మీనాక్షీపురం అనేటువంటి గ్రామంలో ఎస్సీలందరినీ కూడా, మూకుమ్మడిగా1500 మంది పైగా ఉన్న వారంతా ముస్లింలుగా మారారు. మీనాక్షీపురం పేరు రహమత్‌నగర్‌గా మారింది. ఈ ఘటన సంఘం, హిందూసమాజాన్ని, విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులను కలిచివేసింది. ప్రత్యేకంగా, హిందూ సమాజం రాజకీయ వర్గాల నుంచి ధార్మిక వర్గాల వరకూ అచేతనకు గురైంది. ఇందిరా గాంధీ కూడా ఈ సంఘటనకి  కంచిపరమాచార్యుల వారిని సంప్రదించి, ఏంచేయాలి అని అడిగారు. పరమా చార్యులవారు ఉడిపి విశ్వేస్వర తీర్థుల వారి కృషితో తిరిగి నెలల్లోనే వారందరినీ హిందూ ధర్మంలోకి తీసుకువచ్చారు.

ఈ నేపథ్యంలో సంఘం ఆలోచించినటువంటి విధంగా విశ్వహిందూ పరిషత్‌ ‌నేతృత్వంలో ధార్మిక, సాంస్కృతికమైనటువంటి చైతన్యం తీసుకురావడం కోసం ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనలో నుంచి కాన్పూర్‌లో పనిచేస్తున్న అశోక్‌సింఘాల్‌జిని, ఎమర్జన్సీ తర్వాత , ఢిల్లీ ప్రాంత ప్రచారక్‌గా చేశారు. అయ్యారు. 1981 సంఘటన తర్వాత  హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే ఆలోచనలో భాగంగా అశోక్‌ ‌సింఘాల్‌జీ ఢిల్లీ ప్రాంత ప్రచారక్‌గా ఉన్న సమయంలో, మీనాక్షీపురం ఘటన తర్వాత విరాట్‌ ‌హిందూ సమ్మేళనాన్ని ఢిల్లీలో నిర్వహించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా, కాంగ్రెస్‌ ‌నాయకుడిగా ఉన్నటువంటి డా।।కరణ్‌సింగ్‌ అధ్యక్షతన అశోక్‌ ‌సింఘాల్‌జీ విరాట్‌ ‌హిందూ సమ్మేళన యోజన చేశారు. ఈ సమ్మేళనంలో ‘హిందూ హిందూ ఏక్‌రహే’ అనే గీతం విజయవంత మైంది.

యోజన జరుగుతున్న ఆ సమయంలో నేను తరచూ సంఘ పని మీద ఢిల్లీ వెళ్తుండేవాడిని. సంఘ కార్యాలయంలో అశోక్‌ ‌సింఘాల్‌ను చూస్తుండే వాడిని…సంత్‌ ‌సమావేశాలు, సమ్మేళనాలు, సంత్‌ ‌యాత్రలు జరుగుతుండేవి హిందూ సమ్మేళనానికి, సత్యాగ్రహి రామ్‌ అన్నపేరుతో రాముడు ధనస్సు పట్టుకున్న చిత్రాన్ని అశోక్‌సింఘాల్‌జీ ప్రత్యేకంగా చేయించారు. ఈ కార్యక్రమం తర్వాత జిల్లా ప్రచారక్‌ల వర్గ జరిగింది బెంగళూరులో. ఆ వర్గలో అశోక్‌ ‌సింఘాల్‌జీ హిందూహిందూ ఏక్‌రహే పాటను అందరికీ వినిపించారు. వారు కాన్పూరులో విభాగ్‌ ‌ప్రచారక్‌గా ఉన్న సమయంలో ఒక గూడ్సురైలులో గోవులను తరలిస్తున్నారనే సమాచారం తెలిసి, స్వయంసేవకులను వెంట బెట్టుకొని వెళ్లి, ఆ గూడ్సురైలు వాగన్‌ ‌తాళాలను బద్దలుకొట్టి, గోవులన్నింటినీ విడిపించి రైతులకు పంచారు. విరాట్‌ ‌హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. వారి కర్తృత్వ శక్తిని గుర్తించి, 1982వ సంవత్సరంలో విశ్వహిందూ పరిషత్‌క• వారిని పంపారు. విశ్వహిందూ పరిషత్‌ ‌రూపు రేఖలను మార్చినటువంటి కార్యకుశలత అశోక్‌ ‌సింఘాల్‌జీది. హిందూ సమాజానికున్నటు వంటి రుగ్మతలు, సమస్యలు పరిష్కారానికి అవసర మైన విధంగా ఆలోచించి, ప్రతి ఒక్క పనికీ ఒక విభాగాన్ని విశ్వహిందూపరిషత్‌లో ఏర్పాటు చేశారు..

మొట్టమొదటి వ్యవస్థ ధర్మప్రచార విభాగ్‌. ‌మహమ్మదీయులుగానూ, క్రైస్తవులుగానూ మారినటువంటి హిందువులను తిరిగి హైందవ ధర్మంలోకి తీసుకువచ్చే కార్యానికి ప్రాధాన్యతను ఇచ్చేది ధర్మప్రచార విభాగ్‌.  ‌ధర్మాచార్య సంపర్క విభాగ్‌, ‌సంస్కృతం, విశ్వవేద సంస్థాన్‌ ‌వేదాలకు సంబంధించిన పనిచేయడానికి, సేవా విభాగ్‌. అలాగే, పన్నెండు విభాగాలను ప్రారంభించి, దానికి తగినటువంటి కార్యకర్తలను ఇచ్చారు. స్వభావరీత్యా కూడా మనం గమనించినట్టు అయితే, దృఢమైనటు వంటి నిశ్చయం కలిగినటువంటివారు. మనసులోకి ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనను అమలు చేసేంత వరకూ విశ్రాంతి తీసుకోనివారు. కేవలం  ఆలోచన, యోజన మాత్రమే కాకుండా దానిని పూర్తిగా అమలు చేసే కార్యకర్తలు ఎక్కడెక్కడ ఉన్నారని వెతికి, సమర్ధువంతులైన వారిని ఆయా విభాగాలకు అందించిన వ్యవస్థ కూడా వారిదే. మొట్టమొదటగా, ధర్మ ప్రచార్‌ ‌విభాగ్‌లో పృధ్విరాజ్‌ ‌చౌహాన్‌ ‌వంశస్థులు, అజ్మీర్‌ ‌చుట్టుపక్కల ఉండేవారిని, బలవంతంగా మహమ్మదీయులుగా మార్చిన వారిని హిందువులుగా మార్చాలని సంకల్పం తీసుకుని ఆ   పని కొరకై కార్యకర్తలను నియుక్తి చేశారు. పదేళ్ల ప్రయత్నం తర్వాత, మహమ్మదీయులుగా మారిన లక్షన్నరమంది చౌహాన్‌ ‌వంశస్థు లను ఏక కాలంలో హిందువులుగా మార్చేటువంటి కార్యక్రమం పరిషత్‌ ‌చేసింది.

అప్పుడు మేవాడ్‌ ‌మహారాణా, మహారాణా భగవత్‌ ‌సింగ్‌ ‌సమస్య అశోక్‌ ‌సింఘాల్‌తో చర్చించారు. పృధ్విరాజ్‌ ‌మా పూర్వజుడే, మేం హిందూ ధర్మంలోకి వస్తాం. మా ఆడపిల్లలను మీరు చేసుకుంటారు కానీ, మా మగపిల్లలకి మీ ఆడపిల్లలను ఇస్తారా? రాజస్థాన్‌లో ఉండే రాజవంశస్థులందరూ మాతో కలిసి భోజనం చేస్తారా? ఈ సమస్య ఎదురవుతుందన్నప్పుడు మహారాణా భగవత్‌ ‌సింగ్‌తో చెప్పారు సింఘాల్‌జీ, రాజస్థాన్‌లో ఉన్న రాజవంశస్థులందరినీ ఉదయ్‌పూర్‌ ‌పిలవండి మాట్లాడదాం అన్నారు. రెండురోజులు జరిగిన సమావేశంలో వారితో మాట్లాడి, ఒప్పించారు. పరమపూజనీయ గురూజీ 1966లో జరిగిన కుంభమేళాలో జరిగినటువంటి విశ్వహిందూ సమ్మేళనంలో మతం మారినవారిని తిరిగి హిందువులలోకి తీసుకువస్తే అంగీకరించమన్న పూరి శంకరాచార్యుల వారిని ఏ రకంగా సమాధాన పరిచారో, అదే రీతిలో అశోక్‌జీ వారిని కూడా సమా ధానపరిచి, ఒకేసారి లక్షన్నరమందిని హిందుత్వం లోకి తెచ్చారు.

– ‌జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.