సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసు కుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవు తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. రాజకీయవేత్తలు, కళాకారుల కృషి ఫలించే సమయం. రచయితలకు శుభవార్తలు. 9,10 తేదీల్లో దూరప్రయాణాలు. ధన నష్టం, చికాకులు. విష్ణు ధ్యానం చేయండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

బంధువులు,స్నేహితులు ఒత్తి పెంచి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. మనోనిబ్బరంతో ముందడుగు వేయడం మంచిది. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది. వ్యాపారాలు ముందుకు సాగక ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒడుదుడుకులు ఎదుర్కొంటారు. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారు లకు శ్రమే మిగులుతుంది. 13,14 తేదీల్లో శుభ వార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. శ్రీకృష్ణస్తోత్రాలు పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

గతంలో జరిగిన ముఖ్యమైన సంఘ టనలు గుర్తుకు వస్తాయి. ఇంటి నిర్మాణంలో ఇబ్బందులు తొలగుతాయి. నిరుద్యోగులకు ముఖ్య సమాచారం. వ్యాపారాలు ప్రగతిపథంలో కొనసాగి ఉత్సాహంతో గడుపుతారు. ఉద్యోగస్తులకు కృషి ఫలిస్తుంది. కళాకారులు, వైద్యులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. క్రీడాకారుల ఆశలు ఫలిస్తాయి. 10,11 తేదీల్లో ఖర్చులు అధికం. ఆరోగ్య సమస్యలు. ప్రయాణాలు వాయిదా. గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

కాంట్రాక్టులు పొందడానికి యత్నాలు కలసి వస్తాయి. అనుకున్న రాబడి పొంది ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్య కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులు మరింత గుర్తింపు పొందు తారు. పరిశోధకులు, డాక్టర్లు అనుకున్న లక్ష్యాల వైపు సాగి విజయాలు సాధిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు. 8,9 తేదీల్లో మానసిక సంఘర్షణ. దూరప్రయాణాలు. ఇంటా బయటా ఒత్తిడులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

కుటుంబసభ్యులతో సత్సంబంధాలు మెరుగు పడతాయి. మీ సహనమే రక్షగా నిలుస్తుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులు కోరుకున్న విధంగా అవకాశాలు పొందుతారు. వాహన సౌఖ్యం. కళాకారులు, రచయితలకు చెప్పుకో తగ్గ అభివృద్ధి కనిపిస్తుంది. 13,14 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని ఒత్తిడులు ఎదురవుతాయి. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

బంధువుల విమర్శలతో మనస్తాపం కలుగు తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయత, అనురాగం పంచుకుంటారు. ఉద్యోగుల కృషి ఫలించి ఉత్సాహంగా సాగుతారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రచయితలు, వైద్యులకు అత్యంత ముఖ్య సమాచారం. 12,13 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. గణేశాష్టకం పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

భూ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు పైఅధికారుల ఆదరణ. వైద్యులు, పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు తొలగుతాయి. 8,9 తేదీల్లో దుబారా వ్యయం. ఇంటా బయటా చికాకులు. ఆప్తులతో విభేదాలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

ఆర్థిక పరిస్థితి ఊహించని రీతిలో మెరుగు పడు తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే సూచనలు. కళాకారులు, టెక్నాలజీ రంగం వారికి అనుకున్న అవకాశాలు దక్కుతాయి. 9,10 తేదీల్లో దూర ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలు వాయిదా. శ్రమ తప్పదు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలలో  అవరోధాలను పట్టుదలతో అధిగమిస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. 12,13 తేదీల్లో మానసిక ఆందోళన. కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. అనారోగ్యం. కాలభైరవాష్టకం పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణం ధనిష్ఠ 1, 2 పాదాలు

భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలలో అడుగు ముందుకు పడుతుంది. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. నాయకులు, కళాకారులకు ప్రయత్నాలు సఫలమవుతాయి. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. 13,14 తేదీల్లో ప్రయాణాలలో మార్పులు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుని సమర్థతను చాటుకుంటారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింతగా కలసివస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి కలుగుతుంది. పారిశ్రామివేత్తలు, వైద్యులకు విజయాలు వరిస్తాయి. 10,11 తేదీల్లో వృథా ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్యం కొంత ఇబ్బందిపెడుతుంది. గణేశుణ్ణి పూజించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందు తారు. నిరుద్యోగులు, విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలలో మీదే పైచేయిగా ఉంటుంది. ఉద్యోగు లకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తాయి. కళాకారులు, రాజకీయవేత్తలకు విజయాలు చేకూర తాయి. 11,12 తేదీల్లో కుటుంబంలో ఒత్తిడులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE