సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. శ్రమ ఫలి స్తుంది. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పైస్థాయి వారి నుంచి సహాయసహకారాలు అందుతాయి. కళాకారులకు ఈతిబాధలు తొలగుతాయి. రచయితలు, వైద్యుల సేవలు విస్తృతమవుతాయి. 19,20 తేదీలలో దూరప్రయాణాలు. స్నేహితుల నుంచి ఒత్తిడులు. గణేశాష్టకం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని శుభవార్తలు. వ్యాపార, వాణిజ్యవర్గాలపై ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందు తుంది. రాజకీయవేత్తలు అనుకున్నది సాధిస్తారు. కళాకారులు, వైద్యులు సమర్థతను నిరూపించుకుం టారు. 15,16 తేదీలలో దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. శివపంచాక్షరి పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. స్థిరాస్తులు కొనుగోలులో ఆటంకాలు తొలగి ఇతరులకు సహాయం అందిస్తారు. రావలసిన సొమ్ము సమకూరు తుంది. ఉద్యోగులకు విధుల్లో పొరపాట్లు తొలగు తాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రీడాకారులు మరింత స్ఫూర్తితో ముందుకు సాగుతారు 16,17 తేదీలలో కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. దేవీస్తుతి మంచిది.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయవేత్తలకు శుభవార్తలు. కళాకారులు, వైద్యరంగాల వారి సేవలు మరింత విస్తృతమవుతాయి. 17,18 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. గణేశాష్టకం పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపార, వాణిజ్యవర్గాల కృషి ఫలించక డీలాపడతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తలకు కొన్ని పర్యటనలు వాయిదా. కళాకారులు, పరిశోధకులకు నిరాశా జనకంగా ఉంటుంది. 15,16 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని నిర్ణ యాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. వాహనాలు, ఆభరణాలు సమకూరతాయి. వ్యాపారస్తులు ఒడి దుడుకులు తొలగి ఊరటు. ఉద్యోగులకు విధులలో ప్రశంసలు. క్రీడాకారులు, పరిశోధకులకు సంతోష కరమైన విషయాలు 18,19 తేదీల్లో దూర ప్రయాణాలు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆంజనేయ దండకం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
చిన్ననాటి స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగి స్తారు. వివాహ, ఉద్యోగయత్నాలలో ముందడుగు. వ్యాపార, వాణిజ్యవర్గాలకు అనుకూల సమయం. ఉద్యోగులకు కొంత భారం తగ్గుతుంది. కళాకారులకు ఊహించని అవకాశాలు. రచయితలు, క్రీడా కారులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. 16,17 తేదీలలో దూర ప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆదిత్య హృదయం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
దూరపు బంధువులతో కష్టసుఖాలు పంచు కుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు దక్కినా సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులు, పరిశోధ కులకు సమస్యలు తీరతాయి. 20,21 తేదీలలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూ, గృహయోగాలకు అవకాశం. వ్యాపార, వాణిజ్య వర్గాల ఆశలు ఫలిస్తాయి. పారిశ్రామికవేత్తల కృషి ఫలించి ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు. క్రీడా కారులు, పరిశోధకులకు కొన్ని అంచనాలు నిజంకాగలవు. 17,18 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. స్నేహితులతో అకారణంగా తగాదాలు. హనుమాన్ ఛాలీసా పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
నూతన విద్యావకాశాలు దక్కవచ్చు. వ్యాపార, వాణిజ్యవర్గాల యత్నాలలో అనుకూలత. ఉద్యోగు లకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగుతుంది. రాజకీయవేత్తలు మునుపటి కంటే కాస్త అనుకూల పరిస్థితులను చూస్తారు. కళాకారులు, క్రీడాకారులు ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. 16,17 తేదీ లలో ఆకస్మిక ప్రయాణాలు. వృథా ఖర్చులు. లక్ష్మీస్తుతి మంచిది.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవర్గాల యత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత శ్రేణి నుంచి పిలుపు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఊహించని ప్రభుత్వ ఆహ్వానాలు. రచయితలు, క్రీడాకారులకు పట్టింది బంగారమే. 15,16 తేదీల్లో ఆకస్మికప్రయాణాలు. రుణయత్నాలు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
శుభకార్యాలలో పాల్గొంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్య పరుస్తాయి. స్వల్ప అనారోగ్యం. వ్యాపార విస్తరణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగులకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కళా కారులకు వివాదాలు సర్దుకుంటాయి. క్రీడాకారులు, వైద్యుల యత్నాలు సఫలం. 18,19 తేదీల్లో మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించండి.