సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఆర్థిక పరిస్థితి చాలావరకూ మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. మీ ప్రతిపాదనలు అందరూ ప్రశంసిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూవివాదాలు తీరతాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. ఆపదలోని వారికి సైతం చేయూతనందిస్తారు. యత్నకార్యసిద్ధి. వ్యాపారులకు  లాభసాటిగా లావాదేవీలు నడుస్తాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రచయితలు, వైద్యులకు ముఖ్య విషయాలు తెలుస్తాయి. 21,22తేదీల్లో బంధువిరో«ధాలు. ఖర్చులు పెరుగుతాయి. శివపంచాక్షరి పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బం«ధువులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులు అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 17,18 తేదీల్లో దుబారా ఖర్చులు. శారీరక రుగ్మతలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలలో కొంత జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల ఇంట శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. వ్యాపారుల యత్నాలు సఫలం. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి విముక్తి. పారిశ్రామికవేత్తలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. క్రీడాకారులు, వ్యవసాయదారులకు కలసివచ్చే కాలం.  24,25 తేదీల్లో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరాలకు డబ్బు అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారులకు  లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులు విధి నిర్వహణలో సమర్థతను చాటుకుంటారు. కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. రచయితలు, వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది. 22,23 తేదీల్లో  వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం.  దూరప్రయాణాలు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఆర్థిక విషయాలు కొంత నిరాశ పరుస్తాయి. శ్రమానంతరం కార్యక్రమాలు పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం.  శుభకార్యాల రీత్యా ఖర్చులు ఎదురవుతాయి. వ్యాపారులకు లాభాలు మరింత దక్కవచ్చు. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. అదనపు బాధ్యతలు చేపడతారు. రాజకీయవేత్తల కృషి కొంత ఫలించవచ్చు. కళాకారులు, క్రీడాకారులకు ఊహించని ఆహ్వానాలు. 20,21 తేదీల్లో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు అనుకున్నదానికంటే అధిక లాభాలు తథ్యం. ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీయానం.  క్రీడాకారులు, వ్యవసాయదారులకు మనోధైర్యం పెరుగుతుంది. 20,21 తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ సమస్యలు. ఆదిత్య హృదయం పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు కొన్ని ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. ఆత్మీయులు మీపై మరింత ఆదరణ చూపుతారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు పడినా అవసరాలకు సొమ్ము అందుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలకు ప్రయత్నాలు కలసివస్తాయి. క్రీడాకారులు, వైద్యుల సేవలు విస్తృతమవుతాయి. 23,24 తేదీల్లో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. దేవీస్తుతి మంచిది.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. బంధువులతో విరోధాలు. అనారోగ్య సూచనలు. మిత్రులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరించాల్సి వస్తుంది. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. విద్యార్థులకు చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపారులు పెట్టుబడుల్లో నిదానం పాటించాలి. ఉద్యోగులకు ఇష్టంలేని మార్పులు ఉండవచ్చు. కళాకారులకు పర్యటనలు వాయిదా. క్రీడాకారులు, వైద్యులకు శ్రమా«ధిక్యం. 24,25తేదీల్లో  శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు.దుర్గామాతకు అర్చన చేయండి.

ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ఆలోచనలు అమలు చేస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. బంధువుల ప్రోద్బలంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కార్యక్రమాలు చకచకా పూర్తి కాగలవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు అన్ని విధాలా అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవేత్తలు అనుకున్నది సాధిస్తారు. కళాకారులు, రచయితల సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. 22,23 తేదీల్లో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. శివాష్టకం పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. కార్యక్రమాలను సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. తీర్థయాత్రలు సాగిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారులు నూతన ఆలోచనలతో ముందుకు సాగి లాభాలు గడిస్తారు. ఉద్యోగులు కొన్ని బాధ్యతలు చేపడతారు. రాజకీయవేత్తలకు నూతనోత్సాహం, వైద్యులు, క్రీడాకారుల ప్రయత్నాలు సఫలం. 23,24 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కొత్త  కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అమలుకు చర్యలు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారులు రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. రచయితలు, వైద్యులకు శుభవార్తలు.  24,25 తేదీల్లో  మానసిక అశాంతి.  ప్రయాణాలు. దేవీఖడ్గమాల పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. సేవాకార్యక్రమాలపై దృష్టి పెడతారు. వాహనసౌఖ్యం. కార్యజయం. ఇంటాబయటా మీకు ఎదురుండదు. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభించవచ్చు. పారిశ్రామికవేత్తలకు విశేష గౌరవం లభిస్తుంది. రచయితలు, వ్యవసాయదారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 22,23 తేదీల్లో బంధువిరోధాలు. ఆరోగ్యసమస్యలు. ఆంజనేయ దండకం పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.