సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపారులు ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు విధి నిర్వ హణలో సమస్య తీరుతుంది. రాజకీయ, కళారంగాల వారి యత్నాలు సఫలం. రచయితలు, క్రీడాకారులు అనుకున్నది సాధిస్తారు 23,24 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. శివపంచాక్షరి పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

భూవివాదాలు పరిష్కారమవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో కొన్ని విషయాలపై చర్చిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కుతాయి. వ్యాపారులు సకాలంలో విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు ఊహించని ఆహ్వానాలు రాగలవు. క్రీడాకారులు, పరి శోధకులకు అన్నింటా విజయమే. 22,23 తేదీల్లో వృథా ఖర్చులు. విష్ణునామ ధ్యానం చేయండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

బంధువులు,మిత్రుల నుంచి పిలుపు అందుతుంది. దైవకార్యాలలో పాల్గొంటారు. కొంత కాలంగా వేధిస్తున్న శారీరక రుగ్మతలు తీరతాయి. వాహనాలు, భూములు కొంటారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు కొత్త సంస్థల ఏర్పాటులో విజయం. కళాకారులు, పరిశోధ కులకు ఆశయాలు ఫలిస్తాయి. 24,25 తేదీల్లో బంధు వులతో తగాదాలు. వృథా ఖర్చులు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

ఇంటి నిర్మాణాలు ముమ్మరం చేస్తారు. ప్రము ఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. మీ అంచనాలు కొన్ని నిజం కాగలవు. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారులకు పెట్టు బడులు అనూహ్యంగా దక్కుతాయి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళా కారులకు అవకాశాలు పెరుగుతాయి. 26,27 తేదీల్లో బంధువులతో విభేదాలు. మానసిక అశాంతి. కనకధారా స్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తాయి. దేవాలయాలు సందర్శి స్తారు. భాగస్వాముల సలహాలతో వ్యాపారాలు విస్త రిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. కళాకారులకు యోగదాయకంగా ఉంటుంది. రచయితలు, క్రీడాకారుల కృషి ఫలిస్తుంది.27.28 తేదీల్లో మానసిక అశాంతి. దూరప్రయాణాలు. దేవీస్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. తీర్థ యాత్రలు చేస్తారు. వాహనాలు, భూములు కొంటారు. సమాజంలో విశేష గౌరవం. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. వ్యాపారులకు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రచయితలు, క్రీడాకారులకు నూతనోత్సాహం. 22,23 తేదీల్లో అనుకోని ఖర్చులు. కుటుంబ బాధ్యతలతో సతమత మవుతారు. ఆంజనేయ దండకం పఠించండి..

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

నిరుద్యోగులకు ఉద్యోగలాభ సూచనలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారులకు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. రచయితలు, క్రీడాకారులకు అనుకూల సమయం. 26,27 తేదీల్లో శారీరక రుగ్మతలు. స్నేహితులతో విరోధాలు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

కుటుంబంలో సమస్యలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శారీరక రుగ్మతలు. విద్యార్థులకు అవ కాశాలు చేజారవచ్చు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. కళా కారులకు కొంతమేర ఒత్తిడులు తప్పవు. క్రీడా కారులు, నాయకులకు ఒడుదొడుకులు. 24,25తేదీల్లో శుభవార్తలు. ఆకస్మిక వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి..

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

ప్రముఖులతో పరిచయాలు. రాబడి మరింత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. వేడుకలకు హాజరవుతారు. సాంకేతిక విద్యావకాశాలు దక్కు తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవేత్తలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కళాకారులు, పరిశోధకులకు పట్టింది బంగారమే. 26,27 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. దత్తస్తోత్రాలు పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణం ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలసి వస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త పోస్టులు లభిస్తాయి. రాజకీయవేత్తలకు నూతన పదవులు. క్రీడాకారులు, రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 23,24 తేదీల్లో బంధువిరోధాలు. మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ప్రముఖులతో చర్చలు సఫలం. వాహనసౌఖ్యం. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభ సాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం. రాజకీయవేత్తలకు శుభవార్తలు అందు  తాయి. రచయితలు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 25,26 తేదీల్లో కుటుంబంలో సమస్యలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. బంధువులతో సంబంధబాంధవ్యాలు మెరుగుపడతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి లభించే సూచనలు. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, రచయితల ఆశలు నెరవేరతాయి. 24,25 తేదీల్లో శారీరక రుగ్మతలు. స్నేహితులతో విభేదాలు. గణేశాష్టకం పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE