సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

కుటుంబంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపారు లకు లాభాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగు లకు కీలక సమాచారం అందుతుంది. రాజకీయ వేత్తలకు ఆహ్వానాలు రాగలవు. క్రీడా కారులు, సంగీత కళాకారులకు ఊహించని అవ కాశాలు. 2,3 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబంలో సమస్యలు.. శివాష్టకం పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు చేసు కుంటారు. తండ్రి తరఫు వారి నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనసౌఖ్యం. వ్యాపారులు అవ రోధాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. క్రీడాకారులకు గతం కంటే మెరుగైన పరిస్థితులుఉంటాయి. 6,7 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు శుభవార్తలు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారులు సంస్థలను విస్తరిస్తారు. ఉద్యోగులకు మరింత పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వ నుంచి ప్రోత్సాహం. 5,6 తేదీలలో స్వల్ప శారీరక రుగ్మతలు. కుటుంబంలో చికాకులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

ఆదాయం మరింత పెరిగి అవసరాలు తీర తాయి. గతంలో చేజారిన డాక్యుమెంట్లు లేదా ఆభరణాలు తిరిగి దక్కే అవకాశం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగులకు విధులు అనుకూలిస్తాయి. రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరమైన సమయం. కళాకారులు, రచయిత లకు కాస్త ఊరట.1,2 తేదీల్లో వృథా ఖర్చులు, బంధువిరోధాలు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

ఉద్యోగార్థులకు శుభవార్తలు అందుతాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. దూరప్రాంతాల నుంచి ఉపయుక్తమైన సమాచారం. వ్యాపారులకు తగినంత లాభాలు. ఉద్యోగులకు విధులు ప్రశాంతంగా సాగు తాయి. పారిశ్రామిక వర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం. రచయితలకు విశేషమైన కాలమని చెప్పాలి. 4,5 తేదీల్లో అనుకోని ప్రయా ణాలు. హనుమాన్‌ ‌చాలీసా పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

ప్రస్తుత పరిస్థితులను అధిగమిస్తూ అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారులకు పెట్టుబడులకు ఊహించని రీతిలో లాభాలు అందుతాయి. ఉద్యోగు లకు పని ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. క్రీడాకారులు, రచయిత లకు వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. 5,6 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. బంధువిరోధాలు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

బంధువులను కలుసుకుని మరింత ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు కృషి చేస్తారు.వ్యాపారులకు లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు లభిస్తాయి. రాజకీయవర్గాల సేవలకు విశేష గుర్తింపు రాగలదు. రచయితలు, సంగీత కళాకారులకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది. 6,7 తేదీల్లో ధనవ్యయం. శారీరక రుగ్మతలు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

ఆత్మీయుల నుంచి మరింత ఆదరణ లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. అనుకున్న రాబడి దక్కి సంతృప్తినిస్తుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభించే సూచనలు. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. రచయితలు, క్రీడాకారులకు మరింత ఉత్సాహం. 2,3 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. బంధు విరోధాలు. దేవీస్తుతి మంచిది.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధి కారుల ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరిశోధకులు, క్రీడాకారులు గందరగోళం నుంచి బయటపడతారు. 1,2 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. ఆంజనేయస్వామి దండకం పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణం ధనిష్ఠ 1, 2 పాదాలు

ఇంటి నిర్మాణయత్నాలలో కొంత పురోగతి ఉంటుంది. వ్యాపారులు భాగస్వాముల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయ వర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. రచయితలు, క్రీడాకారులు లక్ష్యాలు సాధిస్తారు 4,5 తేదీల్లో వృథా ఖర్చులు. స్నేహితుల నుంచి ఒత్తిడులు. గణేశాష్టకం పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారులు ఆశించినంత లాభాలు లేక నిరుత్సాహం చెందుతారు. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. కళారంగం వారి కృషి కొంత ఫలిస్తుంది. రచయితలు, సంగీతకళాకారులకు సామాన్యంగా ఉంటుంది. 3,4 తేదీల్లో వాహననయోగం. శుభవార్తలు. విష్ణుధ్యానం చేయండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగి స్తాయి. ఉద్యోగార్ధులకు సంతోషకర సమాచారం అందుతుంది. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో గందరగోళం తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమమవుతాయి. కళాకారులు, రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 6,7 తేదీల్లో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE