సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
నిరుద్యోగులు అవకాశాలు పెరుగుతాయి. కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గవచ్చు. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. క్రీడాకారులు, పరిశోధకులకు అనుకోని ఆహ్వానాలు రాగలవు. 24,25 తేదీల్లో కుటుంబంలో తగాదాలు. మానసిక ఆందోళన. ఖర్చులు. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆశ్చర్య కరమైన విషయాలు తెలుస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారులు మరింత లాభపడతారు. భాగస్వాములతో సఖ్యత. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. పరిశోధకులు, కళాకారులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. 25,26 తేదీలలో కష్టానికి ఫలితం కనిపించదు. సోదరులతో విభేదాలు. ఖర్చులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గృహనిర్మాణ యత్నాలు ముమ్మరం. దేవాలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. విద్యార్థు లకు అనుకున్న అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు గందరగోళం తొలగి లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. రచయితలు, క్రీడాకారులకు శుభవార్తలు. 26,27 తేదీల్లో కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విష్ణుధ్యానం చేయండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సమాజంలో విశేష కీర్తి పొందుతారు. ఆశించి నంత ఆదాయం. స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు పెట్టు బడుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు జరుగుతాయి. రాజకీయవేత్తలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు, రచయితలు విజయాలు సాధిస్తారు. 29,30 తేదీల్లో విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఆదిత్య హృదయం పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రాబడి అనూహ్యంగా పెరిగి అవసరాలు తీరతాయి. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు తగినంత లాభాలు. ఉద్యోగులకు విశేష ఆదరణ లభిస్తుంది. పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వపరంగా ఆహ్వానాలు అందుకుంటారు. రచయితలు, క్రీడాకారుల అంచనాలు ఫలిస్తాయి. 28,29 తేదీల్లో శారీరక రుగ్మతలు. స్నేహితులతో తగాదాలు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి. రాజకీయవేత్తలకు నూత నోత్సాహం. రచయితలు, క్రీడాకారులకు అరుదైన పిలుపు రావచ్చు. 25,26 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. స్నేహితులతో వివాదాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
బంధువులు మీ అభిప్రాయాలపై సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుం టాయి. దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని కార్య క్రమాలు సమయానికి పూర్తి. ఉద్యోగులు విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలకు శ్రమ ఫలిస్తుంది. రచయితలు, క్రీడాకారులకు నూత నోత్సాహం. 27,28 తేదీల్లో బంధువిరోధాలు. అనుకోని ఖర్చులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఆస్తుల విషయంలో వివాదాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులు లాభనష్టాలు సమానంగా భరించాల్సిన సమయం. ఉద్యోగులు మరిన్ని బాధ్యతల ఉక్కిరిబిక్కిరి కాగలరు. రాజకీయ వేత్తలకు గందరగోళం. కళాకారులు, క్రీడా కారుల కృషి ఫలించదు. 26,27 తేదీలలో శుభ వర్తమానాలు. ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
కష్టసాధ్యమైన కార్యక్రమాలను సైతం అవలీలగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. రాబడి అనూహ్యంగా పెరుగుతుంది. విద్యార్థుల యత్నాలలో అనుకూలత. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయవేత్తలు అనుకున్నది సాధిస్తారు. కళా కారులు, పరిశోధకుల కృషి కొంత ఫలిస్తుంది. 29,30 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. హనుమాన్ ఛాలీసా పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. కుటుంబంలో మీపై విశేష ఆదరణ కనబడుతుంది. భూవివాదాలు కొల్కిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో మరింత సానుకూలత. కళాకారులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. రచయితలు, క్రీడాకారులకు ఊహించని పిలుపు రావచ్చు. 28,29 తేదీల్లో స్నేహితుల నుంచి ఒత్తిడులు. ఖర్చులు అధికంగా ఉంటాయి. దుర్గాస్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ఊహించని మార్పులు సంతోషం కలిగిస్తాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. కళాకారులు, క్రీడాకారులకు విజయాలు. 26,27తేదీల్లో కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
చిన్ననాటి స్నేహితులతో కష్టసుఖాలు విచా రిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారులకు క్రమేపీ లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఎదురయ్యే ఇబ్బందులు అధిగమించి దూసుకు వెళతారు. రాజకీయవేత్తలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు, రచ యితలు అనుకున్నది సాధిస్తారు. 28,29 తేదీలలో బంధువర్గంతో తగాదాలు. మానసిక అశాంతి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.