సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఒక సంఘటన మీలో మార్పునకు కారణమవుతుంది. వ్యాపారులు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. పారిశ్రామికవేత్తలు ఇబ్బందుల నుంచి బయటపడతారు. రచయితలు, క్రీడాకారుల ఆలోచనలు ఫలిస్తాయి. 15,16 తేదీలలో అనుకోని ప్రయాణాలు. వృథా ఖర్చులు. శివస్తోత్రాలు పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం కొంత మెరుగుపడే సూచనలు. ఇంటి నిర్మాణాలలో ముందడుగు వేస్తారు. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుం టారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూలత. పారి శ్రామికవేత్తలు సంస్థల విస్తరణలో విజయం పొందు తారు. క్రీడాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 16,17 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

సంఘంలో పలుకుబడి పెంచుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలమైనరీతిలో మలచుకుం టారు. మీ నిర్ణయాలపై కుటుంబసభ్యులు సంతోషి స్తారు. వ్యాపారులు ఆశించినంతగా లాభాలు గడి స్తారు. రచయితలు, క్రీడాకారులు లక్ష్యసాధనలో ముందుకు సాగుతారు. 11,12 తేదీల్లో అనుకోని ఖర్చులు. కుటుంబ సమస్యలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

భూవివాదాలు కొలిక్కి వస్తాయి. సమాజసేవలో పాలుపంచుకుంటారు. కార్యక్రమాలు కొంత కష్టమైనా సకాలంలో పూర్తి చేస్తారు. నూతన విద్య, ఉద్యోగావ కాశాలు. ఆహ్వానాలు అందుకుంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు హోదాలు రాగలవు. రాజకీయవేత్తలు సత్తా చాటుకుంటారు. 13,14 తేదీల్లో బంధువులతో తగాదాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. సూర్యస్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని కీలక నిర్ణయాలు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపు తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.  తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. క్రీడాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. 15.16 తేదీల్లో వ్యయప్రయాసలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

ఆలయాలు సందర్శిస్తారు. గతంలో చేజారిన డాక్యుమెంట్లు తిరిగి లభ్యమవుతాయి. శుభకార్యాలపై బంధువులతో చర్చిస్తారు. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాల పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఒక సంతోషకర సమాచారం రాగలదు. రాజకీయవేత్తల ప్రయత్నాలు సఫలం. పరిశోధకులు, వైద్యుల ఆశ యాలు నెరవేరతాయి. 16,17 తేదీలలో దూర ప్రయాణాలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి. కీలక సమావేశాలకు హాజ రవుతారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఎదురవుతాయి. దైవ కార్యాలు చేపడతారు. రాజకీయవేత్తలకు సంతోష కరమైన సమా చారం అందుతుంది. కళాకారులు, రచయితల శ్రమ ఫలిస్తుంది. 13,14 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. విష్ణుధ్యానం చేయండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

తరచూ ప్రయాణాలు సంభవం. ఆదాయ, వ్యయాలు సమానస్థాయిలో ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడి ఉపశమనం. సోదరుల నుంచి పిలుపు. కొన్ని ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. పారిశ్రామికవర్గాలకు కంపెనీల ఏర్పాటు విజయం.  11,12 తేదీల్లో కుటుంబంలో సమస్యలు. వివాదాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

ఆదాయం మెరుగ్గా ఉండి కొన్ని అప్పులు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సానుకూలం. ఉద్యోగస్తులకు కీలక సందేశం అందుతుంది. రాజకీయవేత్తలు అనుకున్నది సాధిస్తారు. రచయితలు, క్రీడాకారులకు శుభవర్త మానాలు. 13,14 తేదీల్లో అనారోగ్యం. స్నేహితు లతో విభేదాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణం ధనిష్ఠ 1, 2 పాదాలు

నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు తప్పక పోవచ్చు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారులు కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులకు పనిభారం మరింత పెరుగుతుంది. కళాకారులకు ఒత్తిడులు ఎదురవుతాయి. 14,15 తేదీల్లో శుభ వార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. ఆహ్వానాలు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులకు ఉత్సాహ వంతంగా ఉంటుంది. వ్యాపారులకు మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఊహించని పోస్టులు రావచ్చు. కళాకారులు, రచయితల ఆశలు నెరవేరతాయి. 16,17 తేదీల్లో మానసిక అశాంతి. కుటుంబసభ్యులతో తగాదాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలపై కుటుంబంలో ప్రస్తావిస్తారు. కొన్ని నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. వ్యాపారులు ఒడి దుడుకులు అధిగిస్తారు. ఉద్యోగులు విధులలో ముంద డుగు వేస్తారు. కళాకారులు అవకాశాలు సొంతం చేసుకుంటారు. 12,13 తేదీల్లో మానసిక అశాంతి. అనారోగ్యం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE