– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి పిలుపు. నిరుద్యోగులకు అనుకోని ఉపాధి అవ కాశాలు. విద్యార్థులు ప్రతిభను చాటుకుని గుర్తింపు పొందుతారు. శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు తోడవుతారు. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. పారిశ్రామిక వేత్తలు నూతనోత్పత్తుల దిశగా వ్యూహాలు రూపొం దిస్తారు. 7,8 తేదీల్లో దుబారా ఖర్చులు. మానసిక అశాంతి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. ఆదాయం ఆశించినంతగా సమకూరి అవసరాలు తీరతాయి. నేర్పుతో సమస్యల నుంచి బయటపడతారు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి. కొత్త ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం. పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ అను మతులు లభిస్తాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా గడుస్తుంది. 9,10 తేదీల్లో అలసట, బంధువులతో తగాదాలు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంత రాలు తొలగుతాయి. అనుకున్న రాబడి దక్కినా అదనపు ఖర్చులు. ఇంటిలో శుభకార్యాల సందడి నెలకొంటుంది. బంధువులతో విభేదాలు తొలగు తాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండ వచ్చు. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం. రచయితలు, క్రీడాకారులకు విశేష ఆదరణ పొందుతారు. 12,13 తేదీల్లో వైద్యసేవలు, మానసిక ఆందోళన. ఆంజనేయ దండకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఇంటిలో శుభపరిణామాలు. వాహనయోగం. కోర్టు వ్యవహారాలు కీలక దశకు చేరతాయి. వ్యాపారులు భాగస్వాములను పెంచుకుంటారు. అలాగే, క్రయవిక్రయాలు మరింత ఊపందు కుంటాయి. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వైద్యులు, కళాకారులు అనుకున్న అవ కాశాలు దక్కించుకునే దిశగా ముందుకు సాగుతారు. 11,12 తేదీల్లో అనారోగ్యం, మానసిక ఆందోళన. శ్రమాధిక్యం. నృసింహ స్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

నిరుద్యోగులకు ఉప్యాధి లభించే అవకాశాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ. వ్యాపారాలు కొత్త భాగ స్వాములు, పెట్టుబడులతో కళకళలాడతాయి. ఉద్యోగుల సేవలు గుర్తింపు. పారిశ్రామికవేత్తలు ఉత్పత్తులపై దృష్టి సారిస్తారు. కళాకారులు, రచయితలు, రాజకీయవేత్తల యత్నాలు సఫలం. 9,10 తేదీల్లో వైద్యసేవలు, దూర ప్రయాణాలు ఉండవచ్చు. శివాష్టకం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడు తుంది. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. బంధువులతో బాంధవ్యాలు మెరుగు పడతాయి. పారిశ్రామికవేత్తలు అనుకున్న పెట్టుబడు లతో ఉత్సాహంగా సాగుతారు. రాజకీయవేత్తలు, కళాకారులు అనుకున్నది సాధిస్తారు. 11,12 తేదీల్లో లేనిపోని ఖర్చులు. మనశ్శాంతి లోపం. ఆకస్మిక ప్రయాణాలు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

దూరపు బంధువులు మీపై ఉంచిన బాధ్యతలు నిర్వహించేందుకు శ్రమిస్తారు. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు జరిగే వీలుంది. పారి శ్రామిక వేత్తలకు ప్రభుత్వసంస్థల ఇబ్బందులు ఎదురుకావచ్చు. రచయితలు, క్రీడాకారులకు అవకాశాలు చేజారి నిరాశ కలిగిస్తాయి. 9,10 తేదీల్లో వస్తు లాభాలు. ఉద్యోగలాభం. యత్నకార్యసిద్ధి. కనక దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

రుణబాధల నుంచి కొంత విముక్తి. విద్యార్థులకు మరింత వెసులుబాటు కలుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు వైద్యులు, రచయితలు, కళాకారులు సత్తా చాటు కునేందుకు అవకాశం. 12,13 తేదీల్లో అనారోగ్యం, వైద్యసేవలు, తండ్రి తరఫు వారితో కలహాలు.  శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ఆదాయం సమృద్ధిగా ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించే సమయం. ఉద్యోగాలలో మీ సమర్థత పైస్థాయి వారు గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, నూతన కంపెనీల ఏర్పాటులో విజయం. రాజకీయ వేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు. 7,8 తేదీల్లో శారీరకపరమైన రుగ్మతలు, దూరప్రయాణాలు, వ్యయప్రయాసలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మధ్యలో కొద్దిపాటి చిక్కులు కలిగినా అధిగమిస్తారు. ఉద్యోగు లకు మంచి కాలమనే చెప్పాలి, కోరుకున్న బదిలీలు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతికరంగాల వారు విజయాల బాటలో సాగుతారు. కళాకారులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. 11,12 తేదీల్లో శారీరక రుగ్మతలు. బంధువిరోధాలు. ప్రయాణాలు వాయిదా. లక్ష్మీనృసింహ కరావలంబం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

నిరుద్యోగులకు అవకాశాలు. విద్యార్థుల అంచ నాలు నిజం. నూతన పరిచయాలు సంతోషం కలిగి స్తాయి. వ్యాపారాలు మరింతగా అనుకూ లిస్తాయి. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైద్యులు, పారిశ్రామిక వేత్తలకు విదేశీ పర్యటనలు, క్రీడాకారులు, సాంకేతిక నిపుణులకు ఆహ్వానాలు రాగలవు. 11,12తేదీల్లో శారీరక రుగ్మతలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

నూతన వ్యక్తులు పరిచయం కాగలరు. నిర్ణయా లలో మరింత చురుగ్గా వ్యవహరిస్తారు. వ్యాపారా లలో తగాదాలు పరిష్కారం, మీ పట్టుదల, క్రమశిక్షణ వల్ల మరింత విస్తృతమవుతాయి. ఉద్యోగాలలో ప్రతిభను చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలకు ఊహించని విధంగా విదేశీయానం. వైద్యులు, కళా కారులు పట్టుదలతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. 12,13 తేదీల్లో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. విష్ణుధ్యానం మంచిది.

About Author

By editor

Twitter
YOUTUBE