ఎ. సూర్య ప్రకాష్
భారతదేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుని, చట్టబద్ధంగా ఎన్నికైన మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని పాశ్చాత్య దేశాలకు, సంస్థలకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన విజ్ఞప్తి ఫలించిందనడానికి ఇప్పుడు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. 2014 నుంచి లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని ఓడించడంలో రాహుల్ గాంధీ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే లండన్‌లోనూ, ఇతర విదేశాలలో ఏర్పాటు చేసిన సభలలో ప్రసంగిస్తూ భారతదేశంలో “ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి” పాశ్చాత్య దేశాలు సహాయం చేయడం లేదని ఆయన వాపోయారు. అంటే, బీజేపీని ఓడించడంలో కాంగ్రెస్‌కు అవి సహాయపడటం లేదని దాని అర్థం. భారతదేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవాలని అంతర్జాతీయ శక్తులకు ఆయన చేసుకున్న ఈ సిగ్గుమాలిన విజ్ఞప్తికి అప్పట్లో పెద్దగా స్పందన రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం పాశ్చాత్య దేశాలు, భారత్‌లో జాతి వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నట్లు కనిపిస్తోంది.
మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దిశగా ఒక అరాచక ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రారంభించారు. అయితే అదే సమయంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలపై భారతదేశానికి ఉపన్యాసాలు ఇచ్చే బాధ్యతను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం తీసుకుంది. నిరసనకారులను సామూహికంగా నిర్బంధిస్తున్నారన్న నివేదికలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నానని, వారిని “ఏకపక్షంగా నిర్బంధించారని” అది పేర్కొంది. ప్రజాస్వామ్య సంప్రదాయాలు, మానవ హక్కులకు అనుగుణంగా ప్రభుత్వం “అత్యంత సంయమనం పాటించాలని” సలహా ఇచ్చింది. అలాగే, ఏకపక్షంగా నిర్బంధించిన వారందరినీ “బేషరతుగా విడుదల చేయాలని” డిమాండ్ చేసింది. ఈ ఏడాది జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) హింసాత్మక నిరసన నిర్వహించి, నిరసనకారులు పార్లమెంటులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఢిల్లీ పోలీసులు గట్టిగా జోక్యం చేసుకోకపోయి ఉంటే, ఆ హింసాత్మక గుంపు పార్లమెంటులోకి దూసుకెళ్లి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ఎంపీల భద్రతకు ముప్పు కలిగించేది. ఈ అరాచకాన్ని ఖండించడానికి బదులుగా, “శాంతికాముకులైన నిరసనకారులతో” చర్చలు జరిపి, వారి ఆందోళనలను పరిష్కరించాలని ఐక్యరాజ్యసమితి సంస్థ భారత ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. “శాంతియుతంగా సమావేశాలు నిర్వ హించుకునే హక్కును పూర్తిగా గౌరవించాలి. దానికి మార్గం సుగమం చేయాలి. అవసరమైతేనే శాంతి యుత నిరసనలపై ఆంక్షలు విధించాలని మేము అధికారులకు పిలుపునిస్తున్నాము” అని పేర్కొంది. అయితే ఆనాటి వీడియోలను చూసిన పక్షంలో ఆ నిరసన ఏమాత్రం “శాంతియుతం” కాదు. అది అరాచకాన్ని సృష్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.
ఈ “ఆమోదయోగ్యం కాని జోక్యం”, “తీవ్రమైన పక్షపాతం” పట్ల భారతదేశం తీవ్రంగా స్పందించింది. భారతదేశం పటిష్టమైన సంస్థలతో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఇందులో శాంతియుత సమావేశాలకు రాజ్యాంగ హామీ ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పొరుగు దేశమైన పాకిస్తాన్లో నిరసనలపై హింసాత్మక ప్రతిస్పందనలను ఐక్యరాజ్యసమితి విస్మరించడం ద్వారా దాని “పక్షపాతాన్ని” విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు. ఇటువంటి “ద్వంద్వ ప్రమాణాలు” ఐక్యరాజ్యసమితి ప్రతిష్టను, విశ్వసనీయతను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత చైతన్యవంతమైన ప్రజాస్వామ్య దేశ పౌరులుగా, ప్రజాస్వామ్యంపై మనకు ఉపన్యాసాలు ఇచ్చే ధైర్యాన్ని ఈ ఐక్యరాజ్యసమితి సంస్థ ఎక్కడ, ఎలా సంపాదించిందో మనం తెలుసుకోవాలి. భారతదేశంపై విమర్శలు చేయడానికి పాశ్చాత్య సంస్థలను నిరంతరం రెచ్చగొడుతున్న రాహుల్ గాంధీపైనే ఈ నిందను పూర్తిగా మోపాలి. ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరిస్తుండటం అత్యంత శోచనీయం.
మస్క్‌ను వెనకేసుకొచ్చిన కాంగ్రెస్
అమెరికా నుంచి భారత్‌కు వ్యతిరేకంగా వస్తున్న అత్యంత ప్రమాదకరమైన సంకేతం గురించి ఇప్పుడు చూద్దాం. దీని మూలాలు రాహుల్ గాంధీలో ఉన్నాయి. ట్రిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న అమెరికన్ పారిశ్రామికవేత్త, వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ ఇటీవల చేసిన ట్వీట్లు భారత్ వ్యతిరేక సంకేతాలకు నిదర్శనం. ఎలాన్ మస్క్ ఇటీవల ‘X’ అనే ప్లాట్‌ఫామ్‌పై పెట్టిన ఒక పోస్ట్‌లో, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించే తన కంపెనీ స్టార్‌లింక్‌కు ప్రపంచవ్యాప్తంగా 165 దేశాలలో లైసెన్సులు లభించినప్పటికీ, భారతదేశంలో ఇంకా లైసెన్స్ రాలేదని అన్నాడు. ఆ తర్వాత ఆయన, “భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?” అని ప్రశ్నించాడు. భద్రతా కారణాల వల్ల శాటిలైట్ లైసెన్స్ ఇవ్వడంలో భారతదేశం చేస్తున్న జాప్యంపై ఆయన వ్యక్తం చేసిన నిరాశ, దానికి అంతే అహంకార పూరితంగా స్పందించిన తీరు నేపథ్యంలో ఈ వ్యాఖ్యను చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో దృఢంగా ఉంది. వాణిజ్యపరమైన ప్రయోగాలకు ముందు ఆపరేటర్లందరూ తప్పనిసరి భద్రతా, నియంత్రణ అనుమతులను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
విచిత్రంగా, ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్‌కు రాహుల్ గాంధీ వెంటనే స్పందించారు. “భారత దేశానికి స్వాగతం, ఎలాన్. ఆ రెండో వ్యక్తి (అదానీని ఉద్దేశించి) ఎవరో తెలిసే వరకు ఆగు” అని అన్నారు. మస్క్ వెంటనే స్పందిస్తూ, “ధన్యవాదాలు రాహుల్, ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం” అని అన్నాడు. ఆ తర్వాత మస్క్ మళ్లీ ట్వీట్ చేశాడు. ఆయన తర్వాతి ట్వీట్లు దిగ్భ్రాంతిని కలిగించాయి. అత్యంత నీచమైన అహంకారాన్ని ప్రదర్శించాయి. “ప్రియమైన ప్రధానమంత్రి అంబానీ, భారతదేశానికి అసలైన యజమాని మీరేనని గ్రహించనందుకు దయచేసి నా వినయపూర్వకమైన క్షమాపణలను స్వీకరించండి. సహజంగానే, మీరు భారతదేశంలోని ప్రజలపై గుత్తాధిపత్యంతో కూడిన దోపిడీని కొనసాగించడానికే ఇష్టపడతారు. అయినప్పటికీ మీతో పోటీపడటానికి స్టార్‌లింక్‌ను అనుమతిస్తారా? చాలా దేశాలలో ఉన్నట్లే, భారతదేశంలో కూడా ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ఇది పిల్లలకు విద్యావకాశాలను, చిన్న వ్యాపారాలకు తమ వస్తువులను ప్రపంచ మార్కెట్లో అమ్ముకునే అవకాశాన్ని దూరం చేస్తోంది. స్టార్‌లింక్ వారి జీవితాలను మరింత మెరుగ్గా మారుస్తుంది”అని ఎలాన్ మస్క్ వాటిలో పేర్కొన్నాడు. అయితే, భారతదేశంలో, ముఖేష్ అంబానీ సేవలు అందించలేని ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలను అందించగలనని ఈ అహంకారి అనుకుంటున్నాడు! భారత్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన అతిపెద్ద వ్యాపార సంస్థ కంటే తాను మెరుగ్గా చేయగలనని, భారతదేశంలోని పేద ప్రజలకు, చిన్న వ్యాపారాలకు ఇంటర్నెట్ అందుబాటులో లేదని అతను భావిస్తున్నాడు. అతడి భావన పూర్తిగా పనికిమాలినది, ప్రతి ఒక్కరూ ఖండించవలసినది. 12 సంవత్స రాలకు పైగా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పట్ల తన పూర్తి మర్యాదారాహిత్యాన్ని, ఉద్దేశపూర్వక అగౌరవాన్ని ప్రదర్శిస్తూ, ముఖేష్ అంబానీని భారతదేశ “ప్రధానమంత్రి” అని వర్ణించేంత తెగింపు అతడికి ఉంది. అతడితో పలకరింపులు, మర్యాద పూర్వక సంభాషణలకు రాహుల్ గాంధీ సంబరపడి పోతున్నారు. తగుదునమ్మా అంటూ మస్క్‌ను మనదేశానికి ఆహ్వానించారు!
జియోకు జయం.. మస్క్‌కు పరాభవం
రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన జియో ఐపీఓకు భారత ప్రజలు బ్రహ్మాండంగా స్పందించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత దేశంలో మార్కెట్ క్యాప్ పరంగా జియోను రెండవ అతిపెద్ద కంపెనీగా నిలపడం ద్వారా ఎలాన్ మస్క్‌కు గట్టి చెంపదెబ్బ కొట్టారు. 79 లక్షల వాటాదారులతో జియో దేశంలోనే అతిపెద్ద వాటాదారుల కుటుంబంగా కూడా ఉంది. ఎలాన్ మస్క్‌కు అహంకారం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం చేసుకోవాలి. మోదీ ప్రభుత్వంపై మస్క్‌కు పెరుగుతున్న అసహనాన్ని, కొంతకాలం క్రితం బొలీవియా గురించి ఆయన అన్న మాటల నేపథ్యంలో చూడాలి. ఒక దేశం నుంచి తమకు కావలసినది పొందడానికి అవసరమైతే, తానూ, అమెరికన్ డీప్ స్టేట్ కలిసి ఆ దేశంలో తిరుగుబాటు చేయిస్తామని ఆయన బహిరంగంగా అంగీకరించాడు. బొలీవియాలోని లిథియం నిల్వలను తక్కువ ధరకు వినియోగించుకోవడానికి లైసెన్స్ కావాలన్న మస్క్ డిమాండ్‌కు బొలీవియా అధ్యక్షుడు తలొగ్గలేదు. దాంతో ఆయనను పదవి నుంచి తొలగించడానికి ఆ దేశంలో తిరుగుబాటు చేయించడానికి అమెరికాను మస్క్ ఉసిగొల్పాడు. ఇదే విషయంపై ఆయనను ఎక్స్ సామాజిక మాధ్యమంలో ఒకరు “దోషి”గా నిందించారు. దానికి బదులుగా “మేము కావాలంటే ఎవరిపైన అయినా తిరుగుబాటు చేయించగలము. చేతనైతే దానిని ఎదుర్కోండి” అని మస్క్ ట్వీట్ చేశాడు. “తిరుగుబాటు” చేయించడం పట్ల తన సామర్థ్యాన్ని మస్క్ ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారు. దీనిని స్టార్‌లింక్‌కు లైసెన్స్ కేటాయింపులో జాప్యంపై మోదీ ప్రభుత్వం పట్ల మస్క్లో నెలకొన్న నైరాశ్యం, భారత్‌లో ప్రస్తుతం రాహుల్ గాంధీ సృష్టించిన గందరగోళం, ఎలాన్, రాహుల్ మధ్య ఉన్న స్నేహం వంటి అంశాల నేపథ్యంలో చూడాలి. అందుకే, ముకేశ్ అంబానీని భారతదేశ ప్రధానమంత్రి అని అత్యంత అమర్యాద కరంగా సంబోధించిన మస్క్‌తో స్నేహం పట్ల కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుడు సంబరపడిపోతున్నారు. ఎలాన్ మస్క్‌ను మందలించి, “భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం. అది వలస దేశం కాదు. మేము ప్రపంచాన్ని స్వాగతిస్తాము. మా భవిష్యత్తును నిర్ణయించేది పాశ్చాత్య స్వార్థశక్తులు, వారి ద్వంద్వ ప్రమాణాలు లేదా అమెరికన్ బిలియనీర్ కాదు. మా భవిష్యత్తును భారత ప్రజలమైన మేమే నిర్ణయించుకుంటాము” అని ఎలాన్ మస్క్‌కు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ చురకలేశారు. కమల్ హాసన్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఎంతైనా ఉంది.
ఎఫ్‌సీఆరఏ బిల్లుతో పాశ్చాత్యులకు వణుకు
అమెరికన్, పాశ్చాత్య సంస్థలు భారత్ వ్యతిరేక భావనను ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి అనే దానికి కారణం స్పష్టంగా ఉంది. ప్రస్తుతం విదేశీ సహకార(నియంత్రణ) చట్టం(ఎఫ్‌సీఆరఏ) బిల్లు పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉంది. ఆ బిల్లుకు ప్రతిపాదిత సవరణలను పార్లమెంటు చేపట్టడానికి చర్చి, క్రైస్తవ మత ప్రచారకులు ససేమిరా అంటున్నారు. సవరణలు చేపట్టకుండా అమెరికన్, పాశ్చాత్య సంస్థల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. మత మార్పిడులను ప్రోత్సహించే మత సంస్థలకు నిధుల ప్రవాహాన్ని నిరోధించడానికి, విదేశీ విరాళాల చట్టాన్ని కఠినతరం చేయడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. ప్రభుత్వ వైఖరి పట్ల క్రైస్తవ సంస్థలు అసంతృప్తితో ఉన్నాయి. అందుకే మొత్తం పాశ్చాత్య మీడియా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది.
భారత్‌కు వ్యతిరేకంగా విదేశీ సోషల్ మీడియా
ప్రతి భారతీయుడిని ఆందోళనకు గురిచేస్తున్న తదుపరి పరిణామం ఏమిటంటే, పాకిస్తానీ మీడియా, పాకిస్తానీ, బాంగ్లాదేశీ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రాహుల్ గాంధీని, కాక్రోచ్ జనతా పార్టీని అదేపనిగా పొగిడేయడం, వారిపై ప్రశంసలు కురిపించడం. భారత యువతను ప్రభావితం చేసి, వారిని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మార్చాలని పాకిస్తాన్, బాంగ్లాదేశ్లలోని యూట్యూబర్లు ఆశిస్తున్నారు. వారు ఆందోళనకారులను ప్రోత్సహించడమే కాకుండా, భారతదేశంలో మోదీ వ్యతిరేక భావజాలాన్ని రెచ్చగొట్టేందుకు ఢిల్లీలో పోలీసుల గురించి, ఆందోళనకారుల హత్యల గురించి తప్పుడు వార్తలను కూడా ప్రచారం చేస్తున్నారు. పాకిస్తానీ, బాంగ్లాదేశీ మీడియా, సోషల్ మీడియా ప్రభావశీలురు (ఇన్ఫ్లుయెన్సర్లు), అక్కడి రాజకీయ నాయకులు పాల్పడుతున్న ఈ దుశ్చర్యను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అత్యంత బాధాకరం.
నేహా బోరా నిజస్వరూపం
బాంగ్లాదేశ్‌లో చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయడానికి జరిగిన తిరుగుబాటును కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్)కు అనుబంధంగా ఉన్న ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నేహా బోరా ప్రశంసించారు. దానిని నడిపించిన వారిని అభినందించారు. ఇది భారతదేశంలో కూడా పునరావృతం కావాలని అన్నారు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని హింసాత్మకంగా కూలదోయాలనేది ఆమె ఉద్దేశ్యం. ఆ విధంగా నేహా బోరా అసలు రంగు బైటపడింది. ఏప్రిల్, 2010లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడి చేసి చంపేశారు. ఆ సందర్భంగా, ఢిల్లీలోని జేఎన్‌యూ క్యాంపస్‌లో సంబరాలు చేసుకున్న పార్టీకి నేహా బోరా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజాస్వామ్యం పట్ల తీవ్రమైన ధిక్కార భావం ఉన్న పార్టీకి చెందిన ఈ మహిళ, “భారతదేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ” కోసం పోరాడుతున్నానని ప్రస్తుతం చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి పోస్టర్ గర్ల్‌గా మారారు. అంతేకాకుండా, బాంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక అల్లర్లను రాడికల్ ఇస్లామిస్టులు ప్రేరేపించారు. ఆ ఆందోళనల సమయంలో ఎంతో మంది హిందువులను కొట్టి చంపారు. అనేక హిందూ దేవాలయాలపై దాడి చేసి వాటిని తగలబెట్టారు. ఈ దురాగతాలను ఎవరు మర్చిపోగలరు? అయితే వీటన్నింటిని నేహా బోరా సమర్థిస్తున్నారు. ఈ దారుణాలకు వత్తాసు పలుకుతున్నారు. మరి బాంగ్లాదేశ్‌లో హింసాత్మక పద్ధతులలో జరిగిన అధికార మార్పిడిని, ఆ దేశంలోని హిందూ మైనారిటీలపైకి అరాచక మూకలు విరుచుకు పడటాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదిస్తుందా? ఆశ్చర్యకరంగా, బాంగ్లాదేశ్‌లో హిందువులపై అరాచక మÖకల దాడిని సమర్థించిన వ్యక్తితో(నేహా బోరా) కలిసి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇటీవల సుప్రీంకోర్టుకు పాదయాత్ర చేశారు. ఆ క్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎనఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ సభ్యులను పక్కకు నెట్టేయడం కనిపించింది.
బొద్దింకల పార్టీ అరాచకం
అమెరికన్ డీప్ స్టేట్ సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)ని మనం ఎలా మర్చిపోగలం? మోదీ నాయకత్వంలో భారతదేశం సాధించిన అసాధారణ ప్రగతిని జీర్ణించుకోలేక, బాంగ్లాదేశ్, నేపాల్ దేశాలలో జరిగినట్టుగా చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభు త్వాన్ని కూలదోయడానికి అది కుట్ర పన్నుతోంది. ఇప్పుడు ఈ బొద్దింకల పార్టీకి అమెరికన్లు నిధులు సమకూరుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. విచిత్రంగా, ఈ బొద్దింకల పార్టీ కొంతకాలం క్రితం అమెరికాలోని బోస్టన్‌లో అభిజీత్ దీప్కేతో మొదలైంది. అతడు బోస్టన్‌లో చదువుకుంటూ, భారతదేశంలో నిరసనలు నిర్వహిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. విద్యార్థులు, యువతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సీజేపీ పుట్టుకొచ్చింది. అందుకే అది నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసును చేపట్టింది. ఈ సంవత్సరం 22 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. కానీ పేపర్ లీక్ స్కామ్ తరువాత, పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించారు. ఈ పునఃపరీక్షతో తీవ్ర నిరాశకు గురైన సుమారు డజను మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో, పేపర్ లీక్ పట్ల యావత్ విద్యార్థి సమాజంలో తీవ్రమైన ఆగ్రహం నెలకొంది. దీనికి తోడు ఇలాంటివే ఇతర పేపర్ లీక్ కేసులు కూడా ఉన్నాయి. ఈ అంశాన్ని సీజేపీ చేపట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. చివరికి ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు, అలాగే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ(ఎసఐఆర్)కు వ్యతిరేకంగా సీజేపీ ఆందోళన ప్రారంభించింది. నవంబర్ 1న జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండి కూటమి రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనకు మద్దతును ప్రకటించింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా వారి పదవులకు రాజీనామా చేయాýంటూ సీజేపీ నాయకులు, మద్దతుదారులు అదేపనిగా డిమాండ్ చేస్తున్నారు.
కాబట్టి, విద్య, విద్యార్థులకు సంబంధించిన సమస్యలను చేపట్టాలనుకుంటున్నామంటూ మొదట్లో సీజీపీ నాయకులు చెప్పిన మాటలు వట్టి బూటకమని దీనితో తేలిపోయింది. వారు గందరగోళం సృష్టించడం ద్వారా, కేంద్రంలో చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్ని స్తున్నారు. వారికి బలమైన మోదీ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక ఎజెండా ఉందని కూడా స్పష్టమవుతోంది. తాము జెన్‌జెడ్‌కు చెందినవారమని, జెన్‌జెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నామని జూలైలో వారు ప్రకటించారు. అయినప్పటికీ ఇండికూటమికి చెందిన పార్టీ అధికారంలో ఉన్న జార్ఖండ్లోగానీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో గానీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ లేదా కర్ణాటకలో గానీ జరిగిన పేపర్ లీక్‌ల గురించి వారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. పంజాబ్‌లో యువత జీవితాలను నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల సమస్య పట్ల కూడా దిగ్భ్రాంతికరమైన మౌనాన్ని సీజేపీ నాయకులు పాటిస్తుండటం అమానుషం.
సీజేపీకి చెందిన సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుపుతున్న సమయంలో, వారి వయస్సు గురించి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ సూటిగా ప్రశ్నించారు. వారు ‘జెన్ జెడ’ తరానికి చెందిన వారు కాదని న్యాయమÖర్తి స్పష్టం చేశారు. “నిరసనలు మొదలైనప్పుడు అవి విద్యార్థుల గురించి ఉండేవి. ఇప్పుడు మీ లక్ష్యాలు మారుతూ వస్తున్నాయి, కానీ వ్యక్తులు మాత్రం మారడంలేదు” అని వ్యాఖ్యానించడం ద్వారా, సీజేపీ నిజ స్వరూపాన్ని న్యాయమూర్తి ఎండగట్టారు. ఆ తర్వాత, “మీరు ఎవరు? ఎవరితో సంబంధం కలిగి ఉన్నారు?” అని ప్రశ్నించారు. అంతేకాకుండా, “అకస్మాత్తుగా మీరు ‘ప్రభుత్వ మార్పు’ గురించి మాట్లాడుతున్నారు, అసలు మీరు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నారు?” అని నిలదీశారు. దీనికి సీజేపీ తరఫు న్యాయవాది నుంచి ఎటువంటి స్పష్టమైన సమాధానం రాలేదు.
ప్రభుత్వ మార్పునకు ప్రశాంత్ భూషణ్
మోదీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఏకైక మార్గం “ప్రభుత్వ మార్పు”(=వస్త్రఱఎవ ్పుష్ట్రaఅస్త్రవ), “విప్లవం” అని సుప్రసిద్ధ న్యాయవాది, మోదీ ద్వేషి ప్రశాంత్ భూషణ్ ఎట్టకేలకు ప్రకటించారు. ప్రజాస్వామ్య మార్గాల ద్వారా మోదీని ఓడించలేమనే విషయంలో ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు. ఇది ఒక రక్తపాత వ్యవహారం (ఖూన్ ఖరాబా హోగీ) అవుతుందని, కానీ వేరే మార్గం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ మార్పుకు సమయం ఆసన్నమైందని తెలిపారు. ప్రభుత్వ మార్పును తీసుకురావడానికి బలం, హింసను ప్రయోగించడంతో సమానంగా, ప్రశాంత్ భూషణ్ ఉపయోగించిన “=వస్త్రఱఎవ ్పుష్ట్రaఅస్త్రవ” అనే పదాన్ని ఆంగ్ల నిఘంటువులు పరిగణిస్తున్నాయి. కేంబ్రిడ్జ్ నిఘంటువు ప్రకారం ప్రభుత్వ మార్పు అంటే “ప్రభుత్వంలో పూర్తి మార్పు, ముఖ్యంగా బలప్రయోగం ద్వారా తీసుకువచ్చేది”. మరో నిఘంటువు ప్రకారం, ఇది సైనిక తిరుగుబాటు ద్వారా లేదా ఒక దేశం మరో దేశ పరిపాలనలో జోక్యం చేసుకోవడం ద్వారా సాధ్యమవుతుంది. రాజకీయ క్రీడ ప్రాథమిక నియమాలను తిరగరాయడానికి ఉపయోగపడే ఒక మార్గంగా కూడా ప్రభుత్వం మార్పును నిపుణులు వర్ణిస్తారు. ప్రభుత్వ మార్పు అంటే చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన, ఎన్నికల మార్గాల ద్వారా ప్రభుత్వం మారడమేనని పేర్కొంటూ ఈ విషయాన్ని గందరగోళపరిచేందుకు మాజీ మంత్రి చిదంబరం సహా పలువురు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ప్రయత్నించారు. కానీ వారు చెబుతున్నది అసత్యం. ఎందుకంటే ఏ నిఘంటువు కూడా ఈ పదానికి ఇలాంటి ఒక అర్థాన్ని ఇవ్వలేదు. భారతదేశంలో మనం ఎప్పటికప్పుడు ఎన్నికల ద్వారా ప్రభుత్వ మార్పును తీసుకువస్తామని స్వయంగా వివరించడానికి ప్రశాంత్ భూషణ్ ప్రయత్నించారు. కానీ ఆయన మాటలు నిరాధారమైనవి. ఎందుకంటే ఆ పదం స్పష్టంగా హింసాత్మక మార్గంలో ప్రభుత్వ మార్పును సూచిస్తుంది తప్ప, ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా జరిగే మార్పును మాత్రం కచ్చితంగా కాదు. ఐరోపాలో కమÖ్యనిస్టు బృందాలు పెద్ద ఎత్తున హింసకు పాల్పడిన నేపథ్యంలో, బాంగ్లాదేశ్‌ను తార్కాణంగా తీసుకొని “విప్లవం”, “ఖూన్ ఖరాబా” (రక్తపాతం) వంటి పదాలను భారతదేశంలోని నిరసనకారులు ప్రస్తావించారు. ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ కమÖ్యనిస్టు బృందాలు చేపట్టిన హింసాత్మక ఘటనలలో ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం పోర్చుగల్ వంటి కొన్ని దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఫ్రాన్స్ పెను బాధితురాలిగా మారింది. ఆ దేశంలోని మార్సెయిల్స్, లిమోజెస్, లియోన్లలో దుకాణాలను నిరసనకారులు దోచుకున్నారు. వాటిని ధ్వంసం చేశారు. ప్రసిద్ధ, వారసత్వ భవనాలకు నిప్పు పెట్టారు.
రాహుల్ అసత్య ప్రచారం
బాంగ్లాదేశ్‌లో జరిగిన తిరుగుబాటును నేహా బోరా ఎంతగానో సమర్థించి, ప్రశంసించిన నేపథ్యంలో, ఆమె లేవనెత్తిన వివాదం నుంచి రాహుల్ గాంధీ గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ తప్పించుకోలేరు. రాహుల్ గాంధీ తన బహిరంగ ప్రసంగాల్లో చేసిన అసంబద్ధమైన వాదనల గురించి ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం ఎంతైనా ఉంది. బీజేపీ, నరేంద్ర మోదీ రంగంలోకి రాకముందు, భారత ఎన్నికల్లో ‘ప్రభుత్వ వ్యతిరేకత’ (aఅtఱ-ఱఅcuఎbవఅcy) అనేది ఒక సాధారణ ధోరణి అని, ప్రజలు ఎప్పుడూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ఓడించేవారని ఆయన మూర్ఖంగా పేర్కొన్నారు. మన ఎన్నికల సరళిని ఆయన ఎంత తప్పుగా అర్థం చేసుకున్నదీ దీనిని బట్టి తెలుస్తుంది. ఆయన వాదనకు విరుద్ధంగా జవాహర్లాల్ నెహ్రూ కాలం నుంచి దీనికి విరుద్ధంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. దీంతో రాహుల్ చేసిన వాదన ఎంత అసంబద్ధమైనదీ స్పష్టమవుతోంది. 1951-52లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల నుండి, 1952, 1957, 1962, 1967, 1971లలో కూడా దేశవ్యాప్తంగా అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఆ తర్వాత 1980, 1984 లోక్‌సభ ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలిచింది. అలాగే 2004, 2009 ఎన్నికల్లో కూడా అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి నెహ్రూ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీలు ‘ఓట్ల దొంగతనానికి’ (ఙశీtవ cష్ట్రశీతీఱ) పాల్పడి, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మళ్లీ అధికారంలోకి వచ్చారా?
ఇదే కాకుండా, పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. అక్కడ 1977లో సీపీఐ(ఎం) నేతృత్వంలోని కమÖ్యనిస్టుల కూటమి (Lవft ఖీతీశీఅt) 294 స్థానాలకు గాను 231 స్థానాలను గెలుచుకుని, వరుసగా 34 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగింది. 1977, 1982, 1987, 1991, 1996, 2001, 2006 ఎన్నికల్లో ఆ కూటమి సునాయాసంగా విజయం సాధించింది. ఆ సుదీర్ఘ కాలంలో, ఎన్నికల్లో గెలవడానికి సీపీఐ(ఎం) కార్యకర్తలు ‘గుండాయిజం’ చేశారని, ‘ఓట్లను దొంగిలించారని’ అప్పట్లో రాహుల్ గాంధీ పార్టీయే ఆరోపించింది. ఇప్పుడు కమÖ్యనిస్టు పార్టీలతో ఆయనకున్న సాంగత్యాన్ని చూస్తుంటే, ఈ సాక్ష్యాధారాలన్నింటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత గురించిన తన వాదన బూటకమైనదని కనీసం అంగీకరించడానికైనా రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారా?
మార్క్సిస్టుల పాలన తర్వాత, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చింది. అది 2011 ఎన్నికలలో ఘనవిజయం సాధించింది. 2016, 2021 ఎన్నికలలో కూడా భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చింది. తృణమూల్ గెలిచిన ప్రతిసారీ, హింస ద్వారా ఆ పార్టీ ఎన్నికలను దొంగిలించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రాథమిక విషయాలను, బూటకపు ప్రభుత్వ వ్యతిరేకత సిద్ధాంతాన్ని బట్టబయలు చేసే ఎన్నికల డేటాను రాహుల్ గాంధీకి ఎవరు అందిస్తారు? ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధానమంత్రులు ప్రధాన ఎన్నికల కమిషనర్లను ఎన్నుకున్నప్పుడే జరిగింది. వారందరూ జ్ఞానేష్ కుమార్లేనా? వారందరూ “ఓటు చోరీ”ని ప్రోత్సహించారా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంలు)ను రద్దు చేయాలన్న కాంగ్రెస్ వాదన కూడా అత్యంత ప్రమాదకరమైనది. ఇవి హ్యాక్ చేయలేని సరళమైన యంత్రాలు. 1982లో ఎన్నికల సంఘం వీటిని తొలిసారిగా ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇవి కాలపరీక్షకు నిలబడ్డాయి. సాధారణ ఎన్నికలలో మోదీని ఓడించలేకపోయిన కాంగ్రెస్ పార్టీ తన ఓటమికి ఈవీఎంలను బాధ్యులుగా చేస్తోంది. ఇది “ఆడలేక మద్దెల మీద పడి ఏడిచినట్టు” అనే నానుడికి సరిగ్గా సరిపోతుంది. సరిగ్గా నాట్యం చేయని వ్యక్తి వేదికపై తప్పులు వెతకడం లాంటిది! అంతేకాదు, కేరళం, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అవే ఈవీఎంలతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దాని మీద ఆ పార్టీ పెదవి విప్పదు. తమిళనాడు ఎన్నికలలో నటుడు విజయ్ గెలవడానికి, పంజాబ్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం వెనుక ఈవీఎంలు ఉన్నాయి. ఎన్నికలలో బ్యాలెట్ పేపర్లను తిరిగి ప్రవేశపెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన 28 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలలో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించారు. కానీ ఆ 28 స్థానాలలో కేవలం ఒక్కదాన్ని మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది! ఇప్పుడు, బ్యాలెట్ పేపర్లలో తప్పులు వెదకాల్సిన పని ఆ పార్టీకి పడింది!
అమెరికన్ పౌరుడి అత్యుత్సాహం
ముంబైలో నిరసనకారులతో అమెరికా పౌరుడైన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ ఉత్సాహంగా కలిసిపోయాడు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. దేశ రాజకీయాల్లో, ఆందోళనల్లో పాల్గొనడానికి విదేశీయులను ఏ దేశం అనుమతి స్తుంది? అతడిని భారతదేశం విడిచి వెళ్లమని ప్రభుత్వం సరిగ్గానే కోరింది. మన అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి విదేశీయులను అనుమతిస్తే మన ప్రజాస్వామ్యం, మన ఐక్యత, మన సామాజిక శ్రేయస్సు దెబ్బతింటాయి. అందువల్ల, ఇదంతా కూడా ఒక ప్రాణాంతకమైన మిశ్రమం(కాక్టైల్)గా కనిపిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీకి నిధులు సమకూర్చడం ద్వారా ఆ పార్టీకి అమెరికన్ డీప్ స్టేట్ మద్దతు ఇస్తోంది. దాని వ్యవస్థాపకుడని చెప్పుకునే అభిజీత్ దీప్కేను బోస్టన్ నుంచి న్యూఢిల్లీకి పంపింది.
తనకు కావలసినవి ఇవ్వని దేశాలలో “తిరుగుబాటు” చేస్తానని బెదిరించే ఎలాన్ మస్క్, ఆ పదవికి ఏమాత్రం అర్హత లేకపోయినా, ప్రధానమంత్రి కావడం తన జన్మహక్కు అని భావించే నిస్సహాయ రాహుల్ గాంధీ, వీరందరిలో అత్యంత నిస్సహాయులై సాధారణ ఎన్నికలలో కేవలం 2.3 శాతం ఓట్లతో ఘోరంగా ఓడిపోయిన కమ్యూనిస్టులు, తాము కోరుకున్న ఫలితాలు విప్లవం, రక్తపాతం ద్వారా మాత్రమే వస్తాయని చెప్పే న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లాంటి మోదీని వ్యతిరేకించే ప్రతీకార స్వభావం గల వ్యక్తులు కలగలసి ఒక ప్రాణాంతకమైన మిశ్రమంగా తయారయ్యారు. చివరగా, రాహుల్ గాంధీ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి కొన్ని మాటలు చెప్పుకోవాలి. వారు భారత ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు లేదా పార్లమెంటు వంటి దేశంలోని ప్రతి సంస్థను కించపరచడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆ పార్టీ ఎంత బాధ్యతారహితంగా తయారైందంటే, దాని కేరళ విభాగం ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ఎగతాళి చేస్తూ ఒక ట్వీట్ చేసింది. “ప్రియమైన సూర్యకాంత్, శాంతిభద్రతలు మీ పరిధిలోకి రాకపోతే, ఇప్పుడే రాజీనామా చేయండి. దానిని నిర్వహించగల మీ స్థానంలో మరొకరిని మేము కనుగొంటాము” అని ఆ పార్టీ అహంకారంతో ట్వీట్ చేసింది. వారు ఉపయోగించిన పదాలను చూడండి. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లుగా, భారత ప్రధాన న్యాయమూర్తిని నియమించగలదన్నట్లుగా “మీ స్థానంలో మరొకరిని మేము కనుగొంటాము” అని అంటోంది. దీనిపై ఒకరు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగానే, కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పింది. కానీ, రాహుల్ గాంధీ వాక్చాతుర్యానికి, ఆయన ఆత్రుతకు పార్టీ కార్యకర్తలు ఎంతగా మస్తిష్క ప్రక్షాళన(బ్రెయిన్ వాష్)కు గురైనదీ ఈ ఉదంతం తేటతెల్లం చేస్తుంది. డాక్టర్ అంబేద్కర్ హెచ్చరించినట్లుగా, ప్రజలు ప్రజాస్వామ్య మార్గాలను విడిచిపెట్టి, హింసను ఆశ్రయించి, ఏదో ఒక సాకుతో చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయాలనే తమ రాజకీయ లక్ష్యాల కోసం అరాచకాన్ని ప్రోత్సహిస్తే, మన ప్రజా స్వామ్యానికి ఒక భయంకర మైన విపత్తు సంభవిస్తుంది. రాహుల్ గాంధీ సృష్టించే అరాచకం కావాలా? లేక నరేంద్ర మోదీ తీసుకువచ్చే ప్రజాస్వామ్యం, అభివృద్ధి, పురోగతి కావాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి.

– ఎ. సూర్య ప్రకాష్