సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

అదనపు ఆదాయం సమకూర్చుకుంటారు. శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలు, గృహం కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు చకచకా పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం పొందుతారు. ఆలోచనలు అమలులో  పెడతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. వ్యాపారులకు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం. 12,13తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. హనుమాన్‌ఛాలీసా పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఎడాపెడా సొమ్ములు అంది అవసరాలు తీరతాయి. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి సంఘటనలు ఎదురవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. బంధువుల కొంత ధనలబ్ధి కలుగవచ్చు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారులకు మరింతగా లాభాలు అందే అవకాశం. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. రాజకీయవేత్తల యత్నాలు సానుకూలం. 14,15తేదీల్లో శారీరక రుగ్మతలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలలో కొంత జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల ఇంట శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. వ్యాపారుల యత్నాలు సఫలం. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి విముక్తి. పారిశ్రామికవేత్తలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. క్రీడాకారులు, వ్యవసాయదారులకు కలసివచ్చే కాలం.  24,25 తేదీల్లో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీపట్ల కొంత అనుకూల వైఖరి అనుసరిస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. స్నేహితులతో విభేదాలు పరిష్కారించుకోవడంలో విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాలు కొంతమేర పరిష్కారమవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. కళాకారులు, క్రీడాకారులకు మరింత ఉత్సాహం. 9,10 తేదీల్లో ్య వృథా ఖర్చులు. అనారోగ్యం. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఆశించిన మేర ఆదాయం సమకూర్చుకుంటారు. కొత్త కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.  చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. పట్టుదల, ధైర్యంతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వివాహయత్నాలు సానుకూలం. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కవచ్చు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.  11,12తేదీల్లో వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. దక్షిణావ•ర్తి స్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ముఖ్యమైన వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. స్నేహితులు,  బంధువుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొత్త్త వ్యక్తుల పరిచయం. రాబడి పెరిగే అవకాశాలు. కొన్ని రుణాలు తీరతాయి. వివాహయత్నాలలో శుభవార్తలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. భూ వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆలయాలు సందర్శిస్తారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. మిమ్మల్ని వ్యతిరేకించిన వారే ప్రశంసించడం విశేషం. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగులకు  హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలకు కృషి ఫలిస్తుంది. క్రీడాకారులు, రచయితలకు మరింత ఉత్సాహం.  12,13తేదీల్లో  శారీరక రుగ్మతలు. కుటుంబసభ్యులతో విభేదాలు. గాయత్రీ ధ్యానం చేయండి.

తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నిదానిస్తాయి. రాబడి అంతగా కనిపించదు. ఆస్తుల వివాదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. సోదరులు, స్నేహితులతో ఒత్తిళ్లు పెరుగుతాయి. అదనపు ఖర్చులు మీదపడి సతమతమవుతారు. బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. చిన్ననాటి విషయాలు  గుర్తుకు వస్తాయి. గృహ నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారులకు పెట్టుబడులలో జాప్యం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు కొంత  సులుబాటు కలుగుతుంది. కళాకారులు, రచయితలకు శ్రమ ఫలిస్తుంది. 11,12తేదీల్లో శుభవార్తలు. చర్చలు సఫలం.  గణేశ్‌ను పూజించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

కొన్ని సమస్యలు, ఇబ్బందులు అధిగమిస్తారు. ఆలోచనలు అమలులో కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నూతన  వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలులో ముందడుగు వేస్తారు. వ్యాపారులకు నెమ్మదిగా లాభాలు అందుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు తగ్గుతాయి. పారిశ్రామికవర్గాలకు  కొత్త విషయాలు తెలుస్తాయి. కళాకారులు, రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.  9,10 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. సూర్యాష్టకం  పఠించండి.

ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు అధిగమిస్తారు. కొంత ఆదాయం తగ్గినా అవసరాలకు లోటు రాదు. కుటుంబబాధ్యతలు  సమర్థవంతంగా పూర్తి చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. స్నేహితులు మీపట్ల మరింత ప్రేమానురాగాలు చూపుతారు.. భూములు కొంటారు. సంతానపరంగా ముఖ్య సమాచారం అందుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనసౌఖ్యం. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు చకచకా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.  13,14 తేదీల్లో వ్యయప్రయాసలు. స్నేహితులతో తగాదాలు.  విష్ణుధ్యానం చేయండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు కొంత నెమ్మదిస్తాయి.  స్నేహితులతో విభేదాలు కొంతమేర  పరిష్కరించుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. బంధువుల నుంచి  ధనలాభం కలిగే సూచనలు.  మీ నిర్ణయాలు అందరూ హర్షిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.  ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి విముక్తి. కళాకారులు అనుకున్నది సాధిస్తారు. పరిశోధకులు, క్రీడాకారులకు సంతోషకర సమాచారం. 12,13తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబంలో సమస్యలు. శివాష్టకం పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

వ్యతిరేక పరిస్థితులు చక్కబడతాయి. అనుకున్నంత ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు.  స్థిరాస్తి వివాదాలు తీరతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఇంటి నిర్మాణాలపై చర్చలు సఫలం. నిరుద్యోగులకు అనుకోని ఉద్యోగయోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు అనుకోని విధంగా లాభాలు. ఉద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం. 11,12తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప రుగ్మతలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొత్త కార్యక్రమాలు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి.. స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రాంతాల నుంచి ఉపయుక్త సమాచారం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు దక్కవచ్చు. కళాకారులకు అనుకూల పరిస్థితులు.  10,11తేదీల్లో వృథా ఖర్చులు. వ్యయప్రయాసలు.  శ్రీరామస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.