సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో మరింత గుర్తింపు పొందుతారు. నూతన ఉద్యోగాలు దక్కవచ్చు.  రాబడి అనూహ్యంగా పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  వివాహాది వేడుకల నిర్వహణలో నిమగ్నమవుతారు. ముఖ్య కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. వ్యాపారులు మరింత పుంజుకుంటారు. ఉద్యోగులకు ఆటుపోట్లు తొలగి ఊరట లభిస్తుంది. కళాకారులకు  అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. రచయితలు, క్రీడాకారులు అనుకున్నది సాధిస్తారు. 21,22 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

పరిచయాలు పెరుగుతాయి. ఆశించిన ఆదాయం సమకూర్చుకుని అవసరాలు తీర్చుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు, సమస్యలు తీరే సమయం. ఆలోచనలపై ఒక అంచనాకు వస్తారు. విద్యార్థుల ప్రతిభకు తగిన గౌరవం దక్కుతుంది. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కార్యక్రమాలు చకచకా సాగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి.  వ్యాపారులు ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కళాకారులకు ఆదరణ లభిస్తుంది. 22,23 తేదీల్లో  బంధువులతో తగాదాలు. మనశ్శాంతి లోపిస్తుంది. అన్నపూర్ణాష్టకం పఠించండి.

.మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

కొద్దిపాటి చిక్కులు, సమస్యలు ఎదురైనా క్రమేపీ అధిగమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు  చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ఒక నిర్ణయానికి వస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.  వ్యాపారులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయవేత్తలకు ఊహించని పిలుపు అందవచ్చు. వైద్యులు, కళాకారులు సత్తా చాటుకుంటారు. 24,25తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. కష్టమే తప్పితే ఫలితం ఉండదు. దక్షిణావ•ర్తి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

మొదట్లో ఎదురయ్యే సమస్యలు క్రమేపీ తొలగుతాయి. కార్యక్రమాలు చకచకా పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. రాబడి ఆశించినంతగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్నేహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కాంట్రాక్టర్లకు ఊహించని అవకాశాలు. ఇంట  నిర్మాణం, కొనుగోలుపై ప్రతిష్ఠంభన తొలగుతుంది. వ్యాపారులు మరింత లాభపడతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. కళాకారులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. రచయితలు, క్రీడాకారుల అంచనాలు ఫలిస్తాయి. 26,27 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో వివాదాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

అనుకున్న కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో మీకంటూ గౌరవప్రతిష్ఠలు దక్కుతాయి. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సన్నిహితులు, స్నేహితుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఒత్తిడులు తగ్గే సూచనలు. రచయితల సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది. 21,22 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. ఆప్తులతో కలహాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

ఎంతటి వారినైనా ఆకట్టుకుని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నిర్ణయాలు ఎటువంటి జాప్యం లేకుండా తీసుకుంటారు. మీ ఆశయాలు నెరవేరే సమయం. పలుకుబడి పెరుగుతుంది. సేవాకార్యక్రమాలలో భాగస్వాములవుతారు. చిరకాల స్వప్నం ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు రావచ్చు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారులకు మరింత పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు శ్రమ ఫలిస్తుంది. రచయితలు, క్రీడాకారులు పేరుప్రతిష్ఠలు గడిస్తారు.  22,23 తేదీల్లో బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం.  ఆదిత్య హృదయం పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

శ్రేయోభిలాషుల సలహాలతో ముందుకు సాగుతారు. అందరిలోనూ పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ధనసంపాదనలో లక్ష్యాలు సాధిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరి లబ్ధి పొందుతారు. ఇల్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి విముక్తి. పారిశ్రామికవేత్తలు సత్తా చాటుకుంటారు. రచయితలు, క్రీడాకారులు నైపుణ్యతను చాటుకుంటారు. 23,24 తేదీలలో  ఆకస్మిక ప్రయాణాలు. స్నేహితులతో తగాదాలు. నృసింహస్తోత్రాలు పఠించండి.

చయితలు, పరిశోధకులకు శుభవార్తలు. 26,27 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

అనుకోని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. కార్యక్రమాలు జాప్యం. ఆత్మీయులతో అకారణంగా విభేదాలు నెలకొనవచ్చు. ఆలోచనలు కలసిరాక ఇబ్బంది పడతారు. ఉండవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు కాస్త ఊరటనిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. ఆస్తుల వ్యవహారాలలో కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు. వాహనాలు నడిపే వారు కొంత అప్రమత్తత పాటించాలి. వ్యాపారులకు సాదాసీదా లాభాలు ఉంటాయి. ఉద్యోగులు కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు. రాజకీయవేత్తలు పదవులు దూరం చేసుకుంటారు. కళాకారులు, వైద్యులు మరింత కష్టపడాలి. 26,27 తేదీల్లో  శుభవార్తలు. వాహనయోగం.  ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విష్ణుధ్యానం చేయండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆదాయం మరింత పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. కొన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.  వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమై సహకరిస్తారు. కొన్ని వివాదాల నుండి బయటపడతారు. వ్యాపారులు ఒడిదుడుకులు అధిగమిస్తారు.  ఉద్యోగులకు విధుల్లో మరింత సానుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. వైద్యులు, పరిశోధకులు ఉత్సాహంగా గడుపుతారు.  25,26 తేదీల్లో  దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

వీరికి పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది. సన్నిహితులు సహకరిస్తారు. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. కార్యక్రమాలు అనుకున్న సమయానికి  పూర్తి చేస్తారు. సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. ప్రముఖులు పరిచయమవుతారు. వ్యాపారులకు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు విధుల్లో చాకచక్యంగా వ్యవహరించి ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలకు ముఖ్య సమాచారం రావచ్చు. 22,23తేదీల్లో మానసిక ఆందోళన. బంధువుల నుంచి సమస్యలు. దేవీఖడ్గమాల పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కొన్ని సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. అనుకున్న  కార్యక్రమాలు పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఆలోచనలు కలసివస్తాయి. స్నేహితులు ఊహించని విధంగా సహకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. మీ ఆశయాలు కొన్ని నెరవేరతాయి. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగులు గందరగోళం నుండి బయటపడతారు. రాజకీయవేత్తలకు మరింత ప్రోత్సాహం. క్రీడాకారులు, రచయితలకు ఆశయసిద్ధి. 25,26 తేదీల్లో కుటుంబంలో ఒత్తిడులు. మానసిక ఆందోళన. శారీరక రుగ్మతలు. శ్రీకృష్ణాష్టకం పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

కొన్ని కార్యక్రమాలు జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు మరింత అనుకూలం. పరిచయాలు విస్తృతమవుతాయి.  ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయం మరింత మెరుగుపడుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు  చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులు సంస్థల విస్తరణపై దృష్టి సారిస్తారు.  ఉద్యోగులకు బాధ్యతలు కొంత తగ్గవచ్చు.  కళాకారులకు శ్రమ ఫలిస్తుంది. వైద్యులు, పరిశోధకులు ఉత్సాహంగా  అడుగులు వేస్తారు. 26,27తేదీల్లో  ఆకస్మిక ప్రయాణాలు. బ్యధువులతో తగాదాలు. అనారోగ్యం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.