సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆదాయం మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. ముఖ్య కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులు, స్నేహితులతో కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో భాగస్వాములు మరింత సహకరిస్తారు. ఉద్యోగవర్గాలకు అవకాశాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు విశేష గుర్తింపు లభిస్తుంది. 28,29 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. ఆంజనేయస్వామికి అర్చన చేయండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రాబడికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. సోదరులు, స్నేహితులతో మనస్సులోని భావాలను పంచుకుని ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. చర్చలు ఫలప్రదమవుతాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగవర్గాలకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రచయితలు, కళాకారులు, పరిశోధకులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. 3,4 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వినాయక స్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆస్తుల విషయంలో బంధువులతో అగ్రిమెంట్లు చేసుకుంటారు. నిరుద్యోగుల లక్ష్యం నెరవేరే సమయం. వాహనసౌఖ్యం. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యల నుంచి కొంత ఉపశమనం. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారుల యత్నాలు సఫలం. ఉద్యోగులకు అనుకోని హోదాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులు విదేశీ పర్యటనలు జరుపుతారు.1,2 తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
యుక్తి, తెలివితేటలుగా వ్యవహరించినా ఫలితం కనిపించదు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు. బంధువులు, స్నేహితులతో కొంత విభేదిస్తారు. ఆస్తులు కొనుగోలు చేసినా ఒప్పందాలలో ఆటంకాలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్య కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ అంచనాలు కొన్ని తప్పే సూచనలు. అయితే కుటుంబసభ్యుల సలహాలు కొంత ఉపకరిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, రచయితలకు లేనిపోని చికాకులు, శ్రమాధిక్యం. 29,30 తేదీలలో ఆస్తిలాభం. దూరపు బంధువుల కలయిక. అంగారక స్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రావలసిన సొమ్ము అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి కలిగే అవకాశం. కళాకారులు, క్రీడాకారులు, రాజకీయవేత్తలకు అనుకూల సందేశాలు రావచ్చు. 29,30 తేదీల్లో వివాదాలు. శారీరక రుగ్మతలు. మానసిక ఆందోళన. శ్రీరామరక్షా స్తోత్రం పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
కొత్త కార్యక్రమాలను సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల ప్రేమానురాగాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. అదనపు ఆదాయం లభిస్తుంది. వాహనాలు, భూములు సమకూరతాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు లభించే వీలుంది. పారిశ్రామికవేత్తలు, రచయితలు, కళాకారులకు కార్యసిద్ధి. ఊహించని అవకాశాలు. 30,1 తేదీల్లో వివాదాలు. వృథా ఖర్చులు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ముఖ్య కార్యక్రమాలు మరింత సజావుగా సాగుతాయి. మీ ఆశయాలు నెరవేరడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఖర్చులు పెరిగినా ఆదాయానికి లోటు ఉండదు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. దేవాలయ దర్శనాలు. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 1,2 తేదీల్లో అనారోగ్యం, దూరప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రాబడి మరింత పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం.. సోదరులు, స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ధార్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారులు భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రచయితలు, క్రీడాకారులు, కళాకారులకు అవార్డులు. 29,30 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. గణేశాష్టకం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆశించినంత ఆదాయం సమకూరుతుంది. రుణబాధలు తొలగుతాయి. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పరిచయాలు పెరుగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. దేవాలయ దర్శనాలు. వ్యాపారుల యత్నాలు సఫలమవుతాయి, లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో అనుకూల పరిస్థితులు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. 28,29 తేదీల్లో అనారోగ్యం, దూరప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
మొదట్లో ఇబ్బంది పడినా క్రమేపీ ఆదాయం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. ముఖ్య కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. స్నేహితులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారులు లాభాలు అందుకుని ఊరట చెందుతారు. ఉద్యోగవర్గాలకు ప్రమోషన్‌లు దక్కవచ్చు. క్రీడాకారులు, రచయితలు, పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 1,2 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. సుబ్రహ్యణ్యాష్టకం పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. ప్రముఖులతో ఊహించని పరిచయాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహన, గృహయోగాలు. సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో మరింత అనుకూలత. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, రచయితలకు విశేష సన్మానాలు జరిగే వీలుంది. 30,1తేదీల్లో వివాదాలు. శారీరక రుగ్మతలు. మానసిక ఆందోళన. శివపంచాక్షరి పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కొన్ని ముఖ్య కార్యక్రమాలలో ఆటంకాలు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులు,స్నేహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. నిరుద్యోగుల యత్నాలు నతనడకన సాగుతాయి. గృహ నిర్మాణాలలో స్వల్ప అవాంతరాలు. వివాదాలకు దూరంగా ఉండండి. శారీరక రుగ్మతలు కొంత బా«ధిస్తాయి. వ్యాపారులు లాభాలపై నిరాశ చెందుతారు. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం తప్పదు. రచయితలు, పరిశోధకులు, కళాకారులకు కొన్ని ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. 3,4 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.