అం‌తర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై అమెరికా డాలర్‌ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకు బ్రిక్స్ ‌కూటమి సన్నద్ధమవుతోంది. దశాబ్దాలుగా విశ్వవిపణిపై పట్టుబిగించిన అగ్రరాజ్యం.. తాజా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తన ప్రాబల్యాన్ని క్రమంగా కోల్పోతోంది. ప్రపంచ చమురు మార్కెట్‌ను అమెరికా డాలర్‌ ‌శాసిస్తోంది. అణ్వస్త్ర తూణీరాలను పోగు చేసుకుని, ప్రపంచాన్ని భయపెడుతున్న శ్వేతసౌధానికి పెద్ద కష్టమే వచ్చి పడింది. అమెరికా మనుగడకు ఆయువుపట్టు లాంటి డాలర్‌ ‌పునాదుల్లో డైనమెట్లు పెట్టేందుకు ప్రపంచంలో ఒక్కొక్క దేశం సన్నాహాలు చేసుకుంటున్నది. అపార చమురు నిక్షేపాలున్న అరబ్బు దేశాల భయమే డాలర్‌ ఆధిపత్యానికి మూలం.

1971‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ ‌నిక్సన్‌ ‌గోల్డ్ ‌స్టాండర్డ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. డాలర్లను ముద్రించడానికి ఇకపై బంగారం మద్దతు అవసరం లేకుండా చేయడమే దీని ఉద్దేశ్యం. దీంతో ప్రపంచ చమురు మార్కెట్‌పై అమెరికా ఆధిపత్యం మొదలైంది. ఆ తర్వాత, 1974లో సౌదీ అరేబియాతో అమెరికా ఒక వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేసింది. దీని ప్రకారం సౌదీ అరేబియా చమురు ధరను అమెరికా డాలర్ల ఆధారంగా నిర్ణయించి, దానిని డాలర్లలోనే విక్రయించాలి. బదులుగా సౌదీ అరేబియాకు భద్రత కల్పిస్తామని అమెరికా హామీ ఇచ్చింది.

అపార చమురు నిక్షేపాలున్న అరబ్బు దేశాల భయమే అమెరికా డాలర్‌ ఆధిపత్యానికి వ•లం. ఆకలీ వ్యాపారవ• తలపడే చోట బీభత్సం ఉంటుంది. బెదిరింపూ, భయవ• తారసపడే చోట భద్రత వ్యూహాత్మక అవసరమవుతుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తీవ్రమైన ఆర్థిక అస్థిర పరిస్థితులు ఏర్పడినప్పుడు అమెరికా సహా 44 మిత్ర దేశాల ప్రతినిధులు కరెన్సీ కోసం ఒక కొత్త వ్యవస్థను ఆమోదించారు. అది ‘బ్రెటన్‌ ఉడ్స్ ‌సిస్టమ్‌’‌గా ప్రసిద్ధి చెందింది. దీని ప్రకారం అమెరికా డాలర్‌ ‌ధరను బంగారం ఆధారంగా నిర్ణయించారు. ఒక ఔన్సు బంగారం ధరను 35 డాలర్లుగా నిర్ణయించారు. బంగారం మద్దతున్న ఏకైక కరెన్సీ అమెరికా డాలర్‌ ‌మాత్రమే. మిగతా దేశాలన్నీ బంగారానికి బదులుగా అమెరికా డాలర్లను నిల్వచేసుకునేవి. దీంతో డాలర్‌ ‌ప్రపంచ కరెన్సీగా మారింది. ఒకానొక సమయంలో అమెరికా విపరీతంగా డాలర్లను ముద్రించడంతో బ్యాంకింగ్‌ ‌కోసం దాని వద్ద తగినంత బంగారం లేకుండా పోయింది. పెట్రోడాలర్‌ ‌వ్యవస్థను అమలు చేయడంతో అమెరికాకు పెద్ద ప్రయోజనం కలిగింది. ఎందుకంటే, ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన, అత్యధికంగా లావాదేవీలు జరిగే వస్తువు చమురు. ఏ దేశమైనా ముడి చమురు కొనాలనుకుంటే దానికి అమెరికా డాలర్లు అవసరమయ్యేవి. చమురు ఎగుమతి చేసే దేశాలు చమురు అమ్మకం ద్వారా పొందిన డాలర్లను అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేవి. దీనినే పెట్రోడాలర్‌ ‌రీసైక్లింగ్‌ అం‌టారు.

సులభంగా చెప్పాలంటే, గల్ఫ్ ‌దేశాలకు అమెరికా సైనిక రక్షణ కల్పించింది. దానికి ప్రతిఫలంగా అమెరికా ఇంధన భద్రతను పొందింది. చమురు వ్యాపారం డాలర్లలో జరిగింది. బిలియన్ల డాలర్ల విలువైన అమెరికా ఆయుధాలు, సాంకేతికతను కొనుగోలు చేయడానికి, అలాగే అమెరికా స్టాక్లు, బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఆ దేశాలు అమెరికాను ఆశ్రయించాయి. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌, ఒమన్‌, ‌బహ్రెయిన్‌ ‌దేశాలు తమ కరెన్సీలను డాలర్‌తో అనుసంధానించాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలకు డాలర్లలో చెల్లింపులు జరిపేందుకు ప్రస్తుతం ‘స్విఫ్ట్’ ‌వ్యవస్థను  ప్రపంచ దేశాలు ఆశ్రయిస్తున్నాయి. ఇటీవల రష్యా, ఇరాన్‌ ‌దేశాలు ‘స్విఫ్ట్’ ‌కు ప్రత్యామ్నాయం వెతుక్కున్నాయి. చైనా తన ఎగుమతి వ్యాపారాల్లో ఆయా దేశాల కరెన్సీని స్వీకరిస్తున్నది. దిగుమతులకు యువన్‌లలో చెల్లింపులు చేస్తోంది. బ్రిక్స్ ‌దేశాలు సైతం ఇదే తరహాలో తమ సొంత కరెన్సీతో వాణిజ్యం చేయాలనే తలంపుతో ఉన్నాయి. మరింత సంక్షోభంలో కూరుకుపోనున్న అమెరికా,  ప్రపంచదేశాలపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఈ భయమే బ్రిక్స్ ‌కొత్త ప్రయత్నాలకు ఊపిరిపోసింది. మన దేశం కూడా సొంత కరెన్సీలో చెల్లింపులు జరపడానికి సమాయత్తమవుతున్నది. సౌదీ అరేబియా, రష్యా, ఇరాన్‌, ‌బ్రెజిల్‌, యూఏఈలు బ్రిక్స్‌లో అతి పెద్ద ఇంధన ఉత్పత్తి దేశాలైతే.. చైనా, భారత్‌లు అతిపెద్ద ఇంధన వినయోగదారు దేశాలు. ఐక్యరాజ్యసమితి నామమాత్రంగా మిగిలిపోవడంతో బ్రిక్స్‌కు ఆదరణ పెరిగింది. సభ్య దేశాల వాణిజ్యంలో 65శాతం స్థానిక కరెన్సీలో జరుగుతోంది. ఢిల్లీలో బ్రిక్స్ ‌సదస్సు అంతిమ లక్ష్యం అమెరికాను సవాలు చేయడంగానే చూడాలి. అయితే అది అంత తేలిగ్గా జరిగే వ్యవహారమా? అనే ప్రశ్న మధ్య భారత్‌-అమెరికా ద్వైపాక్షిక బంధం ఎలాంటి మలుపు తీసుకుంటునేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది.

పద్మావతి గంధవరపు, స్కాలర్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.