సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. సమాజంలో విశేష గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వేడుకల నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. కుటుంబంలో మీమాటకు ఎదురుండదు. విద్యార్థులు ఆశించిన అవకాశాలు పొందుతారు.. పలుకుబడి కలిగిన వారు పరిచయాలు ఏర్పడవచ్చు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవేత్తలు, క్రీడాకారులు కొంత ఊరట చెందుతారు. 8,9 తేదీల్లో శారీరక రుగ్మతలు. బంధువులతో తగాదాలు. శివాష్టకం పఠించండి..
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
రాబడి మీ అంచనాలకు తగినట్లుగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. ఆస్తుల వివాదాలలో పరిష్కారం దొరుకుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఊహించని కాంట్రాక్టులు లభిస్తాయి. గృహ, వాహనయోగాలు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. రాజకీయ,పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం. 6,7 తేదీల్లో ఖర్చులు అధికం. కుటుంబంలో కొన్ని సమస్యలు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొన్ని వివాదాలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. స్థిరాస్తి విషయంలో కొంత అనుకూలత ఉంటుంది. దైవకార్యాలలో పాల్గొంటారు. అదనపు రాబడి ఉంటుంది. పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కొంత ఇబ్బందిపెట్టవచ్చు. కాంట్రాక్టులు అనుకూలిస్తాయి.. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 7,8 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. స్నేహితులతో తగాదాలు. సూర్యారాధన చేయండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజసేవలో భాగస్వాములమవుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. ప్రముఖులు పరిచయమై ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని శ్రీవేడుకలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులను అనుకూలురుగా మార్చుకుంటారు. వ్యాపారులకు తగినంత లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు క్రమేపీ తొలగుతాయి. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం. రచయితలు, క్రీడాకారులకు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. 3,4 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. విష్ణుధ్యానం చేయండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సన్నిహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబసమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆదాయానికి లోటులేని పరిస్థితి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కళాకారులు, రచయితలు, క్రీడాకారులకు సన్మానాలు, అవార్డులు రావచ్చు. ఆగస్టు 1,2 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారు పరిచయం కాగలరు. ముఖ్య విషయాలపై చర్చిస్తారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతారు. సమాజంలో మరింత గౌరవం పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు.. నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. కళాకారులు, రాజకీయవేత్తలకు అనుకూల వాతావరణం. క్రీడాకారులు, రచయితలకు శుభవార్తలు. 4,5 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. అనుకోని ప్రయాణాలు. శివపంచాక్షరి పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. రుణబాధలు తొలగుతాయి. వాహనసౌఖ్యం. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. సోదరులు, స్నేహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. పట్టుదల పెరుగుతుంది. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధుల్లో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతమైన కాలం. రచయితలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. 8,9 తేదీల్లో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో కలహాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ముఖ్యకార్యక్రమాలలో ముందడుగు పడుతుంది. శ్రేయోభిలాషులు మీకు వెన్నంటి నిలుస్తారు. విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో మరింత గౌరవం పొందుతారు. బంధువులు మీపై మరింత అభిమానం పెంచుకుంటారు. ఆదాయం ఆశాజకనంగా ఉంటుంది. స్థిరాస్తుల క్రయవిక్రయాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఒత్తిడులు అధికమైన అధిగమిస్తారు. విధి నిర్వహణలో సత్తా చాటుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులకు అనుకూల సమయం. రచయితలకు కొత్త ఆలోచనలు కలసివస్తాయి. 4,5 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. గాయత్రీ ధ్యానం చేయండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
మధ్యమధ్యలో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. సమాజంలో పలుకుబడి •పెంచుకుంటారు. ఇతరులకు ఇచ్చిన హామీలు నిలుపుకుంటారు. శ్రమ పడినా ఆశించిన ఫలితం అందుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారతారు. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారులు లాభాల దిశగా నడుస్తారు. ఉద్యోగులకు అవాంతరాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. 3,4 తేదీల్లో సోదరులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. సూర్యారాధన చేయండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కీలక సమాచారం అందుతుంది. కొన్ని వివాదాలు, సమస్యల పరిష్కారంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి విషయంలో సోదరులతో ఒప్పందాలు చేసుకుంటారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. కళాకారులు, రచయితలకు నూతనోత్సాహం. 5,6 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో వివాదాలు. దక్షిణావ•ర్తి స్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయం అంతగా కనిపించక అప్పులు చేస్తారు. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. స్నేహితులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఆస్తులపై ఒప్పందాలలో మార్పులు చేసుకుంటారు. బంధువుల నుంచి ఒత్తిడులు తప్పకపోవచ్చు. ఉద్యోగాయత్నాలు నిరాశ పరుస్తాయి. మంచికి వెళితే చెడుగా మారే సూచనలు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారులకు సాదాసీదాగా ఉంటుంది. పెట్టుబడుల్లో నిదానం అవసరం. ఉద్యోగులకు వివాదాలు నెలకొంటాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు గందరగోళంగా ఉంటుంది. క్రీడాకారులకు గందగోళపరిస్థితి. 5,6 తేదీల్లో వాహనసౌఖ్యం. శుభవార్తలు. విష్ణుధ్యానం చేయండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కొత్త కార్యక్రమాలు చేపట్టి సజావుగా సాగుతాయి. కుటుంబంలో వేడుకలు కొన్ని నిర్వహిస్తారు. రాబడి విషయంలో గందరగోళం తొలగుతుంది. విద్య, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని వివాదాలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారులకు తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, రచయితలకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. 8,9తేదీల్లో శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. కనకధారా స్తోత్రాలు పఠించండి.