సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

అనుకున్న ఆదాయం సమకూరడంలో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కొంత విభేదిస్తారు. తరచూ ప్రయాణాలు, వృథా ఖర్చులు. విద్యార్థులకు కొంత నిరాశ. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి వివాదాల కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యపరంగా చికాకులు. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారులు సామాన్య లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, వైద్యరంగం వారికి  విదేశీ పర్యటనలు వాయిదా. 27,28 తేదీల్లో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆదాయం మరింత పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారులు గతం కంటే పుంజుకుంటారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు మరింత ఉత్సాహం. 29,30 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్య సూచనలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. సమాజసేవలో పాలుపంచుకుంటారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలయ్యే అవకాశం. వ్యాపారస్తులు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజమవుతాయి. 31,ఆగస్టు 1తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. దుర్గాస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

కొత్త కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం అందుతుంది. ఆదాయం గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. దేవాలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితల ఆశలు ఫలిస్తాయి. 31, ఆగస్టు 1 తేదీల్లో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

సన్నిహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబసమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆదాయానికి లోటులేని పరిస్థితి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కళాకారులు, రచయితలు, క్రీడాకారులకు సన్మానాలు, అవార్డులు రావచ్చు. ఆగస్టు 1,2 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

ఆశ్చర్యకరమైన రీతిలో ధనప్రాప్తి. ఎటువంటి ఖర్చులు ఎదురైనా అధిగమిస్తారు. మీ ప్రతిపాదనలు కుటుంబంలో అంగీకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు పొందుతారు. వాహనసౌఖ్యం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగులు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, పరిశోధకులు, క్రీడాకారుల యత్నాలు సఫలం.27,28 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

అనుకున్న రాబడి చేకూరి అవసరాలు తీరతాయి. కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. మీ ఆలోచనలు అమలు చేస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశం. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు పూర్వవైభవం కలిగే సూచనలు. 29,30తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. అంగారక స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

అనుకున్న కార్యక్రమాలు పూర్తి కావడంలో జాప్యం. ఆదాయానికి మించిన ఖర్చులు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగులు, విద్యార్థుల ప్రయత్నాలలో కొంత కదలికలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆశ్చర్యరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారస్తులు స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పనిఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు శ్రమాధిక్యం. 31, ఆగస్టు 1తేదీల్లో వాహనయోగం. నూతనత ఉద్యోగాలు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

కార్యక్రమాలను సకాలంలో చక్కదిద్దుతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. గత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. కుటుంబసభ్యులతో మనస్పర్థలు తొలగి ఊరట చెందుతారు. విద్యార్థులు నూతన అవకాశాలు సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలపై కుటుంబంలో చర్చలు. వ్యాపారస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.  ఉద్యోగులకు విధుల్లో సమస్యలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు సమయానికి పెట్టుబడులు అందుకుంటారు. రచయితలు, క్రీడాకారులకు శుభవార్తలు. ఆగస్టు 1,2 తేదీల్లో  వృథా ఖర్చులు. మానసిక అశాంతి. నృసింహస్తోత్రాలు పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాత•సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ప్రముఖులు నుంచి కీలక సందేశం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. విద్యార్థుల యత్నాలలో పురోగతి. ఇంటి నిర్మాణంలో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపార లావాదేవీలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయవేత్తలు పదవులు పొందుతారు. రచయితలు, క్రీడాకారులకు అనూహ్య అవకాశాలు. తేదీలలో  28,29 అనుకోని ఖర్చులు. అనారోగ్యం. దేవీస్తోత్రాలు పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కొన్ని సమస్యలు ఎదురైనా కార్యక్రమాలు  సకాలంలో పూర్తి చేస్తారు. రాబడి కొంత పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారస్తులు లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు తీరతాయి. కళాకారులు అంచనాలు ఫలించి ఉత్సాహంగా గడుపుతారు. వైద్యులు, పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. 31, ఆగస్టు 1 తేదీల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు. దూరప్రయాణాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

ఆదాయ, వ్యయాలలో సమతూకం పాటిస్తారు. కొన్ని కార్యక్రమాలు చిక్కులు అధిగమించి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలలో పురోగతి సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారస్తులకు  ఆశించిన లాభాలు దక్కవచ్చు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం రావచ్చు. రాజకీయవేత్తలకు కొన్ని హోదాలు దక్కుతాయి. రచయితలు, క్రీడాకారుల ఆశలు ఫలిస్తాయి. 30,31తేదీల్లో  స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గణేశాష్టకం పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.