సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆశించినంత ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరులకు సైతం సాయపడతారు. వ్యాపారులు లాభాలు ఆశించినంతగా అందుకుంటారు. ఉద్యోగులకు విశేషమైన కాలం. పారిశ్రామికవేత్తలకు కీలక సమాచారం అందుతుంది. కళాకారులు, రచయితలకు ఆదరణ పెరుగుతుంది. 13,14తేదీల్లో ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో చికాకులు. ఆంజనేయ దండకం పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయి. కొన్ని కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, స్నేహితులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ప్రయాణాలలో అవాంతరాలు నెలకొంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. కాంట్రాక్టులు చేజారతాయి. ఇంటి నిర్మాణయత్నాలు నిలిపివేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు ఎంతకష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులు పనిభారంతో సతమతమవుతారు. పారిశ్రామికవేత్తలకు నిరాశాజనకంగా ఉంటుంది. కళాకారులు, రచయితలకు గందగోళ పరిస్థితి తప్పకపోవచ్చు. 12,13 తేదీలలో శుభవార్తలు, నూతన పరిచయాలు. ధనలబ్ధి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొన్ని కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలతో సంతోషం కలిగిస్తుంది. అదనపు ఆదాయం సమకూరి ఎటువంటి ఖర్చులైనా అధిగమిస్తారు. విద్యార్థులు ఊహించని అవకాశాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో సమస్యలు, ఒత్తిడులు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. రాజకీయవేత్తలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. క్రీడాకారులు, పరిశోధకులకు చిక్కులు తొలగుతాయి. 15,16 తేదీల్లో దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా కొన్ని చికాకులు తొలగుతాయి. ఎట్టకేలకు ఆశించిన రాబడి దక్కవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. చిరకాల స్నేహితులను కలుసుకుంటారు. కొన్ని సంస్థల్లో సభ్యత్వం స్వీకరిస్తారు. సమాజంలో మరింత గౌరవం పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారులు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గవచ్చు. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. క్రీడాకారులు, పరిశోధకులకు గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. 10,11 తేదీల్లో వృథా ఖర్చులు. ప్రయాణాలు రద్దు. మానసిక అశాంతి. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకున్న ఆదాయం సమయానికి సమకూరడం ఉత్సాహాన్నిస్తుంది. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఎంతటి కార్యక్రమం చేపట్టినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువర్గం నుంచి అందిన సమాచారం ఉపయుక్తమైనదిగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆరోగ్యం కొంత మందగించినా ఉపశమనం లభిస్తుంది. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారుల కృషి ఫలించి లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త పోస్టులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనూహ్యమైన ప్రగతి కనిపిస్తుంది. రచయితలు సత్తా చాటుకుంటారు. 14,15 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. స్నేహితుల నుంచి ఒత్తిడులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
కుటుంబంలో ఒడిదుడుకులు తొలగుతాయి. మీలో ధార్మిక , సేవాభావాలు పెరుగుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడంలో స్వశక్తిపై ఆధారపడతారు. పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో అంది అవసరాలు తీరతాయి. ఒక కోర్టు వ్యవహారం అనుకూలంగా పరిష్కారమవుతుంది. వాహనయోగం. వ్యాపారులకు పెట్టుబడులు సమయానికి అందుతాయి. ఉద్యోగులకు కొత్త పోస్టులు దక్కుతాయి. పారిశ్రామికవేత్తల శ్రమ ఫలిస్తుంది. కళాకారులు, రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 13,14 తేదీల్లో అనారోగ్యం. స్నేహితులతో తగాదాలు. గణేశాష్టకం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అనుకున్న కార్యక్రమాలు ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అందిన ఒక సమాచారం ఊరటనిస్తుంది. ఆస్తుల విషయంలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. అదనపు ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. శారీరక రుగ్మతలు తీరి ఉపశమనం పొందుతారు. కుటుంబంలో ఒత్తిడులు తగ్గుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు పెట్టుబడుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి వారి సహాయసహకారాలు అందుకుంటారు. రాజకీయవేత్తలకు ఆటుపోట్లు తొలగుతాయి. పరిశోధకులు, రచయితల ఆశలు ఫలిస్తాయి. 11,12 తేదీల్లో కుటుంబంలో చికాకులు. మానసిక ఆందోళన. ఆదిత్య హృదయం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. పరపతి పెరుగుతుంది. సంఘంలో మీరంటే గౌరవం మరింత పెరుగుతుంది. కొన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తికి సంబ్యంధించిన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారుల యత్నాలు సఫలం. ఉద్యోగులకు సమర్థత వెలుగులోకి వస్తుంది. కళాకారులకు అన్ని వ్యిధాలా అనుకూల సమయం. రచయితలు, క్రీడాకారులు విశేష కీర్తి పొందుతారు. 10,11 తేదీలలో ఖర్చులు అధికమవుతాయి. దూరప్రయాణాలు. విష్ణుసహస్రమానామ పారాయణ చేయండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
కొన్ని సమస్యలను అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబసభ్యుల సలహాల మేరకు ముందుకు సాగుతారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. కార్యక్రమాలు అనుకున్న వధంగా పూర్తి చేస్తారు. దేవాలయాలు వాహనయోగం. మీ నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. రాబడి ఊహించని విధంగా పెరుగుతుంది. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు సాధిస్తారు. వ్యాపారులు మరింత లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గి ఊరట లభిస్తుంది. రాజకీయవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి. రచయితలు, పరిశోధకులకు ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. 13,14 తేదీలలో వృథా ఖర్చులు. అనారోగ్యం. శ్రీకృష్ణాష్టకం పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
మొదట్లో కొన్ని వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. అయితే క్రమేపీ పట్టుదల, నేర్పుతో ముందుకు సాగి విజయాల బాట పడతారు. ఆలోచనలు కలసివస్తాయి. శుభకార్యాలపై చర్చలు సఫలమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. అప్పులు తీరే సమయం. కుటుంబసభ్యులతో మనస్పర్ధలు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు రాగలవు. మీ అభిప్రాయాలను బంధువులకు నిర్భయంగా తెలియజేస్తారు. వ్యాపారులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. కళాకారులు, పరిశోధకులకు ఊహించని అవకాశాలు. 15,16తేదీలలో మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కష్టానికి ఫలితం కనిపించకపోయినా నిరాశ చెందరు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఆస్తుల విషయంలో నెలకొన్న వివాదాలు ఎట్టకేలకు పరిష్కరించుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం కొంత మెరుగ్గా ఉండి అవసరాలు తీరతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు ఎదురుచూస్తున్న అవకాశాలు దక్కే ఛాన్స్. గృహ నిర్మాణయత్నాలలో కదలికలు కనిపిస్తాయి. ఆరోగ్యం కొంత ఇబ్బందిపెట్టవచ్చు. చిన్ననాటి స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారులకు చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు కొంత పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు తొలగుతాయి. రచయితలు, క్రీడాకారులకు ఆహ్వానాలు అందుతాయి. 11,12 తేదీల్లో వృథా ఖర్చులు. బంధువులతో విరోధాలు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ముఖ్యమైన కార్యక్రమాలను సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు మరింత లభిస్తాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ధార్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. ఆదాయం గతంతో పోలిస్తే మెరుగుపడుతుంది. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారులు లాభాలబాట పడతారు. ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు అనుకున్నది సాధిస్తారు. కళాకారులు, రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 10,11 తేదీల్లో వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. శివపంచాక్షరి పఠించండి.