సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. లేనిపోని ఖర్చులు మీదపడి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు ఎదురుకావచ్చు. పట్టుదల, ఆత్మవిశ్వాసం వీడకుండా ముందుకు సాగండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో విభేదాలు నెలకొంటాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఇంటి నిర్మాణాలలో కొన్ని ప్రతిబంధకాలు. వ్యాపారులకు సాదాసీదా లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు సవాలుగా మారతాయి. పారిశ్రామికవేత్తలకు ఆశలు ఫలించక నిరాశ చెందుతారు. రచయితలు, పరిశోధకులు లక్ష్యాలు సాధిస్తారు. 16,17 తేదీల్లో శుభవార్తలు. వాహనసౌఖ్యం. అంగారక స్తోత్రాలు పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

ఆదాయం ఆశాజనకంగా ఉంటాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కీలక సమావేశాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురవుతుంది. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. వ్యాపారులకు లావాదేవీలు పుంజుకుంటాయి, కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఉన్నత శ్రేణి పోస్టులు దక్కవచ్చు. కళాకారులకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. రచయితలు, క్రీడాకారులకు ప్రత్యేక ఆహ్వానాలు అందుతాయి. 20,21 తేదీల్లో బంధువులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. దక్షిణావ•ర్తి స్తోత్రాలు పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. బంధువుల నుంచి సాయం అందుతుంది. ఆదాయం కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. పరిచయాలు విస్తృతమవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఇళ్లు, వాహనాలు కొంటారు. మీ నిర్ణయాలు అందరూ ప్రశంసిస్తారు. సమాజసేవలో  భాగస్వాములవుతారు. సోదరులు, స్నేహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. నేర్పుగా కొన్ని వివాదాల నుండి గట్టెక్కుతారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు దక్కవచ్చు. కళాకారులకుఅవకాశాలు ఊహించని విధంగా దక్కుతాయి. పరిశోధకులు, క్రీడాకారులకు విజయాలు వరిస్తాయి. 15,16 తేదీల్లో వృథా ఖర్చులు.  కుటుంబంలో చికాకులు. గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

రాబడి మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన రీతిలో సమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు ఒడిదుడుకులు, ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా అనుకూల సమయం. క్రీడాకారులు, పరిశోధకులకు నూతనోత్సాహం. 19,20 తేదీల్లో వ్యయప్రయాసలు. ఊహించని వివాదాలు. అనారోగ్యం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

కార్యక్రమాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అందరికీ ఇష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం మునుపటి కంటే మెరుగుపడుతుంది. భూవివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. వ్యాపారులకు పెట్టుబడులు మరింత సమకూరి ముందడుగు వేస్తారు. ఉద్యోగులు అనూహ్యమైన మార్పులు పొందుతారు. రాజకీయవేత్తలకు కొన్ని సమస్యలు తీరతాయి. క్రీడాకారులు, రచయితలకు ఒడిదుడుకులు తొలగుతాయి. 17,18 తేదీల్లో అనుకోని ఖర్చులు. మానసిక ఆందోళన. విష్ణుధ్యానం చేయండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

రుణవిమోచన పొందుతారు. రావలసి సొమ్ము అందుకుంటారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. స్థిరాస్తుల వివాదాలు తీరి కొంత లబ్ధి పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. గిట్టనివారు సైతం మీపై ప్రేమాభిమానాలు చూపడం విశేషం. వ్యాపార లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగులు నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. కళాకారులు నూతన అవకాశాలు దక్కించుకుంటారు. క్రీడాకారులు, పరిశోధకులు అనుకున్నది సాధిస్తారు. 20,21 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. బంధువిరోధాలు. కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. హనుమాన్‌ ‌స్తోత్రాలు పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

అనుకున్న కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. అదనపు ఆదాయం సమకూరి  సంతృప్తి చెందుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. మీ ఆలోచనలు ఆప్తులతో పంచుకుంటారు. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. నూతన విద్యావకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. విందువినోదాలలో పాల్గొంటారు. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులు మరింత ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయవేత్తలకు ప్రయత్నాలు సఫలం. క్రీడాకారులు, రచయితలకు కీలక సందేశం. 16,17 తేదీల్లో ఆరోగ్యసమస్యలు. మానసిక ఆందోళన. దేవీస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

ఆర్థిక పరిస్థితిలో లోటుపాట్లు తొలగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు వీడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. సన్నిహితుల నుంచి ధనలాభాలు ఉంటాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక నిర్ణయాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. వ్యాపారులకు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఊహలు నిజం కాగలవు. పారిశ్రామికవేత్తలకు అనుకోని ఆహ్వానాలు రాగలవు. కళాకారులు, రచయితలకు శుభవార్తలు. 17,18తేదీల్లో ఆప్తులతో కలహాలు. అప్పుల కోసం యత్నాలు. సుబ్రహ్మణ్యేశ్వరుని స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా  క్రమేపీ సర్దుబాటు చేసుకుంటారు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. రాబడి కొంత మెరుగుపడి అవసరాలు తీరతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఎటువంటి బాధ్యతనైనా అవలీలగా పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలులో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారులకు క్రమేపీ పుంజుకుని ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులు విధుల్లో  పొరపాట్లు సరిదిద్దుకుంటారు. కళాకారులకు ఆశయాలు నెరవేరతాయి. 20,21 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబంలో ఒత్తిడులు. శివాష్టకం పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

గత పరిచయాలు ఎంతో ఉపకరిస్తాయి. కొన్ని సమస్యల పరిష్కారంలో సోదరుల సాయం అందుతుంది. రావలసిన బాకీలు చాలావరకూ వసూలవుతాయి. వేడుకల రీత్యా ఖర్చులు ఉండవచ్చు. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిర్ణయాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. స్థిరాస్తి లాభ సూచనలు. వ్యాపారులకు మరింత వృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగులకు అంచనాలు ఫలించే సమయం. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. రచయితలు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 15,16 తేదీల్లో వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన. శివాష్టకం పఠించండి

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరే సమయం. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. హోదాలు ఉన్నవారితో పరిచయాలు. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సోదరీల నుంచి పిలుపు రావచ్చు. వ్యాపారులకు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులకు పరిస్థితులు చక్కబడతాయి. రాజకీయవేత్తలకు కొత్త పదవులు రావచ్చు. కళాకారులు, రచయితలకు కీలక సమాచారం. 17,18 తేదీల్లో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. శ్రీకృష్టాష్టకం పఠించండి..

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు. గతం నెమరువేసుకుంటూ భవిష్యత్తుపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. కొన్ని ఆస్తి వివాదాలు పరిష్కరించుకుని ఊరట చెందుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఊహించని శుభవార్తలు రావచ్చు. ఇంటి నిర్మాణాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. వ్యాపార లావాదేవీలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగులకు అనుకున్న హోదాలు దక్కుతాయి. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. 19,20 తేదీల్లో శారీరక రుగ్మతలు. కుటుంబంలో సమస్యలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE