సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం విజయాల వైపు నడిపిస్తాయి. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. అయితే వృథా ఖర్చులు కొన్ని  తప్పవు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.  కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యతిరేకులను కూడా  అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపారులు విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు.  ఉద్యోగులకు మరింత ఉత్సాహంగా గడుపుతారు. కళాకారులకు గౌరవం పెరుగుతుంది. రచయితలకు శుభవార్తలు. 22,23 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. విష్ణుధ్యానం చేయండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

ముఖ్యమైన  కార్యక్రమాలు కొంత నెమ్మదించినా చివరికి పూర్తి కాగలవు. ఆదాయానికి ఇబ్బందులు తొలగుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. స్నేహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. బంధువుల సలహాలు, సూచనలు పాటిస్తారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలు ఆకస్మిక  విదేశీ పర్యటనలు చేస్తారు. క్రీడాకారులు, పరిశోధకుల యత్నాలు సఫలం. 24,25 తేదీలలో  శారీరక రుగ్మతలు.  కుటుంబంలో చికాకులు. అనుకోని  ప్రయాణాలు. దుర్గాస్తోత్రాలు పఠించండి.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆత్మీయుల ద్వారా శుభవార్తలు అందుతాయి. కొన్ని ముఖ్య వేడుకల్లో పాల్గొంటారు. చిరకాల స్నేహితులను కలుసుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆశించిన ఆదాయం సమకూరే సమయం. సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు ఊహించని అవకాశాలు. రచయితలు, పరిశోధకులకు అనుకూల వాతావరణం. 23,24  తేదీలలో  వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం.  శివాష్టకం పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. రాబడి  నిరాశ కలిగించవచ్చు. కష్టానికి ఫలితం కనిపించదు. బంధువులు, స్నేహితులతో అకారణంగా తగాదాలు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలలో అవాంతరాలు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు మరింత పనిభారం. రాజకీయవేత్తలకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. కళాకారులు, క్రీడాకారులు కొంత నిరాశ చెందుతారు. 24,25 తేదీలలో శుభవార్తలు. వాహనయోగం. గణేశ్స్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

రాబడి అనుకున్న విధంగా పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కార్యక్రమాలన్నీ సజావుగా సాగుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగు చూస్తుంది. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. అరుదైన ఆహ్వానాలు రాగలవు.  దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు కొంత తగ్గవచ్చు. కళాకారులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు.  రచయితలు, క్రీడాకారులు ప్రతిభ నిరూపించుకుంటారు. 27,28 తేదీల్లో అనుకోని ఖర్చులు. కుటుంబసభ్యులతో కొన్ని వివాదాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

ఎదురుచూడని ఉద్యోగావకాశాలు లభించే వీలుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధువుల నుంచి ధన, ఆస్తిలాభ సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. అనుకున్న కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. విద్యార్థులకు అనుకూల వాతావరణం. సమాజసేవలో పాల్గొంటారు. వ్యాపారులకు ఊహించని లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందవచ్చు. వైద్యులు, కళాకారులు సమస్యల నుంచి బయటపడతారు. 22,23 తేదీల్లో బంధువులతో వైరం. దూర ప్రయాణాలు  దేవీఖడ్గమాల పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతమే. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  వేడుకలకు హాజరవుతారు. స్నేహితులతో  ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. 25,26 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

కొన్ని కార్యక్రమాలు నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. శ్రేయోభిలాషుల నుంచి పిలుపు రావచ్చు. ఊహలు నిజం కాగలవు. వాహనాలు, భూములు సమకూరతాయి. విచిత్ర  సంఘటనలు ఎదురుకాగలవు.  విద్యార్థులకు నూతనోత్సాహం. మీ నిర్ణయాలపై అంతా సుముఖత వ్యక్తం చేస్తారు.  తీర్థయాత్రలు చేస్తారు.  ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు మరింతగా లాభాలు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. కళాకారులు అవకాశాలు దక్కించుకుంటారు. రచయితలు, క్రీడాకారులకు కీలక సమాచారం. 24,25 తేదీల్లో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. రాబడి ఊహించని రీతిలో మెరుగుపడుతుంది. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులు ఆశించిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత ఉపశమనం. పారిశ్రామికవర్గాలకు మరింత సానుకూలత. పరిశోధకులు, కళాకారుల ఆశలు ఫలిస్తాయి. 22,23 తేదీలలో అనారోగ్యం. వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆదాయం కొంత మెరుగుపడుతుంది. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. నిరుద్యోగులలో అనుకున్న లక్ష్యాలు సాధించాలన్న తపన పెరుగుతుంది. పరిచయాలు పెరుగుతాయి. భూములు, గృహం కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారులు తగినంత లాభాలతో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీయానం. రచయితలు, వైద్యుల కృషి ఫలిస్తుంది. 23,24  తేదీల్లో కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. శ్రీనృసింహస్తోత్రాలు పఠించండి

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

వ్యూహాత్మక విధానాలతో వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనుకున్న ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆలోచనలు వెంటనే  కార్యరూపం దాలుస్తాయి. శుభకార్యాలపై దృష్టి సారిస్తారు. దైవకార్యాలు నిర్వహిస్తారు.  గృహం కొనుగోలు యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారులకు  స్వల్పంగా లాభాలు దక్కవచ్చు. ఉద్యోగులకు పనిభారం కొంతమేర తగ్గుతుంది. రాజకీయవేత్తలకు కొద్దిపాటి పదవులు లభిస్తాయి. కళాకారులు, క్రీడాకారులకు ఆహ్వానాలు రాగలవు. 25,26  తేదీల్లో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

రాబడి సంతృప్తినిస్తుంది. రావలసిన పైకం కూడా అందుతుంది. కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యసమస్యల నుంచి కొంత ఊరట  చెందుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. చిరకాల సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. విద్యార్థులు సత్తా చాటుకునేందుకు తగిన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. రచయితలు, వైద్యులకు ముఖ్య సమాచారం. 26,27 తేదీల్లో స్నేహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE