సింహంభట్ల సుబ్బారావు, 6300674054


మేషం: అశ్వినిభరణికృత్తిక 1వ పాదం

నిరుద్యోగులకు ఎదురుచూడని ఉద్యోగయోగం. ఏ వ్యవహారమైనా అనుకున్న వెంటనే విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకున్న విధంగా ఆదాయం సమకూరి అవసరాలన్నీ తీరతాయి. కొన్ని వివాదాలు  పరిష్కారంలో ముందడుగు వేస్తారు. విద్యార్థులు గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కీర్తిప్రతిష్ఠలు, సుఖసంతోషాలతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలను నిర్విఘ్నంగా కొనసాగించి సకాలంలో పెట్టుబడులను సమీకరిస్తారు. ఉద్యోగాలలో ఎనలేని గౌరవం, పొందుతారు. పారిశ్రామికవేత్తలు, రచయితలకు అనూహ్యమైన అవకాశాలు. 13,14 తేదీల్లో దూరప్రయాణాలు. అనవసర ఖర్చులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణిమృగశిర 1,2 పాదాలు

ఆర్థికంగా గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు.  కుటుంబంలోనూ, సమాజంలో విశేష గౌరవమర్యాదలు లభిస్తాయి. మనోబలంతో దూరమైన ఆప్తులను ఒక్కటి చేస్తారు. బంధువుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. గృహయోగ సూచనలు కనిపిస్తున్నాయి. మీ మంచితనమే శ్రీరామరక్షగా నిలిచి విజయానికి కారణమవుతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.  ఆధ్యాత్మిక భావాలు కలిగి తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో మరింత ఉన్నతి కనిపిస్తుంది. అత్యంత చాకచక్యంగా లాభాలు ఆర్జిస్తారు.  ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగినా మీకు అనుకూలంగానే ఉండడం విశేషం.రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని  పిలుపు రావచ్చు. 11,12 తేదీల్లో వ్యయప్రయాసలు. బాద్యతలు పెరుగుతాయి. దేవీస్తుతి మంచిది.

మిథునం: మృగశిర 3, 4 పాదాలుఆర్ధ్రపునర్వసు 1, 2, 3 పాదాలు

కుటుంబం, సమాజంలో మీ సత్తా నిరూపించుకుంటారు. ఎంతటి కార్యక్రమమైనా విజయం పథంలో నడిపిస్తారు.  సంతాన రీత్యా•ఇబ్బందులు, సమస్యలు తీరి ఊరట లభిస్తుంద్యి  తరచూ తీర్థయాత్రలు చేస్తారు. రాబడి విషయంలో మీరు పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయి.  చిన్ననాటి స్నేహితులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో కొంత పుంజుకుని లాభాల బాటలో నడుస్తారు.ఉద్యోగాలలో మీ పనితనాన్ని ఉన్నతస్థాయి వారు గుర్తిస్తారు.  పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు కొత్త సంస్థల ఏర్పాటును వేగవంతంగా చేస్తారు. 13,14 తేదీల్లో ధనవ్యయం.మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. శివాష్టకం పఠించండి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదంపుష్యమిఆశ్లేష

మీ మనోభావాలు, అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. వాహన, గృహయోగాలు కలిగే సమయం. ఆదాయం సమకూర్చుకోవడంలో చేసే యత్నాలు సఫలం. ఏ కార్యక్రమమైనా దృఢసంకల్పంతో పూర్తి చేస్తారు. బంధువుల సంపూర్ణ సహకారం అందుతుంది. వారసత్వ ఆస్తి లాభ సూచనలు కలుగుతాయి.విద్యార్థులకు శుభదాయకమైన కాలం. ఇబ్బందులు, కష్టాలు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలు  మరింత లాభించి మరో వ్యాపారానికి శ్రీకారం చూడతారు. ఉద్యోగాలలో ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు అందే సూచనలు. శాస్త్ర, పరిశోధనారంగాల వారికి విశేష కీర్తి దక్కుతుంది. రచయితల యత్నాలు సఫలం. 8,9 తేదీల్లో ఆరోగ్య భంగం. శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

సింహం: మఖపుబ్బఉత్తర 1వ పాదం

వివాహాది విషయాలలో తుది నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఎవరి తోడ్పాటు లేకుండా స్వయంగా ముందుకు సాగి విజయాలు సొంతం చేసుకుంటారు. కుటుంబంలో మీపై ద్వేషభావాలు తొలగుతాయి. అందరితో సుఖసంతోషాలతో గడుపుతారు.  ఇంటి నిర్మాణాలు కలిసివస్తాయి. బంధువుల సంపూర్ణ సహకారంతో ముందుకు దూసుకువెళతారు. క్లిష్టమైన సమస్యలు సైతం నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో నెలకొన్న స్దబ్ధత తొలగి లాభాలు అందుకుంటారు.ఉద్యోగాలలో కొన్ని బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. క్రీడాకారులు, కళాకారులు తీసుకునే నిర్ణయాలు ఎంతగానో ఉపకరిస్తాయి. మునుపటి వైభవం దక్కుతుంది. 10,11 తేదీలలో దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. అనారోగ్యం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలుహస్త చిత్త 1, 2 పాదాలు

మనోనిబ్బరం, ఆత్మవిశ్వాసాలు పెరిగి ముందడుగు వేస్తారు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే.

ఇంట్లో వివాహాది శుభకార్యాలపై అంచనాకు వస్తారు. రాబడిపై పెట్టుకున్న ఆశలు నెరవేరతాయి. ఊహించనిరీతిలో సొమ్ము సమకూరుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణ యత్నాలు వేగవంతం చేస్తారు. పెట్టుబడులపై తుది నిర్ణయానికి వస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు, విధుల నుండి విముక్తి పొందుతారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. క్రీడాకారులు, కళాకారులు అత్యున్నత పురస్కారాలు అందుకుంటారు. 12,13 తేదీల్లో అదనపు ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. ఒత్తిడులు పెరుగుతాయి. గణేశాష్టకం పఠించండి.

తుల: చిత్త 3,4 పాదాలుస్వాతివిశాఖ 1, 2, 3 పాదాలు

కుటుంబంలో పరిస్థితులు చక్కబడి ఊపిరిపీల్చుకుంటారు. దూరపు బంధువులు అందించిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సమస్యలు ఎదురైనా లెక్కచేయక మనోనిబ్బరంతో ఎదుర్కొంటారు. ఏ కార్యక్రమమైనా స్వయంగా పూర్తి చేస్తారు.  ఉద్యోగార్ధులకు ఉద్యోగలాభం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి అవసరాలురతాయి. వాహనసౌఖ్యం. పరిచయాలు మరింత పెరిగి సంతోషంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వాహనాలు నడిపే సందర్భంలో మాత్రం  జాగ్రత్తలు పాటించడం మంచిది. వ్యాపారాలు మీ అంచనాలకు తగినట్లుగా నడుస్తాయి. లాభాలకు లోటు ఉండదు.ఉద్యోగాలలో కొత్త బాధ్యతలను చేపడతారు. పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక రంగాల వారికి కొత్త అవకాశాలు. కళాకారులు తమ ప్రతిభను మరింత నిరూపించుకుంటారు. 9,10 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు మానసిక ఆందోళన. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం: విశాఖ 4వ పాదంఅనూరాధజ్యేష్ఠ

ఆకస్మిక ధనలాభాలతో సంతోషంగా గడుపుతారు. మీ ఆలోచనా తీరును అందరూ ప్రశంసిస్తారు. సమాజంలో మీకంటూ గౌరవం లభిస్తుంది. కొన్ని  ధర్మకార్యాలు నిర్వర్తిస్తారు. తండ్రి లేదా జ్ఞాతుల ద్వారా ఆస్తిలాభాలు ఉండవచ్చు.   వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. విద్యార్థులు ఊహించని విద్యావకాశాలు సాధిస్తారు. వ్యాపారాలలో మీ అంచనాలు, కషి ఫలించి తగినంత లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పైస్థాయి వారితో మరింత  సమన్వయం ఏర్పడి విధులు సజావుగా నిర్వర్తిస్తారు. రాజకీయవేత్తలు ఏదో ఒక పదవిని దక్కించుకునే అవకాశం. పారిశ్రామికవర్గాలు, రచయితలు, శాస్త్రసాంకేతిక రంగాల వారు సమర్థతతో విజయాలు సాధిస్తారు. 9,10 తేదీల్లో ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. మిత్రులతో కలహాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: మూలపూర్వాషాఢఉత్తరాషాఢ 1వ పాదం

కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా ఆత్మవిశ్వాసం వీడక ముందుకు సాగుతారు. కొన్ని ఆస్తులు కొనుగోలు వంటివి చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలను ఎటువంటి ఆటంకాలు లేకుండానే పూర్తి చేస్తారు. ఆత్మీయులు మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తారు. అందరిలోనూ మీమాటే నెగ్గుతుంది. మీ వాగ్ధదటి, నేర్పరితనం   మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న మన ఃక్లేశాలు, ఇబ్బందులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు.  విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఫలించే సమయం. ఆరోగ్య సమస్యల నుండి క్రమేపీ బయటపడతారు. పట్టుదల ఆయుధాలుగా కొన్ని సమస్యలు అధిగిస్తారు.  వ్యాపారాలలో మీ ఆలోచనలు నెరవేరతాయి. అనుకున్న రీతిలో లాభాలు, పెట్టుబడులు సమకూరతాయి.  ఉద్యోగులు మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తించి పైస్థాయి నుండి గుర్తింపు పొందుతారు. కళాకారులు, సాంకేతిక నిపుణులకు మునుపటి కంటే కొంత అనుకూలమనే చెప్పాలి. క్రీడాకారులు సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు.11,12 తేదీల్లో దుబారా ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది. మిత్రులతో మాటపట్టింపులు. దేవీఖడ్గమాల పఠించండి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలుశ్రవణంధనిష్ఠ 1, 2 పాదాలు

ప్రతి నిర్ణయంలోనూ మరింత నిదానం అవసరం. మనస్సులో ఏదో తెలియని ఆందోళన, చికాకులు. ఆదాయానికి ఇబ్బందులు, ఖర్చులు మాత్రం తప్పనిస్థితి. కొన్ని స్థిరాస్తులు విక్రయించే వీలుంది. ఆరోగ్యసమస్యలతో కొంత ఇబ్బందిపడతారు.వాహనాలు నడిపే విషయంలో అజాగ్త్రత తగదు.  వ్యాపారాలలో లాభాలు ఊరించినా చేతికందక నిరాశ చెందుతారు.ఉద్యోగాలలో ఊహించని విధులు నిర్వర్తించడం ద్వారా ఆందోళన చెందుతారు. అయితే మనోబలంతో ముందుకు సాగడం ఉత్తమం.పారిశ్రామికవర్గాలు, శాస్త్రసాంకేతిక రంగాల వారికి  పరీక్షగా ఉంటుంది. కళాకారులు ఎంత ప్రయత్నించినా అనుకున్న అవకాశాలు సాధించడం కష్టమే. 10.11 తేదీలలో శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. గణేశాష్టకం పఠించండి.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలుశతభిషంపూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఇబ్బందులు, సమస్యలు చాకచక్యంగా అధిగమిస్తారు. ఆర్థికంగా మెరుగుదల కనిపించినా ఖర్చులు తట్టుకోవాలి. కుటుంబంలో కొన్ని వేడుకలకు సమాయత్తమవుతారు.ఆరోగ్యపరమైన చికాకులు నుండి బయటపడతారు. ముఖ్యమైన కార్యక్రమాలు మీ అంచనాలకు తగినట్లుగానే పూర్తి చేస్తారు.ఆత్మీయులు మీ అంతరంగాన్ని గమనించి సహాయపడతారు. పుణ్యక్షేత్రాల సందర్శనం ద్వారా  మానసిక శాంతి పొందుతారు. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు కోర్సుల ఎంపికలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాల దిశలో పయనిస్తారు. ఉద్యోగాలలో వ్యిధి నిర్వహణలో కొన్ని మెలకువలు పాటిస్తూ ముందుకు సాగుతారు. పారిశ్రామికవర్గాలు, రచయితలకు మరింత ప్రోత్సాహం అందుతుంది. కళాకారులు అవకాశాల ఎంపికలో సంయమనం పాటిస్తారు. 13.14 తేదీల్లో ఆరోగ్య సమస్యలు. చిత్రమైన సంఘటనలు. ధనవ్యయం. ఆంజనేయ దండకం పఠించండి.

మీనం: పూర్వాభద్ర 4వ పాదంఉత్తరాభాద్రరేవతి

ఆర్థిక లావాదేవీల్లో మరింత అనుకూల పరిస్థితి. కొంత నగదు నిల్వ చేస్తారు. కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలు నిర్వహణపై సంబంధీకులతో సంప్రదిస్తారు. శత్రువులను కూడా ఆకట్టుకుని స్నేహహస్తం అందిస్తారు. మీమాటే చెల్లుబాటై ఎదురులేని పరిస్థితి ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కుతారు. సోదరులతో కొన్ని విభేదాలు ఏర్పడినా సర్దుబాటు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది.దైవారాధన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాలలో వేగం పెంచుతారు. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఇంతకాలం వెనుకబడ్డా ఇప్పుడు చురుగ్గా సాగుతాయి. తగిన మొత్తాలు అందుతాయి.ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. పైఅధికారుల మన్ననలు పొందే సూచనలు. కళాకారులు, రాజకీయవేత్తలు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. 8,9 తేదీలలో శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి వివాదాలు. ఇంటాబయటా సమస్యలు. శివాష్టకం పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE